ఫినిషింగ్ టచ్

Posted on

అబ్బాయికి మూడోస్తే అంతా ఆత్రమే … అమ్మాయికి మూడోస్తే అంతా అల్లకల్లోలమే … సరస సల్లాపాల్లో అల్లకల్లోలం … మిక్సయితే … కాక్ టెయిలే …! మందు కొట్టకుండానే హేంగోవర్ సెన్సేషన్ కలిగింది ధనుష్ కు. అతనో పెద్ద డైలమాలో పడిపోయాడు. అదీ శోభనం రోజు … పందిరిమంచం మధ్య బాసింపట్టు వేసుక్కూచొని, మంచం చుట్టూవున్న మల్లెపూల తోరణాల్లో నుంచి ఒక్కో పువ్వు పీకుతూ ఆలోచిస్తున్నాడు. విరజను చూస్తే మూడొస్తుందా …? మూడొస్తే విరజ గుర్తొస్తుందా …? అన్న డైలమా అతనికి. విరజ గుర్తుకురాగానే చలికాలం ఫైర్ ప్లేస్ ముందు కూచున్న ఫీలింగ్ కలిగింది అతనికి. ఫస్ట్ నైట్ … ఏ.సి. చల్లదనం … అగరొత్తులు … పాలు … పళ్ళు … స్వీట్లు …. ఘుమ ఘుమ వాసనలు చల్లబడే రూమ్ స్ప్రే … పందిరి మంచాన్ని వాటేసుకున్నట్టు పరుచుకున్న సన్నజాజులు … వీటన్నింటికి మించి ఫినిషింగ్ టచ్ లా బందరులడ్డు లాంటి తన విరజ. ధనుష్ కు విరజంటే బోల్డు ప్రేమ …

పెళ్ళి చూపుల్లో ధనుష్ తల్లిదండ్రులు విరజను ఏదో అడగబోయే లోపునే ధనుష్ సిగ్గుపడిపోతూ … “నాకు అమ్మాయి నచ్చిందని’’ చెప్పాడు. కట్నకానుకల గురించి మాట్లాడుతుంటే … “నాకు ఆల్రెడీ అమ్మాయి నచ్చేసింద’ని మరోసారి నొక్కివక్కాణించాడు. ఏ విషయమూ తర్వాత ఉత్తరం రాసి చెబుతామని ధనుష్ తల్లిదండ్రులు చెబుతుంటే వెంటనే ఇంటర్ ఫియరైపోయి ‘ ’మీరు తర్వాతేం చెప్పక్కర్లేదు … ఆల్రెడీ ఈ అమ్మాయి నాకు బోల్డు నచ్చేసిందంతే …’’ అని తెగేసి చెప్పేశాడు. పైగా తల్లిదండ్రులతో సంప్రదించకుండా తనే పురోహితుడ్ని తీసుకువచ్చి పెళ్ళికి మొహూర్తం పెట్టించాడు. అదీ ధనుష్ పెళ్ళికి ముందు ఫ్లాష్ బ్యాక్ సిగ్గుపడుతూ విరజ లోపలి అడుగుపెట్టింది. ధనుష్ విరజవైపు అలానే చూస్తూండిపోయాడు. మెల్లిగా తలుపువేసి బోల్డు పెట్టింది. విరజ మంచం దగ్గరకి వచ్చింది. “అబ్బ … ‘కష్షులా’ వున్నావు’’ అన్నాడు ధనుష్ ఆమె ముఖంవైపు చూస్తూ. “కష్షూనా …? అంటే ఏమిటి …?’’ విరజ మెల్లిగా తలెత్తి అడిగింది. “ఏదో వర్డ్ బావుందని వాడాను … కష్షు అంటే కత్తిలా అన్న అర్థం కావచ్చు … కసక్కులా వున్నావన్న మీనింగూ కావచ్చు. ఇప్పుడు ఆ పదానికి మీనింగూ డిటైల్స్ అంత అవసరమా?’’ అని అడిగాడు ధనుష్. “ఒక్క చిన్న ‘ప్ర’కు, ఇంత పెద్ద ‘జ’నా?’’ అంది విరజ. “ఈ ‘ప్ర, జ’ భాషేంటి?’’ అన్నాడు అర్థం కాక.

“మరేం లేదు … ఇంత చిన్న ప్రశ్నకు అంత పెద్ద జవాబా ..? అని అర్థమన్నమాట’’ అంది విరజ. “ఓహో … అలానా …!’’ అంటూ మెల్లిగా తన చేతిని విరజ నడుం మీదికి పోనిచ్చాడు ధనుష్ … మెత్తగా, బొద్దుగా తగిలింది నడుం మడత “అబ్బ …’’ అన్నాడు నడుంమీద చేయి తీయకుండానే. “ఏంటీ నొప్పెట్టిందా…?’’ అమాయకంగా అడిగిందామె. “ అవును … రక్తం కూడా వచ్చింది .. ఏంటీ కామెడీనా …?’’ అడిగాడు ధనుష్ ఆమెను దగ్గరకు లాక్కుంటూ … విరజ మాట్లాడలేదు … ఈ అనుభవాన్ని అనుభవవేద్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. “నువ్వు నాకెంత నచ్చవో తెలుసా …?’’ అన్నాడు ఆమెను చుట్టేస్తూ ….

“అంత బాగా నచ్చానా …!’’ అడిగింది అతని నడుం చుట్టూ తన చేతులను బిగిస్తూ. “అవును పెళ్ళిచూపుల్లోనే నాకు పిచ్చపిచ్చగా నచ్చావు … అందరూ స్లిమ్ గా వుండాలని అనుకుంటారు కానీ, నాకెందుకో బొద్దుగా వుంటేనే యిష్టం … నీలా …’’ అన్నాడు ధనుష్ చీరకూ, జాకెట్టుకూ మధ్య మెరిసిపోతున్న ఆమె పొట్టమీద సుతారంగా ముద్దుపెట్టుకుంటూ … “అంటే గుండులా గుండ్రంగా వున్నానా …?’’ అడిగింది. “ఊహు … నువ్వు ముద్దుగా, బొద్దుగా, ముద్దబంతి పువ్వులా వున్నావు. అందుకే నిన్ను ఎప్పుడూ చూసినా నాకు మూడేవస్తుంది’’ అన్నాడు ధనుష్. పైన తథాస్తు దేవతలు తథాస్తు అనుకొని వుంటారు …

****

విరజలో అందంవుంది … అణుకువ వుంది … అమాయకత్వం వుంది … ఆరిందాతనమూ వున్నాయి. ముద్దుగా, బొద్దుగా వుందే విరజకు ధనుష్ బోలెడంత నచ్చేసాడు. తనని ప్రేమగా చుట్టుకుపోతూ … అల్లరిగా హత్తుకుపోతూ … తమకంగా తన శరీరంమీద ముద్దుల ముద్రలు వేస్తోన్న ధనుష్ ని చూస్తోంటే ఆమెకు తిలక్ విరహోత్కంఠిత గుర్తొచ్చింది. తనను తానుగా తనకు తానుగా అతని ముందు పరచుకోవాలనుకుంది. నా ఒంటి నిగనిగలవంటి శయ్యను సజ్జితం చేశాను – నాకంటే మిలమిలలవంటి మధువుపాత్రలు నింపాను – త్వరమాణమై ప్రభూ నా తనువూ స్వీయయౌవన భారస తరబడిపోతున్నది …

కిటికీ అవతల హిమస్నాత మాలతీలత నన్ను పలకరింపదు … కిటుకు తెలిసిన పొదలోని గువ్వజంట నన్నూరడింపదు – కందళించే ఈ వలపు ప్రభూగాడాశ్లేష దోహదం లేక క్రమంకసితోద్భాసితం కానేకాదు.

అతడామె భావుకత్వాన్ని గ్రహించలేదు కానీ, ప్రేమలోని వివశాత్వంతో ఆమెను అల్లుకుపోతూనే వున్నాడు. ముద్దుగా బొద్దుగా వుందే విరజలో ప్రతీ అందం … అతడ్ని ఎప్పుడూ టెంప్ట్ చేస్తూనే వుంటుంది. ఆమె శరీరాన్ని స్వేదబిందువులు ఆక్రమించుకున్నాక, ఆమె అనాచ్చాదిత గుండెలమీద తలపెట్టి “విరజా నువ్వెందుకే ఇంతందంగా పుట్టావు …!’’ అనడిగాడు. ఏమో నాకేం తెలుసురా ధనుష్’ అని రిటార్డ్ ఇద్దామని మనసులో అనుకుంది విరజ.

కానీ ఫస్ట్ నైటే తన స్టోన్ విప్పి, విశ్వరూపము చూపిస్తే జీవుడు ఝాడుసుకుంటాడని మానుకుంది. అలా వాళ్ళ మొదటిరాత్రి ముచ్చట పూర్తయిన తర్వాత అతని మూడ్ గంటకు మూడువందల అరవై అయిదు మీటర్ల స్పీడుతో పెరుగెత్తింది పగలూ – రాత్రీ – నో తేడా … సమయం – సందర్భమూ డోంట్ కేర్ … మూడొస్తే చాలు చిన్నపిల్లాడే అయిపోయేవాడు ధనుష్ … “ప్లీజ్ విరజా … మూడొచ్చింది’’ అనేవాడు. ఆఫీసుకి వెళ్ళి గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి “మూడొచ్చిందోచ్’’ అంటూ పరుగెత్తుకొచ్చి ఎవరైనా ఉన్నారేమోనని చూడకుండా విరజను చుట్టేసేవాడు. విరజకూ ధనుష్ దగ్గరవ్వడం యిష్టమే కానీ, ఎప్పుడుపడితే అప్పుడు ఇలా ‘మూడొచ్చిందే …’ అంటూ రావడం వల్ల విరజ ఇబ్బందిలో పడేది. ఫ్రెండ్స్ వున్నారని కూడా చూడడు ..

తను పుట్టింటికి వెళ్తే తను వెళ్ళిన గంటలోగా తన వెనకే వచ్చి మూడొచ్చిందంటాడు. ముసలిబామ్మ ‘అవ్వ … హవ్వ … వ్వ …’ అని బుగ్గలు నొక్కుకుంటుంది. తల్లయితే వెంటనే తండ్రివంక చూసి బుగ్గమీద ఓ పోటుపొడిచి “హు … మీరూ వున్నారు ఎందుకు? ఒక్కసారన్నా అలా మూడొచ్చింది .. అంటూ వచ్చారా …? అవున్లే .. అలా వస్తే … విరజ ఒక్కతే ఎందుకు పుడుతుంది? పక్కింటి మాధవరావుకిమల్లె అయిదుగురు ఆడ పంచపాండవులు పుట్టేవాళ్ళు’ అని అంది. వెంటనే తండ్రి తెగ సిగ్గుపడిపోయేవాడు … ఫ్రెండ్సయితే ‘మూడొచ్చే శ్రీవారున్నారా …?’ అని పలకరించడం మొదలుపెట్టారు. అలా మొగుడి ముద్దుల మూడ్స్ పరాకాష్టకు వెళ్ళిన తర్వాత మొగుడిగారి అతి మూడ్ కు ముక్కుతాడు వేయాలనుకుంది … అప్పుడొచ్చింది ఆ ఆలోచన విరజకు … అంతే … అమ్మాయికి మూడొచ్చింది …! ఇక వాట్ నెక్స్ టే మిగిలింది.యమ సీరియస్ గా ఆఫీసులో పన్జేస్తున్నాడు ధనుష్ … అప్పటికే బాస్ ముండావాడు రెండుగంటల్లో నాలుగు ఫైళ్ళ దుమ్ము దులపాలని వార్న్ ఇష్యూ చేసేశాడు. సరిగ్గా అప్పుడే ఎంటరయ్యింది విరజ. తెల్లటి మైసూర్ సిల్క్ చీరకు రెడ్ కలర్ బోర్డర్ ఎంతో నప్పింది. ఆమె ఒంటికి మరీను … అదే కలర్ బ్లౌజ్ లో మరింత అందంగా మెరిసిపోతోంది … అందరి కళ్ళూ విరజ మీదే … సడెన్ గా తన ముద్దుల భార్య అలా ఆఫీసుకు వచ్చేసరికి షాకయ్యాడు. “విరజ … నువ్వా …!’’ “కాదు … పక్కింటి పంకజాన్ని …’’ అంది. “ఆఫీసులో కామెడీలొద్దు …! ఏంటీ ఇలా వచ్చావ్ …? బాస్ ముండావాడు లోపలున్నాడు’’ మెల్లిగా చెప్పాడు. అంతకన్నా మెల్లిగా అతని చెవిలో గుసగుసలాడింది …

“బాస్ ముండావాడైనా వాడి బాబ్బాబు ముండావాడైనా ఐ డోంట్ కేర్ … నాకు మూడొచ్చింది … ప్లీజ్ … వెంటనే వచ్చేయండొచ్చేయండి’’ అంది విరజ. “ఇప్పుడా …?!’’ “అవునిప్పుడే … ప్లీజ్ …’’ అంది హస్కీగా. తనని సరదాగా ఆటపట్టిస్తుందేమోననుకున్నాడు … కానీ, సీరియస్ గానే అంటోందని అర్థమైంది. ‘అమ్మ విరజ! తన వీక్ పాయింట్ మీద దెబ్బకొట్టింది … ఇంటికి పద నీ పనిజెప్తా’ అనుకున్నాడు మనసులో. అంతే … చెప్పాపెట్టకుండా బయటకు నడిచాడు. నెక్స్ ట్ దే బాస్ తో అక్షింతలు పడ్డం వేరే విషయం.

*****

ధనుష్ ఖర్మగాలి ఓ రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు. విరజ వాళ్లకు టిఫిన్ పెట్టింది. ధనుష్ తండ్రితో ఏదో మాట్లాడుతున్నాడు … సరిగ్గా అప్పుడే “ష్ …’’ అంటూ సైగ చేసి పిల్చింది. అది ధనుష్ కు వినిపిస్తోంది …. ఏమిటన్నట్టు చూశాడు ధనుష్ … దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది … ధనుష్ విరజ దగ్గరకు వెళ్ళాడు … “ఏమిటి విరజా …! టిఫిన్ చేయనీయకుండా …?’’ అతని మాటలు మధ్యలోనే ఆపి… “ఇప్పుడు టిఫిన్ అంత ముఖ్యమంటారా? అవతల మూడ్ తో చస్తున్నాను’’ అంది విరజ.

“మూడా …? ఇప్పుడా …!? సమయం సందర్భం లేదా …. అవతల అమ్మా, నాన్నా ఉన్నారు …’’ “ఏం మా ఇంట్లో అమ్మా, నాన్నా ముందు మీకు మూడొచ్చిందంటే నేను అలానే అన్నానా? అవున్లెండి … అన్నీ చూసేశారుగా … ఇంకా నన్ను కొత్తగా చూడడానికేంవుంది …? మీకు మూడేం వస్తుంది …?’’ అంది ముక్కు చీదుతూ విరజ. బిక్కచచ్చి బిత్తరపోయి … “అబ్బా ,,, నువ్వల అనకు విరజా … నాకు ఎక్కడో గుచ్చుకుంటుంది. రాత్రినుంచీ నీకు మూడ్ రావడం ఇది ఆరోసారి … నావల్ల కాదు’’ నడుం పట్టుకుని అన్నాడు. అదోలా చూసింది విరజ. ఆ చూపుకు జీవుడు ఫ్లాటయి గదిలోకి నడిచాడు …

పెళ్ళాం బుగ్గమీద వేలితో పొడిచి … “చూసారా …? కోడలిపిల్లకు వున్న ఇంగితం నీకు లేదు. నీకెప్పుడైనా మూడ్ వచ్చిందా …? మూడొచ్చిందని ఎప్పుడైనా అన్నావా …? అవున్లే అలా అనివుంటే పంచపాండవులైనా పుట్టేవాళ్ళు …’’ అన్నాడు ధనుష్ తండ్రి భార్యతో ….

*****

అతి దీనంగా భార్యవంక చూసాడు ధనుష్ ….

“ఒసే విరజా నా శరీరం పచ్చి పుండయిందే … సిగ్గుతో చితికి, చచ్చి, బిక్కచచ్చిపోతున్నానే … నీ మూడ్ ని కాశ్మీర్ బోర్డర్ లొ తగలెట్ట … పక్కనే ఫ్రెండ్స్ అని చూడవు, బంధువులున్నారని కూడా ఆలోచించవు … ఆఫీసు టైమింగ్స్ అసలే పట్టించుకోవు … ఇలా ఎప్పుడూ పడితే అప్పుడు మూడ్ అంతే చచ్చూరుకుంటానే …’’ ఆ రాత్రి నాలుగోసారి ఆమెనుంచి విడిపోతూ దీనంగా అన్నాడు ధనుష్ … పొద్దస్తమానం మూడ్ అంటూ మొగుడ్ని పడగ్గదిలోకి లాక్కుపోతూంది. సమయం సందర్భం చూడటంలేదు విరజ. దాంతో చచ్చేచిక్కోచ్చింది ధనుష్ కు.

*****

తెల్లవారుఝామున మొగుడ్ని తట్టిలేపింది … ఉలిక్కిపడి లేచాడు … లేస్తూనే … “మళ్ళీ మూడొచ్చిందా విరజా …?’’ నీరసంగా అడిగాడు ధనుష్. “మూడా … పోయిందే … గాయబ్ … ఇట్స్ గాన్ … ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాను. భార్యాభర్తల మధ్య సమయం, స్థల నిషిద్ధాలు, నియమ నిబంధనలు లేవు. మీకెప్పుడు మూడ్ వచ్చినా ఆ మూడ్ ని నా మూడ్ గా మార్చుకోగలను … కానీ పరిస్థితుల ఆకళింపు చేసుకోవాలి … ఏకాంతం … అది ఎప్పుడైనా ఇష్టమే. అది చెప్పాలనే ఈ సరదా ఫినిషింగ్ టచ్ …’’ అంది.

“నిజ్జమా … యూ ఆర్ కరెక్ట్ … నాకూ తెలిసోచ్చిందే …’’ అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. సరిగ్గా గంట తర్వాత అతని చెవిలో గుసగుసలాడింది విరజ … “ఏవండీ … మళ్ళా మూడ్’’ ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆమెతో సరసాల సమరానికి సిద్ధమయ్యాడు ధనుష్ … భార్యాభార్తల మధ్య ముద్దొచ్చే మూడ్ ఎప్పుడూ ఫ్రెష్ గానే వుంటుంది….!

**************అయిపోయింది*****************

412971cookie-checkఫినిషింగ్ టచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *