“ తాళం తీయండి మేడం, నేను వెళ్ళిపోతాను.’ ఏడుపు నిండిన గొంతుతో చెప్పింది స్వప్న. మేడం తనదగ్గరకు వచ్చేసింది. స్వప్న ఎదురుగుండా నిలబడి రెండుభుజాలపై రెండుచేతులూవేసి, కాస్తవంగి మొహంలో మొహం పెట్టి,

పొదివి పట్టుకొంది. ఆశ్చర్యం నిండిన చూపులతో స్వప్న తన విశాలమైన నేత్రాలను విప్పార్చుకుని మేడం వంకే చూడసాగింది. చలాకీగా మెరుస్తున్న స్వప్న కళ్ళల్లో విజయ తన రూపాన్ని వెతుక్కో సాగింది. అది