మొదట బుజ్జాయిలు – వెనుకే బుజ్జితల్లులు తొంగిచూసి అమ్మలూ – నానమ్మా ……….. ఎక్కడ ఎక్కడ డాడీ – నాన్న ఎక్కడ అని ఆతృత ఉత్సాహం హుషారు సర్ప్రైజ్ తో అడిగారు .
దేవతలు : మీ ప్రియమైన డాడీ – నాన్న …….. ఇక్కడ ఎందుకు ఉంటారు – లండన్ లో ఉంటారు . మీ బుజ్జి హృదయాలు తెలిపాయా ? – మేము మీ గది ముందుకు వచ్చాము కదా మా వలన అలా జరిగి ఉంటుంది .
బుజ్జాయిలు – బుజ్జితల్లులు : వదినమ్మను …….. అమ్మ అని – తమ అమ్మలను ……… పిన్నమ్మా చిన్ని పిన్నమ్మా అని పిలిచి , మీకు అంత సీన్ లేదుకానీ చెప్పండి మా డాడీ – నాన్న ఎక్కడ ? . అయినా మా బుజ్జి హార్ట్స్ కొట్టుకుంటున్నాయని మీకెలా తెలిసింది – దొరికిపోయారులే ………… డాడీ డాడీ నాన్న నాన్న అని ప్రాణం కంటే ఎక్కువగా పిలిచారు .
దొరికిపోయాను – బుజ్జితల్లులు బుజ్జాయిలు tooooooo ఇంటెలిజెంట్ అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ అని అంతే ప్రాణంలా పిలిచాను .
అంతే అంతులేని ఆనందంతో , దేవతలను రెండుగా వేరుచేసేసి డాడీ – నాన్న ……. అంటూ మోకాళ్లపై కూర్చున్న నా గుండెలపైకి చేరిపోయి లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించారు .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ , మిమ్మల్ని చూసేంతవరకూ కూడా నా ప్రాణం ప్రాణంలా లేదు బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……….. ఆఅహ్హ్ ………. అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని పరవశించిపోయాను . గంటలముందే వచ్చాను బుజ్జాయిలూ ………. అదిగో మీ అమ్మ – పిన్నమ్మల వలన ఆలస్యం అయిపోయింది . నా బుజ్జాయిల దగ్గరికి వెళ్ళాలి అని పదే పదే చెప్పినా గిఫ్ట్స్ గిఫ్ట్స్ అని ఆలస్యం చేశారు .
తియ్యనికోపంతో చూస్తున్న దేవతలను చూసి నవ్వుకున్నాను – బుజ్జాయిలు బుజ్జితల్లులు ……… బుజ్జి వేళ్ళతో వార్నింగ్ ఇచ్చారు – మేము మా డాడీ అంతే మధ్యలో ఎవరైనా వచ్చారో ఫసక్ ……….
Yes బుజ్జాయిలూ ……… ఫసక్ అని నవ్వుకున్నాము .
డాడీ ……… గిఫ్ట్స్ ? .
లవ్ టు లవ్ టు ………. అని లేచి వెనుక అంతెత్తువరకూ పేర్చిన గిఫ్ట్స్ చూయించాను .
యాహూ యాహూ ……….. లవ్ యు లవ్ యు soooooooo మచ్ డాడీ – నాన్న అంటూ హోటల్ మొత్తం వినిపించేలా సంతోషంతో కేకలువేసి ముద్దులవర్షం కురిపించారు . పరుగున వెళ్లి బుజ్జిచేతులను విశాలంగా చాపి మా డాడీ తెచ్చిన గిఫ్ట్స్ అని చుట్టేసి మురిసిపోతున్నారు .
ఒక్కసారిగా సైలెంట్ అయ్యి దేవతల వైపుకు తిరిగారు . నానమ్మా – అమ్మలూ ……….. ఎన్ని అని అడిగారు ప్రతీసారీ లానే ………
దేవతలు బుంగమూతులు పెట్టుకుని ఓన్లీ వన్ అని వేళ్ళతో సైగ చేశారు .
బుజ్జాయిలు – బుజ్జితల్లులు ……….. తెలిసిందా మా డాడీ – నాన్నకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో సో మా మధ్యకు రాకండి అని మళ్ళీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి , లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ – నాన్న అంటూ ముద్దులవర్షం కురిపించి తమ తమ ఎత్తులో ఉన్న ఒక్కొక్క గిఫ్ట్ అందుకుని ఓపెన్ చేసి wow wow టెడ్డీ బేర్స్ అంటూ ప్రాణంలా హత్తుకుని నా చుట్టూ చేరారు . తాతయ్యా తాతయ్యా ………… ఈ గిఫ్ట్స్ అన్నింటినీ జాగ్రత్తగా మన ఇంటికి చేర్చండి పెళ్ళైన తరువాత తీరికగా ఓపెన్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము అని ఆర్డర్ వేశారు .
Dad చేతులుకట్టుకుని వొంగిమరీ అలాగే బుజ్జాయిలూ ………. అని బదులిచ్చి నవ్వుకున్నారు . హోటల్ సిబ్బందికి విషయం తెలపడంతో గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకెళ్లారు . బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ ……… రెండు గంటల్లో మ్యారేజ్ .
బుజ్జాయిలు : అలాగే తాతయ్యా ……… , డాడీ ………. ఇది కొత్త అమ్మ గది ప్రక్కనే మన గది – మీకోసం అమ్మలు బోలెడన్ని కొత్త డ్రెస్ లు , అమ్మలు కాదు మేము మేము సెలెక్ట్ చేసాము రండి అనిచెప్పారు . అమ్మలూ ………. మేము మా డాడీ దగ్గరే స్నానం చేస్తాము రెడీ అవుతాము బై బై …………
లవ్ యు బుజ్జాయిలూ అని అమాంతం ఎత్తుకుని , బుజ్జితల్లులూ ……… కమాన్ అంటూ సైగచేసి ఐదుగురమూ మా గదిలోకి చేరిపోయాము . బెడ్ పై పూర్తిగా కొత్తబట్టలు పరిచి ఉండటం చూసి లవ్ యు వదినమ్మా – వదినలూ ………. కాదు కాదు లవ్ యు బుజ్జాయిలూ …….. అని ముద్దులతో ముంచెత్తాను . వెంటనే డోర్స్ క్లోజ్ చేసేసి సిగ్గుపడుతూ అదీ అదీ ………..
బుజ్జితల్లులు : ఇంతలా సిగ్గుపడుతున్నారు – డోర్స్ క్లోజ్ చేశారు అంటే మా ” మహి అమ్మ ” ………..
అంతే మరింత సిగ్గుపడిపోయాను .
బుజ్జాయిలు : డాడీ ………. మహి అమ్మ కనిపించారా డ్రీమ్ లో ………
అవునవును అని తల ఊపాను .
బుజ్జాయిలు : డ్రా చేసిన చార్ట్ ఎక్కడ ? .
అయ్యో ……….. బ్యాగ్ మీ తాతయ్య దగ్గర ఉండిపోయింది .
పోండి డాడీ అంటూ బుగ్గలపై కొరికారు – నాన్నా …….. అంటూ ఛాతీపై కొట్టారు . మాకు మా ” హిమ అమ్మలా ” ఉంటే చాలు . చెప్పండి ” మహి అమ్మ ” గురించి ………..
తియ్యనైన సిగ్గుతో బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తుతూ సోఫాలో కూర్చున్నాను – బుజ్జితల్లులు మా ఎదురుగా మోకాళ్లపై కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నారు .
నా ఏంజెల్ మహి సౌందర్యం గురించి ఒక్కొక్కటిగా వివరించడం – బుజ్జితల్లులు బుజ్జాయిలు ……….. వదినమ్మ లానే హిమ అమ్మ , హిమ అమ్మ …….. అంటూ పోల్చి చివరికి నమ్మలేరు డాడీ మీరు చెప్పినట్లుగానే ఉన్నారు ” హిమ అమ్మ ” అంత అందంగా ఉన్నారు . పెళ్లికి ముందు ఎలాగో ప్రపోజ్ చేస్తారు కదా అప్పుడు మీకే తెలుస్తుంది డాడీ ………… మహి అమ్మతోపాటు హిమ అమ్మ కూడా ……….
