ఈ సృష్టిలో అందరికంటే అందమైన ఆడది ఎవరు?” అని అడిగితే, “పక్కోడి పెళ్ళాం.” అన్నాడట ఎవడో. అలాగే కొంతమంది కాంతామణులకి తమ భర్త కంటే, ఎదురింటావిడ భర్త పోటుగాడిలా కనిపిస్తూ ఉంటాడు.

సావంత్ తో ఫోన్ మాట్లాడి అట్నుండి నేరుగా ఇంటికెళ్లాడు. సాంప్రదాయ వ్యాయామం చేస్తున్న గరుడాచారి అంత ఉదయాన్నే పోర్టీకోలోకి సర్రున గగన్ కారు దూసుకు రావడం చూసి వీడికి మళ్లీ మనసు