ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 4

Posted on

పని చాలా శ్రద్ధతో చేస్తాడని అంచనా కి వచ్చింది కావ్య. ఆఫీస్ సమయంలో అస్సలు ఫోన్ చేయడు. తాను మెసేజ్ పెడితే మాత్రం జవాబిస్తాడు. అతని రెస్పాన్స్ సమయం బట్టి, అస్తమాను ఫోన్ చెక్ చేసుకొనే రకం కాదని అర్ధం అయ్యింది. ఫొటోస్ షేర్ చేసుకునే వారు. మెల్లిగా తన డ్రెస్సెస్ ను మెచ్చుకోటం మొదలు పెట్టి, మెల్లిగా తాను ఇచ్చిన చనువుతో తన అందాల మీద కామెంట్స్, చివరకు ఫోన్ లో ముద్దు వరకు వచ్చారు. అలా అని చెప్పి మరీ పచ్చిగా మాట్లాడేవాడు కాదు. అతనితో తన శృంగార జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచనలతో, తీపి ఊహల్తొ నిద్ర పట్టేది కాదు కావ్యకు.

అప్పుడప్పుడు శ్రీరామ్ చెల్లితో, తల్లి తండ్రులతో మాట్లాడేది కావ్య. మంచి అణకువ కలిగిన కోడలు దొరికిందని చాలా సంతోషం పడేవారు శ్రీరామ్ పేరెంట్స్. అది కూడా కావ్య అంటే మరింత ఇష్టం కలిగేలా, మానసికంగా దగ్గరయ్యేలా చేసింది.

శ్రీరామ్ తన అపార్ట్మెంట్ లోపల చిన్న వీడియోలు, ఫొటోస్ తీసి, కావ్యకు షేర్ చేసి ఆమెకు పూర్తి అవగాహన వచ్చేలా చేసాడు. ఎక్కువగా పెళ్ళైన తరువాత ఇంట్లోకి ఏమి కావాలో తెలుసుకొని షాపింగ్ చేసేవాడు. ఒక రోజు మాటల్లో కొత్త కర్టైన్స్ వేస్తె బాగుంటుందని చెప్పింది.
వెంటనే “తప్పకుండా. మా అమ్మ గారు కొన్న కొత్తలో తొందరలో బట్ట కొని కొట్టించారు. మార్చాలని నేను అనుకుంటున్నాను. రేపే దర్పణ్ షాప్ కి వెళ్లి అక్కడనుంచి నుంచి ఫోన్ చేస్తా”అన్నాడు. అది ఎక్ష్పెక్త్ చేయని కావ్య మొదట చెప్పాలా వద్దా అని సందేహించింది.
చివరకు ఎప్పటికైనా డబ్బు విషయాలు మాట్లాడటం తప్పదని, “ఎంత బడ్జెట్ అనుకొంటున్నావు”
“ఎంత అవుతుందో నాకు అంచనా లేదు. ఎంత అవుతుందో నీకు తెలుసా”అని అడిగాడు.
“నాకు కొంచెం ఐడియా ఉంది. కాని పిండి కొలది రొట్టె అన్నారు కదా. మనం ఎంత పెట్టగలమో నిర్ణయించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది కదా!”
ఆ మాట శ్రీరామ్ కి బాగా నచ్చింది.”వెరీ గుడ్. నువ్వు నాలాగే ఆలోచిస్తావన్న మాట. నేను అంతే. కొంచెం పెద్ద ఖర్చులకు, బడ్జెట్ ప్రకారమే ముందుకు వెళ్తాను. నా దగ్గర బ్యాంకు లో ఆరు లక్షలకు పైగా ఉంది. ఇది మొత్తం పెళ్లికి బట్టలకు, ఇంట్లో ఫర్నిచర్ కు, హనీమూన్ ఖర్చులు అన్నింటికీ కలిపి. నువ్వే ఆలోచించి డిసైడ్ చెయ్యి” అన్నాడు.
ఆ మాటతో తన కాబోయే భర్త మాటల సూరుడు కాదని, తనకు పెళ్లి చూపుల్లో చెప్పినట్టు తన కాళ్లపై నిలబడేవాడని గ్రహింపు కొచ్చింది. “ఆలోచించి రేపు చెబుతా”అని అప్పటికి సంభాషణ ముగించింది. కాబోయే భర్త వెంట హానీమూన్ మాట వచ్చేసరికి ఆ ఊహలతో రోజు లాగే నిద్ర ఆలస్యమయింది.

మరుసటి రోజు భోజన సమయంలో ఆ విషయం తల్లి తండ్రులిద్దరికి మెల్లిగా చెప్పింది. ఆ విషయం విని సంతోషించినా, “బాగానే ఉంది. కాని కొత్త కాపురానికి ఫర్నిచర్ పెట్టడం మన సంప్రదాయం కదా అమ్మ. అలాగే పెళ్ళైన తరువాత మీ ఇద్దరినీ ఒక వారం స్విట్జర్లాండ్ పంపిద్దామనుకొంటున్నాను. కట్నం కూడా తీసుకోవడం లేదు. అట్లాంటిది మన చేత ఆ మాత్రం ఖర్చు పెట్టించక పొతే ఎలా”అన్నాడు రాజారావు.

“పెళ్ళికి బాగా ఖర్చు చేస్తున్నావు కదా నాన్న. దానికి ఏమి అడ్డు చెప్పటం లేదు కదా. కావాలంటే ఆరు నెలల తరువాత స్విట్జర్లాండ్ ఏదో బహుమతి అని ఒప్పిస్తానులే. ప్రస్తుతానికి తన ఖర్చుతో వెళితే తనకు ఒక తృప్తి. నాకు కూడా. కర్టైన్స్ తప్ప మరేమి కొనిపించనులే”
కూతురు కూడా అల్లుడి తరపు మాట్లాడటం నచ్చింది లలితకు.”పోనిలే ఫర్నిచర్ వరకు మనం ఇచ్చేట్టు మాట్లాడి ఒప్పించు. మాకూ ఆనందంగా ఉంటుంది.”

ఆ రోజే శ్రీరామ్ తో మాట్లాడుతూ డబల్ రాడ్ తో కర్టైన్స్ వేస్తె బాగుంటుంది. ఒక లేయర్ తెల్లటి పలుచని సిల్క్ గుడ్డతో రెండవ లేయర్ డిజైన్ క్లాత్ తో వేయటానికి ఒక లక్ష లోపులో అన్ని కిటికీలకు కర్టైన్స్ వేయొచ్చని చెప్పి వప్పించింది. తెల్లటి పరదా వేసినప్పుడు ప్రైవసీ తో బాటు వెలుగు కూడా వస్తుందని, భార్య ఐడియా ని మెచ్చుకున్నాడు. హనీమూన్ డిస్కషన్ కూడా కావ్య తీసుకు రావడంతో శ్రీరామ్ కేరళ కాని, మారిషస్ కాని అని చెప్పటంతో ఇద్దరు ఒక వారం పాటు మున్నార్, అలెప్పి, హౌస్ బోట్, తేక్కడి, కొచ్చిన్ కేరళ ట్రిప్ కి వెళదామని డిసైడ్ చేసుకున్నారు. శ్రీరామ్ రిజర్వేషన్ చేస్తానంటే, మాకూ తెలిసిన ట్రావెల్స్ తో చేయిద్దాము. నాన్నగారు చెబితే తరువాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు, నువ్వే పే చేద్దువు కాని అని చెప్పటంతో శ్రీరామ్ కూడా ఓకే చెప్పాడు. అదే ఊపులో అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు ఫర్నిచర్ ఇవ్వడం ఆనవాయితి అని తనను ఏమి కొనవద్దని చెప్పింది. తన చెల్లికి తల్లి తండ్రులు ఇచ్చినట్టు గుర్తు ఉండటంతో అభ్యంతరం చెప్పలేదు.

సౌమ్య కూడా ఫోన్ చేసినప్పుడల్లా తన మాటలతో మరింత వేడి ఎక్కించేది. పెళ్లి కుదిరిన తరువాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి తమ గురించి అడుగుతుండే వారు. అదేమిటీ హైదరాబాద్ లో ఉండి, ఒక్క సారి విజయవాడ రాకుండా ఎట్లా వున్నాడు. పెళ్ళికి ముందు తాము ఎలా కలుసుకొనేది, ముద్దులు, కౌగలింతలు, వీడియో షేరింగ్ లు, వాళ్ళ విరహం గురించి పచ్చిగా ఫోన్ లో మాట్లాడుకున్న మాటలు చెబుతుంటే తాను ఏమన్నా మిస్ అవుతున్నానేమో అనే భావన కలిగేది.

మాటల్లో ఒక సారి పరోక్షంగా అడిగింది. “మా ఫ్రెండ్స్ ఆశ్చర్య పోతున్నారు, మనిద్దరం ఇంతవరకు ముద్దు పెట్టు కోలేదంటే.”
“నీకు ఏమైనా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా”అని అడిగాడు
ఆ మాటతో సర్దుకొని, “లేదు. నాకు అలాంటి ఫీలింగ్ ఏమి లేదు”
“మనకింకా నాలుగు దశాబ్దాల పైనే సమయం ఉంది. తొందర ఎందుకు. ఇన్ని రోజులు ఆగాము. ఇంకెంత కొన్ని రోజులు మాత్రమే. ఆ ఎదురు చూడడంలోనే ఉన్నది తీపి. లవ్ యు. అంత వరకు ఇది తీసుకో”అంటూ చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టాడు.

ఆ మాటతో తనలాగే భర్తకు కనీసం పర స్త్రీ స్పర్శ ఎరుగడని స్పష్ట మయ్యింది. ఏదో మిస్ అవుతున్నాను అన్న తన ఆలోచనలన్నీ పక్కన పెట్టింది.

అలా పగలంతా జ్యువలరీ, బట్టల షాపింగ్, సన్నిహితుల పిలుపు కబుర్లతో, రాత్రి తీపి కబుర్లతో, తియ్యటి ఊహలతో గడిచి పోయింది కావ్యకు. రోజులు భారంగా గడిచినా పెళ్లి రోజు రానే వచ్చింది.

అత్యంత వైభవంగా జరిగింది కావ్య శ్రీరామ్ ల పెళ్లి. పలువురు పుర ప్రముఖులతో పాటు, సెలెబ్రెటీలు, రాజకీయ నాయుకులు, ఉన్నత బ్యూరాక్రటిక్ అధికారులు వచ్చారు పెళ్ళికి. శ్రీరామ్ తరపు భందువులందరికి ఆశర్యం. ధనికుల సంభందం అని తెలుసు కాని, శ్రీరామ్ మామ గారికి అంత పరపతి ఉందన్న విషయం ప్రత్యక్షంగా చూడడంతో, ప్రసాద్ రావు దంపతులకు, శ్రీరామ్ కి అంత హడావుడిలో కూడా తమ అబ్బాయిలకు ఉద్యోగం విషయం లో సహాయం చేయాలని అభ్యర్ధనలు. అంత VIP ల మధ్య హడావుడిలో కూడా, వియ్యంకులు తమకు సముచిత గౌరవం, మర్యాదలు చేయడంతో ప్రసాద్ రావు, లలిత చాలా ఆనంద పడ్డారు. పెళ్ళైన తరువాత కావ్యతో కాకినాడకు వెళ్లారు మొగ పెళ్లివారు. కావ్యతో పాటు తోడుగా తమ బంధువుల్లో శ్రీరామ్ ఆర్ధిక స్థితికి తగిన కజిన్, ఆమె భర్తను పంపించారు.

తరువాత రోజు కాకినాడలో సాయంత్రం SRMT ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ జరిగింది. వచ్చిన బంధువులు అందరూ కావ్యను చూసి శ్రీరామ్ కి తగ్గ జోడి అని చాలా మెచ్చుకొన్నారు. ఫంక్షన్ అయిన తరువాత బంధువులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మూడు గదులు అపార్ట్మెంట్ కావడంతో శ్రీరామ్ చెల్లి, భర్త కాకినాడ వాళ్ళ చుట్టాలింట్లో ఉన్నారు. ఆ రాత్రి తమ బెడ్ రూమ్ లో ప్రసాద రావు దంపుతులు, రెండో బెడ్ రూమ్ లో కావ్యకు తోడుగా వచ్చిన వారికి ఇచ్చి, మూడో గదిలో కావ్యకు పడక ఏర్పాటు చేశారు. హాల్లో శ్రీరామ్ పడుకొన్నాడు. గదిలోకి వెళ్లి భార్యతో మాట్లాడదామని ఉన్న, పొరపాటున ఎవరైనా లేస్తే బాగుండదని మొహమాటంతో ఆగిపోయాడు. రాత్రి పన్నెండు దాటినా నిద్ర రాలేదు కావ్యకు.

175761cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *