తెలివైన మూర్ఖుడు – Part 3

Posted on

ఆయన చెప్పిన మార్గం గురించి తెలుసుకొని ఓఫియా సుచేత్ లిద్దరూ నోరెళ్ళబెట్టారు. పురాతన కట్టడాల్లో దేవాలయాల్లో ఉన్న గుర్తులను పరిశీలిస్తే తమను ఎలా చేరుకోవచ్చో తెలిపాడాయన.
మరో రెండు రోజుల్లో మొవ్వాడి అంతర్వాహినిగా ఉన్న ఒకనది దగ్గరికొచ్చి అక్కడున్న ఓ చెట్టు మొదట్లో ఉన్న ఒక వేరును చూపి దీని గుండా మూడు రోజులు ప్రయాణం చేస్తే భూ పైకి చేరుకొంటారని చెప్పి వారికి కావల్సినవన్నీ మూట గట్టి ఇచ్చాడు. ఓఫియ సుచేత్ లిద్దరూ ఆయన దగ్గర వీడ్కోలు తీసుకొని బయలు దేరారు.

చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ఎటువంటీ ఆటంకం లేకుండా సరిగ్గా మూడవ రోజు తెల్లవారు ఝామున బయటొకొచ్చారిద్దరూ. . . తామున్న సిటీకి దగ్గరనే అతవీ ప్రాంతాంలో బయటపడ్డరిద్దరూ. . .వడి వడిగా తామున్న హోటెల్ కు చేరుకొన్నారు.

అప్పటికి సుమారు ఇరవై రోజులనుండీ వీరు కనపడేపోయేసరికి ల్యాన్సీ ఖాసీం అందరూ కంగారు పడుతున్నారు.
చిన్న యాక్సిడెంట్ వల్ల ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోయామని చెప్పి అందరినీ కన్వెన్స్ చేసేసారిద్దరూ. . . రెండు మూడు రోజులు వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇద్దరికీ. . .ఆ రోజు రాత్రి ల్యాన్సీ ని మాట్లాడి. . .

మరునాడుదయాన్నే . . .ఖాసీం ను పంపేసి ల్యాన్సీ భర్త దగ్గరకొచ్చి ఆ విగ్రహ గురించి అడిగాడు.
ఆయన నిరాశగా లేదు మిస్టర్. . .ఎంత డీకోడింగ్ చేసినా ఆ విగ్రహం తాలూకు వివరాలు కనుక్కోలేకపోయానని తెలిపాడు.

సుచేత్ తాను సహాయం చేస్తానని ఆ విగ్రహం డీకోడింగ్ వల్ల దొరికే నిధి గురించి చెప్పి తనకు వాటా అడిగాడు.
ఆయన చిత్రంగా కనుబొమలు ముడేసి కాసేపు ఆలోచించి ఓకె . . .నీ వాటా 25 శాతం ఇస్తానని లీగల్ గా ఎటువంటీ ప్రాబ్లం రాకుండా చూస్తానని మాటిచ్చి తీసుకెళ్లాడు ఆ విగ్రహం దగ్గ్గరకు.

తాము కిందకుపడిన చోట మట్టిగడ్డలూ రాళ్ళూ రప్పలూ పడి ఉన్నాయి. దాన్ని చూసి సుచేత్ నవ్వుకొన్నాడు.
ఆ విగ్రహం కింద నున్న అక్షరాలను గుర్తులను పెద్దయన ఆశీర్వాదం వల్ల ఈజీగానే చదవగలిగాడు. అందులో ఇంతకు మునుపు తాము కిందపడిన చోటులో బిల మార్గానికి కావాల్సిన గుర్తులు సూచనలూ ఉన్నాయి.

అంతే కాకుండా విగ్రహ దాతలు విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంలో పూర్వం ఈ చోటు తాత్రిక సాధనా స్థలంగా రహస్యంగా ఉండేదని ప్రజల కోరిక మేరకు అందరికీ అందుబాటులో వామాచారన్ని ప్రవేశపెట్టినట్లు అందుకు నాగులు సహాయం చేసినట్టు ఆ క్రింది లోకాల వారికి కృతఘ్నతగా ఇచ్చుకొన్న సంపద గురించిన వివరాలున్నాయి.

ఎంతవరకూ అవసరమో అంత వరకే ఈయనకు తెలియజేయాలను కొని . ..సార్ ఇక్కడున్న సమాచారాన్ని బట్టి ఇక్కడ ఓ 70-80 కోట్ల విలువైన సంపద లభించవచ్చు. . .ఏమంటారు. . . ?
ఆయన మరో ఆలోచన లేకుండా చూడు సుచేత్. . మీరు చెప్పినది దొరకాలే గాని 25 కాదు 50 శాతం ఇస్తా. . .ప్రభుత్వానికి ఏం చెప్పాలో నేను చూసుకొంటా. . .మీరు ముందు నిధిని కనుక్కోండి. ఈ దెబ్బతో నేను రెటైర్మెంట్ ఇచ్చేసి విదేశాలకు వెళ్ళిపోతా. . అన్నడు.

సుచేత్ సరే నంటూ మరునాడుదయన్నే కలుస్తానని చెప్పి వచ్చేసాడు.
రాంగానే ల్యాన్సీని కాంటాక్ట్ చేసి ఆయన ఆలోచన మొత్తం చెప్పాడు.

ల్యాన్సీ తో సుచేత్ మాట్లాడినదంతా ఓఫియా విన్నది. . . సుచేత్ నీతో ఓ మాట చెప్పనా. . .
ఆ చెప్పు . . .

నీవు నా కొడుకు వయసున్నవాడివి. . వాడితో పోల్చుకుంటే ఎన్నో రెట్లు ముందంజలో ఉన్నావు.వాడికో దారి చూపావు. . .ఇప్పుడు తీసే నిధి ద్వారా నీకు చాలినంత సంపద వచ్చి పడుతుంది.జీవితాంతం కూచొని తినడానికి ఇదే చివరి ప్రయత్నం కావాలి అని అనుకొంటున్నాను.. .
ముందు డబ్బు చేతికందనీ ఓఫియా. . . అప్పుడు చూద్దాం అన్నాడు సుచేత్ తేలిగ్గా. .

అలా తేలిగ్గా తీసిపారేయకు సుచేత్ . . .ఎందుకంటే ఒక్కసారి డబ్బు రావడం మొదలయితే అది మనల్ని ముంచేత వరకూ వదలిపోదు. అంతగా పతనం చేసేస్తుంది.
ఓఫియా నీతులు చాలించు. . .నేను అతి పేదరికం నుండి వచ్చిన వాడిని. . .ఎలా బ్రతకాలో నీవేం చెప్పనక్ఖర లేదు.

ఇవి నీతులు కాదు సుచేత్ వాస్తవం. .అక్కడ మనం చేతిలో చిల్లిగవ్వలేకున్నా. . .ఎంత సుఖం అనుభవించామో తెలుసుగా. . . ఇక్కడ చాలినంత డబ్బు వచ్చిన తరువాత ఇప్పుడే నిర్ణయించుకోమంటున్నా. . .అంతే. . మీ వాళ్లను తెచ్చిపెట్టుకో నీ అన్న వారందరికీ చేతనయినత సాయం చేసి దగ్గరకు తీసుకో. . .ముందు ముందు అది చాలా పనికొస్తుంది.

ఓఫియా చెప్పింది విని సాలోచనగా తల ఊపి . . .చూడు ఓఫియా. . నీ కొడుకు వయసు వాడిని అని నీవే అంటున్నావు.అలాంటి నాతోనే అక్కడ ఆహా ఓహో అని ఎగెరెగిరి కుమ్మించుకొన్నావు.నాది చాలదన్నట్టు అక్కడ ఇద్దరితో పడుకొని పొర్లాడావు.అదే సుఖమని నీకెలా అనిపిస్తోందో నాకూ కొన్ని కొత్త కోరికలూ ఆలోచనలూ ఉంటాయిగా. . ముందు డబ్బు చేతికందనీ నీవన్నట్టుగా ఏం చేయాలో అప్పుడాలోచిస్తా. . .సరేనా. . .అంటూ సిగరెట్ ముట్టించుకొని బయటకెళ్ళాడు.

ఓఫియా నిట్టూరిస్తూ టీవీ పెట్టుకొని మంచం మీద పడుకొన్నది.
మరునాడుదయాన్నే ల్యాన్సీ భర్తతో కలసి విగ్రహం దగ్గరకెళ్ళి పూర్వీకులు దానంగా పెట్టిన కొంత సొమ్మును సంగ్రహించడాని దారిని ఏర్పాటు చేసాడు.ఆయన అటువంటి వాటిల్లో ఎక్స్ పర్ట్ కనుక చకా చకా పనులు జరిపించి ఛిన్న బిందెలాంటిది బయటికి తీసాడు. వీరు ఊహించినదానికన్నా ఎక్కువ పరిమాణంలో సంపద దొరికింది.

ఆయన ఇచ్చిన మాట ప్రకారం సుచేత్ కోరినట్లుగా ఆల్రెడీ తన దగ్గర ఉన్నది మిగిలినది తన విదేశీ మిత్రుల ద్వారా సుచత్ అకౌంట్ లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి ఎవరికీ అనుమానం రాక మునుపే అక్కడనుండి జాగా ఖాళీ చేయమని చెప్పి తనూ అక్కడ నుండి ఉడాయించేసాడు.
కాని అప్పటికే జరగల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఆయన వెళ్ళిపోగానే ల్యాన్సీకి కబురు చేసాడు.
ఆమె వచ్చీ రాంగానే సుచేత్ ను గట్టిగా కౌగిలించుకొని గట్టిగా అరిచేసింది చిన్న పిల్లలా. . . సుచేతూ నీవు మామూలోడివి కాదు. . .వయసు చిన్నదైపోయింది కాని లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకొని నీ ముక్కు పిండేసే దాన్ని. . . హల్లో ఓఫియా గారూ ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా. . . అంటూ సంతోషంగా గడబిడ చేసేసింది.

సుచేత్ ఆమెను విడిపించుకొని. . .మేడం అలా కూచోండి. . మీరు ఏమనుకోకపోతే మీతో ఓ మాట చెప్పా లనుకొంటున్నాను.
ఓ యస్ చెప్పు
మేడం ఇప్పుడు మీ రెండో భర్త నాకిచ్చిన దాంట్లో పదో పరకో కాకుండా 50%షేర్ కావాలి అదేవిధంగా మీకు మీ మిగతా మాజీ భర్తలతో పనిలేకుండా ఇప్పుడొచ్చేది చాలని నా ఉద్ద్యేశ్యం.

లాగిపెట్టి చెంప మీద కొడదామన్నత ఆవేశమొచ్చింది ల్యాన్సీకి. . .తాను తొందర పడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి. . .సుచేత్ చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళి.. . చూడు సుచేత్ నాకు ఎంత వస్తే నా జీవితానికి చాలో డిసైడ్ చేయాల్సింది నీవు కాదు నేను, నీకు నీవుగా న వద్దకు వచ్చావు. . .వీలయినంత సహాయం చేసావు. ఇప్పుడు సడెన్ గా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు. . .

165381cookie-checkతెలివైన మూర్ఖుడు – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *