“థాంక్స్ శివా ” అంటూ చేతిని కలుపుతూ ,బాయ్ చెప్పి లోనకు వెళ్ళింది. నేను నా బైక్ ను షబ్బీర్ వాళ్ళ ఇంటికి మళ్ళించాను . నూర్ వాల్ల ఫ్యామిలీ అంతా వచ్చింది. వాళ్ళ నాన్న వెంటనే జాబ్ లో చేరిపోవచ్చు , షబ్బీర్ దగ్గర ఇంకో టాక్సీ ఉంది అది తీసుకోని వెళతాడు రేపటి నుంచి. నూర్ తన డిగ్రీ పరిక్షలు రాసింది , రిజల్ట్స్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది, నేను అక్కడున్నపుడే చెప్పింది తను ఏదైనా జాబ్ లో చేరతాను హెల్ప్ చేయమని. ఇక లాస్ట్ వన్ MEC కంప్లేట్ చేసింది తను ఎం చేయాలను కొంటుందో తెలియదు తీరిక దొరికినప్పుడు అడగి ఆ తరువాత తనను ఎందులో చెరిపించాలో డిసైడ్ చేయచ్చులే అనుకొంటూ. షబ్బీర్ ను అడిగాను వాళ్ళకు ఏదైనా తక్కువలో ఓ చిన్న ఇల్లు చూసిపెట్టమని.
“అభే , నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి , భయ్యా ఊరినుంచి వస్తున్నాడు అని నువ్వు చెప్పినప్పుడే నేను రెండు ఇళ్ళు చూసి పెట్టాను వాళ్ళు సాయంత్రం వెళ్లి వాళ్ళకు ఏది నచ్చితే అందులో చేరిపోవచ్చు. వాళ్ళు అక్కడ నుంచి కొన్ని సామానులు తెచ్చుకొన్నారు , అర్జంటుగా ఏమైనా కావాలంటే నేను చూసుకోంటాలె, నువ్వు ఈ పిల్లలను చూసుకో అది నీ డ్యూటీ , ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళకు ఎం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను ” అంటూ నాకు భరోసా ఇచ్చాడు.
” ఓ రెండు రోజుల్లో , వాళ్ళు ఎం చేయాలనేది కొద్దిగా తీరికగా డిసైడ్ చేద్దాం” అంటూ వాళ్లతో కలిసి టీ తాగి నేను రేపు కలుస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసాను.
నూర్ , షబ్బీర్ వాళ్ళ ఫ్యామిలీని కలవడం వలన నీరజ తో జరిగిన గొడవ పూర్తిగా మరిచి పో గలిగాను. రేపు ఒక్కసారి ప్రతాప్ ఫ్రెండ్ కు కాల్ చేసి పుర్తీ డీటెయిల్స్ చెప్పేస్తే ఆ కేసుకు సంబందించి పని అయిపోతుంది అనుకొంటూ ఇంట్లోకి వెళ్లాను.
కిర్తనా T.V లో ఎదో సినిమా చూస్తుంది వాళ్ళ నాన్న పడుకొని వున్నాడు.
“ఏంటి నువ్వు పడుకో లేదా ?”
“నాకు నిద్దర రాదు డే టైం లో “
“నేను ఫ్రెండ్స్ తో కలిసి సాయంత్రం సినిమాకు వెళుతున్నా , నువ్వు వస్తావా ?? “
“నాన్నను అడుగు , వెళ్ళమంటే వస్తాను ” అంది. “సరే కాపీ పెట్టనా” అంటూ కిచెన్ లోకి వెళ్లాను , తను నా వెనుకే కిచెన్ లోకి వచ్చి , నేను పెడతాను పాలు , కాఫీ పౌడర్ ఎక్కడ ఉన్నాయో చూపించు అంది.
“నువ్వు అక్కడ నిలబడి చూస్తూ ఉండు ఈ రోజుకు నేను పెడతాను రేపటి నుంచి కావాలంటే నువ్వు పెడుదువు కానీ ” అంటూ ముగ్గారికి కాఫీ పెట్టాను. తను కాఫీ తాగి , “చాలా బాగుంది బావా , నాకంటే బాగా పెట్టావు” ఉండు నాన్నను లేపుతాను అంటూ వెళ్లి వాళ్ళ నాన్నను లేపి కాఫీ ఇచ్చింది.
“నేను పెద్దారెడ్డి వాళ్ళ పిల్లలతో సినిమాకు వెళుతున్నాను , మీరు కుడా రావచ్చుగా”
“నేను రాలేనులే బాబు, పాపను తీసుకెళ్ళు ”
“అయితే మీరు గుడికి వెళతారా ఇక్కడ బిర్లా టెంపుల్ పాల రాతితో కట్టిన గుడి ఉంది “
“నేను ఒక్కనే ఎలా వెళ్ళగలను బాబు “
“మీరు ఒక్కరే వద్దులే , నేను మా ఫ్రెండ్ ను రమ్మంటాను , వాడు వచ్చి తీసుకోని వెళతాడు లే ” అంటూ షబ్బీర్ కు ఫోన్ చేసి , తన గూర్చి చెప్పి , రాత్రి 9.00 వరకు తనను టెంపుల్ కు తీసికెళ్ళి ఆ తరువాత కొద్దిగా టౌన్ తిప్పమని చెప్పాను.
“నువ్వు వెళ్ళే టప్పుడు చెప్పు నేను వచ్చి పెద్దాయనను తీసుకోని వెళతాను “
“నువ్వు బయలు దేరి రా , నేను ఇంకో 15 mts లో వెళ్ళాలి “
“సరే అయితే వస్తున్నా ” అంటూ ఫోన్ పెట్టేసాడు. మీరు తయారు అయితే వెళదాము అన్నాను , వాళ్ళు ఇద్దరు ఫ్రెష్ అయిన కొద్దీ సేపటికి షబ్బీర్ వచ్చాడు. కిర్తనా వాళ్ళ నాన్నను షబ్బీర్ కు అప్పగించి, నేను కిర్తనా బండి మిద శాంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
శాంతా వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చినట్లు ఉన్నాడు మేము వెళ్ళే సరికి హల్లో కూచొని టి తాగుతున్నాడు.
“నమస్తే , సార్ బాగున్నారా “
“ఆ ఏమప్పా శివా , బాగున్నావా ? ఈ అమ్మాయి ఎవరు ? “
“మీ బందువుల అమ్మాయే సారూ , తిప్పా రెడ్డి కూతురు “
“ఎ తిప్పారెడ్డి , నాకు గుర్తుకు రాలేదే ?? “
“మీ ఊరి గుడి పూజారి వాళ్ళ అన్న తిప్పా రెడ్డి , ఆయన రాయచోటి లో ఉంటాడు. “
“ఆ అవును ఎప్పుడో చిన్నప్పుడు చూసాను వాళ్ళ నాన్నను , మేము ఇద్దరం ఒకే బడిలో చదువుకున్నాము చిన్నప్పుడు , ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. “
“తనను కోచింగ్ లో చేర్పించడానికి వచ్చాడు, ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉంటాడు , ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్నాడు. “
“రేపు నువ్వు వచ్చినప్పుడు అతన్ని కుడా తీసుకోని రా , ఓ సారి చూడాలని ఉంది , ఏమ్మా మీ నాన్నకు చెప్పు ఓ సారి మా ఇంటికి రమ్మని తను ఇంటికి వెళ్ళే లోపు “
“అలాగే చెప్తాను సార్ “
“పిల్లలు సినిమాకు వెళ్లాలని , చాలా రోజుల నుండి అడుగుతున్నారు , నువ్వు తీసుకోని వెళ్లిరా శివా ” అంటూ నా చేతికి ఓ 500 డబ్బులు ఇచ్చాడు. నేను వద్దనకుండా తీసుకోని వాళ్ళ కోసం వెయిట్ చేయసాగాను.
ఓ 5 నిమిషాల్లో శాంతా , రాజీ వచ్చారు. వాళ్లకు కిర్తనా ను పరిచయం చేసాను. వాళ్ళ ముగ్గారితో కలిసి సినిమాకు వెళ్ళాము , సినిమా చుసాననిపించుకొని వాళ్ళను ఇద్దరినీ వాళ్ళ ఇంట్లో దింపి. దారిలో హోటల్ లో రెండు డిన్నర్ పార్సిల్ తీసుకోని ఇంటికి వచ్చాను , నేను వచ్చిన 5 నిమిషాలకు షబ్బీర్ , కిర్తనా వాళ్ళ నాన్నను తీసుకోని వచ్చాడు. కార్లో తనతో పాటు నూర్ , వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మకూడా ఉన్నారు.
“రండి ఇంట్లోకి వెళదాము “
“ఇప్పుడు వద్దులే మామా , ఇంకో సారి ఎప్పుడైనా వస్తాము లే , గుడ్ నైట్ ” అంటూ వాళ్ళను తీసుకోని వెళ్లి పోయాడు. మేము తెచ్చిన అన్నం తిని పడుకొండి పోయాము.
పొద్దున్నే నేను లేచే కొద్దీ కిర్తనా వాళ్ళ నాన్న , కిర్తనా ఇద్దరు లేచి స్నానాలు చేసి , కిర్తనా చేసిన కాఫీ తాగుతున్నారు. నేను వెళ్లి ఫ్రెష్ అయి వచ్చే సరికి. తను తిఫిన్ కుడా తయారు చేసి టేబుల్ మిద రడి గా ఉంచింది. ముగ్గరం టిఫిన్ చేసి కోచింగ్ సెంటర్ కు బయలు దేరాము. అంతకు ముందే ఫోన్ చేసి చెప్పడం వలన, అందులోనా ఆ కోచింగ్ సెంటర్ లో ఒక పార్టనర్ నా classmate కావడం వలన తనకు వెంటనే అడ్మిషన్ దొరికింది నామినల్ ఫీజు పే చేసాను హాస్టల్ కు మాత్రమె, తను మెరిట్ స్టూడెంట్ కావడం వలన తన మొదటి సంవత్సరం మార్కులు చూసి ఫ్రీ సీట్ ఆఫర్ చేసారు. EMCET లో మంచి ర్యాంక్ వస్తే , తనకు చదువుకోవడానికి అయ్యే కర్చు అంతా వల్లే భరిస్తామని ప్రామిస్ చేసారు. తను నెక్స్ట్ వీక్ నుంచి హాస్టల్ కు వచ్చేయచ్చు అని చెప్పారు. కీర్తన చాలా హ్యాపీ ఫ్రీ సీట్ రావడం వలన. మేము ఇద్దరం మాత్రమె లోపలి వెళ్ళాము. బయటకు వస్తూనే సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి చెప్పింది. “నాన్నా నాకు ఫ్రీ సీట్ వచ్చింది. మంచి ర్యాంక్ వస్తే పై చదువులకు వల్లే డబ్బులు పెట్టుకొంటారు అంట”
“మంచిది తల్లీ అంతా ఆ అబ్బాయి మంచితనం, లేకుంటే అక్కడే ఊర్లో సొంతంగా చదువుకోవలిసిన దానవు”
“నిజం నాన్నా , అంతా తను చేసిందే, తను లేకుంటే మనం ఇక్కడి దాకా వచ్చే వాళ్ళం కుడా కాదు”
“ఏయ్ , ఇంక చాల్లే పద ఇంటికి వెళదాము. నాకు కొన్ని పనులు ఉన్నాయి ” అంటూ ముగ్గరం ఇంటికి బయలు దేరాము. భోజనం టైం కావడం వలన దారిలో హోటల్ లో బొంచేసి ఇంటికి వచ్చాము.
“నీకు ఇప్పటికే బారం అయ్యాము బాబు ఇకా భారం కాదలుచు కోలేదు, నేను బయలు దేరుతాను , పాప ఇక్కడే ఉంటుంది నువ్వే హాస్టల్ లో దిగబెట్టు ”
“మీరు పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు , నేను కర్చు పెట్టిన ప్రతి పైసా , కాబోయే డాక్టరమ్మ దగ్గర వసూలు చేస్తాను , మీరేమి బాధ పెట్టుకోకుండా ఇంకో రెండు రోజులు ఉండండి, కీర్తన తో పాటు సిటి అంతా తిరగండి నేను పాస్ తిసిస్తాను”. ఆ మాటలకు కిర్తనా సిగ్గుపడుతూ
“ఉండు నాన్నా , రెండు రోజులు ఆగి వెళ్ళు అంది ”