నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 2

Posted on

ఈ లోపల ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది.

“హలో రాసి ఎలా ఉన్నవే ??”

“హారిక నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్ ??”

“పర్లేదే…..”

“హే ఏమైంది ఎప్పుడు చాల ఉషారుగా ఉంటావ్, ఈ సరి బాగా డల్ అయిపోయినట్లున్నావ్…….అర్ యూ ఓకే ??”

“రాసి నా జాబ్ పోయిందే …….”

“ఓ దట్ ఇస్ సో శాడ్…….ఒక హగ్ కావల నా నుంచి ??”

“ఒకే”

నేను ఫోన్ నా చాతి మీద పెట్టుకుని ఫోన్ మల్ల చెవి దగ్గర పెట్టుకున్నాను.

“రాసి ??”

తను ఇంకా హాగ్ లోనే ఉంది.

“యా నేహా అర్ యూ దేర్ ??’

“రాసి చెప్పు…”

“సర్లే నేహా నేను మళ్ళా చేస్తాను నీకు కొంచెం బిజీ గా ఉన్నాను. నువ్వేమో కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నట్లున్నావ్”

“ఒకే రాసి”

“bye హారిక”

“bye రాసి”

ఫోన్ కట్ అయ్యింది. ఈ లోపల బెల్ మోగింది. వెళ్లి డోర్ ఓపెన్ చేసాను.

“మేడం పార్సెల్”

“పార్సెలా ?? ఎక్కడినుంచి ??”

“ఆన్లైన్ ఆర్డర్ మేడం….”

“ఓ ఓకే.”

“మడం ఇక్కడ సైన్ చేయండి”

“నేను సైన్ చేసి పార్సెల్ తీసుకొని డోర్ క్లోజ్ చేసాను”

మొన్న ఒక మంచి డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను ఆఫర్ ఉంటె. బాగా చిరాకుగా ఉండే సరికి కొంచెం distract అవుదాం అని, పార్సెల్ ఓపెన్ చేసి డ్రెస్ ట్రై చేసాను. అద్దంలో చూసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సరిగ్గా సీజ్ మ్యాచ్ అయ్యింది. కలర్ కూడా చాలా చాల బాగుంది. కానీ ఇయర్ రింగ్స్ వేరేవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

కానీ ఎంత రిలాక్స్ అవుదాం అనుకున్న, అస్సలు కుదరటంలేదు. ప్రియా చేయి పట్టుకొని అశ్విన్ ని గన్ పెట్టి పేల్చి ప్రియను జైలు లో పెట్టాలని ఉంది నాకు. ఆ దాని వల్లే ఇదంతా కూడా. అశ్విన్ గడు నిజంగా నీచుడు. యాదవ. పెద్ద పనికిమాలినవాడు. లోఫర్. ఇడియట్. వాడిని ఎంత తిట్టిన పాపం లేదు.

ఈ లోపల సుధీర్ నుంచి ఫోన్ వచ్చింది.

“నేహా, నేను ఇప్పుడే కనుక్కున్నాను ఎవరు ఆ వీడియోస్ ని డిలీట్ చేయమన్నారో ……..”

“ఎవరు ??”

ఎం వినపడలేదు. కట్ అయిపోతుంది సిగ్నల్.

“హలో ?? సుధీర్ ?? హలో ??”

ఫోన్ కట్ చేసి మళ్ళా కాల్ చేశాను కానీ లైన్ బిజీ అని వస్తుంది. ఫోన్ కోసం బాగా వెయిట్ చేశాను. ఇంతలో ఫోన్ మళ్లా వచ్చింది:

“సుధీర్, వీడియోస్ డిలీట్ చేయించింది ఎవరు ?? చెప్పు”

“వైస్ ప్రెసిడెంట్ అని చెప్పారు”

“వైస్ ప్రెసిడెంటా ??” అని ఆశ్చర్యంగా అడిగాను.

టు బి కంటిన్యూడ్ ….

181405cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *