మళ్లీ మెలకువ వచ్చేటప్పటికి 8 గంటలు అయ్యింది – కళ్ళు తెరవగానే ప్రశాంతంగా నిద్రపోతున్న దేవత ముఖాన్ని చూడగానే పెదాలపై తియ్యని చిరునవ్వు – నుదుటిపై కట్టుని చూసి కళ్ళల్లో చెమ్మ – దేవత చేతిని సున్నితంగా చుట్టేసి లేచి కూర్చున్నాను .
గుడ్ మార్నింగ్ హీరో ……… , నీ దేవతనే కాదు మమ్మల్ని కాస్త పట్టించుకోండి .
మోచేతితో కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ డాక్టర్ గారూ – నర్స్ అనిచెప్పాను . మాటిచ్చినట్లుగానీ డాక్టర్ గారు – నర్స్ ………. దేవతను కంటికిరెప్పలా చూసుకుంటున్నారు .
నర్స్ ………. నావైపు – డాక్టర్ గారి వైపు చూసి తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నారు .
డాక్టర్ : ష్ ష్ ష్ ………. అని నర్స్ నోటిని మూసేసి సిగ్గుపడుతున్నారు .
ఏమైంది నర్స్ ………. అంత సంతోషంతో నవ్వుతున్నారు .
నర్స్ : మామూలు సంతోషం కాదు మాటల్లో వర్ణించలేనంత సంతోషం ఆNఈ డాక్టర్ గారి బుగ్గపై ముద్దుపెట్టి , చెప్పానా చెప్పెయ్యనా మేడం – మహేష్ మహేష్ ………. నువ్వు పడుకున్నాక ఏమిజరిగిందో తెలుసా ……….
డాక్టర్ : నో నో నో ………. ష్ ష్ ష్ please please నా మీద ఒట్టు .
నర్స్ : పోండి మేడం ……… మహేష్ కు తెలియాలి కదా , మీరంటే నాకు ఇంత ఇష్టం – మీరు సర్జియన్ స్పెషలిస్ట్ గా 6 మంత్స్ ముందు వచ్చినప్పటి నుండీ ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు – ఇక కొద్దిరోజుల్లో ఇండియాకు వెళ్లిపోతున్న తరుణంలో చూసాను – I am so so happy మేడం లవ్ యు లవ్ యు soooooo మచ్ – అంతలోనే ఆ ఆనందాన్ని లోలోపలే అణిచివేస్తున్నారు ఇది భావ్యమా ………
డాక్టర్ : ఒట్టు అంతే ఇక నోటిని మెదపరాదు అని కన్నీళ్లను కళ్ళల్లోనే దాచేసుకున్నారు .
డాక్టర్ – నర్స్ ……… ఒకరికిఒకరంటే ఇంత ఇష్టంగా ఉండటం ఎక్కడా చూడలేదు – చాలా చాలా ఆనందం వేస్తోంది . సమయం చూసి వెంటనే చిరుకోపంతో డాక్టర్ గారూ ……… ఉదయానికల్లా దేవత కోలుకుంటారు అనిచెప్పారుకదా , 8 గంటలు అవుతున్నా స్పృహలోకి రాలేదే ………
డాక్టర్ : తియ్యదనంతో నవ్వుకున్నారు . నీ దేవత రాత్రే కోలుకున్నారు – స్పృహలోకి రాలేదు అంతే , తప్పు నీవైపు పెట్టుకుని మమ్మల్ని నిందించడం ఏమీ బాగోలేదు హీరో ……… . ప్రాణాలకు తెగించి నీ దేవతను కాపాడి తీసుకొచ్చావు – మేము ట్రీట్ చేసాము అంతవరకూ బాగుంది – ఇంతే జరిగి ఉంటే ఉదయానికల్లా స్పృహలోకివచ్చేవారు . కానీ తనంటే ప్రాణమైన దేవతలా చూసుకునే హీరో గారి బ్లడ్ ఒక బాటిల్ కాదు ఏకంగా two బాటిల్స్ ఇచ్చారు – అంతటితో ఆగావా …….. మేము ఎంత ప్రయత్నించినా శాంతించని నీ దేవత , నీ చేతి స్పర్శకే హెవెన్ లో ఉన్నట్లు ఇదిగో ఇలా హాయిగా నిద్రపోతున్నారు – ఆ చేతిని వదిలితేనే కానీ నీ దేవత హెవెన్ నుండి వచ్చేలా లేరు ఇక నీ ఇష్టం . తప్పంతా తనవైపే పెట్టుకుని మమ్మల్ని అంటున్నాడు పాపం – ఊరికే పడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అని నర్స్ తోపాటు జీవితంలో నవ్వనంతలా ఎంజాయ్ చేస్తున్నారు .
నర్స్ : కళ్ళల్లో చెమ్మతో , మేడం ……… మీలో ఈ ఆనందాన్ని జీవితాంతం చూడాలనుకుంటున్నాను . మహేష్ కు ఏమిజరిగిందో చెప్పేస్తాను .
డాక్టర్ : నో నో నో ………..
ఏమిజరిగింది న్సర్స్ ………..
నర్స్ : అదీ అదీ ……….
డాక్టర్ : ఓహ్ shit , మహేష్ ………. నీ దేవతకు నైట్ ఇంజక్షన్ వెయ్యలేదు వెంటనే వెయ్యాలి లేకపోతే ప్రమాదం .
అయితే త్వరగా వెయ్యండి మేడం ………
డాక్టర్ : ఆ ఇంజక్షన్ కేవలం సిటీలో ఒకే ఒక్క ఫార్మాసిటికల్స్ లోనే దొరుకుతుంది . వెళ్ళిరావడానికి గంటకు పైనే సమయం పడుతుంది .
I have a sports car మేడం , అర గంటలో వచ్చేస్తాను త్వరగా రాసివ్వండి – ఎక్కడ దొరుకుతుందో చెప్పండి .
డాక్టర్ : ప్రిస్క్రిప్షన్ పై ఇంజక్షన్ – అడ్రస్ రాసిచ్చారు .
డాక్టర్ గారూ ……… దేవత జాగ్రత్త , తప్పడం లేదు గాడెస్ అని నెమ్మదిగా చేతినివదిలి బయటకు పరుగుతీసాను .
నర్స్ : ఇంజక్షన్ ఎలా మరిచిపోయారు మేడం , పేషెంట్ పరిస్థితి ఏమిటి ? .
డాక్టర్ : మొదట కన్నింగ్ స్మైల్ ఆ వెంటనే కళ్ళల్లో చెమ్మతో నర్స్ ను అమాంతం కౌగిలించుకుని , తప్పలేదు లేకపోతే నువ్వు చెప్పేసేదానివి – నా స్వార్థం వలన అంతటి మంచి వ్యక్తి ఇబ్బందిపడకూడదు అర్థం చేసుకుంటావనుకుంటాను .
నర్స్ : మేడం ……..
డాక్టర్ : thats it ………. మేము మళ్లీ కలిస్తే కలవాలని రాసిపెట్టి ఉంటే నేనే స్వయంగా చెబుతాను .
నర్స్ : ప్రామిస్ , తప్పకుండా తప్పకుండా కలుస్తారు మేడం అని కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని ఉద్వేగాలకు లోనయ్యారు .
కంగారుపడుతూనే ట్రాఫిక్ దాటుకుంటూ డాక్టర్ గారు చెప్పిన ఫార్మాసిటికల్స్ చేరుకునేసరికి అర గంట పట్టింది . డాక్టర్ గారు చెప్పినది నిజమే గంట సమయం పట్టేలా ఉంది అని కార్ దిగి లోపలికి పరుగునవెళ్లి ప్రెస్క్రిషన్ – పర్సులో ఉన్న డాలర్స్ మొత్తం టేబుల్ పై ఉంచి please అర్జెంట్ అని ఆయాసపడుతూ అడిగాను .
సేల్స్ మ్యాన్ : ప్రిస్క్రిప్షన్ మరియు నన్ను చూసి క్షణాల్లో అందించి బ్యాలన్స్ వెనక్కు ఇచ్చేసాడు .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ బ్రో బ్యాలన్స్ మొత్తం నీకే ……….. – I came for this medicine from a long distance of ********hospital – ఇంత బిగ్గెస్ట్ సిటీ లో ఈ ఫార్మాసిటికల్స్ లో మాత్రమే దొరుకుతుందని ఈ మెడిసిన్ RARE అని డాక్టర్ గారు చెప్పారు .
సేల్స్ మ్యాన్ : rare medicine i believe that కానీ సిటీ లో ఎక్కడైనా దొరుకుతుంది సర్ ……….. – మీరు ఏ హాస్పిటల్ నుండి వచ్చారో అక్కడే ప్రక్కనే ఉన్న మా మెడికల్ స్టోర్ లో కూడా లభిస్తుంది అని బ్యాలన్స్ వెనక్కు ఇచ్చేసాడు .
Ok thanks అనిచెప్పి , మెడిసిన్ అందుకుని పరుగున కారులోకి చేరి హాస్పిటల్ కు బయలుదేరాను . డాక్టర్ గారు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అని ఇంత దూరం ఎందుకు పంపించారో అని ఆలోచిస్తూ మరింత పెరిగిబ్ ట్రాఫిక్ దాటుకుంటూ వేగంగా పోనిచ్చాను .
రోడ్ ప్రక్కనే flowers shop కనిపించడంతో ఆపి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తీసుకుని
” GET WELL SOON GODDESS ” అని రాయించాను – నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతలను తనలో చూసుకున్న దేవతకు ఫ్లవర్స్ మాత్రమేనా అని దారిలో జ్యూవెలరీ షాప్ చెరుకుని లోపలికివెళ్లి నిమిషంలో షాప్ చుట్టేసి మనసుకు నచ్చిన మూడు నెక్ జ్యూవెలరీని గిఫ్ట్ ప్యాక్ చేయించి మూడింటిపై TO GODDESS – TO DOCTER – TO NURSE అని రాసి పే చేసాను . డాక్టర్ గారు చెప్పినట్లుగానే గంట 10 నిమిషాలకు హాస్పిటల్ చేరుకున్నాను .
మెడిసిన్ – ఫ్లవర్స్ – జ్యూవెలరీ గిఫ్ట్స్ అందుకుని క్షణాలలో నేరుగా ICU చేరుకుని డోర్ తీసుకుని లోపలికివెళ్లి , దేవత నిద్ర డిస్టర్బ్ కాకూడదని డాక్టర్ గారూ అనేంతలో …………
బెడ్ పై దేవత లేకపోవడం – డాక్టర్ గారు , నర్స్ ……… కళ్ళల్లో కన్నీళ్ళతో లేచి నిలబడి , సో sorry మహేష్ ………. నువ్వు వెళ్ళగానే నీ స్పర్శ లేకపోవడం వలన నీ దేవత నో నో …….. హెల్ప్ – leave me అంటూ సడెన్ గా లేచి కూర్చున్నారు , కొద్దిసేపటికే నీ దేవత హస్బెండ్ వచ్చి ఈరోజంతా హాస్పిటల్లోనే observation లో ఉండాలి లేకపోతే ప్రమాదం అనిచెప్పినా వినకుండా , ఎలా చూసుకోవాలో మాకుతెలుసు – చూస్తూనే తెలిసిపోతోంది బానే ఉంది అని ( అనవసరంగా సేవ్ చేశారు , ఇలాకాకుండా వేరేలా ……… తీసుకెళ్లేలా చేసి ఉంటే మీ హాస్పిటల్ ఎంత కోరితే అంత డబ్బు ఇచ్చేవాణ్ణి shit shit ) కనీసం వీల్ చైర్లో కాకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లిపోయాడు – మేమేమీ చేయలేకపోయాము మహేష్ sorry sorry ……….. ఇద్దరూ చెప్పడం ఆలస్యం ,
నా కంట కన్నీరు ఆగనేలేదు . ఫ్లవర్స్ – గిఫ్ట్స్ కిందకు జారిపోయాయి , నాకు తెలుసు అతడు దేవతను ఒక్క క్షణం కూడా ఉంచకుండా తీసుకెళ్లిపోతాడని – ఆ క్షణం వరకైనా ప్రక్కనే ఉంది దేవతలో నా దేవతలను చూసుకోవాలని ఆశపడ్డాను . ప్రక్కనే మెడికల్ స్టోర్ లో కూడా దొరికే మెడిసిన్ కోసం నన్ను దేవత నుండి గంటసేపు పైనే దూరం చేశారు ఎందుకోసమో నాకు తెలియదు అని ( నా తో సమానంగా బాధపడుతున్న – అప్పటికి తెలియదు ) డాక్టర్ గారి చేతికి అందించి కన్నీళ్లను తుడుచుకుంటూ బయటకు భారమైన అడుగులువేశాను .
మహే ………… అన్న పిలుపు అక్కడితో ఆగిపోయింది లోపల నుండి .
10 రోజుల ముందు నా హృదయంలో గూడుకట్టుకున్న నా దేవకన్య – ఇప్పుడు నా దేవతలను చూసుకున్న దేవత ………… నాకే ఎందుకు జరుగుతోంది అని కారు సైడ్ మిర్రర్ ను చేతి నుండి రక్తం కారేలా పగలగొట్టి గుచ్చుకున్న అద్దపు ముక్కలతోనే హృదయపు కన్నీళ్ళతో అపార్ట్మెంట్ బయలుదేరాను …………..