శృంగార స్టోరీ 269

Posted on

ఎవరు వీళ్లంతా లోపలికి వచ్చేసారు అంటూ గదిలోనుండి ఒకడు కోపంతో వచ్చాడు .
కృష్ణవేణి : మావయ్యా ……. వీరు , కృష్ణ అక్కయ్య – కీర్తి – అక్కయ్య ఫ్రెండ్స్ …… – నాన్న చెప్పే ఉంటారుకదా వస్తారని …….
వీళ్లేనా …… సరే సరే మంచిది అంటూ కోపంతో వెనక్కు చూస్తూ చూస్తూ వెళ్ళిపోయాడు .
బుజ్జితల్లి : అత్తయ్యా …… అతడి చూపు సరిగ్గా లేదు , భయమేస్తోంది .
సిస్టర్స్ : అవునవును ఏదో తేడాగా కన్నింగ్ గా కనిపిస్తున్నాడు .
కృష్ణవేణి : అవునుకదా ….. , అతనంటే నాకూ నచ్చదు – మా దూరపు చుట్టం అప్పుడప్పుడూ వస్తూ ఉంటాడు – పెళ్లి కుదిరింది అని నాన్నగారు చెప్పడం ఆలస్యం , పిలవకుండానే వచ్చేశాడు – పెళ్లయ్యాక పంపించేస్తారులే నాన్నగారు ….. , భవనం మొత్తం చూయించి వంట గదిలోకి తీసుకెళ్లారు .

బుజ్జితల్లి : అత్తయ్యా …… అక్కడ మల్లీశ్వరి అంటీ హీరో కూడా ఉన్నారు .
మల్లీశ్వరి గారు సిగ్గుపడ్డారు .
కృష్ణవేణి : అలానే కీర్తీ …… ఇద్దరికి క్యారెజీ పంపిద్దాము అని వంటలన్నింటినీ ఒక్కొక్క బాక్స్ లో ఉంచారు .
దేవత : చెల్లీ …… ఇంత ఫుడ్ దేవుడు కూడా తినలేరు .
కృష్ణవేణి : మన ఇంటి దేవుడే కదా అక్కయ్యా ….. , తింటారులే అని సంతోషంతో నవ్వుకున్నారు .
మల్లీశ్వరి గారు : నేను ఇచ్చేసి వస్తాను …….
బుజ్జితల్లి : నేనూ వస్తాను అంటీ …….
కృష్ణవేణి : ప్చ్ …… , కీర్తీ …… మన దేవుడు అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు , మా బంగారం కదూ ప్లీజ్ ప్లీజ్ …… నాకు తినిపించాలని ఉంది .
బుజ్జితల్లి : sorry అత్తయ్యా …….
కృష్ణవేణి : మా బంగారు కీర్తీ …… నాకు sorry ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం లేదు – లవ్ యు అంటూ ముద్దుపెట్టింది .
బుజ్జితల్లి : లవ్ యు టూ అత్తయ్యా …….
కృష్ణవేణి : మల్లీశ్వరి అక్కయ్యా …… , నాన్నగారే స్వయంగా ఇచ్చేసి వస్తారు అని పిలిచి క్యారెజీ ఇచ్చి , నాన్నగారూ ……. వారు తిన్నాకనే కీర్తీ తినేది కాబట్టి …..
మావయ్య గారు : అర్థమైంది తల్లీ …… వీడియో కాల్ చేస్తాను కదా ……
కృష్ణవేణి : లవ్ యు నాన్నగారూ …… , అక్కయ్యలూ …… నా గదిలోకి వెళదాము రండి అని ఫస్ట్ ఫ్లోర్ గదిలోకివెళ్లారు .
*********

బైక్స్ మాత్రమే పారాడుతున్న ఆ మట్టిరోడ్డులో ఒక కారు అదికూడా నేరుగా మాదగ్గరికే వచ్చి ఆగింది . కారులోనుండి చిరునవ్వులు చిందిస్తూ పెద్దవారు దిగి బాబూ మహేష్ …… సాదరంగా ఇంటికి తీసుకెళ్ళాల్సినది కట్టుబాట్ల వలన తప్పడం లేదు క్షమించండి – ఇంతకూ నేనెవరో చెప్పనేలేదు కదూ …… , పెళ్లికూతురి తండ్రిని …….
అయ్యో అంకుల్ క్షమించండి అంటూ కారుమీదనుండి దిగి చేతులు కలిపాను .
అంకుల్ : ఆ తోట ఎవరిది ? , లోపల భోజన ఏర్పాట్లు చెయ్యండి త్వరగా – కీర్తీ తల్లి మరియు నా బంగారుతల్లి కలిసి క్యారెజీ రెడీ చేసి పంపించారు రా బాబూ తోట లోపలికి …….
తోటమాలి : అయ్యగారూ మీరా …… రండి అంటూ గౌరవిస్తూ లోపలికి పిలుచుకునివెళ్లాడు .
అంకుల్ తోపాటు వచ్చిన ఇద్దరు ….. ఒక చెట్టు నీడలో కూర్చోవడానికి అన్నీ ఏర్పాట్లూ చేశారు .
అంకుల్ : బాబూ ఇద్దరూ కూర్చోండి అంటూ అరటి ఆకు పరిచి అన్నీ వంటలనూ వడ్డించారు .
అంకుల్ – అన్నలూ …… మీరూ కూర్చోండి , లంచ్ టైం అయ్యింది కదా …….
అన్నలు : లేదు లేదు మేము బయట ఉంటాము అని వెళ్లిపోయారు .
అంకుల్ ……. మీరూ కూర్చోండి అని అరటి ఆకు పరిచి వడ్డించాను .
అంకుల్ : మీరు భోజనం చేయడం చూస్తేనేకానీ అక్కడ కీర్తీ – నా కూతురు తినరని కూర్చున్నారు , ముందు వీడియో కాల్ చేస్తాను – కీర్తితల్లీ …… పచ్చని తోటలో మీ అంకుల్ కు నేనే స్వయంగా వడ్డించాను , మీ అంకుల్ …… నాకు వడ్డించారు .
బుజ్జితల్లి : అంకుల్ ఉమ్మా ……. , అన్నీ వంటలనూ అత్తయ్యే స్వయంగా చేశారు ఎలా ఉన్నాయి .
సూపర్ బుజ్జితల్లీ …… , చెల్లెమ్మా …… వంటలు అద్భుతంగా ఉన్నాయి .
కృష్ణవేణి : థాంక్స్ అన్నయ్యా …… , చెల్లెమ్మా …… అని ఆప్యాయంగా పిలిచారు చాలా చాలా సంతోషంగా ఉంది అని బుజ్జితల్లికి ముద్దుపెట్టింది .
బుజ్జితల్లీ …… , తింటున్నాము కదా ….. మీరూ తినండి .
బుజ్జితల్లి : అత్తయ్యా …… ఆకలేస్తోంది .
దేవత : మీ అంకుల్ తింటేనే కానీ ఆకలి వెయ్యలేదన్నమాట ఈ బుజ్జి రాక్షసికి ……
బుజ్జితల్లి : చూడండి అత్తయ్యా …… ఉదయం నుండీ బుజ్జి రాక్షసి అంటోంది మమ్మీ ……..
అందరూ నవ్వుకున్నారు .
కృష్ణవేణి : మీ మమ్మీకి …… బుజ్జి దేవతవూ నువ్వే – బుజ్జి రాక్షసీవీ నువ్వే కదా అంటూ ముద్దుచేస్తూ కింద డైనింగ్ టేబుల్ పై చేరి , అందరికీ వడ్డించింది .
దేవత : చెల్లీ …… మనమంతా ఒక ఫ్యామిలీ – ఒకరికొకరం వడ్డించుకుందాము కూర్చో , అత్తయ్యగారూ కూర్చోండి – అక్కడ మావయ్యగారు బాగా తింటున్నారులే అంటూ కూర్చోబెట్టుకున్నారు .
కృష్ణవేణి ……. టేబుల్ పై ఉన్న బుజ్జితల్లి ముందు కూర్చుని ప్రేమతో తినిపించి తిన్నారు .

