ప్రేమ

Posted on

తను నన్ను మరింత గట్టిగా హత్తుకుంటూ….
“నాకు తెలుసు అజయ్ … నీ మీద నాకా నమ్మకం ఉంది గనుకే నీతో ఇక్కడిదాకా వచ్చాను… కానీ నేను ఆలోచిస్తున్నది అది కాదు…”

“మరి…”

“మనం పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలంటే ఇద్దర్లో ఒకరికైనా మంచి జాబ్ ఉండాలి అవునా…”

“అవును….”

“ కానీ ఈ మధ్య మన చదువు ఎలా సాగుతుంది…. నేనైతే చావుతప్పి కన్ను లోట్టబోయిన చందంగా బోర్డర్ లో పాసయ్యాను…. నీక్కూడా అత్తెసరు మార్కులే వస్తున్నాయి… ఇలా చదివితే మనకు మంచి జాబ్స్ వస్తాయా …?”

“కష్టమే కానీ ప్రయత్నిద్దాం… ఈ సారి బాగా చదువుదాం…”

“ఈ మాట లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం అజయ్.. గుర్తుందా…?”

“కానీ ఈ సారి కచ్చితంగా మాట మీద నిలబడదాం…”

“అజయ్ దీనికి నేనొక పరిష్కారం ఆలోచించాను…”

“ఏంటది…”

“నేను చెప్పినట్టు చేస్తానని ప్రామిస్ చెయ్యి…” అంటూ చెయ్యి చాచింది…

“నువు ఏది చెప్పినా చేస్తాను…ప్రామిస్ ” అంటూ చెయ్యి వేసాను

“అజయ్…మన ఇద్దరిలో ఎవరో ఒకరికి మంచి జాబ్ వచ్చే వరకు మనం కలుసుకోకూడదు….”

తన మాటలు పూర్తవకుండానే “వ్వాట్….” అంటూ అరిచాన్నేను…

“అవును అజయ్… నేను బాగా ఆలోచించాను… మనం ఫ్రెండ్స్ గా ఉన్నన్ని రోజులు బాగా చదివాం… ప్రేమలో దిగాక చదువు మీద ధ్యాస తగ్గింది… అందుకే ఇక మీదట మనం కలుసుకోకుండా చదువు మీదే దృష్టి పెడదాం… కేవలం కలుసుకోవడం మాత్రమే కాదు ఫోన్లో కూడా మాట్లాడుకోవద్దు…”

“దివ్యా… నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా… నిన్ను కలుసుకోకుండా మాట్లాడకుండా ఉండగలనా… పోనీ నువ్వు ఉండగలవా…”

“తప్పదు అజయ్… నా ప్రేమ కోసం నీ బంగారు భవిష్యత్తు పాడు కావడం నాకు ఇష్టం లేదు…”

“నా భవిష్యత్తా…”

“అఫ్కోర్స్ మనిద్దరి భవిష్యత్ అజయ్… కొన్నాళ్ళు దూరంగా ఉందాం… నీకు మంచి జాబ్ దొరికితే నువ్వు నా దగ్గరకు రా… నాకు ముందుగా దొరికితే నేను నీ దగ్గరకు వస్తాను.. ప్లీజ్ అర్థం చేసుకో..”

ఇలా ఒక గంట పైగా నాతో వాదించి మొత్తానికి ఆ రోజు దివ్య నాతో ఒప్పించింది….బతిమాలితే నాకు పరిహారం గా మూడు రోజుల ఊటీ టూర్ ని వారం వరకు పొడిగించింది… ఆ వారం రోజులు ఊటీ అంతా తిరిగాము… రాత్రిళ్ళు వీలైనన్ని ఎక్కువ సార్లు ఎంజాయ్ చేసాము… తిరిగి హైదరాబాద్లో దిగాక ఏర్ పోర్ట్ లో నన్ను గట్టిగా హగ్ చేసుకొని బై చెప్పి వెళ్ళిపోయింది… తను వెళ్తుంటే నేను అక్కడే నిలబడి చూస్తున్నా… కొద్ది దూరం వెళ్ళాక తిరిగి చూసింది…. తన కళ్ళ నిండా నీళ్లు… ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతుంది… తలచుకున్నప్పుడల్లా నా కళ్ళ లోనూ నీళ్లు తిరుగుతాయి…

ఆ రోజు నుండి ఈ మూడేళ్లుగా నేను అహోరాత్రులు కష్టపడి చదివాను… బిటెక్ అవగానే ఎంటెక్ లో చేరాను… క్యాంపస్ ఇంటర్వ్యూలో గూగుల్ వాళ్ళు నన్ను తీసుకున్నారు … కోటిన్నర ప్యాకేజీ… ఈ రోజు జాబ్ లో జాయిన్ అయ్యి దివ్యను కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను…
ఫ్లైట్ దిగే వరకూ దివ్య గురించిన ఆలోచనలే…

ఫ్లైట్ దిగగానే క్యాబ్ బుక్ చేసుకుని సరాసరి దివ్య వాళ్ళింటికి వెళ్ళిపోయా…
డోర్ బెల్ కొట్టాను… బెల్ శబ్దం కన్న గుండె కొట్టుకునే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది నాకు…
కాసేపటికి ఒక అమ్మాయి తలుపు తీసింది… తను దివ్య వాళ్ళ చెల్లెలు… స్కూల్ లో చూసే వాన్ని…

“మీరు… అజయ్ కదా…. “ అంది పోల్చుకుంటూ….

“అవును…”అన్నాన్నేను …

“లోపలికి రండి ….” అంటూ నన్ను పిలిచి… “అమ్మా కాఫీ తీసుకురా…” అంటూ సోఫా చూపించి…”కూర్చోండి” అంది..

నేను.. “దివ్య…?” అని అడుగుతుండగానే…

“ఇప్పుడే వస్తాను … కూర్చోండి..” అంటూ పక్క గదిలోకి వెళ్ళింది…

“ఎవరే వచ్చిందీ…” అంటూ వాళ్ళమ్మ కాఫీ కప్ తో బయటకు వచ్చింది … నేనొక్కడినే ఉండడం చూసి కప్ నాకు అందించి “ఎవరు బాబూ నువ్వూ…” అంది..

కప్ అందుకుంటూ… “ఆంటీ… నా పేరు అజయ్… దివ్యను కలవడం కోసం వచ్చాను…” అన్నాను…

“అయ్యో దివ్య ఇక్కడ లేదుగా అబ్బాయ్… అమెరికాలో ఉంది గా” అంది

“అమెరికానా… అమెరికా ఎందుకు వెళ్ళింది??…” అడిగాను ఆశ్చర్యంగా…

“పెళ్లయ్యాక మూడేళ్లుగా వాళ్లక్కడే ఉంటున్నారుగా బాబూ…” అంది..

ఆ మాట వినగానే “వ్వాట్…” అని అరుస్తూ గబుక్కున పైకి లేచాను… నా చేతిలోని కప్పు జారి పడి ముక్కలైపోయింది… దానిలాగే నా హృదయం కూడా వేయి ముక్కలైంది…. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు… కాళ్ళు చేతులు సన్నగా వణుకుతున్నాయి…
“ఏమైంది బాబూ…” అంటూ ఆవిడ అడుగుతున్నా పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను…
గేట్ తీయబోతుండగా “అజయ్ గారూ ఒక్క నిమిషం…” అంటూ దివ్య వాళ్ళ చెల్లి పరుగెత్తుకు వచ్చింది…
“మీరొస్తే అక్క మీకీ కవర్ ఇవ్వమంది…” అంటూ ఒక కవర్ నా చేతికి ఇచ్చింది…

అది తీసుకొని బయటకు వచ్చి ఆటో ఎక్కాను… ఇంటి అడ్రస్ చెప్పి కళ్ళు మూసుకున్నాను…
దివ్య కు పెళ్ళయిందన్న మాట నాకు జీర్ణం కావడం లేదు…
ఎన్ని కలలు కన్నాను… ఎన్ని రోజులుగా తన కోసం ఎదురుచూస్తున్నాను… తన కోసం ఎంత కష్టపడ్డాను… ఇప్పుడు ఆ కష్టమంతా వృథానేనా… నాతో ఎన్ని మాటలు చెప్పింది… నన్ను ఎంత నమ్మించింది… కలవొద్దు, ఫోన్ చెయ్యొద్దు అని చెప్పి తెలివిగా తప్పించుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది… లేదంటే నేను తన పెళ్లికి అడ్డు వస్తానని అనుకుందా… అందుకే నన్ను డైవర్ట్ చేసిందా… తనకి నా మీద ప్రేమ లేదా… సమాధానం లేని ప్రశ్నలతో నా తల తిరిగిపోతుంది…

ఆటో దిగి ఇంట్లోకి రాగానే అమ్మ ఎదురొచ్చింది…
అమ్మ ఏదో అడుగుతుంది …. మాటలు వినబడుతున్నాయి… కానీ చెవికెక్కడం లేదు… మౌనంగా నా గదికి వెళ్లి బెడ్ మీద పడి కళ్ళు మూసుకున్నాను… దివ్య అలా ఎందుకు చేసింది అన్న ప్రశ్న నా మనసును దహించి వేస్తుంది… ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదు… ఇంతలో అమ్మ వచ్చింది… “ఒరేయ్ ఇదిగో ఈ కవర్ ఆటోలో మర్చిపోయావట… ఆ ఆటో అబ్బాయి తెచ్చిచ్చాడు…” అంటూ ఇచ్చి వెళ్ళింది…

ఆ కవర్ ని చింపి చూసాను… అందులో రెండు మూడు పేపర్లు ఉన్నాయి…
తీసి చదివాను…

“ నా ఆరోప్రాణమయిన అజయ్…

నువు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నువు నేను చెప్పింది సాధించావనే అనుకుంటాను… నువు సాధిస్తావని నాకు తెల్సు అజయ్… నాకోసమైనా నువ్ సాధిస్తావాని తెలుసు… నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు… నీ మీద కూడా నాకు అపారమైన ప్రేమ ఉంది అజయ్… కాకపోతే నేను దాన్ని నీకు సంపూర్ణంగా అందించలేకపోతున్నాను…. దానికి కారణం కూడా “ప్రేమే”….

213021cookie-checkప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *