“సర్ ఇందంతా ఎందుకు చెప్తున్నారు నాకు ??” అని అడిగాను.
అశ్విన్ కొంచెం లేసి తన జోబీలో నుంచి ఒక కార్డు బయటకు తీసి నాకు ఇచ్చాడు. ఆ కార్డు తీసుకున్నాను.
కార్డు చూసాను “అమిత్” అని రాసుంది, దాని కింద ఒక నెంబర్ ఉంది. ఇంకేమి లేదు.
“సర్ ఏంటిది ?? అసలు ఎవరితను??” అని అడిగాను.
“ఇతన్ని ఒకసారి కలవు….. అంత నీకే అర్ధమవుతుంది…..”
“సర్ అసలు నేను ఎందుకు ఇతన్ని కలవాలి…..”
“నేహా నేను నీకు ఒక బెటర్ లైఫ్ జీవించటానికి నీకు ఒక మంచి ఛాన్స్ఇస్తున్నాను ….. దాన్ని వాడుకుంటావో లేదో నీ ఇష్టం”
“సర్ అసలు ఇతను ఎవరో నేను తెలుసుకోవచ్చా ??” అని అడిగాను.
“నేహా. అతను టెర్రరిస్ట్ కాడు, సీరియల్ కిల్లర్ అంతకన్నా కాడు…” అని చాలా వెటకారంగా చెప్పాడు.
“ఐన, నేను నీకు హాని చేస్తే నాకేమి వస్తుంది ?? ఈ రోజు నీతో చాలా విషయాలను చెప్పను, చాలా సీక్రెట్స్ ని బయట పెట్టాను, ఎవ్వరికి తెలియనివి….. ఎందుకంటే నువ్వంటే నాకు అంత నమ్మకం….. నాకు. నేను నిన్ను ఆ ఇమెయిల్ అడ్డుపెట్టుకొని ఏమైనా చేసుడొచ్చు కానీ నేను నీకు నిజం కూడా చెప్పేసాను….సో నా మీద నమ్మకం ఉంటె ఒక్కసారి అతన్ని కలవు…..” అన్నాడు.
“ఒకే సర్….” అన్నాను.
“అసలు నేనిదంతా ఎందుకు చేస్తున్నాను అనే డౌట్ నీకు ఉంది కదా ??”
“అవును సర్….”
“నేహా నేను ఇందాక చెప్పినట్లు ఇక నేను ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, మొన్న నిన్ను కలిసాక నేను కొంచెం బాధ పడ్డాను…. నేను చేసిన తప్పుకు….. ఈ విధంగా నేను నీకు నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను …..అంతక మించి ఏమి లేదు…..”
“సరే ఇక నేను వెళ్ళాలి అర్జెంటు గా ఇంటికి” అని చెప్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి.
నేను అశ్విన్ వెళ్ళిపోయాక బాగా ఆలోచించాను, నాకు ఇంకా అర్ధంకాలేదు ఈ అమిత్ ఎవరు అనేది. ఒకసారి అసలు ఎవరో కనుక్కుందామని నేను కార్డు తీసి ఆ నెంబర్ డయల్ చేసాను.
ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో ఫోన్ ఎత్తారు.
“అమిత్ హియర్…. ఎవరు మాట్లాడేది ??”
“సర్ నా పేరు నేహా….. అశ్విన్ గారు ఈ మీ నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడమన్నారు….”
“ఓ నేహా…..నేను నీ కాల్ expect చేస్తున్నాను, కానీ ఇంత ఫాస్ట్ గా వస్తుందని నేను expect చేయలేదు. అయితే నేను ఫోన్ లో విషయాలు మాట్లాడాను…..ఎక్కడైనా కలుద్దాం ….. ” అన్నాడు.
“ఒకే సర్……ఎక్కడ కలుద్దాం ??”
“హోటల్ హాలిడే ఇన్ , రూమ్ నెంబర్ 608 కి రా….నేను ఈవెనింగ్ 4 వరకే నేను ఇక్కడ ఉంటాను….ఆ తర్వాత నేను నిన్ను రేపు ఈవెనింగ్ మాత్రమే కలవగలను …..ఎప్పుడు కలుస్తావో ఒక వన్ అవర్ లో ఫోన్ చేసి కంఫర్మ్ చేయి” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
ఏంటి హోటల్ కి రమ్మంటున్నాడు అని అనుకున్నాను, కాకపోతే సాయంత్రం ఉండను అని చెప్తున్నాడు. రేపు బిజీ అంటున్నాడు. అసలు అశ్విన్ ఈ కాంటాక్ట్ ఎందుకు నాకిచ్చాడు ?? నాకు నిజంగా తన ఉద్దేశం ఏంటో అర్ధంకాలేదు.
నేను అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాను. అసలీ అమిత్ ఎవరు ?? ఇతనికి అశ్విన్ కి సంబంధం ఏంటి ?? అసలు అశ్విన్ కి ఆ ఇమెయిల్ వెనకాల ఉన్న నిజం నాకు అసలు చెప్పక్కర్లేదు. కానీ చెప్పాడంటే ఎందుకు చెప్పాలి నాకు ?? అలాగే రాజ్ గురించి కూడా చాలా విషయాలు తెలిసాయి. అవి కూడా చెప్పాల్సిన పని లేదు. అలాగే అశ్విన్ కి ఇన్ని విషయాలు ఎలా తెలుసు ?? న్యూస్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసాడు అంటే, ఈ మీటింగ్ కోసం బాగా ఎదురు చూసాడా, లేక తాను జాబ్ వదిలేస్తున్నారు కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా కలవాలని వచ్చాడా ?? అలాగే అసలు నాకు ఈ అమిత్ అనే వాడి కాంటాక్ట్ ఎందుకు ఇచ్చాడు, ఈ టైం లో ?? అసలు అతని ఉద్దేశం ఏంటి ?? నిజంగానే బాధపడుతున్నాడా నా గురించి ?? లేదా కేవలం నటన ?? అలాగే నేను ఇంకో జాబ్ గురించి అడిగితే వేరే చోటైనా నా జీవితం ఇలాగే ఉంటుంది కదా అని ఎందుకు అంటున్నాడు ?? అసలు అమిత్ అనేవాడు ఎం చేస్తాడు ?? అసలు హోటల్ లో ఎందుకు కలవాలి ?? అతను వేరే ఊరు వాడ ?? అలాగే ఇప్పటికి చాల విషయాలు నాకు వైస్ ప్రెడిసెంట్ విషయంలో, నన్ను resign చేయమనడం కానీ, మిగిలిన విషయాల గురించి సరైన క్లారిటీ లేదు….. అలాగే డబ్బుల గురించి, నా జీవితం గురించి పదే పదే మాట్లాడాడు నాకు ఒక…. కొత్త జీవితం అంటున్నాడు…. అసలు ఏంటి ఇదంతా ?? ఎం జరుగుతుంది అసలు ?
నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్దాము అంటే అక్కడ రైడ్స్ జారుగుతున్నాయి, ఇంకో వారం పాటు కొనసాగేటట్లున్నాయి. ఈ టైం లో నా లాంటి చిన్న ఎంప్లాయిస్ ఉండాల అక్కడ ?? ఏమోలే నేను ప్రస్తుతం ఆఫీస్ ని టచ్ చేయాలనుకోవడం లేదు.
అమిత్ ని ఇప్పుడే కలవాలి, రేపైతే ఈవెనింగ్ అంటున్నాడు. ఇప్పుడైతే 4 లోపల మీటింగ్ ఐపోగొట్టి బయటకు వచ్చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు టైం ఇంకా ఉంది కాబట్టి.
అమిత్ కి ఫోన్ చేశాను.
“సర్, నేను మిమ్మల్ని ఇప్పుడే కలవాలనుకుంటున్నాను. ఒక అరంగంటలో ఆ హోటల్ కి వస్తాను.” అని చెప్పాను.
“ఒకే….నేహా….నీ ఇష్టం….” అని ఫోన్ పెట్టేసాడు.
అమిత్ బాగా బిజీ వ్యక్తా ఏంటి, ఊరికినే ఫోన్ పెట్టేస్తున్నాడు ??
నేను ఒక క్యాబ్ బుక్ చేసుకొని, ఆ హోటల్ కి వెళ్లాను డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. ఇప్పటికి నేను స్నానం చేయలేదు. ఇంకా ఆ టీ షర్ట్ జీన్స్ లోనే ఉన్నాను.
నేను ఆ హోటల్ కి రీచ్ అయ్యి అమిత్ కి ఒక మెసేజ్ ఇచ్చాను. తను రూమ్ నెంబర్ మెసేజ్ చేసాడు నాకు.
నేను రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టి బెల్ కొట్టాను.
నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యి “వావ్ నేహా డియర్, చాలా అందంగా కనిపిస్తున్నావు. ప్లీస్, లోపలికి రా….” అంటూ ఆహ్వానించాడు.
చూడటానికి ఒక 35-40 మధ్యలో ఉంటుంది వయసు. నేను లోపలి వెళ్లాను. చాలా పెద్ద రూమ్ కానీ ఆ రోజు రాజ్ రూమ్ అంతది కాదు.
నన్ను డైరెక్ట్ గా బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోమన్నాడు. నాకు భయం వేసింది.
అది గమినించి “భయపడకు, ఇది కేవలం ఒక నార్మల్ మీటింగ్….మాత్రమే” అని చెప్పాడు.
తను ఒక చైర్ తెచ్చుకొని నా ఎదురుగ్గా కూర్చున్నాడు.
“ఓహ్ నేహా డియర్, అశ్విన్ నాకు అబద్దం చెప్తున్నదేమో అనుకున్నాను నీ అందం గురించి చెప్పినప్పుడు. నువ్వు నిజంగానే చాలా చాలా అందంగా ఉన్నావు. నాకు నీ అందాన్ని వర్ణించాలంటే నోటి నుంచి మాటలు అస్సలు రావటంలేదు” అని అన్నాడు.
అసలు ఎవడీడు, నన్ను ఇక వచనంలో పలరిస్తూ, పైగా నేహా డియర్ అని పిలుస్తున్నాడు. నా అందం గురించి మాట్లాడుతున్నాడు.
“సర్, నన్ను పొగడటం ఆపేసి, ప్లీజ్ డైరెక్ట్ గా పాయింట్ కి రండి” అన్నాను.
“నేహా డియర్, ఎందుకు అంత తొందర పడుతున్నావ్, ముందుగా కొంచెం కాఫీ తాగు….” అని అడిగాడు.