తరువాత ఎలాగు పిల్లలు పరిక్షలు అంటున్నావుగా , అవి అయిపోయిన తరువాత వాళ్ళు వస్తారులే . ఈ లోపుల ఆయనకు నచ్చితే ఇక్కడే , మా ఇంటి పక్కనే అద్దె ఇల్లు మాట్లాడదాము అన్నాడు. సరే అంటూ ఫోన్ పెట్టేసాను.
నా మాటలు వాళ్ళు కుడా వినడం వలన అంతా సంతోషంగా ఫీల్ అయ్యారు.
ఈ లోపున నూర్ స్నానం చేసి వచ్చినట్లు ఉంది. విరిసిన మొగ్గలా మేరిసి పోతుంది. వాళ్ళ నాన్న జరిగింది అంతా తనకు చెప్పాడు. నేను రేపు నేను పనిచేసే దగ్గర చెప్పి ఎల్లుండి రాత్రికి వెళతాను , మీరు పరిక్షలు రాసిన తరువాత వద్దురు కానీ అన్నాడు.
నూరు వాళ్ళ నాన్న పేరు కరీం ఖాన్ , అతని నంబరు తీసుకోని , నా నంబరు తనకు ఇచ్చి , షబ్బీర్ నంబరు కుడా ఇచ్చి. మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే వాడికి ఫోన్ చేయండి వాడే వచ్చి మిమ్మల్ని తీసుకోని వెళతాడు అని చెప్పాను.
నూర్ దగ్గర వాళ్ళు వుండే అడ్రస్ తీసుకోని వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కు వెళ్లాను. నేను వెళ్ళే టప్పటికి హమీద్ అక్కడే ఉన్నాడు. నా దగ్గర ఉన్న అడ్రస్ ఇచ్చి క్లుప్తంగా దాన్ని ఎలా సంపాదించింది చెప్పాను.
ఆ అడ్రస్ చూసి , ఇది నాకు తెలిసిన ప్లేస్ భయ్యా , ఇంకొద్దిగా చీకటి పడినాకా వెళదాము అంటూ చెప్పాడు. ఈ లోపున విషయం ప్రతాప్ కు చెప్పాను.
నువ్వు అక్కడే ఉండు నేను ఇంకో 15 నిమిషాలలో వస్తాను అని చెప్పాడు. ఆపీస్ లోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న బడ్డీ కొట్టులో ఓ సిగరెట్ తీసుకోని అక్కడే కూచొని పినిష్ చేసి లోనకు వెళ్లాను.
ఈ లోపున ప్రతాప్ వచ్చాడు. హమీద్ అంతా చెప్పాడు. అయితే మీరు ఇద్దరు , ఇంకో నలుగురితో కలిసి వెళ్ళండి , కొడుకులు నందరిని పట్టుకొని రండి నేను చూసుకుంటా అంటూ చెప్పాడు.
హమిదు తన టీం ను రెడీ చేసుకోవడానికి బయటకు వేల్లాడు.
నేను ఈ లోపున శాంతా కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి రేపు సాయంత్రానికి పల్లెలో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసాను. మల్లి ఓ సారి బయటకు వెళ్లి ఓ రెండు సిగరెట్లు ఉది ఓ చాయ్ తాగి వచ్చేసరికి హమిదు తన టిం తో రెడీగా ఉన్నాడు.
భయ్యా నువ్వు రెడీ అంటే వెళదాము అంటూ , అందర్నీ రెడీ చేసి జీపులో కుచోమన్నాడు. తనే స్వయంగా జీపు డ్రైవ్ చేస్తూ నన్ను పక్కన కుచోమని నేను చెప్పిన అడ్రస్ ఉన్న ఏరియాకి తీసుకోని వెళ్ళాడు.
జీపును కొద్ది దూరంలో ఆపి , లోనకు జీపు వెళ్ళదు , ఇక్కడి నుంచి మనం నడుచు కొంటూ వెళ్ళాలి అంటూ , అందర్ని దిగమని చెప్పాడు.
