తెలివైన మూర్ఖుడు – Part 1

Posted on

మరో రెండు రోజుల్లో కోర్ట్ నుండి నకలు ప్రతి ని తెప్పించుకొని ఆమె దగ్గరకు వెళ్లాడు సుచేత్.
అతడిని సాదరంగా లోపలికి తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ చేసింది.

ఆమెలో మార్పును గమనించి చిన్నగా నవ్వుకొన్నాడు.
20ఏళ్ల క్రితం ఇచ్చిన కోర్ట్ ఆర్డర్ ను నిశితంగా పరిశీలిచి ఓ పాయంటును చూపించాడు. ఆమె కు ఆ పాయంటు అర్థం కాలేదు.

అందులో ఇరుపక్షాల అంగీకారం మేరకు నెలకు గానీ లేదా ఒకే మొత్తం గానీ భరణం క్రింద ఇవ్వడానికి తీసుకొనడానికి అంగీకరించేపక్షంలో కోర్ట్ ద్వారా లావాదేవీలను చేసుకొని విడాకుల అభ్యర్తనను పూర్తి చేసుకోవచ్చు అని ఉంది.

అవును దాని ప్రకారమే కదా వారు నాకు 50లక్షలిచ్చారు.
అక్కడే ఉంది మేడం కిటుకంతా. . .ఇది ఇరవై ఏళ్ళ క్రింద నాటిది . . .దీన్ని మళ్ళీ తిరగదోడితే కేసు క్లోజు కావడానికి మరో రెండు మూడేళ్ళు అవుతుంది.ఆయన పిల్లలు ఇప్పట్లో ఆయన వ్యాపారాలు చూస్తుంటారు.. . కదా . . అంతవరకూ దీని వెనకతిరగడానికి వారికి సమయం ఉండక పోవచ్చు. దానిపై మీడియా భయం ఉండనే ఉంది. కాబట్టి మీరు ఒప్పందం ప్రకారం 50లక్షలివ్వలేదు.ఇస్తామని చెప్పి ఇంత వరకూ జరుపుతూ వచ్చారు. అప్పటి వాల్యూ ప్రకారం ఇప్పటికి పెరుగిన వాల్యూ ప్రకారo కనీసం 50కోట్లు ఇవ్వలని కోర్ట్ నోటీస్, వెనువెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి.

వాడి ఆలోచనకు క్రిమినల్ బ్రెయింకు మనసులోనే జోహర్ అర్పించింది ఆమె.కోర్ట్ నోటీస్ ఇస్తాం సరే. . ఒకవేళ కోర్టులోనే చూసుకొందామని వారూ లాయరును పెట్టుకొనేపక్షంలో గెలుస్తామనే గ్యారంటీ ఏమిటి?అందామె
మనం గెలవం . . .కాని మనల్ని మోసం చేసినట్టుగా సృస్తిస్తున్నాం . . దానికే పోలీస్ కంప్లైంట్. . . నా అంచనా ప్రకారం ఒకటి రెండు నెలల్లో మన దగ్గరికి సెటిల్మెంట్ కు రానే వస్తారు.మీరు ముందు మీ లాయరును పిలిపించి జరగవలసింది చూడండి అంటూ లేచి నిలుచున్నాడు. .

మరో రెండు నెలాలో వీరు చేసిన హంగామా కు సుచేత్ వేసిన ఎత్తు ఖచ్చితంగానే ఫలించింది. వారి దగ్గరకూడా సరైన దాఖలాలు లేకపోవడం పిల్లలంతా తన వ్యాపారాలు చూస్తూ ఉంటం వల్ల చిలికి చిలికి పెద్దదిగా మారక మునుపే ఆయనే ఈ నిర్ణయానికొచ్చినట్లు ల్యాన్సీ మొదటి భర్తే వచ్చాడు సెటిల్మెంట్ కు.

సుచేత్ మధ్యవర్తిగా కరెక్ట్ ఐన డాక్యుమెంటేషను చేయించి 40 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ల్యాన్సీకి అది నమ్మశక్యమే కాలేదు. తానున్న పరిస్థితుల్లో 40కోట్లు మామూలు సంగతేం కాదు. వీడేదో మంత్రం వేసినట్టుగా అంత డబ్బు ఒక్క సారిగా వచ్చేసరికి వాడిని పైకెత్తి తిప్పేయాలన్నంత ఆనందమేసింది. వీడిని వదలకుండా పట్టుకోవాలి అని గట్టిగా నిశ్చయించుకొనేసింది.

165341cookie-checkతెలివైన మూర్ఖుడు – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *