శ్రావణసమీరాలు

Posted on

నేను “బావా” అని పిలిచాను. వాడు వనక్కి తిరిగి చూశాడు. నేను వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి వాడిని హగ్ చేసుకున్నా. వాడు కూడా నన్ను హగ్ చేసుకున్నాడు. నాకు చాలా హాయిగా అనిపించింది. కాసేపటి తరువాత బావ “ఏమైంది సమీర?” అని అడిగాడు.
“ఏం లేదు” అన్నాను నేను.
బావ తన కౌగిలిని కాస్త వదులు చేశాడు.నేను మాత్రం అలాగే హగ్ చేసుకొని తలెత్తి బావను చూశాను. వాడు నాకంటే ఒక అడుగు పొడవు. బావ తల దించి నన్ను చూశాడు.
“ఇంకాసేపు ఇక్కడే ఉందాం బావా” అన్నాను.

“రూంస్ అన్నిటికీ లాక్ చేస్తారు. ఇక్కడే ఉంటే ఎలా?” అన్నాడు.
“వాళ్లు వచ్చి లాక్ చేసేంతవరకూ ఇక్కడే ఉందాం” అన్నాను.
“సరే పద” అన్నాడు.
“ఎక్కడికీ?” అన్నాను.
“వెళ్లి కుర్చుందాం” అన్నాడు.
నేను వాడిని వదిలి నవ్వుతూ వాడితో పాటు వెళ్లి కూర్చున్నాను. మేము అలా వెళ్లి కుర్చోగానే “బాబు రూము లాక్ చెయ్యాలి” అంటూ వచ్చాడు వాచ్ మేన్.
ఇక తప్పదు అన్నట్లు ఇద్దరం లేచి బయటకు వచ్చాం.
“కాఫీ తాగుదామా?” అని అడిగాడు బావ.
(మొదట్లో నాకు కాఫీ అలవాటు లేదు. కానీ బావ కోసం అలవాటు చేసుకున్నా)
“పద వెళ్దాం” అన్నాను.
ఇద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకుని కెఫెటేరియా వైపు నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ కాఫీ ఆర్డర్ చేసి, తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర ఎదురెదురు కుర్చీలలో కూర్చుని కాఫీ తాగేసాం. బాగా లేట్ అయినందువల్ల క్యాంటీన్ లో పెద్దగా ఎవరూలేరు. ఇద్దరం బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిల్చున్నాం. బస్సు రాగానే ఖాళీగా ఉండటంతో ఎక్కేసాం. ఎక్కికూర్చోగానే నాకు నిద్ర వెచ్చేసింది. మేము దిగాల్సిన చోటు రాగానే బావ నన్ను లేపి “పద వెళ్దాం” అన్నాడు.

ఇద్దరం బస్సు దిగి “బై” చెప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయాం.
ఇక ఆ రోజు బావతో జరిగిన విషయాలన్ని గుర్తు తెచ్చుకుని హాయిగా నిద్ర పోయాను.

నెక్స్ట్ డే సండే కావడం వల్ల అలాగే పడుకుండిపోయాను. పొద్దున్నే ఒక ఫోన్ కాల్ తో మేల్కున్నాను. “ఎవరా?” అని చూస్తే అన్నయ్య.
(అన్నయ్య పేరు శివ. మేం ఇద్దరం కవల పిల్లలం. వీడు నాకంటే కొన్ని సెకండ్లు పెద్ద. వాడు తిరుపతిలో చదువుకుంటున్నాడు నాలాగే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది అన్నయ్య, బావలే)
ఫోన్ లిఫ్ట్ చేసి “ఎలా ఉన్నావ్ రా?” అని అడిగాను.
“నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్?” అని అడిగాడు.
“ఏదో మీ దయ” అన్నాను.
“మాదేముందిలే” అన్నాడు.
“ఇంకేంటి రా?” అని అడిగాను.
“అమ్మా నాన్నా ఎలా ఉన్నారో తెలుసా? ఫోన్ ఏమైనా చేశారా?” అని అడిగాడు.
“ఏమో బావ ఊరెళ్లి నిన్నే వచ్చాడు. వాడిని అడిగి కనుక్కో” అన్నాను.
“వాడు మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నాడు. ఊరెప్పుడు వెళ్లాడు?” అని అడిగాడు. “ఏం మాట్లాడుతున్నావ్ రా?” అర్థం కాక అడిగాను.
“ఐతే వాడు నీకేం చెప్పలేదా?” అన్నాడు.

“ఏం జరిగిందీ?” అని అడిగాను
“మొన్నటిదాకా వాడికి హెల్త్ సరిగా లేదు. నాలుగు రోజులు నా దగ్గరే ఉండి, ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుని మొన్న నేను వద్దంటున్నా వినకుండా బయల్దేరాడు. ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పమంటే బాధ పడతావని చెప్పొద్దు అన్నాడు” అంటూ టూకీగా మొత్తం జరిగిందంతా చెప్పాడు.
ఇదంతా వినగానే నాకు బావను చూడాలనిపించింది.
“హల్లో” అన్నాడు అన్నయ్య.
“హా…” అన్నాను.
“ఏంటే ఏమైందీ?” అని అడిగాడు.
“ఏం లేదు?” అన్నాను.
“ఈ విషయాలన్ని నీతో చెప్పలేదా?” అని అడిగాడు.
“అస్సలు చెప్పలేదు రా” అన్నాను కాస్త బాధగా.
“ఐతే నువ్వు కూడా ఏమి తెలియనట్లే ఉండు. లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు” అన్నాడు.
“సరే” అన్నాను.
“సరే ఐతే ఉంటాను రా” అన్నాడు.
“బై” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
(ఈ విషయాలన్ని నాతో చెప్పనందుకు బావ మీద పీకల దాకా కోపం వచ్చింది. అదే సమయంలో నేను బాధ పడతానని వాడు దాచినందుకు అంత కంటే ఎక్కువ సంతోషమేసింది)
వెంటనే బావకి కాల్ చేశాను.”ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేశావు?” అన్నాడు.

వాడు చెప్పిన విధానం బట్టి ఇంకా నిద్ర లేచినట్లు లేడు.
“ఏంట్రా ఇంకా తెల్లవారలేదా?” అన్నాను.
“ఇది అడగడానికి కాల్ చేశావా? బయట చూడవే తెలుస్తుంది” అన్నాడు అదే టోన్ తో.
“ఈ వెటకారానికి ఏం తక్కువలేదు. నేను ఇంకో పది నిమిషాలలో నీ రూంలో ఉంటా. లేచి రెడీగా ఉండు” అన్నాను.
“అబ్బా పొద్దున్నే నా ప్రాణం తీయడానికి కంకణం కట్టుకున్నావా?” అన్నాడు.
“నూవ్వు ఏమైనా అనుకో నేను వస్తున్నా అంతే” అని కాల్ కట్ చేశాను.
అరగంటలో అన్ని కార్యక్రమాలు ముగించుకుని వాడి రూం కాలింగ్ బెల్ కొట్టాను. చాలాసేపటి తరువాత వచ్చి డోర్ తీశాడు. వాడి వాలకం చూస్తే ఇప్పటిదాకా ఇంకా పడుకునే ఉన్నట్లు ఉన్నాడు.
“ఏంట్రా నేనేం చెప్పాను?” అని అడిగాను.
“ఏమో గుర్తులేదు. గుర్తొస్తే చెప్తా” అంటూ మళ్లీ బెడ్ పై వాలాడు.
“ఏం అవసరం లేదు వెళ్లి ఫ్రెష్ అవ్వు” అంటూ వాడి భుజం పై చిన్నగా కొట్టాను.
“అబ్బా పడుకోనీవే” అన్నాడు వాడి పైకి దుప్పటి లాక్కుంటూ.
“ఏయ్ చెప్తే వినాలి” అంటూ దుప్పటి లాగేశాను.
“రాక్షసీ” అంటూ బాత్ రూంలోకి దూరాడు.

నేను నవ్వుకుంటూ బయట వెయిట్ చేయసాగాను. సరిగ్గా అరగంట తరువాత వచ్చాడు ఒంటి మీద టవల్ తో. వాడిని అలా చూస్తుంటే నాకు మా బాల్యం గుర్తుకొచ్చింది.
“చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్ రా” అన్నాను వాన్ని చూస్తూ.
“అవును నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను” అన్నడు తల మీది జుట్టుని స్టైల్ గా దువ్వుకుంటూ.
“చాల్లే వెళ్లి భట్టలు వేసుకుని రా” అన్నాను.
“నిన్నెవడు చేసుకుంటాడో గానీ నరకం చూస్తాడు” అంటూ బెడ్ రూం లోకి నడిచాడు.
“పొద్దున్నే నన్ను ఏడిపించకుండా నీకు రొజు స్టార్ట్ అవ్వదా?” అన్నాను కోపంగా.
“అవునవును ఎవరు ఎవర్ని ఏడిపిస్తున్నారో తెలుస్తూనే ఉంది” అన్నాడు వెటకారంగా.
“అంటే ఏంట్రా ఇప్పుడు నేను నిన్ను ఏడిపిస్తున్నానా?” అని అడిగాను కాస్త బుంగ మూతి పెట్టుకుని.
“ఈ అలకలకు ఏం తక్కువలేదు గానీ, టిఫిన్ తిన్నావా?” అని అడిగాడు.
“లేదు. బయట తిందాం పద” అన్నాను.

149530cookie-checkశ్రావణసమీరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *