ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 4

Posted on

అలా అని అవసరం అయితే సహాయం తీసుకోవడంలో తప్పులేదనుకుంటాను. మనకి తెలిసినవారు కష్టాల్లో ఉన్నారంటే మనము సహాయం చేస్తాము కదా, అలాగ. మీరు చెప్పినట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడం నాకూ ఇష్టం. నాకున్న చదువుతో వీలనయినంత సహాయం చేయగలను. నాకు డబ్బు కన్నా వ్యక్తిత్వం ప్రధానం. మీ సంస్కారం నాకు, పేరెంట్స్ కి బాగా నచ్చింది. నేను ఇబ్బంది పడతానని అనుకోవటం లేదు, ఏమంటారు?”

ఆమె అలా డైరెక్ట్ గా అడిగేసరికి వెంటనే ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండి పోయాడు.
“ఇప్పుడే చెప్పాలని లేదు. మీకు ఏమైనా ప్రశ్నలుంటే ఫోన్ చేసి అడగండి. కానీ బాగా ఆలోచించు కొని చెప్పండి.”అంది అతనికి ఉపశమనం ఇస్తూ.
“థాంక్స్ అండీ. ఈ రోజే ఏ విషయం చెప్తా అన్నాడు.”

కావ్యతో మాట్లాడిన తరువాత చాలా హాయిగా, విశ్రాంతిగా అనిపించింది. మళ్ళా కాఫీ పెట్టుకుని తాగుతూ ఆలోచిస్తూ ఉంటె తన ఆలోచనలో మంచితనం ఉన్నా, డబ్బున్న అమ్మాయిల మీద తనకి ఒక స్థిర అభిప్రాయం, ప్రెజుడిస్ ఉండటం కరెక్ట్ కాదని అనుకొన్నాడు. తనకి ఉన్నట్టుగానే ఆ అమ్మాయికి సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన ఎందుకు ఉండకూడదు? కనీసం తను అడగాల్సింది కదా, ఏమయ్యింది తన అనలిటికల్ థింకింగ్ కి అని మధన పడ్డాడు. ఆలోచించగా కావ్య అన్ని విధాలా మంచి భార్య అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ ఫోన్ మోగింది. చూస్తే నాన్న దగ్గరనుంచి. తండ్రులతో పెళ్లి చూపుల దగ్గర నుంచి ఇంతవరకు జరిగినదంతా చెప్పాడు. బాగా మాట్లాడుకొని చివరికి అందరూ సంభందం ఖాయం చేసుకోవాలనుకున్నారు. ప్రసాద్ రావు దంపతులకు కాబోయే కోడలి మీద చాలా మంచి అభిప్రాయం కలిగింది.

**********************

ఈ లోపుల అక్కడ కావ్య తల్లి తండ్రులకు తమ సంభాషణ చెప్పింది. తమ పెంపకాన్ని, కూతురి మీద తమకున్న అపారమైన నమ్మకాన్నీ, మనసులోనే దాచుకుంటూ,”బాగా చెప్పవమ్మా”అని అభినందించాడు.

లంచ్ కి కూర్చోబోతుండగా కావ్య ఫోన్ మోగింది. శ్రీరామ్ దగ్గరనుంచి కావడంతో ముక్కు మీద వేలు పెట్టి నిశ్శబ్దం అన్నట్టు సైగ చేసి, “చెప్పండి శ్రీరామ్”, అంది.

“బాగా ఆలోచించి చెబుతున్నానండి. నా ఆలోచనలో కొంచెం లోపం ఉంది. మీరు ధైర్యంగా చెప్పక పొతే మిమ్మల్ని మిస్ అయ్యే వాణ్ని. నిన్నే చెప్పానుగా, మీకు వంక పెట్టటానికి ఏమి లేదు అని. మీరంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. మా పేరెంట్స్ కి కూడా మీరు బాగా నచ్చారు. మీకు, మీ పేరెంట్స్ కి కూడా ఇష్టమయితే, అంకుల్ కి వీలయినప్పుడు నాన్న గారితో మాట్లాడమనండి.”

