కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Posted on

వాళ్ళు ఇద్దరు ఎం మాట్లాడు కొంటున్నారో అర్థం కాక కిచెన్ లోకి వెళ్ళింది మాజీ మంత్రి గారి భార్య.

నేహాను డ్రాప్ చేసి ఇంటికి వచ్చి , laptop కనెక్ట్ చేసి ఫోన్ లో ఉన్న వీడియో ను ఫ్రేమ్స్ గా ఎడిట్ చేసి అందులో నేహా , నా కౌగిట్లో ఉన్న ఫొటోలను నా పేస్ కనబడ కుండా కొద్దిగా modify చేసి కొన్ని కలర్ ప్రింట్ తీసి కొరియర్ లో నేహా వాళ్ళ ఇంటికి పంపి పడుకోండి పోయాను.

11 గంటల మద్య ఫోన్ కాల్ ఫోన్ కాల్ కు నిద్ర లేచాను , మల్లికార్జున పొలిసు దగ్గర నుంచి ఫోన్.
“హలో , సర్ , బాగున్నారా ?”

“కంగ్రా ట్స్ శివా , యు డిడ్ ఇట్ అగైన్ “
“దేని గురించి సర్ “
“మాజీ మంత్రి వర్యులు ఈ రోజు లొంగిపోయారు , approver గా మారుతా అంటున్నాడు, ఆ పోలీస్ మరియు , నార్కోటిక్ డిపార్టుమెంటు లో పెద్ద సంచలనం రేగుతుంది ఇప్పుడు, అంతా నీ వలనే, నిన్న నువ్వు ఫోన్ చేసి చెప్పినప్పుడు , ఇదంతా జరిగే పనేనా అనుకొన్నా , కానీ ఆయన్ని చుసిన తరువాత పిల్లలు కూడా పెద్దల్ని ఎంతగా మార్చగలరు అని అర్థం అయ్యింది.”

“మన లక్ సర్ , అయన మారారు , నాకు కూడా 50, 50 ఛాన్స్ అని మాత్రం నమ్మకం ఉండి నది”

“మాకు రాని ఆలోచనలు నీకు వచ్చాయి , అంత పెద్ద క్రిమినల్ , ఆయనంతకు ఆయనే వచ్చి లొంగే ట్లు చేసావు”
“ఆ క్రెడిట్ వాళ్ళ అబ్బాయికి , అమ్మాయికి దక్కతాయి”
“మా పెద్ద బాసులు నిన్ను కలవాలని అనుకుంటున్నారు , రేపో , ఎల్లుండి ఫోన్ రావచ్చు “
“నన్ను ఎత్తకండి సర్, ఆ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మాయికి , అబ్బాయికే దక్కాలి , నన్ను ముందుకు తేకండి ప్లీజ్”
“సరే , అలాగే, కానీ నువ్వు మాత్రం తప్పకుండా రావాలి , వాళ్ళకు అందరికి తెలుసు దీనికి మూల విరాట్టు నీవే అని “
“మీరే చెప్పి ఉంటారు లెండి , వీలున్నంత వరకు నన్ను ముందుకు నెట్టకండి సర”
“సరే, ఒన్స్ అగైన్ hearty కంగ్రా ట్స్ శివా “
“థేంక్స్ సర్, ఉంటా “

లేచి ఫ్రెష్ అయ్యి , రూ పాలికి ఫోన్ చేసాను
“హాయ్ శివా , ఏంటి surprise”
“మన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది , ఇప్పుడే inspector నుంచి ఫోన్ వచ్చింది , నేహా వాళ్ళ నాన్న పోలీస్ లకు లొంగి పోయాడంట”
“నువ్వు అనుకోవడం , అది జరగక పోవడమా , కంగ్రా ట్స్ శివా”
“నీ సహాయం లేకుండా , ఇది జరిగే ది కాదు , ఇందులో నీ హ్యాండ్ కూడా ఉంది”
“నేను ఎదో మాట వరుస సాయం చేసాలే , అంత కంటే ఎం ఉంది , కానీ నేహా ధైర్యానికి మెచ్చుకోవాలి “
“నిజం , నేను ఇంకో గంటలో మీ కాలేజీ దగ్గరున్న హోటల్ లో ఉంటా , నే హాకు , నీకు లంచ్ ట్రీట్ ఇవ్వాలి “
“నే హాకు లంచ్ ట్రీట్ అయితే ఇవ్వు , నాకు డిన్నర్ ట్రీట్ ఆ తరువాత ….. ట్రీట్ అయితే బాగుంటుంది “
“ఏయ్ , naughty అయిపోతున్నావు , చూద్దాం లే ప్రస్తుతానికి లంచ్ ట్రీట్ తో సరిపెట్టుకో ” అంటూ ఫోన్ పెట్టేశా.

ఎందుకో నేహా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది, మనసులో వచ్చిన ఆలోచనలను కట్టేయడం ఎందుకు లే అని డ్రెస్ మార్చు కొని బైక్ ను వాళ్ళ ఇంటి వైపు తిప్పాను.

ఇంట్లో నేహా వాళ్ళ అమ్మా, నిరేక్ మాత్రమే ఉన్నారు. నన్ను చూసి
“హాయ్ అన్నా , రా లోపలి ” అంటూ లోపలికి తిసుకేల్లి వాళ్ళ అమ్మకు పరిచయం చెసాడు.

“శివా అన్న, మా కాలేజీ ప్రిన్సిపాల్ కు మంచి ఫ్రెండ్ , నన్ను కాలేజీ లోంచి దీ బారు చేస్తుంటే అన్నే వాళ్ళ ఫ్రెండ్ కు నచ్చ చెప్పి డి బార్ చేయకుండా , కొన్ని రోజులు ఇంటికి పంపేట్లు చేసారు “

“నీతో కొద్దిగా బయట పని ఉంది వస్తావా నిరేక్ , 2 గంటల్లో నేనే తీసుకొచ్చి దింపుతానండి” అని వాళ్ళ అమ్మకు చెప్పాను. నేను ఆ మాట అనగానే వాడు లోపలి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మకు బాయ్ చెప్పి నాతొ పాటు బైక్ మీద కూచున్నాడు.

మేము గమ్యం చేరుకునేంత వరకు , రెండు రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ఘర్షణ అంతా పూస గుచ్చి నట్లు చెప్పాడు. చివరగా “అన్నా , అక్క ఇంకో అబ్బాయితో క్లోజ్ గా ఉన్నా ఫోనులో పార్సిల్ లో వచ్చాయి ,అవి చూసి నాన్న బ్రేక్ అయ్యాడు , అందులో ఉన్నది ఎవరన్నా వాళ్లతో అక్కకు ఇబ్బంది లేదుగా “
“అవి మార్ఫింగ్ ఫొటోలు లో నేను మార్ఫ్ చేసాను , నేహా పర్మిషన్ తీసుకునే చేసాను , వాటి వలన మనకు ఎటువంటి ఇబ్బంది రాదు , నేను గ్యారంటీ “
“థేంక్స్ అన్నా, నేను వాటి గురించి వర్రీ అవుతున్నా, మనం ఎక్కడికి వెళుతున్నాము , అక్క కాలేజీ దగ్గరకా ” అన్నాడు పరిసరాలను చూసి.

“మీ ఇద్దరికీ లంచ్ ట్రీట్ ఇవ్వాలను కొంటున్నా , నిన్ను లోపల వేసిన inspector ఫోన్ చేసి చెప్పాడు , మీ నాన్న surrender అయ్యాడు”
“మాకు ఏమీ ఇబ్బంది రాదు కదా అన్నా”
“ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే పూచి నాది సరేనా”
“నువ్వు , మాట ఇస్తే ఇంకేముంది అన్నా , సరే ” అంటుండగా కాలేజీ పక్కన ఉన్న హోటల్ కు వచ్చాము.

అప్పటికే నేహా , రూపా అక్కడికి వచ్చి ఉండి రి , వాళ్లను బయటకు రమ్మని , ఆటోలో కుచో పెట్టి , డ్రైవర్ కు నన్ను పాలో కమ్మని నేను , నిరేక్ ముందు బైక్ మీద బయలు దేరాము.

“నిరేక్ , ఎ హోటల్ కు వెళ్దాం చెప్పు ,ఎం తినాలను కొంటున్నావు “
“బిర్యానీ తిందాము అన్నా, ఏదైనా మంచి ప్లేస్ కు తీసుకెళ్లు “
“ఐతే , పారడైజ్ కే వెళ్దాం అంటూ , బైక్ ను పారడైజ్ వైపు తిప్పాను”

లంచ్ టైం కావడం వలన కొద్దిగా రష్ గా ఉంది , ఓపికగా ఓ ౩౦ నిమిషాలు వెయిట్ చేసి లోపలి వెళ్ళాము. ఫుడ్ ఆర్డర్ చేసి

“కంగ్రా ట్స్ నేహా , నువ్వు కష్టపడ్డ దానికి ఫలితం దక్కింది ” అన్నాను.

