ఈ లోపున సర్పంచి డ్రైవర్ తన కారు వెనుక డిక్కీ తెరిచి అక్కడున్న ఓ రాడ్డు తీసుకోని వాళ్ళ వెనుకకు చేరుకొన్నాడు. పల్లెలో పెరిగిన వాడు , ఇంట్లాంటి కొట్లాటలు అక్కడ మాములుగా జరుగుతుంటాయి అనుకుంటా వస్తూనే నా వెనుక ఉన్న వాడి బుజం మిద బాదాడు ఆ రాడ్డుతో.
నా చేతిలోని కర్ర మరో ఇద్దరి బుజాలు జాయింట్లు వేరుచేసింది. నా చుట్టూ ఉన్న వాల్లు వెనుక నుంచి ద్రివర్ ముందు నుంచి నేను కొట్టే దెబ్బలకు బెంబేలెత్తి వాళ్ళు వచ్చిన ఆటోల వైపు చూడ సాగారు. ఈ లోపున ఇంకో ఇద్దరి తలకాయలు పగిలి రోడ్డు మిద దోర్లారు. డ్రైవర్ తన అకౌంట్ లో ఇంకో ఇద్దరినీ వేసుకొన్నాడు. నేను తిరిగి చూసే కొద్దీ అక్కడెక్కడో మా కారు దగ్గరున్న ఆటోలో వచ్చి, కన్ను మూసి తెరిచే లోగా కింద పడ్డ వాళ్ళను ఎక్కించు కొని క్షణం లో మాయమై పోయాయి.
అన్నా ఎవరన్నా వాళ్ళు , నీ మీదకు ఎందుకు వచ్చారు”
“అదే నాకూ అర్తం కావడం లేదు “
“నీకు ఈ ఊర్లో ఎవ్వరి మీదైనా , అనుమానం ఉందా ?”
“ఇంతకూ మునుపు రెండు చోట్ల , గొడవలు జరిగాయి , ఇప్పుడు వచ్చిన వాళ్ళు , వాళ్ళ వాళ్ళు అయి ఉంటారు , కానీ నాకు వాళ్ళల్లో ఎవ్వరూ కన బడ లేదు “
“నీ మింద బాగా పగ పట్టినట్లు ఉన్నారు అన్నా అందుకే ఎతుకులాడు కుంటూ వచ్చినారు”
“నువ్వు పెద్దయ్యను తీసుకోని వెళ్ళు నేను రేపు వస్తా ఈ విషయం ఏందో తేల్చుకొని ” అంటూ ఇద్దరం కారు దగ్గరికి వెళ్ళాము.
ఈ లోపున అక్కడున్నా ట్రాపిక్ పొలిసు వచ్చి పెద్దాయనను వివరాలు అడుగుతున్నాడు. నన్ను చూసి గుర్తు పట్టాడు , “సార్ మీరు మా సారూ స్నేహితుడు కదా నేను మిమ్మల్ని సార్ తో పాటు మా ఆఫీస్ లో చూసాను, ఇంతకూ ఎం జరిగింది సారూ ” . అక్కడ జరిగింది చెప్పి వెంటనే ప్రతాప్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. నేను వెహికల్ పంపుతున్నాను నువ్వు ఆఫీసు కు వచ్చేయ్ ఇక్కడ మాట్లాడు కుందాము అని ఫోన్ పెట్టేసాడు.
డ్రైవర్ ను అక్కడే వదిలి , పొలిసు జీపులో పెద్దాయనను షాప్ లో దిగబెట్టి నేను కంట్రోల్ రూమ్ కు వెళ్లాను.
“ఇంతకీ ఏమైంది రా ఎవరు వాళ్ళు” అన్నాడు ప్రతాప్ నన్ను చూడగానే
“అదే నాకు అర్తం కావడం లేదు, నాకు తెలిసి ఉంటే, ఆ స్కూలు లో జరిగిన గొడవ తాలూకు వాళ్ళు అయినా అయి ఉండాలా లేకుంటే , ఉరి బయట పూజారి కూతుర్ని ఎడిపిస్తున్న గ్యాంగ్ లో మెంబర్స్ కు బడువులైనా అయి ఉండాలి.”
“ఉండు, నేను హమీద్ ను పంపుతాను ఇద్దరు ఆ ఊరు బయటకు వెళ్లి ఓ సారి అక్కడ విచారించండి ” అంటూ వైర్ లెస్ సెట్ లో హమీద్ ను వెంటనే కంట్రోల్ రూమ్ కు రమ్మన్నాడు.
హమీద్ వచ్చేంత వరకు నేను అక్కడో కంట్రోల్ రూమ్ లో కూచొని టి తాగి , బయటకు వచ్చి సిగరెట్ వెలిగించాను.
“భయ్యా ఎప్పుడొచ్చావు ” అంటూ అప్పుడే వచ్చిన జిపులోంచి ఒక్క గెంతులో బయటకు దూకి నా దగ్గరకు వస్తూ అన్న మాటలవి.
“రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు హమీద్, కాని ఇప్పుడే ఇక్కడికి నేను రమ్మన్నా , వీడు నువ్వు ఇద్దరు కలిసి ఆ ఉరి చివరకు వెళ్లి రండి , విషయం వాడు దారిలో చెపుతాడు ” అంటూ హమీద్ వచ్చిన జీప్ లోనే వెల్ల మని చెప్పాడు.
“ఎ మైంది భయ్యా” అంటున్న హమీద్ కు జవాబు చెప్పడానికి అటు వైపు తిరిగాను, నా చూపు అటునుంచి తన మీదుగా బయట ఫూట్పాత్ మిద నించొని మా వైపే చూస్తున్న అమ్మాయి మిద పడ్డాది.
జిప్ ముందుకు వెళ్లి పోయింది కాని నా మెదడులో ఆమెను ఎక్కడో చుసిన జ్ఞాపకం , ఎక్కాడన్నది గుర్తుకు రావడం లేదు.
“ఏంటి భయ్యా నువ్వు ఎక్కాడికో వెళ్లి పోయావు ? ” అన్న హమీద్ మాటలకు ఆ అమ్మాయి ఆలోచనలలోంచి బయటకు వచ్చి జరిగింది చెప్పాను.
“అయితే నీ డౌట్ పూజారి కూతుర్ని ఎడిపిస్తున్న వాళ్ళ మీదకు వెళ్ళిందా “
“నా మిద ఇక్కడ కక్ష ఎవరికీ ఉంటుంది , ఉంటే ఆ ఇద్దరికే కదా ? ” మేము మాట్లాడు తుండగా నే పూజారి వాళ్ళు ఉంటున్న వీది వచ్చింది , అక్కడ కొత్తగా ఏమి మొదలు పెట్టిన ఆనవాళ్ళు కనబడ లేదు.
“ఎలాగు ఇంత వరకూ వచ్చాముగా , వెళ్లి పూజారిని పలకరించి వద్దాము భయ్యా” అన్న హమీద్ మాటలకు తల ఉపాను. జీప్ డైరెక్ట్ గా పూజారి ఇంటి ముందు ఆగింది. ఆ జిప్ సౌండ్ విని లోపల నుంచి కీర్తన బయటకు వచ్చింది.
జీప్ లోంచి దిగుతున్న నన్ను చూసి , నవ్వుతూ. “ఏంటి బావగారు దారి తప్పి ఇలా వచ్చారు అంది.”
“నీ కోసమే వచ్చాను , మీ నాన్న గారు ఎక్కడ ” తనతో పాటు లోనకు వెళ్లి హల్లో కుచోన్నాము నేను హామీదు.
“నాన్న షాప్ నుంచి వచ్చే టైం అయ్యింది , వస్తూ ఉంటారు , మీరు కుచోండి నేను టి చేస్తాను ఈ లోపల నాన్నగారు వస్తారు ” అంటూ లోపలి వెళ్ళింది.
“ఇంతకీ నీ చదువు ఎలా సాగు తుంది, పరిక్షలు ఎప్పుడు “
“వచ్చే వారం పరిక్షలు, ఇప్పుడు ప్రిపరేషన్ సెలవలు ఇచ్చారు అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నా “
నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది నేను ఇంతకూ మునుపు వచ్చినప్పుడు తనకు చేసిన ప్రామిస్, “తనను హైదరాబాదులో మంచి కోచింగ్ సెంటలో చేరిపిస్తాను అన్న విషయం.” తరువాత మల్లి మచిపోతాను ఏమో అని అప్పుడే కోచింగ్ సెంటర్ లో పని చేస్తున్న నా మిత్రుడికి కాల్ చేసి , నాకు తెలిసిన అమ్మాయి మేడిసన్ ప్రిపరేషన్ కు పరిక్షలు అయిన వెంటనే వస్తుంది ఓ సీట్ రిజర్వు చేయమని చెప్పి , కీర్తన పేరు నోట్ చేసుకోమని చెప్పాను.
నేను ఫోన్ మాట్లాడ గానే , కిర్తనా వాళ్ళ నాన్న గారు షాప్ నుంచి వచ్చారు. నన్ను చూడగానే
“బాగున్నారా బాబు అంటూ , అమ్మా వీళ్ళకు నీళ్ళు అవీ ఇచ్చావా ” అంటూ కూతురిని కేక వేసాడు.
“టి పెట్టాను నాన్నా , ఇదిగో నీళ్ళు తెస్తున్నా అంటూ చెంబు రెండు గ్లాసులు తీసుకొచ్చింది.” తన చేతిలోంచి నీళ్ళు తీసుకోని ఓ గ్లాసు వాళ్ళ నాన్నకు ఇస్తూ ఇంకో గ్లాసు హమీద్ కు ఇచ్చాను.
ఇలోపున కీర్తన అందరికి టి తీసుకొచ్చింది. మేము టి తీసుకోగా “మీ గురించి పేపర్లో వేసారు అని అమ్మాయి చెప్పింది. ఆ ఊరిలో దొరికిన నిధి విశేషాలు ఉన్న పేపరు తను దాచి పెట్టింది” అంటూ కీర్తన వాళ్ళ నాన్న చెప్పాడు.
“ఆ నిధిలో కొంత బాగం మీ గుడికి కుడా చెందు తుంది , ఆ విషయం గురించి పెద్ద ఎత్తున రీసెర్చ్ జరుగుతుంది అది ఓ కొలిక్కి రాగానే , మీ గుడి కి రావాల్సిన బాగం మీకు అందుతుంది “
“నాకు ఈ సంపదల మీద పెద్ద కోరిక లేదు బాబు , ఎదో నా కూతురు చదువు కొని తన కాళ్ళ మిద తను నిలబడెంత వరకు నేను ఉంటె చాలు ఆ తరువా అంతా ఆ భగవంతుని సన్నిదిలో గడిపేస్తాను “
“కిర్తనా చదువు గురించి మీరు బాద పడకండి, పరిక్షలు అయిన వెంటనే నాకు ఫోన్ చేయండి , నేను మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో తనకు సీట్ మాట్లాడి పెట్టాను , తను వెళ్లి అక్కడ చేరితే చాలు మిగిలినవి అన్నీ వల్లే చూసుకుంటారు, మీరు ఇక్కడ బస్సు ఎక్కించి నాకు ఫోన్ చేయండి మిగిలినవి అన్నీ నేను చూసుకుంటాను”
“భయ్యా, మనం వచ్చిన పని మరిచిపోయావు ” అన్నాడు హమీద్
“ఇంతకూ మునుపూ కిర్తనాను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరైనా మల్లి ఇక్కడికి వచ్చారా ?” అని అడిగాను. “కిర్తనా , వాళ్ళు నిన్ను మల్లి ఎప్పుడైనా , ఎక్కడైనా అడ్డగించారా ?”
“లేదు బాబు , వాళ్ళు ఆ తరువాతా ఇక్కడికి రాలేదు, అమ్మాయి కుడా ఆ తరువాత వాళ్ళను చూడ లేదు, ఏమ్మా నీకు ఎక్కడైనా వాళ్ళు కనబడ్డారా”
“లేదు నాన్నా, ఆ తరువాత వాళ్ళు ఎక్కాడా కానబడ లేదు. “
“మేము బయలు దేరుతాము , కిర్తనా పరిక్షలు అయిన వెంటనే నాకు ఫోన్ చేయండి ” అంటూ నా నెంబరు నోట్ చేసుకోమని చెప్పాను
“నా దగ్గర నీ నెంబరు ఉంది ” అంది కీర్తన వాళ్ళ నాన్నకు కనబడ కుండా నా కు మాత్రమె కనబడే టట్లు నవ్వుతూ.
వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకోని మేము తిరిగి కంట్రోల్ రూమ్ కు బయలు దేరాము.
తిరుగు ప్రయాణం లో నేను చుసిన అమ్మాయిని గురించి హమీద్ కు చెప్పాను.
“మా ఆఫీసు పక్కన చూసావా ? అయ్యో అప్పుడే చెప్పాల్సింది” అన్నాడు.
“నాకు ఆ అమ్మాయిని ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు ” అన్నాను. ఈ లోపున రామి రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది.
“శివా , ఎక్కడున్నావు రాత్రికి ఇంటికి వచ్చేయి , నాయన ఊరికి వెళ్ళలేదు నిన్ను బోజనానికి ఇంటికి రమ్మన్నాడు ” అంటూ ఫోన్ పెట్టేసాడు.
“హమీద్ , నన్ను రామి రెడ్డి వాళ్ళ షాప్ లో దింపేయి , మనం రేపు కలుద్దాము మీ ఆఫీసులో , అప్పుడు ఆలోచిద్దాము , ఈ లోపున నీకు ఏమైనా తెలిస్తే విషయాలు సేకరించు, నా మిద దాడి చేసింది ఎవ్వరో “.