ఉషకులాగా ఉరికురికే జలపాతం కాదు ఆమె.
హుందాగా, గంభీరంగా, పవిత్రంగా కనిపించే సంధ్య ముందు నేను నగ్నంగా…నో… ఆ అలోచనే భరించలేకపోయాను. మెరుపు వేగంతో కుర్చీ వైపు దుమికాను. నా చేతికి టర్కిష్ టవల్ దొరికింది. ఒంటికి చుట్టేసుకున్నాను.
ఉష, సంధ్య ఇద్దరూ సమీపిస్తున్నారు.
“హల్లో…” నవ్వుతూ అన్నాను.
“హౌడుయుడు” అంది సంధ్య.
“అదేం పిచ్చి ప్రశ్న? హి విల్ డూ విత్ ఎ బిగ్ షాట్” అంది ఉష కొంటెగా నవ్వుతూ.
అదృష్టవశాత్తూ సంధ్యకి ‘బిగ్ షాట్’ అంటే తెలీదు కాబట్టి—
ఆమె నొసలు చిట్లించి ఉష వైపు చూసింది.
“సారీ… మేము ఇంకా ఈ వేళప్పుడు స్నానం చేస్తున్నామంటే సో బ్యాడ్. మీరేమో కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఫ్రెష్ గా వచ్చేసారు” అన్నాను.
సంధ్య ఏదో అనబోయింది.
కానీ ఉష ఆమె ఫీలింగ్స్ ని డామినేట్ చేస్తూ—
“సంధ్య అంటే ఏమనుకుంటున్నావ్ డియర్. ఆమె నా డియరెస్ట్ కొత్తగా పెళ్ళయిన దంపతులు చిత్తకార్తెలో ఆల్సేషన్ డాగ్స్ లా విచ్చలవిడిగా వుండాలనేది ప్రొఫెసర్ జిమ్…” అంటోంది ఉష.
సంధ్య ఫకాలున నవ్వేసింది.
“అబ్బా! అవేం మాటలు ఉషా. నువ్వు ఇంకా అదే పద్ధతిలో వుంటే బాగోదు. నౌ యువార్ శ్రీమతి ఉష…” అంది సంధ్య.
“మై ఫుట్… అభినయ్… నువ్వే చెప్పు. ఈ మొగుడూ పెళ్ళాల హిపోక్రసీ— పతియే ప్రత్యక్షదైవం అనే మేల్*స్ట్రాలజీ… నాకిష్టం లేదు. నేను సగటు భారతనారీమణిని కాను అని తీర్మానించినా ఫర్వాలేదు. పెళ్ళి కాకముందు ఒక పద్ధతి, పెళ్ళయ్యాక ఒక పద్ధతి— కుమారి ఉషగా ఒక ప్రవర్తన— శ్రీమతి ఉషగా ఒక ప్రవర్తన—ఐడోంట్ నో! నా నైజం ఎప్పుడూ ఒక్కటే! ఏమో…
నాకు భాస్కర్ బావలాంటి మనిషి తగలకపోయివుంటే, దేశంలో అందరు బావల్లాగా నా బావకూడా మరదలుని కేవలం సరసంవరకే పరిమితం చేసివుంటే, నేను అందరిలాగే వుండేదాన్నేమో! నీకు తెలుసు సంధ్య! విద్యార్థులకు బుద్ధీ, జ్ఞానం, విచక్షణ, విద్య నేర్పించాల్సిన వయసులో, పవిత్రమైన విద్యాలయప్రాంగణంలోనే— నాకు రంజిత్‌సింగ్ లాంటి మాస్టారు, దొరక్కపోయి వుంటే, ఏమో, నేనూ అందరిలాగే వుండేదాన్నేమో! సంధ్యా… నాకు హిపోక్రసీ అంటే పరమ అసహ్యం! సొసైటీ కోసం హిపోక్రసీ నేర్చుకోమంటే నావల్లకాదు!!” సుదీర్ఘమైన ఆ ఉపన్యాసం రెప్పవాల్చకుండా విన్నాను నేను.
సంధ్య శిలాప్రతిమలా అయిపోయింది.
“ఓసినీ… యిప్పుడు నేను నిన్నేమన్నానని అంత రెచ్చిపోయి గుమ్మంలోనే క్లాస్ తీసుకున్నావ్?” అంది సంధ్య.
ఉష అదోలా నవ్వింది.
“సాండీ… నేను మాట్లాడే ప్రతి మాటకి, నేను రాసే ప్రతి అక్షరానికి, నేను చేసే ప్రతి చిన్న పనికీ ఎప్పటికప్పుడు సంజాయిషీలిచ్చుకుంటూ, అనుక్షణం నటిస్తూ, లోపల ఒకటి, బైట ఒకటిగా నేనుండలేను. పెళ్ళయ్యాక కూడా ఉష మారలేదు అని నువ్వు అర్ధం చేసుకుంటావని…” అంటూ ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకుంది.
“అబ్బ అదరగొట్టేసావనుకో” అన్నాను.
వాళ్ళిద్దరి మధ్యా నేనెందుకని… “ఓ.కే. తొందరగా స్నానం కానిచ్చుకుని వచ్చేయ్. టిఫిన్ చేద్దాం” అంటూ లోపలికి వెళ్ళేందుకు కదిలాను.
వీస్తున్న గాలి ఉష గొంతులోంచి వెలువడ్తున్న వ్యాఖ్యానాన్ని మోసుకొస్తోంది.
“గ్రెనైట్ రాయిలా వున్నాడు కదూ నా మొగుడు?”
“గుడ్. హాండ్సమ్. కంగ్రాట్స్—” అంటోంది సంధ్య.
ఆ తర్వాత వాళ్ళ సంభాషణ వినిపించలేదు.
నేను లోపలికి వెళ్ళిపోయాను. చకచక పైజామా, లాల్చీ వేసుకున్నాను. తల దువ్వుకున్నాను. అరగంట తర్వాత వచ్చింది ఉష. పాపం సంధ్యని కూడా స్విమ్మింగ్ పూల్ లోకి తోసిపారేసి వుంటుంది. తడిసిపోయిన బట్టలతో ముడుచుకుపోయి వుంది.
నేను తల దించుకున్నాను.
నేనెంత పాపిస్టి మగాడినో నాకు తెలుసు.
పైకి నేనెంత మర్యాదగా ప్రవర్తించినా, లోపల ఏ మూలనో అందంపట్ల, శృంగారంపట్ల, రసికత్వం పట్ల కుతి వుంది.
సంధ్యని మొదటిసారి చూసినప్పుడే- స్లిమ్ ఎండ్ ట్రిమ్ గర్ల్ అనుకున్నాను.
తడిసిన అందాలు మరింత ప్రమాదకరమైన అభిప్రాయాలు కలిగిస్తున్నాయి.
అందుకు నేను తల దించుకున్నాను.
ముఖ్యంగా ఆ అమ్మాయి కళ్ళల్లో విశిష్టత. పలుచటి పెదవులు, చిన్న నోరు, పన్ను మీద పన్ను.
ఉషలా ప్రవోకింగ్ కాదు గానీ—
అదో రకమైన మెరుపుంది సంధ్యలో.
“అదిగో, అదీ మావారి వరుస. నాలుగైదువందల సంవత్సరాల క్రితం పుట్టి వుండాల్సిన మనిషి. అభినయ్ లుక్ హియర్!” అరిచింది చివర్లో.
తలెత్తాను.
“చూడొచ్చు తప్పులేదు. నీ చూపులకి నా ఫ్రెండు నిండుచూలాలై పోతుందని భయమా? అలా చూసినంతమాత్రాన సాండీ ఏమీ అరిగిపోదు, తరిగిపోదు, కరిగిపోదు, మాసిపోదు, నలిగిపోదు—” ఉష మాటలు పూర్తికాకుండానే సంధ్య కోపంగా రియాక్టు అయ్యి— ఉష పిరుదుల మీద ఫట్ మని కొట్టింది. కెవ్వుమంది ఉష.
నేను మళ్ళీ తల వంచుకున్నాను.
ఎంతో సహజంగా నా చేతివేళ్ళ గోళ్ళల్లో ఏమైనా మట్టి ఇరుక్కుపోయి వుందేమోనని అన్వేషిస్తూ చూస్తూ కూర్చున్నాను.
సంధ్యని తీసుకెళ్ళి తన ఎర్రరంగు నైటీ ఆమెకు తొడిగించింది.
తను పలుచటి నీలంరంగు నైటీ వేసుకుంది.
నేను అప్రయత్నంగానే సంద్యని ఎగాదిగా చూసాను.
అందుకు కారణం ఉషకి తెలుసు.
“ఏంటలా చూస్తున్నావ్? ఈ ఎర్ర నైటీలో నేనెంతో సెక్సీగా కనిపిస్తాను అనేవాడివి. ఏఁ… సాండీ అలా కనిపించటం లేదా? ఆడవాళ్ళకి ఎర్రరంగు ఎప్పుడూ కిక్ ఇచ్చే లెవల్‌లోనే కనిపిస్తుంది.”
సంధ్య కలవరంగా చూసింది ఉష వంక.
నేను చాలా కాజువల్ గా వంటకాల మీద దాడి ప్రారంభించాను.
ఉడకపెట్టిన గుడ్లు, వెజిటెబుల్ సాండ్*విచ్, సగ్గుబియ్యంతో చేసిన కిచిడి, ఫ్రయిడ్ బ్రెడ్డు, టొమాటో ఆమ్లెట్స్ ఇన్ని ఐటెమ్స్ ఉదయాన్నే వండి— హాట్ కేసుల్లో భద్రపరిచింది ఉష.
డామిట్, షీ ఈజ్ ఎ మెషీన్!
అలసట అనేది ఆమెలో మచ్చుకైనా కనిపించదు.
బ్రేక్*ఫాస్ట్ చేస్తున్నంతసేపూ ఉష మాట్లాడుతూనే వుంది.
మామూలుగా ఆమె మాటలు వింటే అంతా అసందర్భ ప్రేలాపనలాగే వుంటుంది.
కానీ అంతర్లీనంగా ఆమె సెక్స్ చాంటింగ్ ఆలోచనలు కనిపిస్తాయి.
“మనిషి భోజనం చేసే విధానాన్ని బట్టి అతని సెక్స్ అలవాట్లు చెప్పొచ్చు తెలుసా?” అంది ఉష.
నిజంగానే కుతూహలం రేకెత్తించే ప్రశ్న.
ప్రశ్నార్థకంగా చూసాను.
“సాండీని చూడు. ముందు స్లోగా మునివేళ్ళతో కెలుకుతూ, ఒక్కొక్క పదార్ధం రుచిచూసి, బాగా నచ్చిన టొమటో ఆమ్లెట్ ని ఫాస్ట్ గా తింటోంది. అంటే, సెక్సు విషయంలో తనకి నచ్చిన మనిషితో ఎంత చనువుగా చొరవగా ఫస్టుగా వుంటుందో, దగ్గర కాని రుచించని మనిషితో అంత పొడిపొడిగా వుంటుంది” చెప్పింది ఉష.
“యామైరైట్?” మళ్ళీ సాండీనే అడిగింది.
“ఏమోబాబూ. నీకులాగే ప్రతీ అంశాన్ని సెక్స్ తో ముడిపెట్టి ఆలోచించటం నా వల్ల కాదు ఉషా.”
“ఓకే. ఓకే. అదిగో అభినయ్ ఎలా తింటున్నాడో చూసావా? ఒక్కొక్క పదార్ధాన్ని తృప్తిగా చప్పరిస్తూ, బాగా నములుతూ మధ్య మధ్యలో టొమాటోసాస్, చిల్లీ సాస్ నంచుకుంటూ ఏకాగ్రతగా తింటున్నాడు. అంటే?”
“ప్లీజ్ ఉషా” ఖండించబోయాను నేను.
“అభినయ్ చేతిలో పడిన ఆడపిల్ల అణువణువునా తృప్తిగా చప్పరించబడి, స్వర్గపు అంచులకి జాగ్రత్తగా చేర్చబడి, ఆనంద డోలికల్లో”
“కమాన్. డోంట్ బీ సో క్రేజీ ఉషా” కసిరినట్లుగా అన్నాను.
అప్పుడు సంధ్య నాతో అన్నది.
“దాన్ని మాట్లాడనివ్వండి. దొరకక దొరకక మొగుడు దొరికాడు. రాత్రీ పగలు దానికి కంటిమీద కునుకులేకుండా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు. మీరు ఆన్ని విధాలా ఆమెకు నచ్చారు. జీవితంలో మొగుడే దొరకడనుకునే ఆడదానికి మంచి మొగుడు దొరికితే ఆ ఆనందపు అనుభుతి నుంచి, తమకత్వపు మైకంలోంచి అంత సులభంగా బైట పడలేదు. లెట హర్ ఎంజాయ్!”
సీరియస్‌గా అంది సంధ్య.
ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది ఉష.
“ఫెంటాస్టిక్! విన్నావా అభినయ్. సాండీ ఈజ్ ఎ జీనియస్. ఆమె నోటంట వెలువడే ఒక్కొక్క వాక్యం ఒక బ్రహ్మాస్త్రంలాంటిది. లాజిక్, రీజనింగ్ ఎండ్ సైకో ఎనాలసిస్ లేకుండా ఆమె ఏ పనీ చెయ్యదు. అదీకాక నా గురించి బహుశా సంధ్యకి తెలిసినంత క్షుణ్నంగా ఈ సృష్టిలో మరెవరికీ తెలీదు. ఎందరో మగాళ్ళని రుచి చూసిన ఈ ఉషకి ఒక మగాడు మొగుడయ్యేంతగా ఆకట్టుకోగలిగాడూ అంటే— కారణం ఏమయ్యుంటుందో ఆమె ఇట్టే గ్రహించగలదు. అందుకే నేనేం చేసినా అభ్యంతరం చెప్పదు…” అంది ఉష నవ్వుతూ.
కోపంగా ఉష మొహంలోకి చూసింది సంధ్య.
కిసుక్కున నవ్వి—