“నాకు ఎలా , accept చేయాలో అర్థం కావడం లేదు సర్ , ఓ వైపు బాధగా ఉంది ఇంకో వైపు ఇక్కడితో ఆగి పోయినందుకు సంతోషం గా ఉంది, కానీ నాన్న ఎన్ని రోజులు ఉంటా డో లోపల “
“నిజమే నేహా , మీ నాన్నకి సాధ్యమైనంత తక్కువుగా లోపల ఉండేట్లు చూస్తాను , రేపు నేను ఆ డిపార్టుమెంటు లోని పెద్ద తల కాయాలను కలవడానికి వెళుతున్నా , వాళ్లతో మాటాడి ఆ తరువాత చెప్తా”

“ఇంట్లో మా అమ్మ మా మీద ఎగురుతుంది , మా వల్లనే నాన్న జైలు కు వెళతారు అని “
“ఆవిడ బాధ ఆవి డకు ఉంటుంది లీ , ఆమెను ఎ మీ అనకండి”
“I am sorry , మీరు ఇద్దరు నన్ను క్షమించాలి, ఇదంతా నా వల్లనే జరిగింది “
“మీరేందుకు సారీ అన్నా, మీరు మాకు కలవడం మేము చేసుకున్న అదృష్టం , లేదంటే మా నాన్న ఎ ఎన్‌కౌంటర్ లోనూ పోయే వాడు , దాని కంటే ఇదే నయం కదా”
“మా తమ్ముడూ , కరెక్ట్ చెప్పాడు , మీరేందుకు సారీ సర్, మేమే మీకు రుణపడి ఉన్నాము “
“పెద్ద పెద్ద పదాలు ఎం వద్దు లే , ప్రస్తుతానికి బిర్యానీ లాగించండి, మిగిలిన విషయాలు తరువాత మాట్లాడడాం ” అంటూ బేరర్ తెచ్చిన ప్లేట్స్ పై దాడి చేశాము.
===============================

“వాట్ నెక్స్ట్ ” అంది రూపా తన ప్లేట్ ఖాళీ చేస్తూ
“ఇంక చదువు మీద concentrate చేయండి” వాళ్ళు ఆటోమేటిక్ గా calm అయిపోతారు.
“తప్పకుండా అన్నా , ఇప్పటికే లెసన్స్ మిస్ అయ్యానేమో అని నాకు భయంగా ఉంది “
“నీకు కావాలంటే సెపరేట్ క్లాసు లు పెట్టమని , మా ఫ్రెండ్ కి చెప్తాలే , దాన్ని గురించి బెంగ పెట్టు కోకు “
“థేంక్స్ అన్నా ,నేను రేపు పొద్దున్నే హాస్టల్ కి వెళ్లి పోతా , ఈ లోపల నాన్న వస్తే ఓ సారి మాట్లాడి వెళతా “
“రాకున్న ఫరవాలేదు , నాకు చెప్పు ఎప్పుడు కలవాలంటే అప్పుడు నేను తీసుకెళతా “
“సరే అయితే “
“మీరు ఇంటికి వెళ్ళండి , మాకు సాయంత్రం ల్యాబ్ ఉంది మేము ఆటోలో కాలేజీ కి వెళతా ము ” అంది రూపా
“సరే ” అంటూ నేను నిరేక్ బైక్ మీద వాళ్ళ ఇంటికి వెళ్లి తనను అక్కడ దింపి నేను ఇంటికి వచ్చాను. నేను వచ్చిన 10 నిమిషాలకు షబ్బీర్ నుంచి ఫోన్
“ఏంట్రా మామా , ఇంట్లో ఉన్నావా లేక ఎక్కడన్నా రేగుతున్నావా ?”
“ఇంట్లోనే ఉన్నా లే , ఏంటి చెప్పు విశేషం”
“నీతో పని ఉంది , సాయంత్రం ఇంటికి వస్తావా , మీ చెల్లెలు బిర్యానీ చేస్తా అంటుంది “
“ఇంతకీ , బిర్యానీ కోసం రానా , లేక పని ఉందని రానా ?? “
“నువ్వు టైం కి రెడీ గా ఉండు నేను వచ్చి పిక్ చూసుకుంటా, 7.30 కి వస్తా ” అంటూ ఫోన్ పెట్టేవాడు.

సాయంత్రం షబ్బీరు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నారు అని అమ్మకు చెప్పి, నా రూమ్ లో కి వెళ్లి పడుకోండి పోయాను.

150601cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *