నన్ను రామి రెడ్డి వాళ్ళ షాప్ లో దించేసి హమీద్ వెళ్లి పోయాడు.
“వాళ్ళు ఎవరో తిలిసిందా శివా ?” అడిగాడు రామి రెడ్డి.
“లేదు, ఇంత వరకూ నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది, వాళ్ళలో ఒకరు కాదని తేలిపోయింది , రేపు తెలుస్తుంది ఎవ్వరన్నది, ఇంతకీ మీ నాన్న ఎక్కడ ? ఎలా ఉన్నాడు , డ్రైవర్ ఎక్కడ , కార్ ఎదీ “
“నాయన బాగానే ఉన్నాడు, అపార్ట్మెంట్ కు వెళ్ళాడు, డ్రైవర్ కారు తీసుకోని గ్యారేజి కి వెళ్ళాడు , ఇన్సురెన్స్ వాళ్ళు కారును రిపేరు చేసి రేపు సాయంత్రానికల్లా ఇస్తాము అన్నారు, పోసిసోల్లె కారును గ్యరేజి కి తీసుకోని వెళ్ళారు , ఆ కారు వాళ్ళ పెద్దసారుకు బాగా కావలిన వాళ్ళది , తొందరగా రిపేరీ చేసి పంపిచ్చు అని గ్యరేజి ఓనర్ కు వల్లే చెప్పి వెళ్ళారు అంట , నాకు ఇప్పుడే డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. “
షాప్ బంద్ చేసి ఇద్దరం కలిసి అపార్ట్ మెంటుకు వెళ్ళాము.
పల్లవి తలుపు తీసింది. ఇద్దరం లోపలికి వెళ్ళగానే మా వెనుక తలుపు వేస్తున్న తనను చూసి
“నిన్ననే వచ్చింది, మీ వెనకాల మా నాయనతో పాటు , ఆ నిధి దొరికిన తరువాత మీరేమో ముందు వచ్చేశారు , నాయనా చెల్లెలు డ్రైవర్ తో ఆ తరువాత వచ్చారు”
“నాయన తిన్నాడా ? “
“7 గంటలకే తినేసి పడుకొన్నాడు” అంది పల్లివి.
ముగ్గురు కూచొని బొంచేస్తుండగా , నా ఎదురుగా ఉన్న పల్లవిని చూస్తుండగా గుర్తుకు వచ్చింది, కంట్రోల్ రూమ్ పక్కన చుసిన అమ్మాయిని ఎక్కడ చూసానో
ఆ అమ్మాయి పల్లవీ క్లాసు మేటు నూర్. ఆ అమ్మాయి ఇందంతా చేయించిందా ? లేక ఆ అమ్మాయి వెనుక నుంచి ఎవరైనా ఆ అమ్మాయిని ఉపయోగించు కొంటున్నారా అని అలోచించ సాగాను.
ఈ లోపుల రామి రెడ్డి బొంచేసి. “నేను హల్లో T.V చూస్తుంటా మీరు తిని రండి.” అంటూ తను హాల్లోకి వెళ్ళాడు.
“ఏంటి అంత దిర్గంగా ఆలోచిస్తున్నావు “
“నీ ఫ్రెండ్ తో ఈ మద్య ఎప్పుడైనా మాట్లాడావా ?”
“ఎ ఫ్రెండ్ “
“అదే నీ క్లాస్ అమ్మాయి , నూర్ “
“మనిద్దరం చూడడమే దాన్ని ఆ తరువాత నేను దానిని చూడడం కాని , మాట్లాడడం కాని చేయలేదు. “
“దాని బాయ్ ఫ్రెండ్ ను పోలిసుల చేత నేనే చంపించానని దానికి తెలిసినట్లు ఉంది , అందుకే నా మిద పగ పట్టింది, ఈ రోజు నేను కంట్రోల్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే అక్కడ కనబడ్డది. అది నా కోసం అక్కడ ఉన్నట్లు అని పించింది. “
“ఏమో మరి నాకైతే తెలీదు , ఆనీ అలాంటిదే కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళావా ?”
“ఎక్కడ, తనను ఎక్కడ చూసానో గుర్తుకు రాలేదు అప్పుడు . ఇప్పుడు నిన్ను చూస్తుంటే గుర్తుకు వచ్చింది “
“రేపు ఓ సారి వాళ్ళ ఇంటికి వెళ్లి రానా ? “
“నువ్వు వద్దులే , నేను వెళతాను”
“సరే అయితే , తిను అన్నం చల్లారిపోతుంది”. తనతో పాటు తినేసి నేను వెళ్లి రామి రెడ్డి తో పాటు T.V చూస్తుండగా , పల్లవి అన్ని సర్దేసి వచ్చి మాతో పాటు కుచొంది
“నాకు నిద్దర వస్తుంది , నేను పడుకుంటా , శివా నువ్వు ఆ రూమ్ లో పడుకో , పల్లవి నువ్వు నాన్న గదిలో పడుకో ” అంటూ వెళ్లి పడుకొన్నాడు. ఓ పది నిమిషాలు T.V చూసి నేను కుడా వెళ్లి పడుకొన్నాను.
పొద్దునే లేచి వాళ్ళతో పాటు టిఫిన్ చేసి రామి రెడ్డితో పాటు బయలు దేరి కంట్రోల్ రూమ్ చేరుకున్నాను. నేను వెళ్ళే సరికి హమిదు అక్కడే ఉన్నాడు.
“హమిదు ఆ అమ్మాయి ఎవ్వరో కాదు నూర్ అని , అక్కడ స్కూల్ లో చనిపోయిన్ వాడి గర్ల్ ఫ్రెండ్. “
“ఆ అమ్మాయే మీ మిద దాడి చేయించింది అంటావా భయ్యా”
“లేకుంటే ఆ అమ్మాయికి ఇక్కడ ఎం పని , మనం ఓ సారి ఆ అమ్మాయి ఇంటి చుట్టు పక్కల చూసి వద్దామా”
“అలాగే భయ్యా , నేను మఫ్టి లో వస్తా , డ్రెస్ లో వస్తే మనకు ఏమి ఇన్ఫర్మేషన్ దొరకదు” అంటూ నాతొ పాటు బయలు దేరాడు.
నేను ప్రతాప్ కు ఫోన్ చేసి నేను హమీద్ ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాము అని చెప్పాను . నేను ఇంతకూ మునుపు ఆ అమ్మాయి ఇల్లు చూడడం వలన , హమీద్ ను గైడ్ చేయగా తన బైక్ ను ఆ అమ్మాయి ఇల్లు ఉన్న విదిలోకి తీసుకోని వెళ్ళాడు.
బైక్ ను ఓ షాప్ ముందర పార్క్ చేసి ఆ ఆమ్మాయి ఇంటికి నడుచు కుంటూ వెళ్ళాము. మేము వెళ్ళే సరికి ఇంట్లో వాళ్ళ అమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయిని గురించి అడగగా , ఆ అమ్మాయి ఇంట్లొంచి వెళ్లి వారం రోజులు అయ్యింది అంట ఇంటికి రావడం లేదు అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళిందో కుడా వాళ్ళకు తెలియదు అంట.
“ఎక్కడని వెతుకుదాం భయ్యా ” అన్నాడు హమీద్ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తూ.
“ఓ సారి వాళ్ళ పాత ఇల్లు వుంది చూడు అక్కడికి వెళ్లి చూసి వద్దామా ”
“సరే భయ్యా ” అంటూ బైక్ ను ఇంతకూ మునుపు నేను నూర్ ను ఎక్కడ చూసానో ఆ ఇంటి వైపుకు తిప్పాడు.
మేము ఇల్లు ఉన్న సందు పలుపు తిరిగే టప్పటికి , హమీద్ ఫోన్ మొగ సాగింది. బైక్ పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేసాడు. ఆ ఫోన్ హమీద్ ఇంట్లోంచి వచ్చింది వాళ్ళ అబ్బాయి ఇంటి ముందు సైకిల్ తొక్కుతూ పడి చేయి విరక్కోట్టు కొన్నాడు అని.
“నువ్వు వెళ్ళు హమిదు , నేను ఇక్కడ నుంచి వెళతాలే ” అన్నాను.
“నువ్వు ఒక్కడివే ఎలా భయ్యా , నేను వేరే ఎవ్వరి నైనా పంపనా నీకు తోడుగా. ”
“నేను ఒక్కడినే వేల్లనులే , ఓ సారి బయట నుంచి చూసి కంట్రోల్ రూమ్ కు వెళ్ళిపోతాను, నువ్వు వెంటనే వెళ్లి బాబును హాస్పిటల్ కు తీసుకోని వెళ్ళు” నా బలవంతం మిద తను నన్ను అక్కడ వదిలి వెళ్లి పోయాడు.
డైరెక్ట్ గా వెళ్లి తలుపు తట్టాలా లేక , ఇంతకూ మునుపు లాగా కిటికీ లోంచి వెళ్లి చూడాలా అని డిసైడ్ చేసుకోలాక సతమతమవ్వసాగాను. ఏమైతే అది అయ్యింది డైరెక్ట్ గా వెళ్లి తలుపు తడదాము అని మనసులో అనుకోని దానిని అమలు చేయడానికి డైరెక్టు గా వెళ్లి తలుపు తట్టాను.
“కౌన్ హాయ్ ” అంటూ ఆమ్మాయి గొంతు వినబడ్డది. ఎం చెప్పకుండా మల్లి తలుపు తట్టాను. ఈ సారి తలుపు దగ్గరికి అడుగుల చప్పుడు వినబడి తలుప గడియ తీస్తున్న సౌండ్ వచ్చింది.
తలుపు కు కొద్దిగా వెనుక నిలబడి తలుపు తీసే వాళ్ళ కోసం ఎదురు చూసాను.
నేను అనుకొన్నట్లు నూర్ తలుపు తీసింది. పంజాబీ డ్రెస్ వేసుకొని వుంది , పడుకొని లేచి వచ్చినట్లు ఉంది పైన దుప్పట్టా అక్కడే చాప మిద వుంది. నిండైన సంపద కొట్తోచ్చి నట్లు కనబడ సాగింది.
“లోపలి రండి , మీరు వస్తారని నాకు తెలుసు అందుకే , నేను ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడ ఉన్నా”
“ఏంటి , నేను నీకు తెలుసా ? మనం ఎప్పుడు కలుసుకో లేదే ? ” అంటూ ఆశ్చర్యంగా అడిగాను
“అవును , మనం ఎప్పుడు కలుసుకో లేదు , కానీ నువ్వు నాకు తెలుసు. ”
“సలీం చనిపోయిన ముందు రోజు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నేను మిమ్మల్ని హమిదు అనే పొలిసు తో చూసాను, ఆ భయ్యా నాకు ముందే తెలుసు, కానీ నేను ఆ భయ్యాకు తెలీదు.”