“అలాగే చెబుతానండి”, అంది ఆనందంగా.
“థాంక్ యు అండ్ కంగ్రాట్స్ టు యు. మీ కేమన్న నా గురించి తెలుసు కోవాలనుకుంటే నాకు ఫోన్ చెయ్యండి. ఉంటాను.”
“కంగ్రాట్యులేషన్స్. మీరు కూడా. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. గుడ్ డే. బై “అంటూ కాల్ కట్ చేసింది.

తల్లి తండ్రులు తన మాటలు వింటున్నారని కొంచెం సిగ్గు ముంచు కొచ్చింది. కూతురి ముఖం లోని వెలుగు చూసి విషయం అర్ధం అయ్యింది. అబ్బాయి ఒప్పుకోవడంతో తల మీదనుంచి పెద్ద బరువు దించినట్టయింది రాజారావుకి.

“సీతా! ముందు ఆ పరమాన్నం తినిపించవే అందరికి”, అంది జానకి ఆనందంగా.

కళ్యాణ మొచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు. మంచి రోజులు దొరకడంతో రెండు వారాల్లో తాంబూలాలు, నెలన్నరలో పెళ్లి నిర్ణయించుకున్నారు. కట్న కానుకలు ఏమి అడగలేదు, కొడుకు ముందే చెప్పడం వల్ల. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తరువాత రెండు రోజుల వరకు శ్రీరామ్ కాల్ చేయకపోతే, తనే కాల్ చేసింది. మెల్లిగా రోజు కాల్ చేసే రొటీన్ లో పడ్డారు. అలాగే శ్రీరామ్ తనని ఇంకా మీరు అని పిలుస్తుంటే రెండు మూడు సార్లు వారించి ఏక వచనం లోకి మార్పించింది. తన కాబోయే భర్త మీద మెల్లిగా మంచి అవగాహన రాసాగింది.

నోవొటెల్ హోటల్ లో దగ్గర బంధువులను పిలిచి ఎంగేజిమెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. అది చూసి ప్రసాద్ రావు దంపతులు, బంధువులు బాగా ఆనందించారు. శ్రీరామ్ కి అన్ని విధాలా సరి అయిన జోడి దొరికిందని అభినందించారు. అంతవరకూ ఫోటో మాత్రమే చూసిన సౌమ్య, బావను చూసి చాలా ఆనందించింది. ” నెల రోజుల్లో పెళ్లి. ఆ తరువాత ఫుల్ ఎంజాయ్. అక్కా నువ్వు చాలా లక్కీ. నిన్ను చూస్తుంటే చాలా అసూయగా ఉంది”అంటూ అక్కను ఏడిపించసాగింది.

డిన్నర్ అయిన తరువాత బంధువులు అందరూ మెల్లిగా జారు కొన్నారు. పెళ్లి వారికి అదే హోటల్ లో బస ఏర్పాటు చేయడంతో అందరూ రూమ్స్ కి వెళ్లారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటామని అక్కడ లాబీలో సోఫాలో రిలాక్స్ అయ్యారు.
కొంచెంసేపు వాళ్ళను మాట్లాడుకోనిచ్చి సౌమ్య కూడా చేరింది అక్కడికి”గుడ్ ఈవెనింగ్ బావా”అంటూ.
“ఏమిటి నువ్వు ఇంకా వెళ్లలేదా”అన్నాడు ఏమి మాట్లాడాలో తెలియక.
“మీ ప్రైవసీ డిస్టర్బ్ చేస్తున్నానా? అక్కతో తప్ప నాతొ మాట్లాడవా? అయితే వెళ్ళిపోతా”అంది కోపం నటిస్తూ.
“అబ్బె అలాంటిదేమి లేదు. కూర్చో. సెమిస్టరు మధ్యలో వచ్చావు. నీ స్టడీస్ డిస్టర్బ్ కాలేదు కదా.”
“చదువు గురించి ఇప్పుడెందుకులే. నాకు నీ విషయాలు తెలియాలి.”
“అయితే అడుగు”అన్నాడు సౌమ్య ఏమి అడగబోతుందో తెలియక.
“దాంతో కొంచెం జాగ్రత్త శ్రీరామ్”అంది కావ్య చెల్లి దూకుడు తెలిసి.
“అబ్బో పెళ్లి కాకుండానే మొగుడ్ని వెనకేసుకు వస్తున్నావు. నువ్వు అటు తిరుగు. నేను బావని కొన్ని అడగాలి”అంటూ శ్రీరామ్ వైపు తిరిగి,”బావా నీవు నిజం చెప్పాలి. నీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్, ఇంతవరకు”

ఊహించని ఆ ప్రశ్న కు షాక్ తిన్నాడు. మొహంలో నవ్వుపోయి సిగ్గుతో ఎర్రగా అయ్యింది. అసలే తెలుపేమో. క్లియర్ గా తెలుస్తోంది. భర్త రియాక్షన్ తో అతని ఇబ్బంది గమనించింది. తనతో కూడా ఫోన్ లో కాబోయే జీవితం గురించి, అపార్ట్మెంట్ కి ఏమి కొనాలో, అభిరుచులు, బంధువులు, పుస్తకాలు, పని గురించి తప్పితే అఫైర్స్ , ప్రేమలు గురించి ఏమి మాట్లాడేవాడు కాదు. తనకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే కాదు, అలాంటి వ్యగ్తిగత విషయాలు వేరే వాళ్లతో సంభాషించే అలవాటు లేదని గ్రహించింది.

“మంచి నీళ్లు కావాలా బావా”అంది వాటర్ బాటిల్ చూపించి ఆట పట్టిస్తూ.
“ఏయ్. బావను ఆట పట్టించింది చాలు. నువ్వు వెళ్లవే”, అంది కావ్య
బావ లాంటి అందమైన తెలివైన మెతక మనిషి అంతవరకూ జీవితంలో ఎవరు ఎదురు పడలేదు సౌమ్యకు. అందుకే అతన్ని ఆటపట్టించడం సరదాగా ఉంది తనకి.
“బావకి మాట్లాటడం రాదా. ప్రతిదానికి నువ్వు అడ్డు పడుతున్నావు. బావ చెప్తే వెళ్ళిపోతా”అంది కవ్విస్తూ.
శ్రీరామ్ కొంచెం తేరుకొని, “ఇంతవరకు ఎవ్వరు లేరు. ఇప్పుడు మీ అక్క ”
“మా అక్కను ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నావుగా. ఇక నుంచి నేనే నీ గర్ల్ ఫ్రెండ్. రాత్రికి ఫోన్ చెయ్యి” అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయింది.
“ఏమనుకోకు. అది ఒక్క అల్లరి మేళం. But she is really fun to hang out with.” అంది కావ్య
“It’s ok. I had friends like that in college and at work but not among relatives. I will start getting used to it now”, నవ్వుతూ అన్నాడు, ఆ సరదాకి ఒక ముగింపు పలుకుతూ

ఎంగేజ్మెంట్ అయిన తరువాత రోజు అందరూ వాళ్ళ ఊళ్లకు వెళ్లిపోయారు. రెండు వైపులా పెద్దవాళ్ళు పెళ్లి పనులు మొదలు పెట్టారు. ఇంట్లో మొదటి పెద్ద శుభకార్యం కావటంతో భారీ ఎత్తున చేయటానికి ఏర్పాట్లు చేయసాగారు. కావ్య, శ్రీరామ్ లు రోజు ఫోన్ లో మాట్లాడు కోసాగారు. మొదట్లో కొంచెం రిజర్వేడ్ గా ఉన్నా మెల్లిగా ఓపెన్ అయ్యాడు. పది, పదిహేను నిముషాలు మాట్లాడే శ్రీరామ్ ను కొన్ని రోజుల్లోనే గంటల్లోకి తీసుకెళ్లింది కావ్య. శ్రీరామ్ ని బాగా గమనించడంతో కావ్యకు అతని మనస్తత్వం పై ఒక పూర్తి అవగాహన వొచ్చింది. అతనితో మాట్లాడిన ప్రతి సారి ఒక కొత్త విషయం తెలిసేది కావ్యకు. అలాగని తను తెలివైన వాడన్న గర్వం ఏ కోశానా లేకుండా, తనని ఒక సమానురాలు లాగ మాట్లాడటంతో అతనిపై ప్రేమ, గౌరవం మరింత పెరిగింది.

175761cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *