ఉష నాకు దగ్గరగా జరిగింది.
నా మొహానికి ఆమె మొహం ఎంత దగ్గరగా ఉందంటే కిక్ ఇచ్చే ఆడతనపు పరిమళం, ఆ వెచ్చటి ఊపిరి…నేను ఫీల్ ఔతున్నాను.
“అభినయ్! ఈ ప్రపంచంలో ఏ ఒక్క మగాడయినా ఏదైతే ఇవ్వగలడో అది నువ్వు నాకు ఇవ్వగలవని నాకు పూర్తి నమ్మకముంది. అయాం ఎ స్పెషలిస్ట్ ఇన్ సెక్స్! కాబట్టీ నేను నీకు కొత్త పాఠాలు నేర్పించగలను. శారీరకంగాఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేయగలను. ఐ కెన్ డూ వండర్స్ విత్ యు! కానీ మానసికంగానే నేను నీకు పూర్తి తృప్తినివ్వలేనేమోనని…” అని ఒక్కక్షణం ఆగి—
“ఓకే. ఒక షరతు! నేను నీకు నచ్చకపోయినా, నువ్వు నాకు నచ్చకపోయినా, ఏ క్షణంలోనయినా మనం ఒకరినొకరు వదిలి వెళ్ళిపోవచ్చు. నేను నీకు భార్యగా రావడానికి నీ షరతులేటో చెప్పు వింటాను” అంది.
“నాకు నువ్వు కావాలి. అంతే! షరతులంటూ ఏమీలేవు.”
“తర్వాత పొరపాటు చేసానని అనిపిస్తే…”
“నెవ్వర్___అభినయ్ పొరపాట్లు చెయ్యడు. చేస్తే బాధపడడు.”
“మాటలు కాదు లీగల్ అగ్రిమెంట్ కావాలి. ఇద్దరం కలిసి డాక్యుమెంట్స్* రాసుకోవాలి. నా షరతులన్నిటికీ నువ్వంగీకరిస్తున్నట్లు రాసిస్తే…మన పెళ్ళి” అందామె.
“ఓకే. నాకు ఏ డాక్యుమెంట్స్* అక్కరలేదు. నీకు కావాలంటే రాసిస్తాను. తప్పకుండా…” అన్నాను.
ఉష నావైపు నమ్మలేనట్లు చూసింది.
“నేను నిన్ను మోసం చేస్తే?”
“నన్ను మోసం చేయాలని నీకనిపిస్తే అది కూడా నెరవేర్చుకునే అవకాశం నీకు కలిగిస్తాను. నా అనుమతి లేకుండా నాకు తెలీకుండా నువ్వు నన్ను ఒకే ఒక్కసారి మాత్రమే మోసం చేయగలవు— అదే ఆఖరిసారి ఔతుంది” అన్నాను.
ఆమె పెదవులు ముచ్చటగా బిగుసుకున్నాయి.
వెనువెంటనే ఆ పెదవుల మీద ఒక దరహాసం లాస్యం చేసి అదృశ్యమయ్యింది.
“అంటే…నేను నిన్ను మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుంటావా?”
“నేను మూర్ఖుడ్ని కాను. ఆత్మహత్య చేసుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం.”
“నన్ను హత్య చేస్తావా?”
“నేను పిచ్చివాడ్ని కాను. నానుంచి అటువంటి ప్రమాదాలెప్పుడూ రావు” అన్నాను ధీమాగా.
ఆమె ఒక్క నిమిషం నా మొహంలోకి అలా చూస్తూనే వుంది.
ఆమె పెదవులు వణుకుతున్నాయి.
చటుక్కున నా మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని—
నా పెదవులకి తన పెదవులు ఆన్చి—
గట్టిగా ముద్దు పెట్టుకుని—
నా పెదవులను చప్పరిస్తూ—
తన వెచ్చని నాలుకను నా నోట్లోకి జొనిపి, నా నాలుకని అందుకుంది
ఆ రాత్రి నన్ను ఒక లక్షసార్లయినా ముద్దుపెట్టుకుంది ఉష.
నేను మనసుని ఎంత అదుపులో పెట్టుకున్నానో నాకు తెలుసు.
ఆమె మహోన్నత వక్ష శిఖరాలు నా కళ్ళముందు కదలాడుతున్నా నేను చేతులు చాచలేదు.
నా గుండెల మీద తలవాల్చి నిద్రపోయిందామె.
ఉదయమే టెలిఫోన్ నిద్రలేపింది.
ఆమే రిసీవర్ అందుకుంది.
హోటల్ సావన్ కాంటినెంటల్ ఎం.డి. రాత్రి ఫోన్ చేస్తారని ఎంతో ఎదురుచూసానని చెప్పాడట. నీతో పాటు గదికెవరో కుర్రాడొచ్చాడట. నిజమేనా, అని అడిగాడట. నిజమే అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
రూం ఖాళీ చేసి బొంబాయిలో ఆమెకు తెలిసిన ఒక ఎడ్వకేట్ దగ్గరకెళ్ళాం.
నన్ను ఫ్రంట్ రూంలో కూర్చోబెట్టి ఆమె లోపలికెళ్ళి, నలభై నిముషాల తర్వాత వచ్చి, నన్ను లోపలికి రమ్మని పిలిచింది.
అప్పటికే అగ్రిమెంట్* టైప్ చేసి సిద్ధంగా వుంచాడు ఎడ్వకేట్ థీరూబాయ్ పటేర్కర్.
“ఒకసారి చదువుకో అభినయ్” అంది ఉష.
“అక్కర్లేదు”
“సంతకం చేసేముందు చదువుకోవాలి…” అన్నాడĺ