అసలు కథ – Part 8

Posted on

మోహనను మార్చడానికి వచ్చిన గగన్ స్నేహితులు పది పదిహేను రోజులు ఫాం హౌస్ లోనే ఉండిపోయారు.అవసరానికి మాత్రమే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ ఉండే వారు. గగన్ కూడా మధ్య మధ్య లో ఇంటికెళ్ళి వచ్చాడు. గగన్ లోని మార్పును అహన పసికట్టినా పెద్దగా పట్టించుకోలేదు.

ఈ పదిహేను రోజుల్లో గగన్ స్నేహితులందరూ మోహనను ఓ దారికి తెచ్చారు. కట్టూ బొట్టూ నడత ఆహార్యం మొత్తం మార్చుకొనేలా గగన్ మీద ఆన పెట్టి చిన్న పిల్లలా మారాం చేస్తున్న మోహనను మార్చిపడేసారు. అందరు స్నేహితులూ అరమరుకలు లేకుండా కలిసిపోవడం అందులో ఒకటో రెండో శ్రుతి మీరడాలున్నా పట్టించుకొనేంత పెద్దవి కాకపోవడం తో మోహన కూడా వాళ్ళతో కలిసిపోఇంది.
మోహన చదువు విశయమే పెద్ద తల నొప్పిగా మరింది అందరికీ . . .ఏక సంథాగ్రహిగా అన్నీ పట్టేస్తూ లేని పోని డౌట్లు అడిగేస్తూ అందరినీ కంగారు పెట్టేస్తోంది. గగన్ నవ్వుతూ తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు.
మొత్తానికి ఒక నెల తరువాత మోహనలో బాగా మార్పు వచ్చి వ్యక్తిత్వం బాగా నెమ్మదించింది.
శరీరం ఆరోగ్యంగా తయారయ్యింది. మనసు, శరీరం రెండూ బాగా తేటబడి మరింత అందగా కనపడుతూ హుందాగా మాట్లాడుతూ ఉంది.
గగన్ మాత్రం బావా అనే పిలుస్తోంది.

అలా మొత్తానికి ఒకరోజు స్నేహితుల సహాయంతో మోహనను గుళ్ళో పెళ్ళి చేసేసుకొన్నాడు.
గగన్, మోహన మెడలో తాళి కడుతుంటే మోహన కళ్ళలో కనిపించిన కృతఘ్నతా భావం మిగతా స్నేహితులందరినీ కూడా కళ్ళలో కన్నీళ్ళు తెప్పించాయి.
మోహన గగన్ పాదాలు చుట్టేసుకొనేసింది.మోహన అలా బరస్ట్ కావడంతో గగన్ కంగారు పడిపోయాడు .
గగన్ స్నేహితుల్లో మోహన కు చదువు చెప్పిన ఒకామె మోహనను ఓదార్చింది.

అందరితో సెలవ్ తీసుకొని ఒకరిద్దరు స్నేహితులతో పెళ్ళిబట్టలతోనే నేరుగ ఇంటికెళ్ళారు.

క్లబ్ కని రెడీ అవుతున్న అహన కు ప్రక్కన చక్కనైన చుక్కతో గగన్ అలా పెళ్ళి బట్టలతో ఎదురొచ్చేసరికి మ్రాన్ పడిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకొంటూ ఉంటే ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక చారికి ఫోన్ చేసి సోఫాలో కూలబడిపోయింది.
కట్టలు తెంచుకొన్న ఆవేశంతో పదే పది నిమిషాల్లో ఇంటికొచ్చిన చారి వచ్చీ రాంగానే గగన్ చెంప చెళ్ళుమనేలా ఒక్కటిచ్చుకొన్నాడు.
గగన్ పక్కకి తూలిపడిపోయాడు. అడ్డు వచ్చిన మోహనను అసహ్యంగా చూస్తూ ప్రక్కకు తోసేసి , గగన్ వీపు మీద మరో నాలుగు దెబ్బలేసాడు. గగన్ స్నేహితులు వారించడంతో గట్టిగా ఏడుస్తూ తనూ అహన పక్కలో కూలబడిపోయాడు.

గగన్ మీద చారి అలా చేయిచేసుకొన్నప్పుడు అహన కూడ ఏలాంటి భావం చూపించకుండా కూచొంది.

ఇంత జరుగుతున్నా గగన్ ఒక్క మాట మాటాడలేదు.మోహన మాత్రం ఇంకేం జరుగుతుందో అన్నట్టుగా కంగారుపడిపోతోంది.
చారిలో ఆవేశం చల్లబడ్డాక గభాలున లోపలకెళ్ళి రెండు మూడు సూట్ కేసులలో గగన్ బట్టలు డబ్బూ దస్కం పెట్టుకొని వచ్చి హాల్లో గిరాటేస్తూ. . .ఒరేయ్ తల్లిదండ్రులం మేమున్నామని మరచి పోయి పెళ్ళి చేసుకొని వచ్చిన నీకు నా ఇంట్లో స్థానం లేదు.కొడుకనే వాడు తల్లి దండ్రుల గౌరవాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలి . . .వారి ఆశలను ఆశయాలను అర్థం చేసుకొని ఉండాలి . నీలా నీ స్వార్థాన్ని ఆలోచించుకొనే వాడు బ్రతికినా చచ్చినట్టే లెక్క. అలాంటి వాడికి నా ఇంట్లో స్థానం లేదు.

గగన్ స్నేహితులు కలగజేసుకోవాడానికి ప్రయత్నిస్తే అందరి మీదా పులిలా గర్జించి చెదరగొట్టేసాడు.

గగన్ అక్కడున్న సూట్ కేసులను తీసుకొమ్మని తన స్నేహితులతో చెప్పి కన్నీళ్ళతో అమ్మ వంక జూస్తూ వెనుతిరిగాడు.
అహన దీనంగా చూసిందే కాని ఆపడానికి ప్రయత్నించలేదు..
గగన్ స్నేహితులు కలగజేసుకోవాడానికి ప్రయత్నిస్తే అందరి మీదా పులిలా గర్జించి చెదరగొట్టేసాడు.
గగన్ అక్కడున్న సూట్ కేసులను తీసుకొమ్మని తన స్నేహితులతో చెప్పి కన్నీళ్ళతో అమ్మ వంక జూస్తూ వెనుతిరిగాడు.
అహన దీనంగా చూసిందే కాని ఆపడానికి ప్రయత్నించలేదు.

అట్నుండి నేరుగా మళ్ళీ ఫాం హౌస్ లోనికే వచ్చారు. అయోమయంగా చూస్తున్న సెక్యూరిటీని దగ్గరకు పిలిచి చూడు బాబాయ్ నన్ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు. నేనెలాంటి వాడినో నీకు తెలీదా. .
అయ్యో అదేం మాట బాబూ అలా అంటావు. ఈ చేతుల్తో నిన్ను పెంచాను. . ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇలా చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకోవడం పెద్దయ్య గారికి కోపం తెప్పించి ఉండవచ్చు అంతే . .అన్నీ సర్దుకొంటాయి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. అమ్మాయి ఎంత బెదిరిపోతోందో చూడు. . . మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. మిగతావి నేను చూసుకొంటాను అని గేట్లు బార్లా తెరచి పెట్టి కార్లను లోపలకు పంపాడు.
వాళ్ళ శోభనానికి స్నేహితులు ఏర్పాట్లు చేస్తుంటే అదురు తున్న గుండెలతో ఒకరిప్రక్కన ఒకరు కూచొని బిక్క చూపులు చూస్తున్నారు.
ఈలోగా సెక్యూరిటీ అహనకు ఫోన్ చేసి ఉప్పందించాడు.
ఆ రోజు రాత్రే శోభనం అని తెలిసి కుత కుతా ఉడికిపోయింది అహన . . .అలా అని తను ఇప్పుడు ఏం చేసినా అసలుకే మోసం వస్తుందని తెలిసి గమ్మున ఉండిపోయింది. గరుడాచారి గంభీరంగా మారిపోయాడు. ఆఫీసుకెళ్ళకుండా తాగుతూ కూచొన్నాడు.

83450cookie-checkఅసలు కథ – Part 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *