అష్టా చెమ్మా -10 ( సమాప్తం )

Posted on

నాకు చాలా భయం వేసింది.నన్ను క్షమించండి సార్.నేను ఉండలేను ఇంటికి వెళ్తాను అన్నాను.సార్ ఎంత చెప్పినా వినలేదు.నేనైతే రేపు వెళ్తున్నా అన్నాను.సరే కానీ ఒకరోజు ఉండి రా అన్నారు.అది అప్పుడే చెప్పలేను అన్నాను.పొద్దున్నే ఇంటికి వెళ్ళాను.అప్పుడు సమయం ఉదయం 7 గంటలు అయింది. ఎంత డోర్ కొట్టినా తీయడం లేదు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.

అష్టా చెమ్మా 9

అత్త వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఫంక్షన్ ఉండి వేరే ఊర్లో ఉన్నాం అన్నారు.కాలింగ్ బెల్ కూడా పని చేయడం లేదు.అలాగే బయట కూర్చుని 5 నిమిషాలకి ఒకసారి డోర్ కొడుతున్న. గంట తర్వాత వచ్చి నిద్ర మత్తులో ఎవరూ అంటూ డోర్ తీసాడు నా మొగుడు.అతని వాలకం చూసి షాక్ అయ్యాను.అక్కడక్కడ మల్లె పూల రెమ్మలు బాడీ కి అంటుకుని ఉన్నాయి. ఏంటిరా అప్పుడే వచ్చావు అన్నాడు.నువ్వేం చేస్తున్నావు అని తోసుకుంటూ లోపలికి వెళ్ళాను. బెడ్ పై నగ్నంగా ఒక ఆడది పడుకుని ఉంది. ఇల్లంతా గందరగోళంగా ఉంది.టేబుల్ పై బీర్ బాటిల్స్ గ్లాసులు చిప్స్ ఉన్నాయి. ఏయ్ ఏంటిది అని గట్టిగా అరిచాను. బెడ్ పై ఉన్నది భయపడి నిద్ర లేచింది.దానిని కొట్టబోతుంటే హే ఆగురా తన తప్పేం లేదు వదిలేయ్ అంటూ నన్ను పక్కకి జరుపుతూ పట్టుకున్నాడు.అది డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయింది. చూడు ఇది నీకు కొత్త కాకపోవచ్చు. కానీ మళ్ళీ చేయను అనే కదా నన్ను అక్కడికి పంపించి జాబ్ తెచ్చుకున్నావు.నిన్ను నమ్మే వెళ్ళాను కదా ఎందుకిలా చేస్తున్నావు అని అరిచాను.ఒకప్పుడు పనిలేక ఇదే పనిగా పెట్టుకున్న.

ఇప్పుడు ఆ పని ఒత్తిడి తట్టుకోలేక ఇలా చేస్తున్న. చేయకుండా ఉండాలనే అనుకున్న.అలవాటు పడిన ప్రాణం కదా.కొంచం సమయం పడుతుంది.నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. మెల్లిగా మారతాను. అయినా నువ్వు ఇప్పట్లో రావని సార్ చెప్పాడు కదా. ఎందుకు వచ్చావు అన్నాడు.నాకు ఉండాలి అనిపించలేదు.ఇంకా నేను వెళ్ళను.చాలు అని అక్కడ జరిగిన విషయాలు అన్నీ చెప్పాను.ఒసేయ్ పిచ్చి మొద్దు వాళ్ళ అబ్బాయి నీ వల్ల మంచిగా అయితే నాకు ఒక కంపెనీ నే ఇస్తా అన్నాడు. అదే జరిగితే మన ఫుల్ లైఫ్ సెటిల్ అయినట్టే కదా.కొన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు. సరే ఎలాగో వచ్చావు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉండు.రేపు వెళ్ళు అన్నాడు. ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే నాకు కష్టంగా ఉంటుంది ఉండలేను అన్నాను. ఏం కాదు.వాళ్ళ రాయల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అనుకుని ఉండు.అని మళ్ళీ నన్ను ఒప్పించి వాళ్ల ఇంట్లో దిగబెట్టాడు.ఇంటికి వెళ్ళగానే సార్ కొడుకు వచ్చి హగ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పాలి కదా.నీకోసం ఇల్లు అంతా వెతికాను. తెలుసా అని అన్నాడు. అది చూసి నా భర్త ఫేస్ అటు వైపు తిప్పుకున్నాడు.ఇతను ఎవరు అని నా భర్త వైపు చూసి అన్నాడు. మీ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను అన్నాడు. ఏంటి ఇలా చెప్పాడు అని నేను చూస్తుంటే, నా వైఫ్ మీరే తీసుకువచ్చారా అన్నాడు. వైఫ్ ఆ అని నేను సార్ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తున్న. నా భర్త కూడ అంతే షాక్ తో సార్ వైపు చూస్తూ ఏంటి అని కళ్ళు ఎగరేసి అడిగారు.వెంటనే సార్ , అవును రా అతనే తీసుకువచ్చాడు.నువ్వు రూం లోకి వెళ్ళు. నీ వైఫ్ తర్వాత వస్తుంది నువ్వు వెళ్ళు అన్నాడు.సరే డాడీ త్వరగా రా అంటూ నాకు చెప్తూ వెళ్ళాడు సార్ కొడుకు.

నిన్న నువ్వు వెళ్ళాక నా వైఫ్ ఎక్కడ అని కంగారు పడుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. గోల గోల చేసాడు. ఏదో చెప్పి మరిపించాను.రేపు తప్పకుండా వస్తుంది అని చెప్పి ఓదార్చాను. ఆ విషయం డాక్టర్ గారికి చెప్తే, అలా ఊహించుకున్నాడు. మీతో పాటు మీ ఇంట్లో ఉండేసరికి అలాగే ఆ అమ్మాయి మెడలో తాళి ఉండేసరికి నా వైఫ్ అని ఫిక్స్ అయ్యాడు. ఏం కాదు. అదే కంటిన్యూ చేయండి.అతను ఏం అన్నా అతనికి సపోర్ట్ చేస్తూ మంచిగా ఉంటూ మంచి చెడు చెప్తూ ఉంటే త్వరగానే కోలుకుంటాడు అని చెప్పారు.అందుకే ఇలా ఉండక తప్పదు.అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని సార్ వెళ్ళిపోయారు.నన్ను కన్విన్స్ చేసి నా భర్త కూడ వెళ్ళాడు.

నేను రూం లోకి వెళ్ళాను. నాకు నా పరిస్థితి అర్థం అయింది.త్వరగా ఇతన్ని మార్చాలి అని డిసైడ్ అయ్యాను.అప్పటి నుండి అది భాద్యతగా తీసుకున్నాను. రోజూ తనతో సెక్స్ చేయాల్సి వస్తుంది. కండోమ్ వేస్తే ఛీ అని దాన్ని పీకి పడేస్తున్నాడు.ఇక తప్పేది లేక కండోమ్ లేకుండా చేయడం అలవాటు అయింది.మెల్లిగా అందరి ముందు నాతో అసభ్యంగా ఉండడం నచ్చడం లేదు.కొద్దిగా సిగ్గు పడుతున్నాడు. అలా మూడు నెలలు గడిచే సరికి నాకు కడుపు వచ్చింది. సార్ తో చెప్పాను. సరే తీయిస్తాను అని అన్నారు. ఆ విషయం సార్ కొడుకు విని నా పర్మిషన్ లేకుండా నా బిడ్డ ను తేసేస్తా అంటారా డాడీ సార్ పై అరిచాడు. నువ్వేంటి నాకు చెప్పకుండా డాడీ చెప్తున్నావు.నాకు మా అమ్మ పుడుతుంది.తనని రానివ్వకుండా ఎవరూ చేయొద్దు అని కోపంగా అన్నాడు.నాకు భయమేసి నా భర్త కి చెప్పాను.ఇంట్లో అమ్మ వాళ్ళతో చుట్టు ప్రక్కల వాళ్ళతో నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాను. కానీ ఇలా అయిందేంటి ఇప్పుడెలా సరే ఆలోచిద్దాం అని ఫోన్ పెట్టేసాడు. ఇక నేను సార్ కొడుకు కి మంచిగా చెప్పడానికి చాలా ప్రయత్నం చేసాను.అసలు వినట్లేదు. నేను ఎక్కడ మిస్ అవుతానో అని నా చుట్టే తిరుగుతున్నాడు సార్ కొడుకు. అలా 5 నెలలు గడిచింది.ఈలోపు ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాడు. అందరూ వచ్చి విష్ చేస్తున్నారు. ఏంటిరా తెలియకుండా పెళ్ళి చేసుకున్నావు అప్పుడే తండ్రివి కూడా అవుతున్నావు అని సార్ కొడుకుని ఆట పట్టించారు. అలా సార్ వాళ్ళ చుట్టాలకు కూడా విషయం తెలిసి వచ్చి చూసి వెళ్తున్నారు. పెళ్ళి చెప్పకుండా చేసావు. శ్రీమంతం అయినా అందరినీ పిలిచి ఘనంగా చేయమని వాళ్ళు సలహాలు ఇచ్చి వెళ్తున్నారు. సార్ తల పట్టుకుని కూర్చున్నారు.

సార్ నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యో సార్ ఏంటిది అన్నాను. నన్ను క్షమించు నువ్వు వద్దు అన్నా వినకుండా నిన్ను బలవంతంగా నా స్వార్థం కోసం ఉంచాను.కానీ ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడే అన్నీ మార్గాలు మూసుకుపోయాయి.అందరికి తెలిసిపోయింది. నువ్వే నా కోడలివి అనుకుంటున్నారు.ఇప్పుడు నువ్వు వెళ్తే నా పరువు పోతుంది. ఉంటే నీ జీవితం పోతుంది. ఏం చేయమంటావు నువ్వే చెప్పు అన్నాడు సార్.
కొద్దిసేపు ఆలోచించి. సార్ మీ కొడుకు మంచిగా అయ్యే వరకూ ఉంటాను.అప్పుడు నిజాలు అన్నీ చెప్పి నేను వెళ్ళిపోతాను.అన్నాను. సరే నీ ఇష్టం అన్నారు. డెలివరీ అయ్యి బాబు పుట్టాడు.పని వాళ్ళు ఉన్నా అమ్మ ఉంటే బాగుంటుంది అనిపించింది. నా భర్త చెప్పి అమ్మ వాళ్ళని తీసుకురా అన్నాను.

నన్ను క్షమించు నీ ప్రమేయం లేకుండా నేను వాళ్ళకి అబద్దం చెప్పాను. అందరూ నిన్ను తప్పుగా అనుకోవద్దు అని నువ్వు లేవని ఈ లోకం వదిలి వెళ్ళిపోయావని చెప్పాను. నీకు చెప్పాలి అనుకున్న కానీ కడుపు తో ఉండగా ఇలాంటివి చెప్పకూడదు అని చెప్పలేదు.కానీ నిన్ను చుట్టు ప్రక్కల వాళ్ళు తప్పుగా అంటుంటే తట్టుకోలేక అలా చెప్పాను. నన్ను క్షమించు అన్నాడు. నా గుండె ఒక్కసారి జారిపోయింది.ఏడుపు ఒక్కటే తక్కువయింది. ఇప్పుడు నా జీవితం ఎటు పోతుంది అని ఏడుస్తూ ఉన్నాను. సార్ కొడుకు నేను ఏడుస్తుంటే చూడలేక కళ్ళు తుడిచి.లోపల నొప్పులు ఉన్నాయా…. ఏం కాదు త్వరగా తగ్గిపోతుంది. ఇదిగో బాబు చూడు ఎంత ముద్దుగా నవుతున్నాడో. నీకు నేను బాబు ఉన్నాం కదా.నీకు ఏ బాధ రాకుండా చూసుకుంటాం అని ధైర్యం చెప్తున్నాడు.ఆల్మోస్ట్ మార్పు కనపడుతుంది. కానీ నా బ్రతుకే తెలియడం లేదు. అలా 6 నెలలు బాబు ని నన్ను బాగా చూసుకుంటూ సార్ కొడుకు లో మంచి మార్పు వచ్చింది. అన్న ప్రాసన ఫంక్షన్ ఘనంగా చేసారు.అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళతో వాళ్ళ ఆఫీస్ విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు. పూర్తి గా మార్పు కనపడుతుంది. అయితే ఇప్పుడు నిజం చెప్పొచ్చు అనుకున్న. తర్వాతి రోజు సార్ కి హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ లో జాయిన్ చేసారు. నన్ను పిలిపించి. నా కొడుకు మారినట్లు తెలుస్తోంది. అది ఆఫీస్ విషయాలు అన్నీ అప్పచెబితే అప్పుడు తెలుస్తుంది. నేను బ్రతుకుతానో లేదో తెలియదు. కానీ నువ్వు నా కొడుకును వదిలి వెళ్ళకు. నా బాధ్యతలు అన్నీ నీ చేతుల్లో పెడుతున్న. నా కొడుకుని, నా ఆస్తులను, నా కంపెనీలు అన్నీ ఇకపై నువ్వే చూసుకో. రాదు తెలియదు అనకుండా అన్నీ నేర్చుకో. నా కొడుకు కి నీ గతం తాలూకు విషయాలు ఏవీ చెప్పకు. నా పై నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా చెప్పకు. ఇంకో విషయం నీ భర్త ఒక పెద్ద ఫ్రాడ్. వాడి నుండి నిన్ను తప్పించడానికి ఆ దేవుడు నీ జీవితం ఇలా మార్చి ఉంటాడు. ఇది నీ మంచికే అనుకో.ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అని బయట ఉన్న సార్ కొడుకు ని పిలిపించి వేరే మనిషిని పిలిపించి తాళి తెప్పించి అక్కడే నా మెడలో తాళి కట్టించారు. మీ ఇద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి అన్నాడు. అలాగే అని ఇద్దరం మాట ఇచ్చాం. అలా కొన్నాళ్ళకి సార్ గతించారు. కంపెనీలు అన్నీ చూసుకుంటూ బాగా మంచిగా మారిపోయాడు నా కొత్త భర్త.

ఎందుకో నా గతం దాచి నా జీవిత భాగస్వామితో జీవితం పంచుకోవడం తప్పుగా అనిపించింది.ఒకరోజు నైట్ ఆఫీస్ నుండి వచ్చాక చెప్పాలని చూసాను. ఏంటి మేడమ్ ఏదో చెప్పాలని చూస్తున్నారు ఆగిపోతున్నారు అన్నాడు. అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాను. నన్ను హగ్ చేసుకుని ఏంటి బంగారం బాబు ఉన్నాడు పాప కావాలి అనిపిస్తుందా అన్నాడు రొమాంటిక్ గా.అది కాదు నా గతం మీకు ఏమీ తెలియదు కదా అడగాలి అని అనిపించలేదా అన్నాను. నువ్వేంటో నాకు తెలుసు. నీ గతంతో ఇప్పుడు ఏమీ అవసరం లేదు కదా వదిలేయ్ అన్నాడు.నాకు ఇది కరక్ట్ గా అనిపించడం లేదు అన్నాను.నువ్వు ఎక్కువగా ఆలోచించకు. డాడీ చెప్పారు తన గతం గురించి ఎప్పుడూ అడగకు, తను చెప్తున్న వినకు అని అన్నాడు. అయినా సరే చెప్తాను విను అన్నాను. హే స్టాప్. డాడీ కి ప్రామిస్ చేసావు.మర్చిపోయావా. ఆ ప్రామిస్ బ్రేక్ చేయకూడదు అన్నాడు. అది మీకు ఎలా తెలుసు అన్నాను. హాస్పటల్ లో మీరు మాట్లాడేది విన్నాను. చాలా అంటే చాలా బాధ పడ్డాను.కానీ నువ్వు నాకోసం పెట్టిన ఎఫర్ట్స్ గుర్తొచ్చి నీపై ప్రేమ పెరిగింది.నువ్వు నీ ఎక్స్ హస్బెండ్ విషయంలో నువ్వు పడిన బాధ,నువ్వు నా కోసం త్యాగం గుర్తొచ్చి నీపై గౌరవం పెరిగింది.నీకు తాళి కట్టిన మరుక్షణం నుంచే నేను పూర్తిగా మారిపోయాను. నీ భర్త గానే ఉన్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీ గతం అంతా నాకు తెలుసు. అంతే కాదు మీ అమ్మ నాన్నలతో మాట్లాడి వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకువద్దామని అనుకుంటున్నాను.మనకి కూడా ఎవరూ లేరు కదా.అన్నాడు. చాలా సంతోషంతో ఆనందం ఆగక గట్టిగా హగ్ చేసుకుని థాంక్యూ సో మచ్. నా జీవితంలో ఏం కోల్పోయానో అది ఇప్పుడు నాకు దొరికినట్లు అనిపిస్తుంది.అన్నాను. నాకు ఇన్ని కంపెనీలు చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. నాతో పాటు నువ్వు కూడా సగం చూసుకోవాలి.లేదు అంటే రోజూ ఈ స్ట్రెస్ ని నీ అందమైన బూస్ట్ తో పోగొట్టు. సరేనా అన్నాడు. రోజూ చేస్తే బోర్ కొడుతోంది అన్నాను. బాబు పుట్టాక రోజు రోజుకీ నీ అందం పెరిగి పోతుంది. ఆ అందానికి తగిన న్యాయం చేయాలంటే రోజూ చేయాల్సిందే అని లిప్ లాక్ చేసాడు.

తర్వాతి రోజు మా అమ్మ నాన్నలతో మాట్లాడి అన్నీ చెప్పాను. వాడు ఇంత మాయగాడు అనుకోలేదు. గుండె బద్దలై బాధ పడుతుంటే కనీసం బ్రతికే ఉంది నిజం చెప్పలేదు.వాడికి రేపు పెళ్ళి అంట.రమ్మన్నాడు. ఏ అభాగ్యురాలు బలి అవుతుందో ఏమో అన్నది అమ్మ. అవునా సరే అమ్మా వదిలేయ్. ఎవరి రాత ఎంతో అంతవరకే.మనం కలిసాం కదా అది చాలు నాకు.అన్నాను.
— సమాప్తం —

Upcoming romantic story – రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కథ

1183730cookie-checkఅష్టా చెమ్మా -10 ( సమాప్తం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *