“అవును ఆఫీస్ లోనే కలవమంది……నన్ను”
“కలిస్తే నష్టం ఏంటి ??”
“నాతో పిచ్చిగా ప్రవర్తిస్తే ??”
“పళ్ళు ఊడొచ్చేలాగా….. ఒక నాలుగు పీకు వాడిని……”
“ప్రియ నేను చెప్పేది నీకు జోక్ లాగా ఉందా నీకు ??”
“నేను చెప్తుంది నీకు నచ్చటంలేదు……..మరి నన్నెందుకు పిలిచావు ??”
“సరే……నేనొక ఐడియా వేసాను…..”
“ఏంటా గొప్ప ఐడియా ???”
“నేను తన కేబిన్ లోకి వెళ్లి మొత్తం వాయిస్ రికార్డింగ్ చేయాలనుకుంటున్నాను……”
“సరే……తర్వాత ??”
“తర్వాత ?? అశ్విన్ కెరీర్ ఫినిష్…….నేనే వాడిని బ్లాక్మెయిల్ చేసి ప్రమోషన్ తెచ్చుకుంట……ఎలా ఉంది నా ఐడియా ??” అని నెమ్మదిగా చెప్పను.
“సరే అలాగే కళలు కంటూ ఉండు….నీ ఊహ ప్రపంచంలో నువ్వు జీవించు”
“ఏంటి ప్రియా అలా మాట్లాడతావు నువ్వు ??”
“మరి….ఎలా మాట్లాడాలి ??”
“నేను సీరియస్ గా చెప్తున్నాను…..జోక్ చేయటంలేదు…….”
“నువ్వు సీరియస్ ఐన నువ్వు ఫెయిల్ అవుతావు……”
“నేను చెప్పేది నీకు ఎక్కలేదనుకుంటాను…..మల్ల చెప్పనా ఇంకొకసారి ??”
“నువ్వొక పిచ్చిదానివి……”
“ప్రియ నువ్వు నన్ను ఎందుకు సపోర్ట్ చేయడంలేదు ??”
“నేహా…….. మనం ఆకు లాంటి వాళ్ళం…….మిగిలిన వారు ముల్లు లాంటి వాళ్ళు……ముల్లు ఆకు పై పడ్డ, ఆకు ముల్లు పై పడ్డ….నష్టం ఆకుకే”
“ఇంతే నువ్వు సామెతలు చెప్తున్నావు ?? నేనింత సీరియస్ మేటర్ మాట్లాడుతుంటే ??”
“సరే నేహా……ఇప్పుడు సీరియస్ గానే మాట్లాడుకుందాం …… నువ్వు ఆ రికార్డింగ్ తో వాడిని బెదిరిస్తావ్, వాడు నిన్ను అన్ని తిప్పలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు…….నువ్వు రికార్డింగ్ బయట పెడితే నీకు కూడా బాగా బాడ్ నేమ్ వస్తుంది……రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాం మనందరం కూడా……..ఇప్పుడొక కాంట్రవర్సీలో ఇరుక్కుంటే….. అది మనకే నష్టం…..ఇంకోటి ఆలోచించు నువ్వు……”
“ఏంటది ??”
“అశ్విన్ పేరు బయటకి వస్తే కంపెనీ కి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు అశ్విన్ కె సపోర్ట్ వెళ్తారు…..పేరు కాపాడుకోవటానికి……నిన్ను ఒక నెలలో బయటకు పంపిచేస్తారు……”
“ప్రియ నువ్వేం మాట్లాడుతున్నావ్……నేనేం చెప్తున్నాను ?? నేను కేవలం బ్లాక్మెయిల్ చేస్తాను అని అంటున్నాను. నాకేమైనా పిచ్చ ?? నేనేమి దాన్ని బయటపెట్టను”
“సరే……ఒక రికార్డింగ్ చేస్తావ్…..అశ్విన్ ని బెదిరిస్తావ్……ప్రమోషన్ వస్తది…….వాడు నీకు శత్రువుగా తయారవుతాడు…. రోజు నిన్ను పీక్కొని తింటాడు…… కానీ అన్ని విషయాలను నీ వెనకాల చేస్తుంటాడు తెలియకుండా….. ”
“ప్రియ అసలు నువ్వేమి మాట్లాడుతున్నావ్ ??”
“నేహా నీకు శ్వేతా విషయం తెలుసా తెలియలేదా ??”
“శ్వేతా ఎవరు ??”
“ఒకప్పుడు మన ఆఫీస్ లోనే పనిచేసేది…..మొత్తానికి ఏదో గొడవ వచ్చింది శ్వేతా కి అశ్విన్ కి………….తనకిప్పుడు 29 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదు….. ఎందుకో తెలుసా ??”
“వాడు మేనేజర్ గాడు….శ్వేతా డిటైల్స్ అన్ని కనుక్కొని…..తనకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసాడు….శ్వేతా మీద ఏవేవో చెప్పాడు…..శ్వేతా అందరితో పాడుకుందని……డ్రగ్స్ అలవాటుందని……చాల విషయాలు ఫోన్లు చేసి మరి చెప్పాడు……అందరికి……ఈ రోజు ఎవ్వరు ముందుకు రావట్లేదు తనను పెళ్లి చేసుకోవటానికి……తెలుసా ?? మనోడు అశ్విన్ ఎంతకైనా తెగిస్తాడు…జాగ్రత్తగా ఉండమని చాలామంది నాతో చెప్పారు………నీ ఇష్టం మరి”
ప్రియతో మాట్లాడటం వేస్ట్ అని అర్ధమయ్యింది.
లంచ్ అయ్యాక నేను మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళాను:
“సర్”
“చెప్పు నేహా….”
“సర్ ఇందాక మీరు నన్ను సాయంత్రం కలవమన్నారు కదా ??”
“hmmmm….”
“ఎందుకు సర్ ??”
“ప్రమోషన్ అడిగావు కదా….”
“సర్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆ విషయం ఏంటో ఇప్పుడే చెప్పండి”
“నేహా……నీకు ప్రమోషన్ కావాలా వద్ద ??”
“కావాలి సర్”
“అయితే నేను రికమెండ్ చేస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, తెలుసా ??”
“ఎస్ సర్…”
“నేను నిన్ను రికమండ్ చేయాలంటే……..నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి”
“సర్…..నాకు సాయంత్రం అంటే లేట్ అవుతుంది……అందుకే మీరు ఆ విషయం ఇప్పుడు చెప్తారని……”
“ఓహో…..రేపు ప్రమోషన్ వస్తే ఆఫీస్ లో పనిచేయకుండా ఇలాగే ఆఫీస్ నుంచి సాయంత్రం టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతావా ??”
“లేదు సర్”
“నేహా టైం వేస్ట్ చేయకు…..ఎస్ ఆర్ నో చెప్పెసేయి”
“సర్…..సాయంత్రం కలవకపోతే నన్ను రికమెండ్ చేయరా మీరు ??”
“ఆలా అని నేను అనలేదే…….”