ఇద్దరం బైటికి వచ్చేసాం జగన్ మోహన్ దేశాయ్ గారి బంగళాలోంచి.
రాత్రి పది గంటలు దాటుతోంది.
ఒక తెల్లని మారుతీ కారు వచ్చి మా ముందు ఆగింది.
“రండి-కూర్చోండి…” బ్యాక్ డోర్ తెరిచి నన్ను లోపలకి ఎక్కమని చెప్పింది ఉష.
“ఈ కారు మీదా?” అని అడగాలనిపించింది.
అడగలేకపోయాను.
ఐతే నా మనసులోని ప్రశ్న ఆమె గ్రహించినట్లుగా కారులోకి ఎక్కిన తర్వాత, నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, జవాబు ఇచ్చింది.
“హోటల్ సావన్ కాంటినెంటల్ ఎం.డి. నాకు మూడేళ్ళుగా తెలుసు. నేను కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. బొంబాయి ఎప్పుడొచ్చినా సావన్ లోనే దిగుతాను. నా రూం బిల్ తీసుకోడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. కారు పంపించనా అని అతనే అడుగుతాడు. అతనికి నేను కావాలని నాకు తెలుసు. కానీ నేనతనికి దొరికిపోయాననుకోండి. ఈ మర్యాదలు ఇక జరగవు, వాడుకుంటాడు. డబ్బు పడేస్తాడు.
ఇంతవరకు నామీద సుమారుగా పదిహేనువేల రూపాయలు ఖర్చు చేసి వుంటాడంటే ఎవరూ నమ్మరు. ప్రతిసారీ నేనతనికి మర్నాడే లొంగిపోబోతున్నాననే భావన కలిగించి, తప్పించుకుంటూ వుంటాను. క్రితం సారి నేను రూం ఖాళీ చేస్తున్నానని చెప్పగానే, నా గదిలోకి వచ్చి, చాలా చనువుగా నా చుట్టూ చేతులు వెయ్యబోయాడు. నేనతనివైపు ఎంత క్రూరంగా చూసానో నాకింకా జ్ఞాపకం వుంది. మంత్రించినట్లు ఆగిపోయాడు.
పాపం అతని మీద జాలి వేసింది. అయినా నేనతనికి లొంగలేదు. అందుకే ఈసారి మూడు నెలల తర్వాత బొంబాయికి రాగానే, అతని హోటల్ కి ఫోన్ చేసి, వస్తున్నానని చెప్పి, రాగానే అతన్ని నా గదిలోకి ఆహ్వానించి, నేనే అతన్ని గట్టిగా కౌగిలించుకుని, గట్టిగా ముద్దుపెట్టుకున్నాను…” అంటూ కిలకిల నవ్వి, “ఆ ముద్దు ప్రభావం ఏమిటో తెలుసా? నేను కనిపిస్తే చాలు నా కాళ్ళ చుట్టూ తోకాడిస్తూ తిరిగే పెంపుడు కుక్క అయిపోతున్నాడు!” అంది ఉష.
నేనామెవైపు రెప్పవాల్చకుండా చూస్తుంటే—
“నామీద అసహ్యం కలుగుతోందా? కమాన్, టేకిట్ ఈజీ…” నా తొడ మీద చెయ్యివేసి నొక్కింది.
కారు ‘సావన్ కాంటినెంటల్’ లోనికి ప్రవేశించింది.
మేము కిందకు దిగాం.
“మేమే సాబ్, జడేసాబ్ ఘర్ మే హై. ఆప్ కో ఫోన్ కర్నేకో బోలే…” అన్నాడు సర్దార్జీ డ్రయివర్.
అతన్ని ఎగాదిగా చూసి ముందుకి కదిలింది ఉష.
నేనామె తైతక్కలాడే పిరుదులను చూస్తూ ఫాలో ఔతున్నాను.
నేనెక్కడో చదివిన మాటలు అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చాయి.
ఒక అందమైన, తెలివైన ఆడది ఎటువంటి మగాడినైనా…కీలుబొమ్మలా మార్చుకోగలదు.
గదిలోకి వెళ్ళగానే ఆమె తలుపులు వేసి, తుఫానులా దూసుకొచ్చి, నన్ను హఠాత్తుగా కౌగిలించుకోవటం నాకాశ్చర్యం కలిగించింది.
నా షర్టు పైబటన్ తీసేసి, ఛాతీమీద రింగులు తిరిగిన వెంట్రుకల మధ్య గట్టిగా ముద్దు పెట్టుకుంది ఉష.
“మీరు ఎక్సర్*సైజ్ చేస్తారా? బండరాయిలా వుంది మీ బాడీ” అందామె.
నేను జవాబివ్వలేదు.
“షర్టు ప్యాంటు విప్పేసి లుంగీ కట్టుకోండి” అందామె మళ్ళీ.
ఆమె బాత్*రూంలోకి వెళ్ళింది.
నేను చక చక దుస్తులు మార్చుకున్నాను.
నా ఒంటి మీద లుంగీ మాత్రమే వుంది.
నిలువుటద్దంలో నా రూపం నాకు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆరడుగుల ఎత్తుంటాను.
ప్రత్యేకించి వ్యాయామం చెయ్యకపోయినా, చాలా చిన్నతనం నుంచి ఫుట్ బాల్, వాలీ బాల్ ఆడే అలవాటుండేది. ఒళ్ళంతా చెమట ముద్దయిపోయేలా ఆడేవాడిని. నా ఫిజిక్ ని అభినందించిన వాళ్ళెందరో నా జీవితంలో తారసపడ్డారు.
ఐదేళ్ళ క్రితం ఓ కాల్ గర్ల్ నన్ను నగ్నంగా చూసి — పిచ్చి ఆనందంతో అరిచి నన్ను తుఫానులా చుట్టేసి – “ఫెంటాస్టిక్, ఒళ్ళంతా ఇలా ఎలుగుబంటిలా వెంట్రుకలుండే మగాడు గ్రేట్ ఇన్ బెడ్ అంటారు. కమాన్!” అని అభినందించింది.
హెరిడిటరీ.
నాన్న కూడా నాకులాగే వుండేవాడు.
బాత్ రూం తలుపు తెరుచుకుని ఆమె ఇంటర్నేషనల్ లక్స్ పరిమళాలు వెదజల్లుతూ, వొంటికి టర్కిష్ టవల్ బిగించుకుని వచ్చింది.
“స్నానం చేస్తారా?” అడిగింది ఉష.
నేను బాత్ రూంలోకెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి ఆమె డబుల్ కాట్ మీద మెడవరకూ కప్పుకుని పడుక్కుని వుంది.
నేను వెళ్ళి ఆమెకు కొంత దూరంలో పడుక్కున్నాను.
ఆమె గొంతు తగ్గించి మెల్లిగా అంది…
“ఒంటిమీద నూలు పోగులేదు తెలుసా? ఈ బ్లాంకట్ తప్ప”
ఒక్క క్షణం నేను మాట్లాడలేదు.
బరువుగా వూపిరి పీల్చి వదిలాను.
నా మస్తిష్కంలో రూపు దిద్దుకుంటున్న సహస్రాంశాలన్నిటినీ పోగు చేసుకుంటూ, సీలింగ్ వైపు తదేకంగా చూస్తూ మెల్లిగా అన్నాను__
“ఉషా…!”
“ఊ…? దగ్గరకొచ్చి పడుక్కోవచ్చుగా?” గోముగా అందామె.
“పడుక్కోవచ్చు. అంతేకాదు, ఇద్దరం ఒక్కటైపోవచ్చు. కానీ… నేనిప్పుడప్పుడే మిమ్మల్ని అందుకోవాలని అనుకోవటం లేదు.”
“ఎందుకు?” చటుక్కున నావైపు ఒత్తిగిల్లుతూ కుతూహలంగా అడిగింది.
“అందినట్లు అంది అందబోతున్నట్లు భ్రమ కలిగించి అందరినీ ఆడించినట్లు…నన్ను మీరు ఆడించటంలేదని నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఇప్పుడంటే ఇప్పుడు అందుకోగలననీ నాకు తెలుసు. కానీ నన్ను క్షమించండి. మన పరిచయం కొన్ని గంటలక్రితమే అయినా…ఎందుకో నాకు మీ మీద వ్యామోహం కలుగుతోంది. మిమ్మల్ని చూసిన క్షణం నుంచీ నా మనసులో మీరే! రేపు ఉదయం నా మనసులోని మాట చెప్పమని మీరు కోరినా, అయాం సారీ, నేను దాచుకోలేకపోతున్నాను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను!” అన్నాను.
అదిరిపడి లేచి కూర్చుందామె.