అంకుల్ ఇంటికి చేరుకున్నాక , దేవతవాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , చెల్లీ …… ముహూర్తానికి అన్నింటినీ రెడీ చెయ్యాలి ఇక వెళ్ళొస్తాము అని దేవత చెప్పారు .
కృష్ణవేణి : మా కీర్తిని కలవాలంటే ఉదయం వరకూ ఆగాలి అంటూ ప్రేమతో హత్తుకుని ముద్దులుపెడుతూనే ఉన్నారు .
అత్తయ్యగారు అందరికీ సాంప్రదాయబద్ధంగా పట్టుచీర – పసుపు కుంకుమ అందించి సంతోషంతో పంపించారు .
బుజ్జితల్లి : మా అత్తయ్య కోసం ఉదయం ఆశతో ఎదురుచూస్తుంటాము అని ముద్దులుపెట్టి బయలుదేరారు .
కృష్ణవేణి ఏకంగా రోడ్డుమీదకువచ్చి కనుచూపుమేరవరకూ టాటా చెప్పి ఎక్కువ సంతోషం – చిరు బాధతో తన తల్లితోపాటు లోపలికివెళ్లింది .

సిస్టర్స్ : బుజ్జితల్లీ ……. , మీ కాబోయే అత్తయ్య నచ్చిందా ? .
బుజ్జితల్లి : అంకుల్ తరువాత – మమ్మీ తరువాత అత్తయ్యనే అంతగా నచ్చారు .
దేవత : ఈ మమ్మీ కంటే అంకుల్ అంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట ……..
బుజ్జితల్లి : అవును మమ్మీ అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టి ఐస్ చేసేసింది .
దేవత : సరి సరి …….
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
20 నిమిషాలలో పొలిమేర చేరుకున్నారు . అదిగో కార్ అంకుల్ ఎక్కడ ఎక్కడ అంటూ చుట్టూ చూస్తోంది బుజ్జితల్లి ……..

పొలిమేర తోరణం దాటగానే ఐదుగురు ముసుగువ్యక్తులు కారుకు అడ్డుగా నిలబడి కత్తులు తీసి కారుని చుట్టుముట్టారు .
కారులో అందరూ భయపడిపోతున్నారు .
మల్లీశ్వరి అలర్ట్ అయిపోయి మిర్రర్స్ క్లోజ్ చేసి వేగం పెంచేంతలో …… , రోడ్డుకు అడ్డుగా వెనుకా ముందూ పెద్ద పెద్ద రాళ్లు వెయ్యడంతో , ముందుకూ వెనుకకూ వెళ్లలేని పరిస్థితి .
సిస్టర్స్ …… సర్ సర్ అంటూ – మల్లీశ్వరి …… ఏమండీ ఏమండీ అంటూ – దేవత …… మహేష్ గారూ మహేష్ గారూ అంటూ – బుజ్జితల్లి …… అంకుల్ అంకుల్ అంటూ కేకలువేస్తున్నారు , మిర్రర్స్ క్లోజ్ చెయ్యడం వలన కేకలు వినిపించడం లేదు.

చంపేస్తాము అంటూ గొంతుపై కత్తులు ఉంచుకుని సైగలు చేస్తూ కారు చుట్టూ – ఇంజిన్ మీదకు చేరి మిర్రర్స్ పగలగొడుతున్నారు . లాభం లేకపోవడంతో ఒకడు రాయి అందుకుని వెనుక డోర్ అద్దాన్ని కొట్టగానే మిగిలిపోయింది .
బుజ్జితల్లి భయంతో డాడీ డాడీ అంటూ గట్టిగా కేకలువేసింది పగిలిన మిర్రర్ ద్వారా వినిపించగానే …… తోటను వీక్షిస్తున్న ఇద్దరమూ పరుగునవచ్చాము .
కారుపై కత్తులతో దాడి చేస్తుండటం చూసి గగుర్పాటుకు లోనయ్యాను . రేయ్ రేయ్ అంటూ పగిలిన మిర్రర్ ద్వారా కత్తి దూర్చిన వాడిని వెనక్కు లాగేసాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ …… అంటూ భయపడిపోతోంది .
అలా నా బుజ్జితల్లిని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది .
రేయ్ ……. మా వాడినే కొడతావా అంటూ ఐదుగురూ కత్తులతో నా ముందుకు చేరారు .
బుజ్జితల్లి : డాడీ జాగ్రత్త …….
అన్నయ్యా ….. జాగ్రత్త అంటూ సూరి వొఇసులో కూడా భయం కనిపిస్తోంది . హలో హలో సర్పంచ్ గారూ ……. ఎవరో ఐదుగురు ముసుగుల్లో అక్కయ్యా వాళ్లపై దాడిచేస్తున్నారు కత్తులు కత్తులతో తొందరగా వచ్చెయ్యండి .
ముసుగుల్లో ముందున్నవాడు …… రేయ్ ముందు వీడిని వేసేయ్యండ్రా అంటూ కత్తితో వేగంగా వచ్చాడు .
సూరి : అన్నయ్యపైకి కత్తులతో వస్తున్నారు , నాకు భయమేస్తోంది తొందరగా తొందరగా …….
నావైపు వచ్చినవాడి కత్తిపట్టుకున్న చేతిని పట్టుకుని చెవిపై బలంగా ఒక దెబ్బవేశాను – అంతే గింగిరాలు తిరుగుతూ నెలకు అతుక్కుపోయాడు . హమ్మా హబ్బా …… అంటున్నాడు కానీ ఉలుకులేదు – చెవిలోనుండి రక్తం కారిపోతోంది .
సూరి : సర్పం….చ్ గా…..రూ …… అంటూ ధీర్ఘం తీసాడు – తేరుకుని సర్పంచ్ గారూ భయమే లేదు నెమ్మదిగా రండి అంటూ విజిల్ వేసి , అన్నయ్యా …… నాకూ భయం పోయింది – కీర్తి తల్లీ …… మాంచి యాక్షన్ మూవీ ఎంజాయ్ చేయబోతున్నారు అంటూ రోడ్డుప్రక్కన పడిన రెండు కర్రలను తీసుకొచ్చి ఒకటి అందించాడు .
థాంక్స్ తమ్ముడూ …… అంటూ కత్తులతో నలుగురూ మావైపుకు రాకముందే , నా బుజ్జితల్లినే కత్తులతో భయపెడతారా అంటూ ఒక్కొక్కడి దిమ్మతిరిగేలా పొడవాటి కర్రలతో ఒక్కొక్కడి చెవులపై – ఆ వెంటనే తొడలపై బలంగా దెబ్బలువేశాను .
వెనుక నెలకు అతుక్కుపోయినవాడు లేవడం చూసి , లేచినవాడిని లేచినట్లుగా కొడుతున్నాడు సూరి …….
బుజ్జితల్లి చూసి నవ్వడం చూసి , లవ్ యు బుజ్జితల్లీ …… నేనున్నాను కదా – రావడానికి ఆలస్యం అయ్యింది అంతే ……..
బుజ్జితల్లి : డాడీ …… వెనుక ……
కత్తికి కర్రను అడ్డుపెట్టి , వెనుక నుండి కాదురా మగాడిలా ముందునుండి అటాక్ చెయ్యాలి అంటూ షర్ట్ లాగి వీపుపై ఆపకుండా దెబ్బలు వేస్తున్నాను .
వాడు నొప్పితో వేసిన కేకలు బహుశా రెండు ఊళ్లకు వినిపించాయేమో …….
ఎవడురా వీడు ఇలా కొడుతున్నాడు అంటూ చెవులలోనుండి కారుతున్న రక్తాన్ని చూసి వణుకుతున్నారు .
రేయ్ ఎవర్రా మీరు , త్వరగా రండి అక్కడ బోలెడన్ని పెళ్ళిపనులు ఉన్నాయి – మీలాంటి వాళ్ళు ఉంటారనే అనాధనైన నేను చాలీ చాలని ఫుడ్ తింటూ కష్టపడి పెరిగాను – బాడీ పెంచాను కుమ్మడానికి …….. చూస్తారా ….. ? .
బుజ్జితల్లి : చూస్తాము చూస్తాము …….
సిస్టర్స్ : మేము కూడా ……
లేడీస్ సిగ్గు – బుజ్జితల్లీ sorry …….
బుజ్జితల్లి : లవ్ యు డాడీ …… అంటూ నవ్వుతూనే ఉంది .
రేయ్ త్వరగా రండి రా ……. , నా …… మేడం గారి బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకోవాలి అని నేనే ముందుకువెళ్లి ఒక్కొక్కడి తాట తీసాను – రేయ్ …..ముందు మీ ముఖాలు చూడాలి ముసుగులు తియ్యండి అంటూ ఇద్దరిని పట్టుకున్నాను .
ఎంత ఫాస్ట్ గా వచ్చారో ఏమిటో చేతుల్లో కర్రలతో ఏకంగా రెండు వైపుల నుండీ రెండు గ్రామాల ప్రజలంతా ట్రాక్టర్లలో కర్రలూపుకుంటూ వచ్చేసారు – వారిలో వెనుక పెద్దయ్య కూడా ట్రాక్టర్ నుండి దిగటం చూసి పెద్దయ్యా పెద్దయ్యా …… అంటూ వెళ్లి పట్టుకున్నాను .
ఈ గ్యాప్ లో రేయ్ దొరికితే ప్రాణాలు పోయినట్లే పరిగెత్తండి రా అంటూ ఇరువైపులా ఉన్న తోటల్లోకి కంచెలు దూకిమరీ పరుగుతీశారు ఐదుగురూ …….
సర్పంచ్ గారు : వదలకండి వెళ్లి పట్టుకోండి అని చెప్పగానే …… , తోటల్లోకి వెనుకే పరుగుతీశారు కొంతమంది .

పెద్దయ్యా …… రక్తం రక్తం పాదాలంతా రక్తం , సూరీ …… కారు తియ్యి ……
సూరి : అలాగే అన్నయ్యా …… అంటూ క్యాబ్ తీసుకొచ్చాడు .
పెద్దయ్యను కూర్చోబెట్టి ఎక్కబోతే …… , డాడీ డాడీ …… పరుగున వచ్చిన బుజ్జితల్లిని ఎత్తుకుని , మల్లీశ్వరి గారూ ……. వెనుకే రండి అని కూర్చోగానే సిటీ వైపు వేగంగా పోనిచ్చాడు .
ట్రీట్మెంట్ తీసుకున్న సేమ్ హాస్పిటల్ కు తీసుకెళ్లాము . స్ట్రెచర్ పై పడుకోబెట్టి సేమ్ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లాము – వెనుకే దేవత వాళ్ళు వచ్చారు – బుజ్జితల్లీ మేడం గారూ …… ఏమీకాదు , మనకోసం ట్రాక్టర్లో వచ్చారుకదా ఎక్కేటప్పుడు – దిగేటప్పుడు ఏదో తగిలి రక్తం కారి ఉంటుంది .

కొద్దిసేపటి తరువాత డాక్టర్ వచ్చి అదే విషయం చెప్పారు . ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు సర్ – రెండు చోట్ల కుట్లు ఊడిపోవడం వలన రక్తం వచ్చింది – వెళ్లి చూడొచ్చు – వారం రోజులపాటు ఇంటి నుండి బయటకు కదులకూడదు .
మేడం ……. రండి అంటూ లోపలికి పిలుచుకునివెళ్ళాను .
నాన్నగారూ …….
తాతయ్యా …….
బుజ్జితల్లిని బెడ్ పై కూర్చోబెట్టాను .
పెద్దయ్య : బుజ్జితల్లీ – తల్లీ – బాబూ …… మీకేమీ కాలేదు కదా ……
దేవత : దేవుడే తోడుగా ఉంటే ఏమౌతుంది నాన్నగారూ …….
బుజ్జితల్లి : తాతయ్యా …… నొప్పిగా ఉందా ….. ? .
పెద్దయ్య : కొద్దిగా ఉంది బుజ్జి తల్లీ …… , మిమ్మల్ని చూసాను కదా పోయింది , మా దేవుడు బాబూ నువ్వు – నువ్వు తోడుగా వెల్లకపోయుంటే …….
ఆ మాట ఊహించడంతోనే , నా గుండె చప్పుడు ఆగిపోయేది పెద్దయ్యా …… అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టాను .

సర్పంచ్ గారు – పెళ్లికూతురు నాన్నగారు అంకుల్ ……. లోపలికివచ్చి పరిస్థితి తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు .
సర్పంచ్ గారూ …… వాళ్ళు దొరికారా ? .
సర్పంచ్ గారు : తోటల వెనకున్న కొండల్లోకి వెళ్లిపోవడం వలన ఒక్కడూ దొరకలేదు మహేష్ …….

ఇంటి నుండి మరియు చెల్లెమ్మ కృష్ణవేణి నుండి దేవతకు కాల్స్ రావడంతో మాట్లాడి ధైర్యం చెప్పారు .
డాక్టర్ గారు వచ్చి , సర్ …… బయట జనమంతా వీరికోసమేనా ….. ? .
అవును డాక్టర్ …….
డాక్టర్ : వచ్చే పోయే పేషెంట్స్ కు ఇబ్బందిగా ఉంది , ప్రాబ్లమ్ ఏమీ లేదు నడవకుండా ఉంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్లొచ్చు అమౌంట్ పే చేసి …….
పెద్దయ్య : బాబూ మహేష్ …… , నీ మాట వినలేదు క్షమించు – ఇక నువ్వు చెప్పినట్లుగానే వింటాను , ఇంటికి వెళదాము …….
పెద్దయ్యా …….
డాక్టర్ : Nothing to worry …… ఇంటికి వెళ్ళవచ్చు .
పెద్దయ్య : బుజ్జితల్లీ …… నువ్వైనా చెప్పు – మీ అంకుల్ చెప్పినట్లుగానే వింటాను .
సరే పెద్దయ్యా …… కదలకుండా ఉండాలి , పే చేసి వస్తాను వెళదాము .
అంకుల్ – సర్పంచ్ గారు : మేము పే చేస్తాము మహేష్ , పెద్దయ్యను జాగ్రత్తగా తీసుకురా …….
బుజ్జితల్లీ …… మమ్మీతోనే ఉండు అనిచెప్పి , సూరి సహాయంతో పెద్దయ్యను వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటకు తీసుకొచ్చాము .
పెద్దయ్య నినాదాలతో హాస్పిటల్ దద్దరిల్లిపోయింది . క్యాబ్ లో మేము – రోవర్లో దేవతవాళ్ళు ……. బుజ్జితల్లి పరుగున నా గుండెలపైకి చేరిపోయింది – గ్రామానికి బయలుదేరాము . గ్రామం పొలిమేరలో తమ్ముడు కృష్ణ కంగారుపడుతున్నాడు – కారులో ఎక్కించుకుని నేరుగా ఇంటికి చేరుకున్నాము . పెద్దయ్యా ….. కాసేపు రెస్ట్ తీసుకోండి తరువాత వచ్చి పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళతాము అని లోపలికివదిలాము . బుజ్జితల్లీ …… తాతయ్య దగ్గర ఉండు – తాతయ్యను పిలుచుకుని వెళ్ళేటప్పుడు నీ ఇష్టం అని ముద్దుపెట్టి ప్రక్కనే కూర్చోబెట్టి , కృష్ణా జాగ్రత్త అనిచెప్పి గుడి దగ్గరికి చేరుకున్నాను .

కాలేజ్ గ్రౌండ్ ఎంట్రన్స్ లో గ్రాండ్ వెల్కమ్ డెకరేషన్ చేస్తున్నారు – ఎంట్రన్స్ దగ్గర నుండీ ఫుల్లీ కవర్డ్ వెడ్డింగ్ హాల్ వరకూ శ్రీమంతుడు మూవీలో శృతికోసం మహేష్ బాబు అటెండ్ అయిన వెడ్డింగ్ సెట్టింగ్స్ లా రెండువైపులా ఫ్లవర్స్ – మొక్కలు మరియు విద్యుత్ కాంతులు వెలిగేలా సెట్ చేస్తున్నారు .
సర్ రండి అంటూ మేనేజర్ సెట్టింగ్స్ ద్వారా లోపలికి పిలుచుకునివెళ్లారు – ఎకరం విస్తీర్ణంలో పెళ్ళిమండపం సెట్ చూసి wow అన్నాను .
మేనేజర్ : మరొక రెండు గంటల్లో మొత్తం పూర్తిచేసేస్తాము సర్ …… , ఇటువైపు అంటూ కుడివైపుకు తీసుకెళ్లి భోజనాలకోసం ఏర్పాటుచేసిన హాల్ ను మరియు మండపానికి ఎడమవైపుకు తీసుకెళ్లి బోలెడన్ని టెంట్స్ చూయించారు – సర్ ఇవి పెళ్లికూతురు మరియు బంధువులకోసం …….. ప్రతీ టెంట్ లో సకల సౌకర్యాలూ ఉండబోతున్నాయి – ఇంకా ……..
చాలు చాలు మేనేజర్ గారూ …… , నేను ఎక్సపెక్ట్ చేసినదానికంటే అద్భుతం …… థాంక్యూ soooo మచ్ ……
మేనేజర్ : మీరు డబ్బు ఇచ్చారు – మేము మా వర్క్ చేస్తున్నాము సర్ …….
వర్క్ లో సిన్సియారిటీకి థాంక్స్ చెబుతున్నాను మేనేజర్ గారూ ……. , చీకటి పడేలోపు పూర్తయిపోతుంది కదా ……..
మేనేజర్ : అంతలోపే సర్ …… , గయ్స్ కమాన్ కమాన్ …… గంటలో పూర్తిచేయాలి.

కాలేజ్ బిల్డింగ్ పనులతోపాటు టెంపరరీ కాలేజ్ బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతుండటం చూసి కాంట్రాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాను .
కాంట్రాక్టర్ గారు : మహేష్ …… , పెద్దయ్యకు ఎలా ఉంది అని అడిగారు .
కుట్లు ఊడిపోయి రక్తం బాగా పోయింది – వారం రోజులు ఎక్కడికీ వెళ్లకూడదు అనిచెప్పారు డాక్టర్ ……..
కాంట్రాక్టర్ గారు : ఎవరో అటాక్ చేస్తున్నారని తెలియగానే తెగ కంగారుపడిపోయి ట్రాక్టర్ లో మొదట పెద్దయ్యనే ఎక్కారు మహేష్ – నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసింది .
నా అదృష్టం కాంట్రాక్టర్ గారూ ….. , ప్రోగ్రెస్ ఏమిటి ? .
కాంట్రాక్టర్ గారు : టెంపరరీ కాలేజ్ రెండు మూడురోజుల్లో పూర్తిచేసేస్తాము మహేష్ ……. – హాస్పిటల్ బిల్డింగ్ కట్టడం కోసం స్థలాన్ని ఇవ్వడానికి చాలామంది ఊరిప్రజలు ముందుకువస్తున్నారు – అందరూ ఒక నిర్ణయం తీసుకున్న మరుక్షణమే హాస్పిటల్ పనులు కూడా మొదలుపెట్టేయ్యొచ్చు .
అయితే పెద్దయ్య – సర్పంచ్ గారిని కలవండి మరి …….
కాంట్రాక్టర్ గారు : వాళ్లేమో నీ ఇష్టం అంటున్నారు – నువ్వువచ్చేవరకూ ఆగమని చెప్పారు ……. – నువ్వేమో …… వాళ్ళ ఇష్టం అంటావు .
కరెక్ట్ గా చెప్పారు కాంట్రాక్టర్ గారూ ……. , వాళ్ళ ఇష్టమే నా ఇష్టం – తొందరగా మీరే నిర్ణయం తీసుకుని మొదలుపెట్టేయ్యండి – అత్యాధునికమైన సౌకర్యాలు ఉండాలి , చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాదు – వైద్య ఖర్చులు భరించలేని సిటీ ప్రజలు కూడా ఇక్కడికే రావాలి , ఎంత ఖర్చయినా వెనక్కు చూడకండి .
కాంట్రాక్టర్ : సూపర్ మహేష్ ……. , ఈ ధైర్యం ఇచ్చారు ఇక చూసుకోండి అని సంతోషించారు .

అన్నయ్యా అన్నయ్యా …… ఇక్కడ ఉన్నారా అంటూ తమ్ముళ్లు వినయ్ – గోవర్ధన్ పరుగునవచ్చారు .
తమ్ముళ్లూ …… ఎక్కడికి వెళ్లిపోయారు , మధ్యాహ్నం వచ్చేస్తాము అనిచెప్పివెళ్లి సాయంత్రానికి వచ్చారు , మీరు ప్రక్కన లేకపోతే ఎలా చెప్పండి .
తమ్ముళ్లు : Sorry అన్నయ్యా ……. , ఓనర్ ఏదో పనిమీద రాజమండ్రి వెళ్లారట , నేరుగా అక్కడికే వెళ్లి పనిపూర్తిచేసుకువచ్చాము .
రాజమండ్రి వెళ్లి వచ్చారా ……. ? .
తమ్ముళ్లు : మరి మా ఊరి దేవుడు పని అప్పజెప్పాక రాజమండ్రి ఏమిటి ఢిల్లీ వరకైనా వెళ్లిపోతాము . అన్నయ్యా ….. విషయం తెలుసుకుని కొన్న రేటుకే ఇవ్వడానికి ఒప్పుకున్నారు – రేపు ఉదయం వైజాగ్ వస్తాను మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అనిచెప్పారు .
Wow గుడ్ తమ్ముళ్లూ ……. , అంతలోపు పెళ్లికూడా పూర్తయిపోతుంది , థాంక్యూ తమ్ముళ్లూ …….
తమ్ముళ్లు : మీరు థాంక్స్ చెప్పడం సర్పంచ్ గారు వింటే ఇంకేమైనా ఉందా …….
కాంట్రాక్టర్ గారు : అవునవును నిజమే అంటూ నవ్వుకున్నారు .
తమ్ముళ్లు : అన్నయ్యా …… ఉదయం నుండీ చెయ్యాల్సిన పనులన్నీ ఇప్పుడు చకచకా చేసేస్తాము ఆర్డర్ వెయ్యండి .
అన్నీ పూర్తయిపోతున్నాయి తమ్ముళ్లూ …… , ఊరిజనమంతా కలిసిపోయి పూర్తి చేసేస్తున్నారు .
తమ్ముళ్లు : అంతా మీరిచ్చిన ఉత్సాహమే అన్నయ్యా …… , ఇంత గ్రాండ్ గా మ్యారేజ్ ఇప్పటివరకూ చూడలేదు అన్నయ్యా – మూవీ సెట్టింగ్ లా ఉంది – బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయినందుకు మరింత సంతోషం వేస్తోంది .

1299040cookie-checkశృంగార స్టోరీ 269

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *