“నాకు నిన్నటి CCTV రికార్డింగ్ కావాలి”
“నిన్నటిదా దేనికి ??”
“సుధీర్ ప్లీజ్ నీకు మళ్ళా చెప్తాను. ఇది బాగా అర్జెంట్. నిన్న నా కేబిన్ దగ్గర ఉన్న కెమెరాకు సంబందించినది ఫుటేజ్ కావలి”
“ఏమైనా టైం చెప్పగలవా ??”
నేను చెప్పాను.
“సరే….ఏంటి విషయం ??”
“సుధీర్ ప్లీజ్ నీకు చెప్తాను…..అర్జెంటు గా అది సంపాదించు నువ్వు…..ఒక కాపీ కావలి నాకు”
“కార్చవ్వుద్ది మరి……”
“పర్లేదు నేను ఇస్తాను నీకు ఎంత కావాలో”
“సరే…….నేను ఒకసారి వెల్లో అక్కడికి నీకు కాల్ చేస్తాను ఓకేనా ??”
“థాంక్స్ సుదీర్స్……. చాల చాల థాంక్స్…..”
ఫోన్ కట్ అయ్యింది. ఇప్పుడే ఎం తినాలనిపించలేదు. సుధీర్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అటు ఇటు ఫోన్ చేతిలో పట్టుకొని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఫుటేజ్ దొరికిందంటే నేను ఈ ప్రాబ్లెమ్ నుంచి బయటపడినట్లే. నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను.
ఈ లోపల మళ్ళా ఆలోచించటం స్టార్ట్ చేశాను. ఈ ప్రియా అశ్విన్ కలసి ఇంత కుట్ర చేస్తారనుకో లేదు. అసలు వైస్ ప్రెసిడెంట్ గడు దీనంతటికి కారణం. వాడు అసలు ప్రియతో అందుకు మాట్లాడాలి. వాడు దాంతో మాట్లాడినందువల్లే కదా ఇదంతా. నేను కూడా ఆయనకు విషయం చెప్పకుండా పెద్ద తప్పు చేసాను. కనీసం ఆయనను ఎలాగైనా కాంటాక్ట్ చేయాలనుకున్నాను. అయన నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించాను. వైస్ ప్రెసిడెంట్ నాకు కనీసం నిన్న ఫోన్ చేసి చెప్పాలి కదా ఇలా జరిగిందని. resign చేసి అలా వెళ్ళిపోవటం ఏంటి ??
ఈ లోపల ఫుడ్ చల్లారుతుందని పార్సెల్ ఓపెన్ చేసి ఫుడ్ తినటం స్టార్ట్ చేసాను. ఈ లోపల సుధీర్ ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ ఎత్తాను:
“హలో సుధీర్”
“సారి నేహా….”
“ఏమైంది ??”
“ఎవరో ఇందాకే వచ్చి ఆ రికార్డింగ్స్ డిలీట్ చేసేసారట…..”
“డిలీట్ చేసేసార?? అదేంటి ?? ఎవరు ??”
“వాళ్ళు చెప్పరంట…….”
“సరే సుధీర్ నీకు మళ్ళా కాల్ చేస్తాను…… బాయ్” అని ఫోన్ పెట్టేసాను. నాకసలు ఎం చేయాలో అర్ధంకాలేదు. మళ్ళా భయం స్టార్ట్ అయ్యింది. నాకేమి తినాలనిపించలేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేనింత కష్టపడి చివరికి ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండటం ఏంటి అని అర్ధంకాలేదు.
నేను ఫుల్ stressed గా ఫీల్ అవ్వటంతో తల నొప్పి స్టార్ట్ అయ్యింది. బాగా ఎపుడొచ్చేసింది విషయం తలచుకుంటేనే. నాకు ఎం చేయాలో అర్ధం కాక సోఫా మీదే పడుకొని ఆలోచించాను. ఇప్పటికి ప్రియకు వచ్చిన ప్రమోషన్ తట్టుకోలేకపోతున్నాను. నిన్న వాచ్మెన్ గడు గేట్ దెగ్గర నాకిచ్చిన లుక్ ఇప్పటికి మరిచిపోలేను. కచ్చితంగా క్లీనర్ గాడు అందరికి నా విషయం చెప్పేసుంటాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ అంత నా గురించి ఏవేవో అనుకుంటారు. అశ్విన్ ప్రియ కలసి ఆఫీస్ లో నన్ను, వైస్ ప్రెసిడెంట్ ని ఇరికించారు. వైస్ ప్రెసిడెంటే లొంగిపోయి resign చేసాడంటే ఇక నేనెంత ?? ఇదంతా తలచుకొని ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయినట్లనిపించింది .
నాకు ఇంకా దిక్కు తోచక ఓకే పేపర్ తీసుకున్నాను. రాయటం స్టార్ట్ చేసాను. ఒక లెటర్ రాసి. కిచెన్ నుంచి కత్తి తెచ్చుకున్నాను. ఆ లెటర్ టేబుల్ పైన పెట్టి, బాత్రూం లోకి వెళ్లి నిల్చున్నాను. ఫోన్లో టైం చూసాను 4:17 అయ్యింది. కత్తిని నెమ్మదిగా నా చేయి దగ్గరకి తీసుకొని వచ్చాను.
ఫోన్లో మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి “lets meet once at holiday inn hotel reception . Have something to tell you”
అది చూసి కత్తి పక్కన పెట్టాను. అసలు వాడు ఇలాంటి మెసేజ్ ఎందుకు పెట్టాడో అర్ధం కాలేదు. ఎంత ధైర్యంగా పెట్టాడు మెసేజ్ అనుకున్నాను. హోటల్ లో కలవాలంటే యదవకి. అసలు వీడి గురించి వీడి ఫీలింగ్ ఏంటి. అలా మెసేజ్ పెట్టేస్తే నేను వచ్చేస్తాననుకున్నాడా ?? అది కూడా హోటల్ కి రాత్రి పూట. ఐన అది 5 స్టార్ హోటల్, అక్కడ రూమ్ రెంట్ నా నెల జీతం అంత ఉంటుంది. అసలు వీడికి అక్కడ ఎం పని నన్ను కలవటానికి ??
ఇంకో మెసేజ్ వచ్చింది “its important. it is a public place”
అది చూసి అసలు నన్ను ఎందుకు కలవాలనుకున్నాడో అర్ధం కాలేదు. నన్ను పడుకోమని అడుగుతాడేమో. పడుకుంటే జాబ్ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్తాడేమో. ఒక సరి మళ్ళి ఆలోచించాను. ఒక వేళ నేను ఇప్పుడు చనిపోతే అశ్విన్ అందరితో నా ఇమెయిల్ బయటపడిందని, ఆ ఇమెయిల్ బయటపడినందుకే నేను సూసైడ్ చేసుకున్నాను అని ప్రచారం చేస్తాడు. వాడికి ఇమెయిల్ ఆధారం ఉంది. కానీ వాడి గురించి కానీ ప్రియ గురించి కానీ నా దగ్గర ఏ ఆధారాలు లేవు. పైగా ప్రియకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేనేదో కావాలని ఇలా నిందలు వేస్తున్నాను అని కూడా నిజం అనుకుంటారు అందరు. ఒక వేళా పోలీస్ వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ లో అడిగినా ఆ క్లీనర్ గడు సెక్యూరిటీ అందరూ మొన్నటి సంగతి చెప్పొచ్చు. అప్పుడు అందరూ నేను నిజంగానే అలాంటి దాన్ననే అనుకోవచ్చు. అప్పుడు నేను ఒక తప్పు చేసి దొరికిపోయి సూసైడ్ చేసుకున్నాను అనే అందరూ నమ్ముతారు కానీ నా లెటర్ ఎవ్వరు నమ్మకపోవచ్చు. అప్పుడు నా సూసైడ్ కి అర్ధంలేకుండా పోతుంది. చివరకు నేను తప్పుడు దాన్ని అవుతాను. అశ్వినే కరెక్ట్ అని నమ్మొచ్చు ఇమెయిల్ ఉంది కాబట్టి.
నేను ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ చేసాను. కట్ చేసాడు. మళ్లా ట్రై చేసాను. మళ్ళా కట్ ఫోన్ కట్ చేసాడు.
ఇంకో మెసేజ్ పెట్టాడు “cannot talk over phone” అని రాసాడు.
నేను ఒక మెసేజ్ పెట్టాను “cannot talk to idiots” అని
నాకు రిప్లై ఇచ్చాడు “it is about your job”
నేను ఇంకో మెసేజ్ పెట్టాను “it is about your lust” అని
ఇంకో రిప్లై ఇచ్చాడు “It is your choice. I am sending termination letter post receipt in 30 min.”
నేను వెంటనే రిప్లై ఇచ్చాను “at what time ??”
ఒక smiley పెట్టి 8:30PM అని పెట్టాడు.
వెంటనే ఫోన్ లో screenshot తీద్దామని చూసాను కానీ ఈ లోపలే అన్ని మెసేజెస్ డిలీట్ చేసేసాడు అశ్విన్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిసింది.
మళ్ళా ఆలోచనలో పడ్డాను. అసలు ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడే మార్గం ఏంటి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు ఇప్పటికి stress బాగా ఎక్కువైంది. బయటకు వెళ్లి నా లెటర్ చింపేసి చెత్త బుట్టలో వేసాను. చల్లారిపోయింది పార్సెల్ తీసుకొని ఫుడ్ వేడిచేసుకొని తింటూ ఆలోచించాను.
ఇక నా వల్ల కాక, కొంచెం రిలాక్స్ అవుదాం అని TV ఆన్ చేసి క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ ఫోకస్ లేదు. నా మొహం అంత ఏడుపుతో బాగా చెడింది. అందుకే స్నానం చేద్దామని హీటర్ వేసాను. హాల్ తలుపు గాడి వేసాను. కొంచెం సేపు ఆలోచించి స్నానం చేసి రెడీ అయ్యి మేక్ అప్ వేసుకొని, తీవ్రంగా ఆలోచించాను. బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. కొంచెం సేపు యోగా చేసి కూర్చున్నాను.
నిన్న మొన్న వెతికిన అపార్ట్మెంట్స్, జాబ్స్ గురించి ఎమైల్స్ వచ్చాయి. ఒకొక్కటి నెమ్మదిగా చూసాను. నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను నోటిఫికెషన్స్ ఉంటె. ఎవడో నాకు పిచ్చి మెసేజిలు పెట్టాడు. వాడికి మిడిల్ ఫింగర్ ఎమోజి పెట్టి, వెంటనే బ్లాక్ చేసాను. వారానికి ఒక సరి ఇలాంటి మెసేజెస్ నాకు వస్తుంటాయి, ఇలాంటి మెసేజెస్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసే యాప్ కనిపెడితే బాగుండు అనుకున్నాను. నా కొత్త ప్రొఫైల్ పిక్చర్ చూసాను, రెండు వేల లైక్స్ వచ్చాయి. అందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు నేను ఎంత అందంగా ఉన్నానో అని. వాటితో పాటు నా పెళ్ళెప్పుడు అని కూడా చాల మంది కామెంట్స్ ఉన్నాయి. నిజంగానే చాలా అందంగా వచ్చింది ఫోటో. పోయిన సరితో పోలిస్తే ఈ సరి బాగా ఫిట్ గా కనిపించాను ఫొటోలో. ఈ సరి వేసుకున్న lipstick బాగా వచ్చింది. కానీ జుట్టు ఇంకొంచెం బాగా వచ్చునంటే బాగుండేది. ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చి అసలు జరుగుతుందేంటీ నేను చేస్తున్నదేంటి అని అలోచించి ఫోన్ పక్కన పెట్టేసాను.