తెలివైన మూర్ఖుడు – Part 3

Posted on

ఆయన సుచేత్ హావభావాలతో పనిలేకుండా ఇలా చెప్పుకొంటూ పోయాడు. భూ గ్రహం మొత్తం నాలుగు పొరలుగా మీరు చదివి ఉంటారు.మీరు భూమి ఉపరితలం మీద నివసిస్తూ అదే ప్రపంచమని నమ్ముతూ ఉంటారు. భూమిలోపల కొంత దూరం వరకూ పాములూ చీమలూ ఇంక కొన్ని ప్రాణులూ ఉంటాయని తెల్సుకొని ఉంటారు.అయితే భూమి ఉపరి తలానికి చెందిన ఆ ప్రాణులన్నీ కొంత వరకూ మాత్రమే పరిమితం. . .

కాని భూ పొరలలో మా లాగ ఎన్నో ప్రపంచాలుంటాయని ఊహించలేరు. పూర్వం మీ పురాణాల కాలానికి భూమి పైనున్న వారంతా మాతో సత్సంభందాలు పెట్టుకొన్నవారే. . . కేవలం భూ గర్భనంలో ఉన్న మాతోనే కాదు. భూమికి ఆవల పైనున్న లోకాల వాళ్ళతోనూ సత్సంభందాలు కలిగి ఉన్నవారు. . .మీ మానవులు.కాకపోతే రాను రాను మీ ఉపరితల ప్రాణులలో మార్పు అనేది సహజమైన ప్రక్రియ. . .అందువల్ల ఆ మార్పు పరిశీలన తర్కం వైపు కాకుండా కేవలం ఎలా బ్రతకాలన్నదానిపైనే కేంద్రీకరించడం వల్ల స్వార్థం పెరిగిపోయి మీ మూలాలను మీరు మరిచిపోతున్నారు.

మధ్యకాలంలో మా గురించిన కొంత పరిశీలన జరిగింది.మా సహాయ సహకారాలను తీసుకొని భూ ఉపరితలంపై చాలా అద్భుతాలు చేసిన వారున్నారు. వాటిలో పురాతన కట్టడాలు దేవాలయాలు. . .ఇంకా శాస్త్రాలు.. . .అందుకు కృతఘ్నతగా మా గురించిన వివరాలు శిల్పాల రూపంలో చెక్కి ఉన్నారు. బాగా గమనిస్తే ప్రతీ శిల్పం కూడా మూల విగ్రహం కాస్త ఎత్తుగా పెద్దదిగ ఉండి దాని ప్రక్కన కొన్ని వింత జీవులూ నాగాలూ అర్ద మానవశరీరం కలవారూ. .

.ఇంకా జరిగిన సంఘటనలు తెలిపే విధంగా ఇలా ప్రతీ ఒక్కటీ మీ పురాతనమైన శిల్పాలలో పొందుపరిచి ఉంటారు. అది బహుశా ఇప్పటి తరం వారికి అర్థం కాకపోవచ్చును. ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో కొన్ని ప్రాంతాలలో అర్థం కాని ఎన్నో రంధ్రాలు భూగర్భానికి ఉన్నాయి. దాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా దేవుని పేరుతో మూఢనమ్మకాలను పెంచుకొంటున్నారు భూ ఉపరితలం వారు.

ప్రతీ విగ్రహం కూడ ఒక సందేశాన్ని ఇచ్చేదే. . .ప్రతీ దానికి ఒక శక్తి అంటే ఒక పవర్ ఉంటుంది. దాన్ని సాధించకుండా మీకు మీరే ఏవేవో సృష్టించుకొని అంధ విశ్వాసంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రస్తుతం నీవున్న లోకలో మాతృస్వామిక విధానం బహు భర్తుత్వం ఉంది. అలా అని మగవారు బానిసలు కాదు.

అందరూ సమానమే. . . కాకపోతే పిల్లలను ఉమ్మడిగా పోసిస్తారు. అందువల్ల వయసుకొచ్చిన వారు ఎవరితోనైనా స్వేచ్చగా ఉండే అవకాశం ఉంది. ఆడా మగా అంతే తేడా . . .మిగతావన్నీ చాలా చిన్న విశయాలు.. . అంటూ ఆపాడు.
సుచేత్ నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు.భూమి లోపల ఇంత జరుగుతూ ఉందా. . .? అదీ ఇంత అడ్వాన్స్డ్ గా అని.

ఆయన మళ్ళీ చెబుతూ. . .భూమిపైన గాలివెలుతురు రావడానికి ఏదైతే ఏర్పాట్లున్నాయో భూమిలోపల ఉన్న మాకు కూడా గాలీ వెలుతురూ అన్నింటికీ ఆయా ఏర్పాట్లున్నాయి.ఇప్పటి మీ తరం వారు పాకులాడుతున్నటువంటి మంత్ర తత్ర శాస్త్రాలన్నీ కేవలం డబ్బుకోసమే లేదా ఏదో ఆశించే అంతే కాని ప్రతీ ఒక్కటీ సైన్స్ అని తెలుసుకోవడం లేదు.

సుచేత్ అన్నీ సైన్సేనా. . .యోగాలూ సాధనలూ పూజలూ కర్మలూ వేదాలూ అన్నీ ?
అవును ప్రతీ ఒక్కటీ సైన్సే . . .కాని దాన్ని అర్థం చేసుకొనే స్థాయినుండి భూ ఉపరితలం వారు ఎప్పుడో దాటిపోయారు. పురోగతి అంటూ వెనక్కు ప్రయాణం చేస్తోంది. . .మానవ లోకం. . .అందుకే మిగతా లోకాల సంపర్కం తెగిపోతోంది. ఎక్కడో ఒకచోట మాత్రమే కొంత మంది సాధన ద్వారా మా గురించి అలాగే తమను గురించి తాము తెలుసుకొంటున్నారు. మిగతా అంతా గుల్లలే. . .మభ్య పెట్టి బ్రతుకుతున్న వారే. . .

ఇవన్నీ మీకెలా తెలుసు స్వామీ అన్నాడు. . .సుచేత్
ఇందాకే చెప్పను కదా మీ వారు మాతో మంచి సత్సంభందాలు కలిగిఉండేవారని. . .
మరి మీ తెలుగు భాష . . .?
ఆయన నవ్వి అంతా మన మెదడులో ఉన్నది.. . .తెలుగని నీవనుకొంటున్నావు.నీవే మా భాష మాటాడుతున్నావు. . .అది నీవు గుర్తించే స్థితిలో లేవు. . .

సుచేత్ ఉలిక్కిపడ్డాడు. అంటే. . .
అతని సందేహాన్ని ఆయన అర్థం చేసుకొన్నట్లుగా. . .నాయనా సుచేత్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నీలోని జన్యు నిర్మాణాన్ని పరిశీలించి ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేసాం. . .
ఓఫియాకు. . .

ఆ తనకు కూడా. . .
సుచేత్ ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా సేపు గమ్మునుండిపోయాడు.
మీరిద్దరూ స్పృహ లేని సమయంలో మా ఈ ప్రదేశానికి గల చోటులో భూ ఉపరి తల మార్గం ఉంది . . .అక్కడి నుండే మిమ్మల్ని తీసుకొని వచ్చాము. మీరు కావాలనుకొంటే ఇక్కడే ఉండిపోవచ్చు. . .లేదా మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. . .కానీ మీ ఇద్దరిలో చేసిన మార్పుల వల్ల మీ ప్రవర్థన కొంచెం వేరేగా ఉంటుంది.

ఇక్కడి పద్దతులు అక్కడ వేరేగా ఉంటాయి కాబట్టి మీకు కొన్ని కష్టాలు కలగవచ్చు. . . .ఆలోచించుకో. . .
సుచేత్ మరో ఆలొచన లేకుండా వెళ్ళిపోతాం స్వామీ మాఖర్మన మమ్మల్ని బ్రతుకనీయండి. . .స్వచ్చంగా ఉన్న మీ లోకాన్ని మా కుతంత్రాలతో ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు.మీరనట్టుగా. . .ప్రతీదీ సైన్సే కాబట్టి ఆ స్థాయి కి చేరుకోడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా కృషిఫలితంగా సాధించదానివల్లే నాకు తృప్తి కలుగుతుంది.. . .ఒకవేళ ఎటువంటీ మార్పురాలేదనుకోండి. . .భవిశ్యత్తులో ముందు తరాలు ఎలా బ్రతకాలో తెల్సుకొని జాగ్రత్త పడతాను. . .అంటూ చేతులు జోడించాడు.

ఆయన ఆశీర్వదించి రెండు మూడు రోజుల్లో మొవ్వాడి నీకు దిశా నిర్దేశం చేస్తాడు.ఆపైన నీ ఇష్టం.అంటూ కళ్ళు మూసుకొన్నాడు.
సుచత్ వెనక్కు వచ్చేసాడు. నేరుగా ఓఫియా దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పాడు.
ఆమెలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఆమెకి ఆ వాతావరణం ప్రజలు వాళ్ళ పండుగలూ ఆహారం అంతా నచ్చాయి. అందువల్ల ససేమిరా రానంది.

ఆమె రాకపోతే ఖాసీం నుంచి వచ్చే ఇబ్బందులను గూర్చి చెప్పాడు. . . .
ఏది ఏమైనా తను రానటే రానని మొండికేసింది.
ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె తన మాట పెడచెవిన పెడుతోంది.
ఇలా కాదను కొని మొవ్వాడి సహాయంతో. . .మళ్ళీ పెద్దయన దగ్గరికెళ్ళారు.

అప్పటికే ఆయన విశయాన్ని మొత్తం గ్రహించి ఉన్నాడు. వీరు చెప్పే అవసరం లేకుండా. . .ఓఫియాకు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడకొచ్చే అవకాశం ఇస్తునట్లు చెప్పి అందుకు కావాల్సిన మార్గం గురించి చెప్పాడు.

165381cookie-checkతెలివైన మూర్ఖుడు – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *