వశీకరణం

Posted on

‘ఇప్పుడేమంత టైమైపోయిందని. ఇంతకీ ఏం స్పెషల్స్* చేశావు? వంటింట్లోకి చొరవగా వస్తూ అంది మామ్మ.‘అబ్బే, పెద్దగా ఏం చెయ్యలేదు’ నవ్వుతూ చెప్పిన లావణ్య ‘బావా, నువ్వు త్వరగా స్నానం చేసిరా. టిఫిన్* రెడీ’ అనడంతో కారుణ్య బాత్రూంలో దూరాడు. వెంటనే కారుణ్య ‘లావణ్యా, గీజర్* వేసి ఎంతసేపయింది? నీళ్ళు సలసలా మరిగి పోతున్నాయి’ అన్నాడు.‘ఏమో బావా, గుర్తులేదు. పని హడా విడిలో పడి కట్టడం మర్చిపోయాను. అంతగా వేడిగా ఉంటే కాస్త చన్నీళ్ళు కలుపుకో. ఈ మాత్రం దానికి అంతలా అరవాలా?’ చిన్నగా కసురు కుంటూ అంది లావణ్య.‘అదేంటే లావణ్యా! నా మనవణ్ణి అంతలా తీసి పారేస్తున్నావు. అయినా అబ్బాయి స్నానా నికి వెళ్ళేముందే కాస్త వాడికి వేన్నీళ్ళు తీసి పెడితే నీ సొమ్మేం పోయింది’’ అని అంది మామ్మ.‘నువ్వు ఊరుకో మామ్మా. ఇప్పుడు ఇటు వంటివన్నీ అలవాటు చేస్తే రేప్పొద్దున అటు నా పని, ఇటు భర్త పని చెయ్యలేక చాలా ఇబ్బందులు పడాలి’ మామ్మకి టిఫిన్* పెడుతూ నవ్వుతూ అంది లావణ్య.‘సరే తల్లీ, నీ గురించి తెలియక ఏదో అన్నాను. చూడు అబ్బాయి స్నానం అయినట్లుంది. వేడి వేడిగా టిఫిన్* ఇవ్వు’’ అంది మామ్మ.‘అబ్బా మామ్మా, అక్కడ హాట్*కేస్*లో పెట్టాను. అలాగే పక్కన చెట్నీ కూడా ఉంది. బావకి అల వాటే! వడ్డించుకుంటాడు’ నవ్వుతూ చెప్పింది లావణ్య.‘ఏం, మొగుడికి ఆ మాత్రం టిఫిన్* వడ్డిస్తే అరిగిపోతావా, కరిగిపోతావా’ అడిగింది మామ్మ.‘ఏం అరిగిపోను. కరిగిపోను.

మొగుడికి ఇటు వంటి కొత్త అలవాట్లు చెయ్యకూడదు మామ్మా! ఒకసారి అలవాటు చేశామా, పీకకి చుట్టు కుంటుంది’ మెల్లగా అంది లావణ్య ‘ఇది మరీ బావుందే తల్లీ! ఏదో చాదస్తం కొద్దీ చెప్పాను. ఎంతైనా సత్తెకాలపు దాన్నికదా, నాకిన్ని తెలివితేటలు ఎక్కడివి? అవి ఉండి ఉంటే నేనూ మీ తాతని ఓ ఆట పట్టించే దాన్ని. ఏ మాట కామాటే చెప్పాలి, మీ తాతగారు ఏనాడూ ఆయన చేత్తో వడ్డించు కున్న పాపాన పోలేదు. అన్నీ ఎదురు గుండా ఉన్నా, నేను వడ్డిస్తేనే గాని తినేవారు కాదు’ భర్తవంక ముసి ముసిగా చూస్తూ అంది మామ్మ.‘ఇంకా నయం, తాతగారు నిన్ను ముద్దలు కలిపి ఇమ్మన లేదు’ అంది లావణ్య.‘ఆ ముచ్చటా అయ్యింది తల్లీ. ఒక్కొక్క సారి గోరుముద్దలు పెట్టమంటే అవి కూడా తినిపించేదాన్ని. అప్పుడు మీ తాతగారు ఏం చేసేవారో తెలుసా… నా వేలుని కొరికే వారు’ సిగ్గుగా అంది మామ్మ.

‘అమ్మో! తాతయ్యేం తక్కువవారు కాదన్న మాట’ అంటూ లావణ్య అక్కడే ఉన్న తాతయ్య పురుషోత్తం కేసి చూడ్డంతో ఆయన మనసు లోనే గర్వపడుతూ ‘ఏమిటే రాజ్యం చిన్నపిల్లతో నీ వేళాకోళాలు. వెళ్ళి నా స్నానానికి నీళ్ళు సిద్ధం చెయ్యి’ అని అనడంతో ‘చూశావామ్మా, ఇదీ భాగోతం’ అన్నట్లుగా లావణ్యకేసి చూసిన మామ్మ ఆయనకి నీళ్ళ ఏర్పాట్ల కోసం బాత్రూంలోకి వెళ్ళింది.‘లావణ్యా, నేను ఆఫీసుకు బయలుదేరు తున్నాను’ అని కారుణ్య అనడంతో ‘ఓకే బావా’ అని సింపుల్*గా చెప్పిన లావణ్యను చూసి ‘అదేమిటే పిల్లా! భర్త ఆఫీసుకు వెళుతుంటే భార్య ఎదురు రావాలి. అలాగే గేటుదాకా వెళ్ళి సాగనంపాలి. అప్పుడు ఆ మగనికి అంతా శుభమే జరుగుతుంది. అవునా’ అని లావణ్యను అడిగింది.‘చూడు మామ్మా, నువ్వింకా సత్తెకాలంలోనే ఉన్నావు. ఇప్పుడెవరికంత తీరికుందని, ఒకరి కొకరు టాటాలు చెప్పుకోవడానికి. ఆ రోజులు ఏనాడో పోయాయి. భర్త దారి భర్తదే. భార్య దారి భార్యదే’’ అంది లావణ్య.‘‘చూడమ్మాయ్*! నువ్వలా అంటే నేను ఒప్పుకోను. మీ తాతగారు స్కూల్లో పనిజేసి నంత కాలం నేను ఎదురు రాకుండా ఎప్పుడూ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. అలాగే వీధి గేటు వరకు ఆయన్ను సాగనంపందే నా మనసు ఒప్పుకునేది కాదు.

ఈనాటి కుర్ర కారుకు ఇవేమి తెలియవు. సెంటిమెంట్లు అసలే లేవు. చెబితే అర్థం చేసుకోరు సరికదా ‘బోడి చాదస్తం’ అని కొట్టిపారే స్తారు. అవునా!’ అని లావణ్యతో అంది.‘సరే మామ్మా, ఇప్పుడు చెప్పావుగా! ఇంక పాటిస్తాను గాని ముందు నువ్వెళ్ళి స్నానం చెయ్యి. తర్వాత మనిద్దరం కూర్చుని తీరు బడిగా కబుర్లు చెప్పుకోవచ్చు’’ అని లావణ్య అనడంతో ‘సరే’ అన్న మామ్మ స్నానం, పూజ కానిచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఇల్లంతా పరికించి చూసింది.ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని సర్దే విధానాన్నిబట్టి ఆ ఇంటి ఇల్లాలి ఇష్టాలు, అభిరుచులు, మనస్తత్వం ఇట్టే చెప్పొచ్చును. లావణ్య ఇంటిని చూసిన మామ్మకు ‘ఏమిటో, లావణ్యకు ఏ విషయంలోనూ శ్రద్ధ లేదులా ఉంది’ అనుకుంటూ బెడ్రూములో ఉన్న లావణ్య దగ్గరకు వెళ్ళిన మామ్మ బెడ్రూముని చూసి మరింత ఆశ్చర్యపోతూ ‘ఏమిటే మనవ రాలా, కొత్తగా పెళ్ళైనవాళ్ళు ఉండే బెడ్రూమేనా ఇది. చూడు దుప్పటి ఎంతలా మాసిపోయిందో. ఇటువంటి రూముని చూస్తే ఏ మగాడికైనా అసలు మూడ్* వస్తుందా చెప్పు’ ఆమె పక్కనే కూర్చుంటూ అంది మామ్మ.‘ఏంచెయ్యను మామ్మా! నాకు ఇల్లు సర్దడమంటే పరమ చిరాకు. అయినా బావ కూడా ఏమీ అనడు’ చెప్పింది లావణ్య.

‘మగాడు! పాపం వాడేమంటాడు? అసలు బెడ్రూమంటే ఎలాఉండాలి? చూడ్డానికి ఎంతో నీట్*గా, లైట్*కలర్* దుప్పట్లతో మంచం, ఇంకా అందమైన చిన్నచిన్న వాల్* పెయింటింగ్*లు ఇవన్నీఉంటే ఎటువంటి మగవాడికైనా బెడ్రూము వదిలి రావాలని ఉండదు. మరినువ్వో! ఎప్పుడు బెడ్రూములోంచి పారిపోదామా అనిపించేలా ఉంచావు’ అని అన్న మామ్మ వెంటనే బెడ్రూమంతా ఎంతో నీట్*గా సర్ది పరుపుమీద అందమైన లేత గులాబీ రంగు దుప్పటి పరిచి ‘ఇప్పుడెలా ఉంది బెడ్రూము’ అన్నట్లుగా లావణ్య వంక చూసింది.‘థాంక్స్* మామ్మా, చాలా చక్కగా సర్దావు. ఇప్పుడు కారుణ్య ఈ రూము చూస్తే ఇంక సర్వం మరిచిపోతాడు’ అంటూ మామ్మ బుగ్గ మీద చిన్నగా ముద్దుపెట్టిన లావణ్యతో ‘అవునే లావణ్య, నిన్నో విషయం అడుగుతాను. సిగ్గు పడకుండా నిజం చెప్పాలి. సరేనా’ అని అంది మామ్మ.‘ఏ విషయం మామ్మా’ నవ్వుతూ ఆశ్చ ర్యంగా అంది లావణ్య.‘అదే మన కారుణ్య బెడ్రూములో ఎలా ఉంటాడు?’ సడన్*గా అడిగింది మామ్మ.‘పో మామ్మా! నువ్వు మరీనూ! అటువంటి విష యాలు ఎవరైనా చెబుతారా ఏంటి?’ సిగ్గుగా అంది లావణ్య.‘ఎవరి విషయాలో నాకెందుకు. నీ సంగతి చెప్పు’ అంది మామ్మ.‘బాగానే ఉంటాడు’ చెప్పింది లావణ్య,‘బాగానే అంటే’ తిరిగి రెట్టించి అడిగింది మామ్మ.‘బాగానే అంటే బా….గా…నే’ అన్న లావణ్యతో, ‘ఓసి వెర్రిదానా! వాడు నీతో ఎలా ఉంటాడో నువ్వు చెప్పకపోయినా నేను ఊహించగలను’ అంది మామ్మ.‘ఎలా’ భయంగా అంది లావణ్య.‘ఏంలేదు, నా లెక్కప్రకారం ప్రతిరోజూ వాడు నిన్ను బతిమాలుతూ ఉంటాడు, అవునా?’ అంది మామ్మ.‘అలా అని ఏంలేదు.

కానీ నిజం మామ్మా! బావ ఒకటికి రెండుసార్లు అడిగితేనేగాని నేను ఒప్పుకోను’ సిగ్గుగా చెప్పింది లావణ్య.‘ఏం ఎందుకు? బావంటే నీకు ఇష్టం లేదా?’ సూటిగా అడిగింది మామ్మ.‘అమ్మో! బావంటే నాకు పంచప్రాణాలు. అందుకే కదా, ఏరి కోరి పెళ్ళి చేసుకున్నాను’ అంది లావణ్య.‘మరి అటువంటి భర్తను పస్తులు ఎందుకు పెట్టడం, తప్పు కదా?’ నవ్వుతూ అంది మామ్మ.‘ఏమో మామ్మా, నేను ఎందుకలా ఉంటానో నాకే తెలియడం లేదు. పాపం బావ చాలా మంచివాడు. అందుకే నన్ను ఎప్పుడూ బలవంత పెట్టడు’ చెప్పింది లావణ్య.‘ఊరుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్లు విను. అప్పుడు చూడు… మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా, ఎప్పటికీ ఓ అందమైన అను భూతిలా మిగిలిపోతుంది’ అని చెప్పడంతో ‘మామ్మా.. ప్లీజ్* త్వరగా గురోపదేశం చేసి పుణ్యం కట్టుకో. మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం’ నాటక ఫక్కీలో అంది లావణ్య.

‘ఇందులో ప్రత్యేకంగా నేర్పాల్సిందేమీ లేదు. ఒక్కొక్కరిది ఒక్కో పంథా! నా మటుక్కి నేను మీ తాతయ్యను నా చెప్పుచేతల్లో ఉంచడానికి ఓ పద్ధతి పాటించాను’ అంది మామ్మ.‘ఏంటది మామ్మా’ ఎంతో ఉత్సాహంగా అడిగింది లావణ్య.‘‘ఏంలేదు లావణ్యా! నీకు తెలుసుకదా, మీ తాతయ్య కూడా వరసకు నాకు బావే అవు తాడు. అలా అని నేనెప్పుడూ ఆయన్ని చుల కనగా చూడలేదు. భర్తగా ఎప్పుడూ గౌరవించే దాన్ని. ఎందుకంటే మగాడికి ‘నేను మగాణ్ణి. పైగా మొగుణ్ణి’ అన్న ‘ఇగో’ ఉంటుంది. దాన్ని మనం శాటిస్*ఫై చేస్తే చాలు. వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు. భార్య భర్తను గౌరవించాలి. భర్త భార్యను ప్రేమించాలి. అప్పుడే వారి సంసారంలో ‘సరిగమలు’ పలుకుతాయి.

147770cookie-checkవశీకరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *