నో నో నో ……. చిన్నచిన్నవాటికి స్మాల్ స్మాల్ విషయాలకు కన్నీళ్ళతో బాధపడటం నాట్ గుడ్ నాట్ అట్ అల్ గుడ్ మేడం – ముందు ముందు ఆకన్నీళ్లను ఆపేయ్యండి – మీలాంటి అందమైన స్త్రీల కన్నీళ్లు నేలరాలడం భువికి మంచిదికాదు .
దేవత : what …… ? .
ఇదిగో ఇలా ఇలా కోప్పడండి కావాలంటే కన్నీళ్లు మాత్రం కార్చకండి please ……. కొంతమంది తట్టుకోలేరు .
దేవత : ఎవరు ? .
అదే అదే ……. ఆ మీ బుజ్జి ఏంజెల్ – మీ తల్లిదండ్రులు – తమ్ముడు తమ్ముడికి కాబోయే భార్య …… ( మరీ ముఖ్యంగా నేను ) బాధపడతారు .
బుజ్జితల్లి : మమ్మీకి రోజూ అలవాటైపోయింది అంకుల్ – కన్నీళ్లు కార్చని రోజంటూ లేదు .
( ఆ రోజులు పోయాయి బుజ్జితల్లీ …… నా దేవతకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా , బలవంతంగానైనా సంతోషంగా ఉండేలా చేస్తాను ) బయటపడ్డారు కదా ……. ఇంకా ఎందుకు ఆ కన్నీళ్లు .
దేవత : ఈ జీవితమంతా కన్నీళ్లే …….
బుజ్జితల్లి : మమ్మీ …….
దేవత : లేదు లేదు బుజ్జితల్లీ ……. అని ప్రాణంలా హత్తుకున్నారు .
బుజ్జితల్లి : దేవత కన్నీళ్లను తుడిచి , మమ్మీ …… ట్రైన్ లేదా …… ? .
ట్రైన్ లేకపోతే ఏమిటి బుజ్జితల్లీ ……. ఫ్లైట్ ఉందిగా మరింత తొందరగా …… ( తొందరగానా అని నాలుక కరుచుకున్నాను – ఫ్లైట్ లో అయితే దేవతతో సమయం మరీ తక్కువగా ఉంటుందే ……. )
దేవత : వద్దు వద్దు వద్దు …….. , చాలా కాస్ట్ అవుతుంది – అక్కడ పెళ్లి ఖర్చులే చాలా ఉంటాయి .
హమ్మయ్యా …….. ( ఫ్లైట్ లో తీసుకెళ్లడం ఇష్టమే కానీ దేవతతో కలిసి కొన్ని గంటలయినా ప్రయాణించాలికదా , పేరు తెలుసుకోవాలి నా మనసులోని దేవతకు మ్యాచ్ అయ్యేలా – దేవత నడుముపై దిష్టి చుక్క లాంటి అందమైన పుట్టుమచ్చ ……. ఆఅహ్హ్హ్ …… ఆ ఊహకే వొళ్ళంతా జలదరిస్తోంది ….. ఇంకా ఇంకా …… చాలానే ఉన్నాయి కానట్టి ) అయితే బస్సులో వెళదాము .
దేవత : రేపు ఉదయానికల్లా ఊరిలో ఉంటామా ? .
టైం చూసి ట్రావెల్ టైం కౌంట్ చేసి సూర్యోదయం లోపు వైజాగ్ లో ఉంటాము మేడం – జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత నాది .
బుజ్జితల్లి : అంకుల్ ……. ఇప్పుడొచ్చిన బస్ కు లానే రోడ్డుకు అడ్డుగా ఏదైనా అడ్డుపడితే అప్పుడు కూడా అంతే సమయంలోపు తీసుకెళతారా ? , ఎందుకంటే అమ్మమ్మను చూసి చాలా చాలా రోజులయ్యింది .
నేను …… మీతోపాటే రావడానికి మరొక కారణం బుజ్జితల్లే తెలిపింది – ప్రయాణం మధ్యలో ఏవైనా ఆటంకాలు వచ్చినా – మనం ప్రయాణించే బస్సే రిపేర్ వచ్చినా ……. ఒకరు తోడు ఉండటం మంచిదే , అందులోనూ నాలాంటి మంచివాడు ఉంటే మరింత మంచిది , ఎందుకంటే మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా అని దేవతవైపు హైఫై చూయించాను .
దేవత కోపంతో చూడటంతో బుజ్జితల్లికి ఇవ్వడంతో బుజ్జిబుజ్జినవ్వులతో హైఫై ఇచ్చింది అవును అంకుల్ మనం ఫ్రెండ్స్ అయ్యాము . నా పేరు కీర్తి – మీ బుజ్జి ఏంజెల్ పేరు కీర్తి .
Yes yes ……. బుజ్జి ఏంజెల్ ( ” నా బుజ్జి ఏంజెల్ నువ్వే – నా దేవత …… మీ మమ్మీనే ” ) భూకంపం వచ్చినా – అగ్నిపర్వతం బద్దలైనా – వడగల్లు పడినా – పిడుగులు సంభవించినా …….. రేపు సూర్యోదయం లోపు సేఫ్ గా వైజాగ్ తీసుకెళతాను .
దేవత ఒక్కసారిగా నవ్వేసింది . ఇంకా మిగిలిన ప్రకృతి వైపరీత్యాలన్నీ చెప్పేయ్యండి – మీరు చెప్పినవాటిలో ఒకటి వచ్చినా మనం అడుగైనా ముందుకువెయ్యగలమా ………
నిజమే మేడం ……. కానీ మీరు వైపరీత్యాలు చూడకండి , అయినా తీసుకెళతాను అంటే మీరంటే మీరంటే ……..
దేవత : మేమంటే ? అంటూ కోపంగానే అడిగారు .
అదే అదే మీరు తోటి తెలుగువారు కదా , తోటి తెలుగువారికి సహాయం చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను , చుట్టూ ఉన్న జనాలలో మీరు ముఖ్యమైనవారు అని చెబుతున్నాను – ఇలాప్రతీదానికీ కోప్పడితే ఎలాచెప్పండి . అయినా నేనేమీ పట్టించుకొనులేండి …… అని నవ్వుకున్నాను . ( ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి ) .
దేవత : అలా అయితే ok , నేను కాబట్టి కోప్పడుతున్నాను – నా స్థానంలో వేరే అమ్మాయి ఉంటే మీ డబల్ మీనింగ్ మాటలకు కొట్టేదే ……..
నేను డబల్ మీనింగ్ …….. మీరూ కొట్టొచ్చు కదా మేడం ……. అని గుసగుసలాడాను .
దేవత : అదిగో లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారు – మగవాళ్ల బుద్ధే ఇంత అందరూ ఒక్కటే …….- మీ కళ్ళల్లో తేడా కనిపెట్టలేని అమాయకురాలినేమీ కాదు . మా ఇష్టాలు – కోరికలు – మా మనస్థత్వం ఎవ్వరికీ అవసరం లేదు .
నేను నేను నన్ను నన్ను మీ మీ …… పొలుస్తున్నారా …… ? .
బుజ్జితల్లి : మమ్మీ ……. అంకుల్ అలాంటివారు కాదు అనిపిస్తుంది . అంకుల్ …… వారి దేవతను – బుజ్జి ఏంజెల్ ను ఎలా చూసుకుంటున్నారో చెప్పారుకదా ……..
ఆ అవునవును కావాలంటే మరొకసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అని దేవతకు దగ్గరగావెళ్లి దేవత కళ్ళల్లోకే చూస్తూ పారవశ్యం పొందుతున్నాను .
దేవత చూసి ఊహూ …… ఏమాత్రం తేడా లేదు , బుజ్జితల్లీ ……. నీ అంకుల్ ……
మేడం ……. నా పేరు మహేష్ , you can call me మహేష్ ……..
దేవత : మహేష్ కళ్ళల్లో కనిపిస్తున్నది వేరు – మాట్లాడుతున్నది వేరు . అసలు పెళ్లి అయ్యిందా అన్నదే అనుమానం …….
( Wow ……. దేవత tooo టాలెంటెడ్ , కళ్ళు చూసి నిజం చెప్పేస్తోంది ) మేడం …..మీరు ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ బస్ కూడా మిస్ అయిపోతాము అని ఒకచేతితో బుజ్జితల్లిని – మరొకచేతితో లగేజీ ఎత్తుకున్నాను .
దేవత : అవునవును అంటూ దేవత అడుగుతున్నది మరిచిపోయి పైకిలేచింది .
అవినాష్ : కారుని exit దగ్గరకు తీసుకొస్తాను అని బయటకు పరుగుతీసాడు .
బయటకువచ్చిచూస్తే పార్కింగ్ లో కారు బయటకు తీసుకురావడానికి వీలులేనంతలా వెహికల్స్ అడ్డుగా ఉన్నట్లు అవినాష్ చూయించాడు .
దేవత : అడుగడుగునా అవాంతరాలు – ప్రకృతి కూడా ఇబ్బందిపెడుతోంది .
మేడం ……. ప్రతీదానికీ మీరు నెగటివ్ గా ఫీల్ అవ్వడం నాట్ రైట్ – ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి .
దేవత : ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అమ్మాయి జీవితం అంధకారమైనప్పుడు ఇలానే ……..
( మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావడానికేనేమో ప్రకృతి మనల్ని ఇలా కలిపింది – మీరే …… నా దేవత అని ప్రకృతే తెలియజేసింది , ఇక చూసుకోండి ) బుజ్జితల్లీ …… కంగారుపడకు – రేపు సూర్యుడి కంటే ముందుగా మీ అమ్మమ్మ ఒడిలో ఉంటావు .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో థాంక్యూ అంకుల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
( ఇలా సంతోషంతో ముద్దులుపెడితే ఇక ఆగను దూసుకుపోతాను ) బుజ్జితల్లీ …… నేనూ ముద్దుపెట్టవచ్చా ? .
బుజ్జితల్లి : మీ కీర్తి గుర్తుకువచ్చిందా …… ? , అలా గుర్తుకువచ్చిన ప్రతీసారీ నన్ను అడగకుండానే ముద్దుపెట్టవచ్చు .
థాంక్స్ కీర్తీ ……. అని బుగ్గపై ముద్దుపెట్టాను – మరి నా దేవత గుర్తుకువస్తేనూ …… అని దేవతకు వినిపించేలా చిన్నగా చెప్పి , ఓర కంటితో దేవతవైపు చూసాను .
ఎప్పుడో మూడోకన్ను తెరిచేశారు అదికూడా బస్ మిస్ అవుతుందేమోనన్న కంగారు ఒకటి ………
అమ్మో ……. కేర్ఫుల్ , మేడం ……. బస్ స్టాండ్ ప్రక్కనే – అండర్ గ్రౌండ్ లో 5 నిమిషాలలో వెళ్ళవచ్చు – 5 నిమిషాలు నడవగలరు కదా …….
దేవత : ఈ సిటీ నరకం నుండి బయటపడటం కోసం ఎన్ని కిలోమీటర్లయినా నడుస్తాను అని కన్నీటిని తుడుచుకున్నారు .
నా హృదయం చలించిపోయింది – ఆ కన్నీటి చుక్కలోనే తెలుస్తోంది ఎన్ని కష్టాలు అనుభవించారోనని …….. , మేడం …… ఇటువైపు ప్రక్కనే నడవండి .
అవినాష్ : సర్ బిరియానీ ……..
అమ్మ చేతి బిరియానీ వదిలి వెళతానా ……. ? , ఇవ్వు అవినాష్ …….
అవినాష్ : నేను తీసుకొస్తాను – బ్యాగు కూ……డా ……
నా కంటి సైగకు పెదాలపై చిరునవ్వుతో ఆగిపోయాడు .
దేవత : మహేష్ గారూ …… బ్యాగు ఇవ్వండి .
అంటే ఇప్పటికీ బ్యాగు దొంగతనం చేసేవాడిని ……..
దేవత : లేదు లేదు ……. సరే మీరే అంటూ ముసిముసినవ్వులు నవ్వారు .
అలా నవ్వుతూ ఉండండి – నవ్వితే మీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు .
దేవత : ఇదిగో ఇలానే డబల్ మీనింగ్ లో మాట్లాడుతారు అందుకే కోపం – ఒకసారి నవ్వితే చాలు అడ్వాన్స్ అయిపోతారు మీమగాళ్ళు ……..
Sorry మేడం , ఏదో నిజం చెప్పాను అంతే – అదీ వద్దంటే ఇక అన్నీ అపద్ధాలే చెబుతాను ……..
బుజ్జితల్లి : వద్దు అంకుల్ ,మీరు చెప్పినది నిజమే మమ్మీ బ్యూటిఫుల్ – నవ్వితే ఇంకా బ్యూటిఫుల్ ……. – మీకు బోలెడన్ని థాంక్స్ లు చెప్పాలి మీవల్లనే మమ్మీ నవ్వడం చూసాను .
ఉత్త థాంక్స్ లు నాకు నచ్చవు అని నీకు తెలుసుకదా ……. అనేంతలో ……
బుజ్జితల్లి : థాంక్స్ అంకుల్ ఉమ్మా ……. అని గట్టిగా ముద్దుపెట్టింది .
నిజం చెబితే నువ్వు థాంక్స్ తోపాటు ముద్దుకూడా ఇచ్చావు – మీ మమ్మీ …… కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు సరికదా డబల్ మీనింగ్ అంటూ కోప్పడుతున్నారు .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకుంది . మళ్లీ థాంక్స్ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
థాంక్యూ sooooo మచ్ కీర్తి తల్లీ ……. , అమ్మో ……. బస్ కు టికెట్స్ బుక్ చెయ్యడమే మరిచిపోయాను అని బ్యాగుని అవినాష్ కు అందించి మొబైల్ తీసి KSRTC యాప్ ఓపెన్ చేసాను . 20 – 30 నిమిషాలలో వరుసగా స్లీపర్ మరియు సూపర్ లగ్జరీ బస్సెస్ ఉండటం చూసి , స్లీపర్ లో అయితే ……. నో నో నో దేవతతో మాట్లాడే అవకాశం లభించదు కాబట్టి సూపర్ లగ్జరీలో బుక్ చేద్దాము అని సీటింగ్ ఓపెన్ చేసాను . అక్కడక్కడా 10 – 12 సీట్స్ ఖాళీగా ఉండటం చూసి గుడ్ అనుకున్నాను .
బుజ్జితల్లీ ……. బస్సులో ఏ సీట్స్ కావాలో మూడింటిని నువ్వే సెలెక్ట్ చెయ్యి .
దేవత : మూడు సీట్లు ఎందుకు మహేష్ గారూ …….
మళ్లీ నా కళ్లల్లో డబల్ మీనింగ్ ఏమైనా కనిపించిందా …….. నన్ను వేరే బస్ లో ……
దేవత : లేదు లేదు , కీర్తి తల్లికి అవసరం లేదు , నేను ఎత్తుకుని కూర్చుంటాను ,బస్సులో టికెట్ ప్రైస్ ఎక్కువ కదా – రెండు టికెట్స్ డబ్బు ……..
ఏంటండీ మీరు ……. ( రేయ్ మహేష్ గా మూడు ఎందుకురా నీ బుజ్జితల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొట్టడం ఇష్టం లేదా నీకు ) ఇష్టమే ఇష్టమే అని సంతోషంతో కేకలువేసి sorry sorry అంటూ నవ్వుకున్నాను . సరే మేడం మీకు – నాకు రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేస్తాను . బుజ్జితల్లీ …… సెలెక్ట్ చెయ్యి .
బుజ్జితల్లి : బస్సు మధ్యలో విండో ప్రక్కన సీట్ మమ్మీకి – మమ్మీ ప్రక్కన సీట్ మీకు ……..
దేవత : నో నో నో ……. అనేంతలో …….
డన్ కొట్టేయ్యడంతో టికెట్స్ బుక్ అయిపోయాయి – బుజ్జితల్లీ ……. షాక్ బస్ మొత్తం ఫుల్ ……. – మనం ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే మన సీట్లు వేరేవాళ్లకు బుక్ అయిపోయేవి అని బుజ్జిచేతితో హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
మేడం ….. నో నో నో అన్నట్లున్నారు – అవునుకదా …… దూరం కూర్చోవాలి అని కండిషన్ పెట్టారు – sorry sorry మేడం వెంటనే క్యాన్సిల్ చేసేస్తాను .
దేవత : వద్దు వద్దు ……. బస్ ఫుల్ అయిపోయింది అన్నారుకదా …….
నవ్వుకుని , ఈబుష్ ఫుల్ అయితే నెక్స్ట్ బస్ కు బుక్ చేస్తాను మేడం లేకపోతే నేనేదో ప్లాన్ చేసి ప్రక్కప్రక్కనే బుక్ చేశానని మీరు అనుకున్నా అనుకుంటారు .
దేవత : అది నిజమే కదా ……..
ఇంతమాట అన్నాక ఇక క్యాన్సిల్ చేయాల్సిందే అని మొబైల్ తీసాను .
దేవత : please please నో నో నో …….. అని చేతిని పట్టుకున్నారు .
ఫస్ట్ టచ్ ……. కరెంట్ షాక్ కొట్టినట్లు కదలకుండా నిలబడిపోయాను .దేవత చేతిని తీసేంతవరకూ వొళ్ళంతా తియ్యనైన జలదరింపులు ఆగడం లేదు .
దేవత వెంటనే చేతిని తీసేసి , నెక్స్ట్ బస్ కూడా ఫుల్ అయ్యుంటాయేమో , ప్రక్కప్రక్కనే పర్లేదు please please …….
తేరుకుని ( గాడెస్ …… మీరు రిక్వెస్ట్ చెయ్యడం ఏమిటి – నేను …… మీ నడుముపై పుట్టుమచ్చ దాసుడిని ఆర్డర్ వెయ్యాలి – ఆ స్థాయికి ఎలాగైనా తీసుకెళతానులే – మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు , కేవలం చేతి స్పర్శకే గాలిలో తేలిపోయాను ) మీకు ok అయితే నాకు ok , 15 నిమిషాలలో బస్ బయలుదేరబోతోంది అని అండర్ గ్రౌండ్ దిగాము.
అండర్ గ్రౌండ్ రెండువైపులా షాపింగ్ బిజీబిజీగా సాగిపోతోంది .
బుజ్జితల్లి : మమ్మీ …… సేమ్ టెడ్డి బేర్ సేమ్ టెడ్డి బేర్ టింకూ గాడి లా అంటూ ఉత్సాహంతో చూయిస్తోంది .
మేడం ……. ఒక్కనిమిషం అంటూ వెళ్లి ఆ టెడ్డి బేర్ ను అందుకుని , కీర్తి ఏంజెల్ కు నా తరుపున గిఫ్ట్ అని అందించాను – కీర్తీ తల్లీ …… నీకు తోడుగా టింకూ టెడ్డి బేర్ , నీ టింకూ టెడ్డి బేర్ కు తోడుగా ఈ కొత్త టెడ్డి బేర్ ………
బుజ్జితల్లి : మమ్మీ ………
దేవత : నో బుజ్జితల్లీ …….. , please మహేష్ గారూ …… ఇప్పటికే మీరు చాలా సహాయం చేసారు .
ఈ ప్రపంచంలో ఏఒక్కరూ తొడులేకుండా ఉండకూడదని తీసుకున్నాను – కావాలంటే మీ ఊరువెళ్లాక దీనికికూడా అమౌంట్ ఇచ్చెయ్యండి – please please మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లికోసం ……..
నా మాటలకు దేవత ….. ఒక కొత్త ఫీల్ తో నా కళ్ళల్లోకి చూస్తున్నారు . సరే ఈ ఒక్కసారికీ …… బుజ్జితల్లీ తీసుకో …….
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ – థాంక్యూ అంకుల్ అంటూనా బుగ్గపై ముద్దుపెట్టి ఒకేసారి రెండు టెడ్డి బేర్స్ ను హత్తుకుని ఆనందిస్తోంది .
బస్ స్టాండ్ రూట్ ద్వారా చేరుకుని , వైజాగ్ వెళ్లే బస్సెస్ ఆగు ప్లాట్ ఫార్మ్ చేరుకున్నాము . సూపర్ లగ్జరీ ఐరావత్ రెడీగా ఉండటంతో కండక్టర్ కు టికెట్స్ చూయించాము .
కండక్టర్ : మీకోసం మరియు మరొక వ్యక్తికోసం వెయిటింగ్ , రాగానే బయలుదేరడమే అని కన్నడలో చెప్పడంతో బస్ ఎక్కాము – చూస్తే అప్పటికే బస్ ఫుల్ అయిపోయింది .
మా వెనుకే అవినాష్ వచ్చి పైన లగేజీ మరియు లంచ్ బ్యాగ్ ఉంచి హ్యాపీ జర్నీ చెప్పాడు .
థాంక్స్ అవినాష్ …… బిరియానీ టేస్ట్ చేసి అమ్మకు కాల్ చేస్తాను .
అవినాష్ : అలాగే సర్ ……. , మేడం – పాప ……. మీకు కూడా హ్యాపీ జర్నీ , సర్ ….. చాలా చాలా మంచివారు అనిచెప్పి కిందకుదిగాడు .
పెదాలపై చిరునవ్వుతో , మేడం ……. కీర్తి తల్లి కోరిక ప్రకారం విండో ప్రక్కన మీరు అని కూర్చోగానే ఒడిలోకి చేర్చాను – మీ ఆజ్ఞ ప్రకారం మీకు దూరంగా నేను అని వెనుక చివర సీట్లో కూర్చున్నాను , బస్ మొత్తానికి ఖాళీగా ఉన్నది ఆ సీట్ మాత్రమే – దేవుడా ……. ఎలాగైనా నన్ను , నాదేవత ప్రక్కన చేర్చు please please ……. తిరుపతికి కాలినడకన వస్తాను .
కీర్తి తల్లి : నాదగ్గరకువచ్చి అంకుల్ ……. మమ్మీ చెప్పింది కదా ప్రక్కప్రక్కనే …….
దేవత : కీర్తి తల్లీ …… అని పిలవడంతో బుజ్జిబుజ్జి అడుగులతో వెళ్ళింది .
ప్చ్ ……. దేవత ఇప్పట్లో ఏ మగవాడినీ అంత సులభంగా నమ్మేలా లేదు , చూద్దాం ఏమిజరుగుతుందో ……
కండక్టర్ చెప్పినట్లు చివరివ్యక్తి బస్ ఎక్కాడు . అతడెలా ఉన్నాడంటే చూస్తేనే భయపడేలా ఉన్నాడు – బస్ మొత్తం చూసి దేవత ప్రక్కన ఉన్న సీట్ పై కన్నుపడింది .
దేవత గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లు , సీట్లోనుండే మహేష్ గారూ మహీద్ గారూ …….. please please వచ్చి కూర్చోండి అని బ్రతిమాలుతున్నారు – బుజ్జితల్లి పరుగునవచ్చి అంకుల్ అంకుల్ అంటూ చేతిని లాగుతోంది .
లోలోపలే ఎంజాయ్ చేస్తూ …… , పర్లేదు మేడం ……. మీకు దూరంగా ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది అని బుజ్జితల్లిని గుండెలపైకి ఎత్తుకున్నాను .
అంతలో అతడు దగ్గరికి రానేవచ్చాడు . దేవత చూసి భయంతో కళ్ళు మూసుకోవడమే కాకుండా చేతులతో ముఖాన్ని మూసుకుని దేవుడా దేవుడా ……. అంటూ ప్రార్థిస్తోంది .
ప్రక్కన కూర్చున్నట్లు అనిపించగానే , అధిరిపడి దేవుడా దేవుడా ……. అంటూ ఓర కంటితో వేళ్ళ మధ్యన చూసి , మహేష్ గారూ …… మిమ్మల్నీ అంటూ భుజంపై దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .
ఈ క్షణం కోసమే కదా …….. wait చేసినది అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
బుజ్జితల్లి : అప్పటివరకూ బుజ్జినోటిని చేతులతో మూసుకున్నట్లు సంతోషంతో చప్పట్లు కొడుతోంది .
కోపం కాదు తాపం చల్లారినట్లు నన్ను కొడుతుండటం తెలిసి నాలుక కరుచుకుని తనలోతానే నవ్వుకుంటున్నారు – వెనక్కు చూస్తే ఆ వ్యక్తి చివరి సీట్లో కూర్చోవడం చూసి హమ్మయ్యా ……. అనుకున్నారు .
32 దెబ్బలు కొట్టారు మేడం స్స్స్ స్స్స్ ……
దేవత : నొప్పివేస్తోందా …… ? , sorry sorry ……..
పర్లేదు మేడం , మీలానే మీ దెబ్బలు కూడా ……..
దేవత : నా దెబ్బలు కూడా ……. అంటూ మళ్లీ మూడో కన్ను తెరిచేశారు – కొద్దిగా చనువిస్తే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు అని బుజ్జితల్లిని నా నుండి అందుకుని అటువైపుకు తిరిగారు .
బుజ్జితల్లి : sorry అంకుల్ ……..
I like that ……. , నిమిషంలో వచ్చేస్తాను అని లేచి బస్ దిగాను . ఎదురుగా ఉన్న షాప్ లో బోలెడన్ని పాప్ కార్న్ ప్యాకేట్స్ – చిప్స్ ప్యాకేట్స్ – చాక్లెట్ లు – ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్ – వాటర్ బాటిల్స్ ……. రెండు చేతులనిండా తీసుకుని , బస్ ఎక్కకుండా వెనుక నుండి దేవత వెనుక సీట్ ప్రక్క విండో నుండి చూస్తున్నాను – ఒకవేళ నేను కనిపించకపోతే దేవత రియాక్షన్ ఏమిటని ………
నిమిషంలో బస్ స్టార్ట్ అయ్యి డోర్ క్లోజ్ అవ్వడమే కాకుండా నాలుగైదుసార్లు హార్న్ మ్రోగింది . దేవత చుట్టూచూసి కనిపించకపోయేసరికి లేచిమరీ చూస్తున్నారు . అంతలో బస్ వెనుకకు కదలడంతో కంగారుపడిపోయి స్టాప్ స్టాప్ అని కేకలువెయ్యడం కిక్కిచ్చింది – ఈ మాత్రం చాలు అని పరుగునవెళ్లి డోర్ తట్టి ఓపెన్ చెయ్యడంతో బస్ ఎక్కాను .
దేవత గుండెలపై చెయ్యి చేరడం – బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి సంతోషంతో లోలోపలే డాన్స్ చేస్తూ లోపలికినడిచాను .
మెడలో – రెండు చేతులనిండా స్నాక్స్ ఉండటం చూసి అందరిచూపు నామీదనే – ఆశతో నావైపు చూస్తున్నారు .
సీట్ దగ్గరికి చేరుకుని కీర్తి తల్లీ …… మొత్తం నీకోసమే అంటూ వర్షం కురిపించాను .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ …….. అంటూ బుజ్జిచేతులతో పట్టుకోవడానికి ట్రై చేస్తూ ముద్దుగా నవ్వుతోంది .
అందరూ వచ్చేసినట్లే రైట్ రైట్ అని కండక్టర్ విజిల్ వెయ్యడంతో బస్ ఒక జర్క్ ఇచ్చింది .
దేవత ఒకచేతితో బుజ్జితల్లిని పడిపోకుండా పట్టుకుని , పట్టుతప్పకుండా మరొకచేతితో నా షర్ట్ పట్టుకున్నారు .
మేడం జాగ్రత్త అని బుజ్జితల్లిని అందుకున్నాను ఏమాత్రం దేవతను టచ్ చెయ్యకుండా ……. – ఏంటి అలా చూస్తున్నారు పడిపోతారు కూర్చోండి అని ప్రక్కనే కూర్చున్నాను – ఏంటి మేడం అలా కేకలువేశారు నేను ఎక్కలేదని కంగారుపడినట్లున్నారు .
దేవత : లేదు లేదు అలాంటిదేమీ లేదు , నేనా కేకలు నో నో నో అంటూ అటువైపుకు తిరిగి ఒసేయ్ నిన్నూ అంటూ సున్నితంగా మొట్టికాయలు వేసుకున్నారు .
ఇదిచాలు …… రైట్ రైట్ అని కేకేయ్యడంతో బస్ కదిలింది .
బుజ్జితల్లి : చాక్లెట్ లు – ఐస్ క్రీమ్స్ – స్నాక్స్ ……. అన్నీ ఎవరికోసం అంకుల్ …….
ఎవరిపై కుమ్మరించాను కీర్తీ …….
బుజ్జితల్లి : నాపైననే ……..
Yes నీకు – నాకు మరియు మరియు …….. ఇంకెవరిపై కుమ్మరించాను మీ మీ ……. అంటూ దేవతవైపు చూసాను .
మన చూపులు అమ్మాయిలకు కిలోమీటర్ల దూరం నుండి అయినా తెలుస్తుంది అంటారు ఇక్కడ ప్రక్కనే కదా తెలిసి దేవత కోపంతో చూసింది .
అదే అదే నీ నీ టెడ్డి బేర్స్ కు కీర్తీ ……. మొత్తం మీకే ఎంజాయ్ …….
దేవత : బుజ్జితల్లీ నో , మహేష్ గారూ ……. ఇప్పుడు ……
ఏదో ఇష్టంతో తీసుకొచ్చాను మేడం గారూ – కావాలంటే తిన్నవాటికి కూడా డబ్బు ఇద్దురుకానీ , కీర్తీ నువ్వు – నీ టెడ్డి బేర్స్ హ్యాపీగా తినండి . మనం ఫ్రెండ్స్ అయ్యాముకదా కొద్దిసేపటి ముందే …… మనిషిని నమ్మాలండీ ……..
దేవత : మీలా సరదా సరదాగానే ఉండేదానిని , మా పల్లెలో అందరమూ కలిసిమెలిసి పంటలను పండిస్తాము ఒకరిపై మరొకరికి అంత నమ్మకం – అలాంటి స్వచ్ఛమైన జనాలమధ్యన ఇంకెంత సంతోషంతో పెరిగి ఉంటానో ఊహించుకోండి – నా జీవితంలోకి వచ్చిన ఒక మృగం వలన …….. అయినా మీకెందుకు చెబుతున్నాను , కీర్తి తల్లీ …… తిన్నవన్నీ కౌంట్ చెయ్యి అంకుల్ కు దీనితో కలిపి ఇచ్చేద్దాము .
దేవత కన్నీళ్లను చూసి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి . వెంటనే కన్నీళ్లను తుడుచుకుని , కీర్తీ ……. మీ మమ్మీతో డీల్ సెట్ అయిపోయింది ఇక స్టార్ట్ చేసేయ్ …….
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ – థాంక్యూ అంకుల్ ……. అని కోన్ ఐస్ క్రీమ్ బాక్స్ నుండి ఒకటి చేతిలోకి తీసుకోగానే …… , ప్రక్కన – ముందు – వెనుక కూర్చున్న పిల్లలు ఆశతో చూడటం చూసి , అంకుల్ ……. అంటూ చెవిలో గుసగుసలాడింది .
హబ్బా ……. మా కీర్తీ ……. దేవత కోపంగా చూపుకు , sorry sorry మీ మీ కీర్తీ బంగారం ……. – దేవత శాంతించగానే హమ్మయ్యా అనుకున్నాను – కీర్తీ తల్లీ …… నీ ఇష్టమే నా ఇష్టం మీ మమ్మీ ఇష్టం , దేవత మళ్లీ ఒక చూపు చూసారు – అలా చూడాలనే కదా నా ప్రయత్నాలు కూడా అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను . మేడం ……. మీ బుజ్జి ఏంజెల్ ఇష్టమే మీ ఇష్టం కాదా చెప్పండి .
నా వైపు కోపంతో చూస్తూనే బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టారు .
కీర్తీ ……. మీ మమ్మీ కూడా ok అన్నట్లే , ఇంకెందుకు ఆలస్యం – ఆలస్యం చేసేకొద్దీ ఐస్ క్రీమ్స్ కరిగిపోతాయి అని కిందకుదించాను . బుజ్జిచేతులలో ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్ బాక్స్ ఇచ్చాను – వాళ్లకు ఏది ఇష్టమైతే అవి ఇవ్వు …….
బుజ్జితల్లి : ఒకవేళ రెండూ ఇష్టమైతే అంకుల్ అని బుజ్జి బుజ్జి నవ్వులతో అడిగింది.
ఇచ్చేయ్ బుజ్జితల్లీ ……. , నెక్స్ట్ స్టాప్ లో మళ్లీ తీసుకొస్తాను , అదికూడా మీ మమ్మీ కోపంతో చూడకపోతేనే ………
దేవత చేతిని అడ్డుపెట్టుకుని నవ్వడం చూసి ఆనందం కలిగింది .
బుజ్జితల్లి : థాంక్స్ అంకుల్ అని బుగ్గపై ముద్దుపెట్టి , ప్రక్కన సీట్స్ లో పేరెంట్స్ ఒడిలో కూర్చున్న పిల్లాడికి రెండూ ఇచ్చింది .
పిల్లాడు థాంక్స్ అనడం – పేరెంట్స్ …… బుజ్జితల్లి బుగ్గలను స్పృశించడంతో ….. బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేనట్లు నావైపుకు తిరిగి థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని బుజ్జిబుజ్జినవ్వులతో చెప్పింది .
థాంక్స్ మాత్రమేనా అని బుంగమూతిపెట్టుకున్నాను .
బుజ్జితల్లి : నో నో నో అంకుల్ అంటూ ముద్దుపెట్టడానికి నాదగ్గరికి వచ్చింది .
నాకు పెట్టావుకదా మీ మమ్మీకి అంటూ ఎత్తి మా మధ్యలో నిలబెట్టాను .
బుజ్జితల్లి సంతోషాలను ఆనందబాస్పాలతో దేవత చూస్తుండటం అప్పటికి గమనించి yes yes అనుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ మమ్మీ ……..బాయ్ థాంక్స్ చెప్పాడు – బాయ్ పేరెంట్స్ బుగ్గలు నిమిరారు తెలుసా ….. , soooo happy ……. అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవత : లవ్ యు తల్లీ ……. అని బుజ్జితల్లి ఆనందాలను చూసి మురిసిపోతూ ప్రాణంలా గుండెలపై హత్తుకుంది .
మేడం …… మిగతా పిల్లలందరూ ఆశతో బుజ్జితల్లివైపే చూస్తున్నారు – మరొక్క క్షణం ఆలస్యం చేసినా బుజ్జి జాంబీస్ లా మనమీదకు జంప్ చేసి లాక్కునివెళ్లేలా ఉన్నారు అని గుసగుసలాడాను – కావాలంటే డిస్ట్రిబ్యూషన్ తరువాత మీ బుజ్జితల్లిని ఊరికి చేరేంతవరకూ గుండెలపైననే ఉంచుకోండి .
దేవత ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు . చుట్టూ పిల్లలను చూసి అవును నిజమే మహేష్ గారూ ……. అని నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నారు – కీర్తీ తల్లీ …… వెళ్లు అని నవ్వుని మాత్రం ఆపడం లేదు .
దేవత నవ్వులను వీక్షిస్తూనే బుజ్జితల్లిని కిందకుదించాను వెళ్ళమని …….
బుజ్జితల్లి : అలాగే అంకుల్ అని ముందుకు వెళ్లి ఒక్కొక్క వరుసలోని పిల్లలకు వారికిష్టమైనవి అందించి , పిల్లల నుండి థాంక్స్ – పేరెంట్స్ నుండి ఆశీర్వాదాలు అందుకుని , మమ్మీ – అంకుల్ …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ మా దగ్గరికి పరుగునవస్తోంది .
అంతలో స్పీడ్ బ్రేకర్ వచ్చినట్లు సడెన్ బ్రేక్ వెయ్యడంతో , బుజ్జితల్లి చేతులలో బాక్సస్ ఉండటం వలన మమ్మీ …… అంటూ వెనక్కు పడేంతలో లేచి పట్టుకున్నాను – దేవత కంగారుపడుతూ లేచి చూసి హమ్మయ్యా …… అంటూ గుండెలపై చేతినివేసుకుంది .
బుజ్జితల్లీ ……. నేనుండగా నీకేమైనా కానిస్తానా చెప్పు , కళ్ళుతెరిచి చూడు బుజ్జితల్లీ ……
బుజ్జితల్లి : కళ్ళుతెరిచి చూసి నేను పడలేదా అంకుల్ అని ముద్దుముద్దుగా అడిగింది .
లేదు బుజ్జితల్లీ ……. అంటూ లేచి గుండెలపై హత్తుకున్నాను . చుట్టూ చూస్తే బస్సులో ఉన్న ప్రతీఒక్కరూ ఊపిరిపీల్చుకోవడం చూసి , మీరంతా ఆశీర్వదించారు కదా ఏమీకాదులేండి ఎనీవే మీ అందరికీ థాంక్స్ …….
కండక్టర్ : రేయ్ …… కాసేపు స్టడీగా వెళ్లు , చిన్నపాప బస్సులో ఉన్న పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ ఇస్తోంది అని డ్రైవర్ కు చెప్పాడు .
డ్రైవర్ : sorry పాపా …… అని కేకవేసి ఒకే వేగంతో పోనిస్తున్నాడు .
అందరినీ చూసి సంతోషంతో కూర్చుంది దేవత ………
బుజ్జితల్లీ ……. వెనుక నీ బుజ్జి ఫ్రెండ్స్ కు ఇచ్చేదాకా ఎత్తుకోనా …….
బుజ్జితల్లి : అలాగే అంకుల్ అని బుగ్గపై ముద్దుపెట్టింది .
ముద్దుపెట్టాలని ఉన్నా దేవతవైపు చూసి ఆగిపోయాను – వెనుక పిల్లలందరికీ అందించి , వాళ్ళ థాంక్స్ లకు మురిసిపోతున్న బుజ్జితల్లిని చూసి ఆనందిస్తూ నా ప్లేస్ లో వచ్చి కూర్చున్నాను . మేడం గారూ …… ఇక మీఇష్టం ఎంతసేపైనా హత్తుకోండి అని అందించాను .
దేవత : బుజ్జితల్లి బుజ్జినవ్వులను చూసి దేవత ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి – తల్లీ ……. ఇంత సంతోషంగా నిన్ను ఎప్పుడూ చూడలేదు బంగారూ ……. చాలా చాలా ఆనందం వేస్తోంది – నా వల్లనే కదా నువ్వుకూడా అలా అని కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బంగారూ ……. ప్రాణంలా హత్తుకున్నారు .