అక్కడితో ఆపేసి , బుజ్జితల్లులూ ………. సమయం లేదు ఫస్ట్ మీరు ఫ్రెష్ అవ్వండి ఆ తరువాత మేము ముగ్గురం కలిసి ఫ్రెష్ అవుతాము .
లవ్ యు నాన్న – డాడీ అంటూ నలుగురూ సంతోషంతో ముద్దులుపెట్టారు . బుజ్జితల్లులిద్దరూ ………. టవల్ – కొత్త డ్రెస్సెస్ అందుకుని చెరొక బాత్రూమ్లోకి వెళ్లారు .
బుజ్జాయిలు : డాడీ డాడీ ………. అమ్మావాళ్లకు – నానమ్మకు తాతయ్యకు – మాకు గిఫ్ట్స్ తీసుకొచ్చారు మరి హిమ అమ్మకు ? .
మీ హిమ అమ్మకు కూడా తీసుకొచ్చాను బుజ్జాయిలూ ……….. , మీ ఇందు అమ్మ దగ్గర ఉంది .
బుజ్జాయిలు : ఇందు అమ్మ అని చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ………..
లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ ………. అని ఆనందబాస్పాలతో చెవులను పట్టుకోవడం చూసి నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : అమ్మతో ఉన్న గిఫ్ట్ తో హిమ అమ్మకు ప్రపోజ్ చెయ్యబోతున్నారన్నమాట లవ్ యు లవ్ యు అని గట్టిగా ముద్దులుపెట్టి , మా హిమ అమ్మకు ప్రపోజ్ అంటే మామూలు విషయం కాదు – పిన్నమ్మలకులా గులాబీ పువ్వు , రింగు సరిపోదు అమూల్యమైనదిగా ఉండాలి మా హిమ అమ్మ అందంలా …………..
Yes yes ……….. మీ కోరిక తీరబోతోంది బుజ్జాయిలూ , మీ అమ్మలూ – నానమ్మ చూసి ఈర్ష్య అసూయలకు లోనయ్యారు .
బుజ్జాయిలు : అయితే పర్ఫెక్ట్ డాడీ అని ముద్దులుపెట్టారు . మరి మా సంధ్య అక్కయ్యకు – బిస్వాస్ అన్నయ్యకు – బామ్మ గారికి ………….
లవ్ యు బుజ్జాయిలూ ……….. నాకు తెలియదు కదా ? .
బుజ్జాయిలు : బాధపడకండి డాడీ ………. ఇంటికి వెళ్ళాక మా గిఫ్ట్స్ ఇస్తాములే ………
లవ్ యు లవ్ యు …….. మా బుజ్జాయిలు బంగారం అని ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసి ముద్దులతో ముంచెత్తి , నేను మహి గురించి – బుజ్జాయిలు హిమ గారి గురించి ఒకేలా మాట్లాడుతూ ఆనందిస్తున్నాము .
అంతలో నాన్న – నాన్న ……….. we are finished అని బుజ్జితల్లులు పట్టు పరికిణీలలో వచ్చి ఎలా ఉన్నాము నాన్న – నాన్న అని చుట్టూ తిరిగి చూయించారు.
బ్యూటిఫుల్ – లవ్లీ ……….. అక్కయ్యాలూ అని బుజ్జాయిలు కిందకుదిగి చెప్పారు .
Yes yes ………. బుజ్జి దేవతల్లా ఉన్నారు బుజ్జితల్లులూ అని బుగ్గలను అందుకోబోయి ఆగిపోయాను .
బుజ్జితల్లులిద్దరూ ………. ప్రాణంలా చుట్టేసి , మా నాన్న – నాన్న ఎలా ఉన్నా మాకు ok త్వరగా త్వరగా ముద్దుతో దిష్టి చుక్కలు పెట్టండి .
లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జితల్లులూ ………. అని ఇద్దరి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .
చిరునవ్వులు చిందించి ఇప్పుడు ఇప్పుడు మరింత బ్యూటిఫుల్ గా ఉంటాము అని పరుగునవెళ్లి అద్దం లో చూసుకుని మురిసి లవ్ యు నాన్న అని పరుగునవచ్చి హత్తుకున్నారు . నాన్న – నాన్న ………. మా చెల్లెళ్లకు స్నానం చేయించి మాకు అప్పగిస్తే మాకంటే బ్యూటిఫుల్ బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేస్తాము .
లవ్ టు లవ్ టు బుజ్జితల్లులూ ……….. , బుజ్జాయిలూ ……… are you ready అనేంతలో ,
సోఫా ఎక్కి నా గుండెలపైకి చేరిపోయారు .
బుజ్జాయిలు : డాడీ – డాడీ ………. మీరు మాకు స్నానం చేయించి 6 నెలలయ్యింది.
అవును బుజ్జాయిలూ ……….. నేను రోజూ స్నానం చేసేటప్పుడు ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని నవ్వుతూ స్నానం చేస్తాను .
బుజ్జాయిలు : మేము కూడా డాడీ అని నా గుండెలపై నుండే సింక్ ఎత్తుపైకి చేరి నాకు పెద్ద బ్రష్ – వాళ్ళు బుజ్జి బ్రష్ లు అందుకుని పేస్ట్ అంటించి బ్రష్ చేసాము . కిందకుదిగి క్షణాలలో బట్టలన్నీ విప్పేసి బుజ్జాయి నవ్వులు నవ్వుతున్నారు .
అమాంతం ఇద్దరినీ ఎత్తుకుని వెచ్చని షవర్ కింద తడిచేలా చేసి కిందకు దించాను . మొదట కురులకు షాంపూ ఆ వెంటనే వొళ్ళంతా సబ్బుతో సున్నితంగా రుద్ది షవర్ కింద స్నానం చేయించాను .
చలికి వణుకుతున్న బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జి టవల్స్ అందుకుని మృదువుగా తుడిచి , బుజ్జితల్లులకు అందించాను .
బుజ్జాయిలు : డాడీ ……… 15 మినిట్స్ అంతే ,
లవ్ యు బుజ్జాయిలూ ……….. అమ్మో అప్పుడే 10 సెకన్స్ అని లోపలిచేరి బట్టలన్నీ విప్పేసి చక చకా స్నానం చేసి టవల్ చుట్టుకుని మరొక టవల్ తో వొళ్ళంతా తుడుచుంటూ పాటలు పాడుకుంటూ వచ్చాను .
నా వాయిస్ విని బుజ్జితల్లులు ………. బుజ్జాయిలను తమ వెనుక దాచెయ్యడం చూసాను .
ఏయ్ బుజ్జిదొంగలూ ……….. నేను చూడకూడదా ? , ఈ ఈ ………. అంటూ ఏడుపు నటించాను .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ……… two మినిట్స్ two మినిట్స్ , బుజ్జాయిలకు ఫైనల్ టచ్ ఇవ్వాలి కళ్ళుమూసుకోండి .
అలా చెప్పండి అని వెనక్కుతిరిగి 120 119 118 ……….. కౌంట్ చేస్తున్నాను .
బుజ్జితల్లులు : డాడీ ……… స్లో గా అని నవ్వుకోవడం వినిపించింది .
నా వల్ల కాక మరింత ఫాస్ట్ గా కౌంట్ చేసాను . 5 4 3 2 1 అంటూ కళ్ళుమూసుకునే బుజ్జితల్లులవైపుకు తిరిగాను . కళ్ళుతెరిచి చూస్తే బుజ్జితల్లులు మాత్రమే చిరునవ్వులు చిందిస్తున్నారు .
డాడీ డాడీ …….. అంటూ నా వెనుక అని సైగచేశారు .
భౌ భౌ ……… అని బుజ్జాయిలు ,
అమ్మో ……… అంటూ వెనక్కు తిరిగిచూస్తే బార్బీ డ్రెస్ లలో బెడ్ పై బుజ్జి నవ్వులతో గెంతులేస్తున్నారు . స్నిగ్ధ బుజ్జి పెదాలపై స్వీట్ లిప్స్టిక్ ఉండటం చూసి సూపర్ అంటూ ఇద్దరినీ హత్తుకుని ముద్దులుపెట్టాను . బుజ్జితల్లులూ ……… భలేగా రెడీ చేశారు తొందరగా నా డ్రెస్ కూడా సెలెక్ట్ చేస్తే బోలెడన్ని సెల్ఫీలు తీసుకోవాలి నలుగురు బుజ్జి ఏంజెల్స్ తో ……….