“నీకు ఈ ఏరియా బాగా తెలుసునా ?? ,మనం వెళ్ళే ప్లేస్ కి ఇంకో దారి ఏమైనా ఉందా ? ఉంటె ఎలా వెళ్ళాలి ” అంటూ హమీద్ ను అడిగాను.
“ఈ ఏరియా నాకు బాగా తెలుసు సారూ ” అన్నాడు మాతో పాటు టీం లో వచ్చిన నౌషాద్
“ఆ ఇంటికి ఇంకో దారి కుడా ఉంది సార్ , అది బయట తుప్పల్లోకి వెళుతుంది , వాళ్ళు గాని వెనుక నుంచి తప్పించు కొంటె అక్కడ నుంచి పారిపోవడం చాలా సులభం” అన్నాడు నౌషాద్
“అయితే మనం రెండు టీంలుగా విడిపోదాం ఓ టిం ముందు నుంచి వెళదాము , ఇంకో టిం వెనుక నుంచి కవర్ చేస్తే సరిపోతుంది. అంటూ రెండు టిం లు గా విడిపోయి హమీద్ ఉన్న టిం ను ముందు వైపుకు వెళ్ళమని చెప్పి నాతొ పాటు నౌషాద్ ను ఇంకో అతనిని తీసుకోని , నౌషాద్ దారి చూపుతుండగా ఆ ఇంటికి వెనుక వైపుకు వెళ్ళాము.
మేము వెళ్ళిన దారి అంతా తుప్పలు లైట్లు లేవు, పైన చుక్కల వెలుగులో చిన్నగా ఆ ఇంటి వెనుక వైపు మాకు కనబడేటట్లు ఉండే ఓ పొద వెనుక నించొన్నాము.
“నౌషాద్ , వాళ్ళు గాని వెనుక వైపు నుంచి వస్తే , రెండో ఆలోచన లేకుండా వారి మిద ఎటాక్ చేసి వాళ్ళను బందీలుగా చేసుకోవాలి లేకుంటే వాళ్ళ దేనికైనా తెగిస్తారు” అన్నాను.
“అవును సారూ , హమీద్ భయ్యా చెప్పాడు నాకు , వాళ్ళు మీ మిద ఎటాక్ చేసి నపుడు కత్తులు , కొడవళ్ళు తెచ్చారటగా , మా ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి , ఓ సారి హెచ్చరిస్తాము మినక పొతే , అప్పుడు పొలిసు పద్దతిలో వాళ్లకు బుద్ది చెపుతాము”
ఓ అయిదు నిమిషాలు ఆ తుప్పల్లో చిమ్మటల శబ్దం తప్ప మరే విధమైన సౌండ్ లేదు ఆ చుట్టుపక్కల.
“హమీద్ భయ్యా లోనకు వేల్లాడంటారా ” అన్నాడు నౌషాద్ తను ఆ మాట పూర్తి కాక ముందే ఆ ఇంటిలోంచి కేకలు వినబడసాగాయి.
“ఇప్పుడే హమీద్ లోపలి వెళ్లి నట్లు ఉన్నాడు , ఇంతకూ ఆ ఇంట్లో ఎవ్వరు ఉంటారు ? ” అన్నాను
“అక్కడ ఓ ముల్లా వుండే వాడు సాయంత్రం పిల్లలకు ఖురాన్ చెప్పే వాడు, ఇప్పుడు ఆయన లేడు , కాని పిల్లలు రాత్రిళ్ళు ముందు లాగే వెళుతున్నారు మరి ఇప్పుడు అక్కడ ఎవ్వరు వున్నారో తెలియదు “
“ఇప్పుడు కుడా పిల్లలు ఉన్నారు లోపల అందుకే అంతగా సౌండ్ వస్తుంది. ఎందుకైనా మంచిది మీరు రెడీగా ఉండండి ” అంటూ వాళ్ళను హెచ్చరిస్తుండగా వెనుక వైపు తలుపులు తెరుచుకొన్నాయి. నాలుగు ఆకారాలు ఆ తలుపులోంచి బయటకు వచ్చాయి వేగంగా వెంటనే తెరుచుకొన్న తలుపులు ముసుకోన్నాయి.
బయటకు వచ్చిన ఆకారాలు వేగంగా చీకట్లో మా వైపుకు రాసాగాయి, వారిని ఎదుర్కోవడానికి మేము అందరం అలర్ట్ గా ఉన్నాము. మూడో క్షణంలో వాళ్ళు నలుగురు మా ముందు ఉన్న పొద దగ్గరకు రాసాగారు. ఆ పొద వెనుకన ఉన్న పోలీసులు ఇద్దరు చేతిలోని గన్స్ వారి వైపు గురి పెడుతూ కుడివైపు నుంచి పొద ముందుకు వెళ్లి ,
“లొంగి పొండి లేకుంటే , కాల్చేస్తాము ” అంటూ వాళ్ళ ముందుకు ఎక్సైట్ మెంటుతో డైరెక్ట్ గా , గన్స్ తీసుకెళ్ళి వాళ్ళ గుండెలకు ఆనింఛారు. మిగిలిన ఇద్దరు చేతులు పైకి ఎత్తి తమ మిత్రుల వైపు చూడసాగారు.
నేను వాళ్లతో పాటు వెల్ల కుండా ఆ తుప్పల్లో దొరికిన పొడుగ్గా ఉన్న ఎండు కొమ్మను హాకీ బ్యాటు లాగా పట్టుకొని వాళ్ళ వైపు చూడసాగాను.
ఆ చీకట్లో మరి వాళ్ళు కళ్ళతో మాట్లడుకోన్నారో లేక మనసులతో మాట్లాడుకోన్నారో తెలీదు కాని, నలుగురు కూడ బలుక్కొన్నట్లు , తమ గుండెల మీదున్న గన్స్ ను చేత్తో పట్టుకొని వాటి బారెల్ ను పక్కకి పికి ముందుకు గుంజారు. మిగిలిన ఇద్దరు పోలిసుల వెనుక చేరి వాళ్ళ పట్టునుంచి గన్స్ తీసుకోవడానికి అన్నట్లు పోలిసుల మిద కలబడ్డారు.
అంత వరకు మాకు ఫెవర గా ఉన్న అదృష్టం వాల్లు ఇద్దరూ వేసిన తప్పటడుగు వళ్ళ , అవతల వాళ్ళ చేతిలోకి వేల్లిపోసాగింది. ఇక అక్కడ ఉంటె ఉన్న కొద్ది చాన్స్ కుడా మిస్ అవుతుంది అనుకొంటూ పోదకు ఎడమ వైపు నుంచి ముందుకు వెళుతూ పొలిసులను వెనుక నుంచి పట్టుకొన్న వాడి మెడ మిద శక్తి కొద్దీ చేతిలో ఉన్న కట్టెతో కొట్టాను. వెంటనే వాడు ఏమయ్యాడు అనేది చూడకుండా ఓ ఫుల్ రాండ్ తిరిగి అదే వేగంతో పొలిసు గన్ పట్టుకొని గుంజుతున్న వాడి బుజం మిద ఓ దెబ్బ వేసాను. ముందు కొట్టిన వాడు ఎటువంటి శబ్దం చేయలేదు కాని రెండో సారి కొట్టిన వాడు మాత్రం కీచుగా అరిచి కింద పడిపోయాడు.
వేగం ఎ మాత్రం తగ్గకుండా ఇంకొకడి నడుం మిద కొట్టాను. ఆ దెబ్బకు కట్టే రెండుగా విరిగి పోయింది.
ఎప్పుడైతే తన మిద అటాక్ చేస్తున్న ఇద్దరు కింద పడే కొద్దీ, మాతో పాటు వచ్చిన పోలీసుకు తను చేసిన తప్పు తెలిసి వచ్చి, దాన్ని సరిదిద్దుకొనే మార్గం దొరికింది అన్నట్లు చేతిలోని గన్ ను తన ఫ్రెండ్ ను వెనుక నుంచి పట్టుకొన్న వాడి మోకాళ్ళ మిద కాల్చాడు. అంత చీకట్లో సరిగ్గా బుల్లేట్ వాడి కళ్ళలో దూరినట్లు వాడు కెవ్వు మంటూ కిందకు పడిపోయాడు.