మెల్లిగా తలతిప్పి ఆమెవైపు చూసాను.
ఆమె వంటి మీద బ్లాంకట్ జారిపోయినట్లు ఆమె గమనించిందో లేదో నేను గమనించే స్థితిలో లేను.
ఆమె మెడ క్రిందకు పాకింది నా చూపు.
అద్భుతం. అపూర్వం. అమోఘం.
నా ఫాంటసీ ఫంటాస్టిక్ గా సాక్షాత్కరిస్తోంది.
ఆమె ఉఛ్వాస నిశ్వాసలకి కుంకుడు గింజల్లాంటి ఆమె టిప్స్ సన్నగా ప్రకంపిస్తోంటే—యుద్ధానికి సిద్ధంగా స్టెన్ గన్స్ స్టిఫ్ గా పట్టుకుని అలెర్ట్ గా నిల్చున్న సైనికులు జ్ఞాపకం వచ్చారు.
“రియల్లీ సారీ ఉషా, రేపు ఉదయం మళ్ళీ ఇదే మాట చెప్తాను, మర్చిపోకుండా యధాతధంగా చెప్తాను. ఇప్పుడు నిద్రపోండి —” అన్నాను.
“నో! నేను సిన్సియర్*గా నమ్ముతున్నాను, ఈ మాట మీ గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిందని! ఐతే…ఐతే…మీకు నా గతం గురించి, నా జీవితం గురించి సరిగ్గా తెలీదు కాబట్టి…” ఆమె ఏదో అనబోయింది.
“ఒద్దు. నాకు మీ గతం వద్దు ఉషా.”
“నాకు కావాలి అభినయ్ జీ. నా గతం మీరు తెలుసుకోవటం నాకు కావాలి. నా గతం, నా మనస్తత్వం తెలిస్తే మీరెంత తొందరపాటు మాట అన్నారో గ్రహిస్తారు. నాలాంటి ఆడదాన్ని పెళ్ళి చేసుకుంటే — ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందో మీరు ఊహించలేకపోతున్నారు. నేనేమి పతివ్రతను కాను. అఫ్కోర్స్ వేశ్యని కాల్ గర్ల్ నీ అంత కన్నా కాను. నన్ను పెళ్ళంటూ చేసుకుంటే నా మొట్టమొదటి భర్త మీరవుతారేమో తప్ప — మొట్ట మొదటి మగాళ్ళు మాత్రం మీరు కారు! పది మంది … కనీసం పదిమంది… మగాళ్ళతోనైనా నేను…” అంటోంది ఉష.
“నోనో…డోంట్ డోంట్ టెల్ మీ” అరిచాను.
ఆమె విశ్మయంతో నోరు మూసుకుంది.
నేను లేచి కూర్చున్నాను.
“ఉషా! ఈ క్షణంనుంచి నేను నిన్ను నువ్వూ అని ఏకవచనంతో పిలుస్తాను. నువ్వు కూడా నన్ను దయచేసి మీరు అనవద్దు. మనం పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా, మనం మంచి మిత్రులుగా ఉండిపోదాం. కానీ మనం పెళ్ళి చేసుకోకపోతే—మన శరీరాలు మాత్రం దూరంగానే ఉంటాయి. మనమధ్య పెళ్ళయ్యేంతవరకూ సెక్స్ నిషేదించబడింది” అన్నాను సీరియస్*గా.
“పెళ్ళంటే ఏమనుకుంటున్నావ్ అభినయ్?” సూటిగా అడిగింది ఉష.
“ఒక ఆడదీ, ఒక మగాడు కలిసి బ్రతకడానికి ఈ సంఘం కోసం చేసుకునే ఎగ్రీమెంట్” అన్నాను.
“నీకూ—నాకూ ఇష్టమైతే మధ్యలో ఈ సంఘం ఏమిటి బుల్ షిట్!” అందామె.
“సంఘం అనేది లేకపోతే, సంఘం పట్ల మనిషికి ఒక నైతిక బాధ్యత లేకపోతే…ఇది అరణ్యం అవుతుంది, జనారణ్యం! మనం మృగాలమౌతాం. జస్ట్ యానిమల్స్” అన్నాను.
“మేన్ ఈజ్ ఎన్ యానిమల్!”
“నో…ఎ సోషల్ యానిమల్” సరిదిద్దానామెను.
“తప్పు! అది హిపోక్రసీ. నైతిక బాధ్యతలు, కట్డుబాట్లు, ఆచారాలు ఇవన్నీ ప్రకటించడానికి బోధించడానికే ఆచరించడానికి కాదు… చూపించనా?ఎంతమంది…” అంటోందామె.
“వద్దు…” కట్ చేసాను. “నువ్వు చెప్పదల్చుకున్నది నాకు తెల్సు. నేరస్తులను చూపించి ఇది సంఘం, ఇదే శాసనం అనుకోవటం తప్పు” అన్నాను.
“నాలో ఏం చూసి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావ్?”
“సెక్స్ అపీల్! ది ప్రవోకింగ్ లేడీ ఇన్ యు! శారీరకంగా నేను స్వప్నాల్లో ఆవిష్కరించుకున్న శిల్ప సౌందర్యం జీవం పోసుకుని నా ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది నీ శరీర లావణ్యం చూడగానే! ఒక గొప్ప ఆడదానిలో ఈ లక్షణాలుండాలి అని నా వరకూ నేననుకున్న ప్రత్యేకతలన్నీ నీతో మాట్లాడుతూంటే నాకు కనిపించాయి. నీ అనుమతి లేకుండా, అయాం సోసారీ! నిన్ను నేను మానసికంగా పెళ్ళిచేసుకున్నట్లుగానే భావిస్తున్నాను.”
“యు ఆర్ మ్యాడ్ అభినయ్” కోపంగా అంది ఉష.
“యస్! మ్యాడ్ ఫర్ యూ” ఏదో అయస్కాంతపు శక్తి నా చూపులని ఆమె గుండెల వైపు లాగేస్తోంటే చూపు తిప్పుకున్నాను.
“నన్ను కాసేపు మాట్లాడనిస్తావా అస్సలు” అనడిగిందామె.
ఆమెవైపు చూసి చిరునవ్వుతో అన్నాను—”ఊ…ప్రొసీడ్!”
“నన్ను పెళ్ళి చేసుకుని భర్తగా నన్ను శాసించగలనని అనుకుంటున్నావేమో…”
“శాసించను. లాలిస్తాను, ప్రేమిస్తాను.”
“ప్రేమ ఒక టీనేజ్ ఫాంటసీ” వ్యంగ్యంగా అందామె.
“అది నువ్వు భావిస్తే”
“నువ్వు మాట్లాడొద్దు అభినయ్! జస్ట్ విను… అంతే” అందామె ఆవేశంగా.
సరేనన్నట్లు తలూపాను.
“ప్రేమ ఒక టీనేజ్ ఫాంటసీ. సెక్స్ ఒక ఎడల్ట్ ఫాంటసీ. పెళ్ళి ఈ రెండు ఫాంటసీల మధ్య ఉధ్భవించిన హంబక్. హుళక్కి! నాకు కొన్ని పెర్వర్షన్స్ ఉన్నాయి, సరదాలున్నాయి, ఇష్టాలున్నాయి, ఆశలున్నాయి, కోరికలున్నాయి. పెళ్ళి పేరుతో వాటిని సమాధి చెయ్యలేను—”
“వన్ మినిట్! సారీ ఫర్ ద ఇంటరప్షన్. నా దగ్గర డబ్బుకు కొదవలేదు. లంకంత ఇల్లు వుంది, కండల్లో బలం వుంది. నీ సంతోషం కోసం నువ్వేం చేస్తానని అన్నా నాకభ్యంతరంలేదు. నేను నీకు ఏదయినా ఇవ్వలేకపోయిన పక్షంలో నువ్వు ఎక్కడయినా ఎప్పుడయినా పొందగలిగినా నాకేమీ అభ్యంతరముండదు. నన్ను వదిలి వెళ్ళకుండా నాతోనే ఉండిపో! అంతేచాలు” అన్నాను.