బుజ్జాయిలు : మేము మేము అంటూ బెడ్ పై ఉన్న డ్రెస్ లన్నింటినీ స్కాన్ చేస్తున్నారు .
జాహ్నవి ఒకవైపు – వైష్ణవి ఒకవైపు ……… 1 2 3 ……. 6 7 8 నాన్న నాన్న 8 ప్యాక్స్ అని వీణలు మీటినట్లుగా స్పృశించారు .
బుజ్జితల్లులూ ………. గిలిగింతలు అని మెలికలు తిరిగిపోయి , సిగ్గుపడుతూ బెడ్ కు మరొకవైపు చేరుకున్నాను .
బుజ్జాయిలు : ఈ డ్రెస్ – వాచ్ – బెల్ట్ – షూస్ అని అందించి అటువైపుకు తిరిగారు .
తియ్యదనంతో నవ్వుకుని నిమిషాల్లో వేసుకుని , మొబైల్ పర్స్ హ్
జేబులో పెట్టుకుని బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ………..
హ్యాండ్సమ్ డాడీ – నాన్న అంటూ నా గుండెలపైకి చేరిపోయారు .
లవ్ యు అంటూ ముద్దులతో సెల్ఫీలు తీసుకుని , టైం అవుతోంది వెళదాము అని బుజ్జాయిలను ఎత్తుకున్నాను . బుజ్జితల్లులూ ………. 8 ప్యాక్స్ అని మీ అమ్మలు – నానమ్మకు చెప్పకండి అని ఎయిర్పోర్ట్ లో జరిగినది వివరించాను .
నలుగురు : అయితే మేమే లక్కీ అన్నమాట , అలాగే నాన్న అంటూ సంతోషంతో బయటకువచ్చాము .
అప్పటికే వదినమ్మ గిఫ్ట్ తో – వదినలు – అమ్మ ………. దివి నుండి దిగివచ్చిన దేవతల్లా రెడీ అయ్యి మాకోసం ఎదురుచూస్తుండటం చూసి ఆనందించాము .
దేవతలు నలుగురూ పట్టుచీరలలో నేను ప్రేమతో తెచ్చిన జ్యూవెలరీ వేసుకుని ఉండటం చూసి లవ్ యు చెప్పి పరవశించిపోయాను .
బుజ్జితల్లులు : నానమ్మా – అమ్మలూ ……… మీరే పెళ్లికూతుళ్ళల్లా రెడీ అయితే ఇక మా హిమ అమ్మ ఎలా ఉంటారో , నాన్న – డాడీ …….. గిఫ్ట్ తో రెడీగా ఉండండి లోపల situation చూసివస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు . హిమ అమ్మా హిమ అమ్మా ………. అంటూ లోపలికి పరుగుతీశారు .
Dad : జాగ్రత్త బుజ్జాయిలూ …….. అని నా బ్యాగు అందించారు . మహేష్ ……. గిఫ్ట్స్ ఉన్నట్లుగా ఉన్నాయి ఎవరికోసం ? .
అంతలో అన్నయ్యలు నలుగురూ తమ తమ రూమ్స్ నుండి బయటకువచ్చారు . Dad చెప్పినట్లుగానే ఇంకా మత్తులోనే ఉన్నారు .
అన్నయ్యలూ ………. అంటూ వెళ్లి ఎలా ఉన్నారు అని పలకరించాను . నన్ను పట్టించుకోకుండా అడుగులువేశారు . అదేమీ నేను పట్టించుకోకుండా చిన్నన్నయ్య దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ అన్నయ్యా ……… అని చేతిని చాపాను .
చిన్నన్నయ్య : ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నందుకా ………. , నన్ను మరింత బాధపెట్టడానికే అడుగుతున్నావు కదరా ………. , నీకు – నాన్నకు మేమంటే లోకువ అయ్యాము . పెళ్లిచేసి ఇంట్లో కట్టిపడేయాలని అనుకుంటున్నారేమో ……….. నా అన్నయ్యలే నాకు ఆదర్శం నా లైఫ్ నా ఇష్టం – మా జీవితంలో ఎంజాయ్ తప్ప మరొకటి లేదు అని మత్తులో తుళ్ళిపడి పడిపోబోతుంటే పట్టుకున్నాను . రేయ్ నన్ను పెట్టుకోకు నాకేమైనా ఎక్కువ అయ్యింది అనుకున్నావా నేను స్టడీ అంటూ మళ్లీ మళ్లీ అలాగే పడబోతున్నాడు .
రెండవ అన్నయ్య : తమ్ముడూ ……… నేనున్నాను కదా నన్ను పట్టుకో , నాకూ అలానే ఉంది – ఈ పెళ్లి ఎవడు కనిపెట్టాడో ఏమో ముహూర్తం ఒకటి తమ్ముడూ ……… తొందరగా మూడు ముళ్ళు వేసేయ్ తరువాత సంగతి తరువాత గోవా బార్స్ మనకోసం ఎదురుచూస్తున్నాయి – గోవా లో పెళ్లి సెట్ చేసి ఇదొక్క మంచిపనిచేశాడు డాడీ అంటూ నవ్వుకున్నారు .
నలుగురి నుండీ గుప్పుమంటున్న మందువాసన – అయినా అన్నయ్యలంటే నాకు ఇష్టమే , పెద్దన్నయ్య దగ్గరకువెళ్లి అన్నయ్యలూ ………. మీకోసం ప్రేమతో గిఫ్ట్స్ తీసుకొచ్చాను .
పెద్దన్నయ్య : తమ్ముడూ ……… లండన్ మందే కదా ఇవ్వు పెళ్లిలోనే తాగుతూ ఎంజాయ్ చేద్దాము , తొందరగా ఇవ్వు – ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి అని ఓపెన్ చేసి చూస్తే rolex వాచస్ ………. , రేయ్ తమ్ముళ్లూ ……… మొబైల్ యుగంలో కూడా మన వేస్ట్ తమ్ముడు మనకోసం ఏమితీసుకొచ్చాడో చూడండి – ఇప్పుడు ఎవడైనా వాచ్ కట్టుకుంటున్నాడా అని హేళనగా నవ్వుకుంటున్నారు .
అమ్మా నాన్న కోపంతో ముందుకు రాబోతే , చేతి సైగలతో ఆపాను .
పెద్దన్నయ్య : ఏంటి తమ్ముడూ ………. వీటి బదులు చిన్న మందు బాటిల్ తెచ్చినా ఆనందించేవాళ్ళము – ముష్టి వాచ్ లు గిఫ్ట్ ఇచ్చి 10 రోజుల్లో మన మొత్తం సామ్రాజ్యానికి అధినేతవు అయిపోతున్నావు – ఇప్పుడు నాన్నను అడుక్కున్నట్లు అప్పుడు నిన్ను నిన్ను అడుక్కోవాలి అలాంటి బ్రతుకు అయిపోయింది . నువ్వంటే మాకు చిన్నప్పటి నుండీ అసహ్యం – అసలు నువ్వు ఎవరో …………
Dad : గోవర్ధన్ ………. అని కోపంతో కేకెయ్యడంతో ,
అయ్యో అయ్యో డాడీ డాడీ …….. అంటూ భయం నటించి తమ్ముళ్లూ ఫంక్షన్ హాల్ ఎటువైపు చెత్త గిఫ్ట్స్ అంటూ నెలపైకి విసిరికొట్టి పైకి వెళ్లిపోయారు .
వదినమ్మ – వదినలు ………. కన్నీళ్ళతో కిందపడి పగిలిపోయిన గిఫ్ట్స్ ను అందుకుని తమ తమ హ్యాండ్ బ్యాగులలో పెట్టుకుని , నన్ను హత్తుకున్నారు .
డాడీ డాడీ – నాన్న నాన్న ………. అంటూ సంతోషంతో కేకలువేస్తూ నలుగురూ బయటకు రావడం చూసి , అందరమూ కన్నీళ్లను తుడుచుకుని బాధను లోలోపలే దాచేసుకుని పైకి మాత్రం నవ్వుతూ , బుజ్జాయిలూ ………. అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .
నా హృదయస్పందనను పసిగట్టి , డాడీ ……… ఈ గ్యాప్ లో ఏమో జరిగింది – మీ అన్నయ్యలు వచ్చారుకదూ ………..
Dad : మీ నాన్నలు ……… మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్స్ విసిరేశారు అందుకే ……….
బుజ్జాయిలు : తాతయ్యా ……… మా డాడీ ఒక్కరే , వాళ్ళను ఎప్పుడూ మేము అలా అనుకోలేదు పిలవలేదు , డాడీ ……… మిమ్మల్ని బాధపెట్టినవాళ్లను ఊరికే వదిలేశారా అని కోపంతో ఊగిపోతున్నారు .
బాధను దిగమింగుకుని , ఎంతైనా నా ప్రియమైన అన్నయ్యలు వాళ్లంటే నాకు ఎప్పుడూ ఇష్టమే ……….
బుజ్జాయిలు : కోపంతో ఊగిపోతూనే , వాళ్ళు అలా ఎప్పుడూ అనుకోలేదు డాడీ , మిమ్మల్ని ఎప్పుడూ తక్కువచేసి చూస్తారు – వాళ్ళు నలుగురూ కలిసిపోయి మిమ్మల్ని తమ్ముడిగా కాదు బంధువులానైనా చూడనేలేదు .
బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ………. ఈ సంతోషమైన సమయంలో ఇవన్నీ ఎందుకు , అందరిలో ఉత్సాహం తీసుకురావాలని …….. మీ హిమ అమ్మకు ప్రపోజ్ చెయ్యడానికి ఈ డాడీకి సహాయం చేస్తారా లేదా చెప్పండి .
బుజ్జితల్లులు : లోపల మొత్తం సెట్ చేసేసాము డాడీ , హిమ అమ్మ సర్ప్రైజ్ అయిపోయాలి – మాకు తెలిసి మా డాడీని చూసి ఫ్లాట్ అయిపోతారేమో ……….
దేవతల పెదాలపై చిన్నగా చిరునవ్వులు పూయడంతో సంతోషించి , వదినమ్మా ………. జ్యూవెలరీ బాగుందని మీరే ఉంచేసుకుంటారా ఏంటి .
వదినమ్మ : తియ్యనికోపంతో నా చేతులకు అందించి గిల్లి తియ్యదనంతో నవ్వుకున్నారు .
బుజ్జాయిలూ ……….. ఫస్ట్ టైం భయం సిగ్గు వేస్తోంది .
మేము ఉన్నాము కదా డాడీ అంటూ నన్ను లాక్కుని లోపలికి నడిపించారు – వెనుకే దేవతలు ఫాలో అయ్యారు – dad ……… పైన ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్లారు .
బుజ్జాయిలు : బామ్మ బామ్మ ………. మా డాడీ మా హీరో అని పరిచయం చేసారు .
బామ్మగారి ఆశీర్వాదం తీసుకున్నాను . చల్లగా ఉండు బాబు అని దీవించడంతో లవ్ యు లవ్ యు బామ్మ అని బుజ్జాయిలు ఆనందించారు .
బుజ్జితల్లులు : డాడీ ……… సంధ్య అక్కయ్య – బిస్వాస్ అన్నయ్య చెప్పాముకదా , హిమ అమ్మ ప్రియమైన చెల్లెలు – తమ్ముడు .
Hi సంధ్య – hi బిస్వాస్ ………. అని చేతులను కలిపాను .
బుజ్జాయిలు : బామ్మా ………. అమ్మను , డాడీకి పరిచయం చేస్తాము . డాడీ …….. అమ్మ లోపల బెడ్రూం లో ఉన్నారు రండి అని లాక్కునివెళ్లారు .
సోఫాలో ……….. పెళ్లికూతురి చీరలో డ్రీమ్ లో నా ఏంజెల్ మహిలానే ట్రాన్స్పరెంట్ చున్నీతో ముఖం కప్పుకుని కూర్చున్నారు .
వైష్ణవి గిఫ్ట్ – జాహ్నవి ఫ్లవర్స్ అందించి ముసిముసినవ్వులతో ముందుకుతోసారు .
ఎందుకో తెలియదు నా మహి కనిపించినది అనో లేక వదినమ్మ మొదలుకుని రాము వరకూ హిమ గారు తెగ నచ్చేశారు అనో లేక మరెందుకో………… అడుగులు వణుకుతూ పడ్డాయి – జై భజరంగభళీ అని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ all the best చెబుతున్న దేవతలు – బుజ్జాయిల ఆనందాలను ఆస్వాదిస్తూ వెళ్లి పెళ్లికూతురు ముందు మోకాళ్లపై కూర్చుని , తలదించుకుని నా గురించి వివరించాను .
పెళ్లికూతురు : hi మహేష్ గారూ ……… , బుజ్జితల్లులకు – బుజ్జాయిలకు మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను , ఒక్క క్షణం కూడా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేదు .
ఒక్కనిమిషం డాడీ ……… అంటూ బుజ్జాయిలు పెళ్లికూతురు ముసుగును తొలగించి చెరొకవైపు నిలబడ్డారు .
Yes yes హిమగారూ ………. వాళ్లే నా ప్రాణం . I I ……… ఒకసారి బుజ్జాయిలవైపు చూసి అంతులేని ధైర్యంతో ” I LOVE YOUహిమ గారూ ” అని గిఫ్ట్స్ అందించబోయి పెళ్లికూతురిని క్షణకాలంలో చూసి హృదయంలో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా వెనక్కు పడిపోయాను – కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు .
పెళ్లికూతురు కంగారుపడిపోబోతుంటే బుజ్జాయిలు బుగ్గలపై ముద్దులుపెట్టారు , ఇంతలో దేవతలంతా చుట్టూ చేరి వివరిస్తున్నారు .
గిఫ్ట్ – ఫ్లవర్స్ నేలపై ఉంచేసి కన్నీళ్లు దేవతలు – బుజ్జాయిలు చూడకుండా బయటకు నడిచాను .
బుజ్జాయిలు : డాడీ ………. ఫ్లాట్ అయిపోయారా ? చెబితే వినలేదు ………
బయటకు రాగానే మైండ్ బ్లాక్ అయిపోయింది – కన్నీళ్ల ధార ఆగడం లేదు – అన్నయ్యలలా తాగినట్లు అడుగులుపడుతున్నాయి – గోవా లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను కానీ పెళ్ళయ్యేంతవరకూ ఉండాలి ఎలా అని నేరుగా నా గదిలోకి వెళ్లి సింక్ మొత్తం నీటిని వదిలి ముఖాన్ని ముంచేసి బాధపడ్డాను . ఎంత కంట్రోల్ చేసుకున్నా ……… బాధ హృదయం తన్నుకొస్తూనే ఉంది . ఊపిరాడకపోయినా అలానే ఉండిపోయాను ప్రాణం పోతే బాగుండు అనిపించింది – సమయాన్ని మరిచిపోయాను .
డాడీ డాడీ – నాన్న నాన్న ………. అని ప్రాణమైన పిలుపులు వినిపించడంతో ప్రాణం లేచొచ్చినట్లు సడెన్ గా నీటిలోనుండి లేచి ఘాడంగా ఊపిరిపీల్చుకున్నాను. కన్నీళ్ళతో కళ్ళు ఎర్రబడ్డాయి .
అమ్మలూ ………. డాడీ పైకి వెళ్లినట్లున్నారు మేము వెళుతున్నాము అని నలుగురూ ఒక లిఫ్ట్ లో పైకివెళ్లారు .
జాగ్రత్త బుజ్జాయిలూ ……….. వచ్చేస్తున్నాను అని టవల్ తో తుడుచుకుని కారుతున్న కన్నీళ్లను కారినట్లుగా తుడుచుకుని గుండెను రాయిచేసుకుని పైకివెళ్ళాను . నావల్ల వదినమ్మ – బుజ్జాయిలు ఏమాత్రం బాధపడకూదురా అని మనసులో పదే పదే అనుకుంటూ అడుగులువేశాను .