ఒక ప్రైవేట్ కాలేజ్ ముందు బస్సెస్ ఆగాయి . బయటనుండి ముందు బస్సెస్ నుండి దిగిన పిల్లలు ……. వైష్ణవి – జాహ్నవి , రాము – స్నిగ్ధ అంటూ కేకలువేస్తూ పిలిచారు .
అమ్మమ్మా – అమ్మలూ ……. ఒక్కనిమిషం అంటూ బుజ్జితల్లులు – బుజ్జాయిలు పరుగున కిందకువెళ్లి , ఆ వెంటనే ఫ్రెండ్స్ తోపాటు లోపలికివచ్చారు డాడీ డాడీ ……. వీళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్స్ అని పరిచయం చేసారు .
గుడ్ మార్నింగ్ పిల్లలూ …….
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ టూర్ ఫస్ట్ డే ఉత్సాహంతో చెప్పారు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ……. ఈ కాలేజ్లోనే ఆకామడేషన్ ఏర్పాటుచేశారు మేడం – మా ఫ్రెండ్స్ తోపాటు వెళ్లి ఫ్రెష్ అవుతాము please please డాడీ …….
కృష్ణ : please ఎందుకు బుజ్జితల్లులూ ……. , మీ సంతోషమే మా సంతోషం – టూర్ మీది వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అంతేకదా బాస్ ……..
Go and enjoy బుజ్జితల్లులూ ……..
లవ్ యు డాడీ – అంకుల్ అంటూ ముద్దులుపెట్టి , అమ్మలూ అమ్మలూ ………
చెల్లెళ్లు : రెడీ ఏంజెల్స్ అంటూ ఒక బ్యాగులో డ్రెస్సెస్ రెడీ చేసినట్లు అందించారు .
బుజ్జితల్లులు : లవ్ యు sooooo మచ్ అమ్మలూ ……. , నిద్రపోతున్న బుజ్జిపాపాయికి ముద్దులుపెట్టి పిల్లలు – బాబు చేతులను అందుకుని ఫ్రెండ్స్ తోపాటు వెళ్లారు .
కృష్ణా ……. ఈరోజు పిల్లల టూర్ విశేషాలు ఏంటి ? .
కృష్ణ : జేబులోనుండి లిస్ట్ తీసి మధ్యాహ్నం 2 గంటలకు కొండపైనున్న స్వామివారి దర్శనం కాబట్టి లంచ్ వరకూ ఇక్కడే సైట్ సీయింగ్ ప్రదేశాలైన ఇస్కాన్ – జూ ……. లిస్ట్ లో చాలానే ఉన్నాయి కానీ పిల్లలు జూ లోపలికి వెళ్లారంటే అక్కడే ఉండిపోతారు కాబట్టి ఆ రెండు ప్రదేశాలు పర్ఫెక్ట్ అనుకుంటున్నాను .
రేయ్ …….. నా దేవతలు , అమ్మ చెల్లెమ్మలను త్వరగా చెరుకోవాలని ఏడుకొండలూ కాలినడకన వెళ్లాలని మొక్కుకున్నాను . అమ్మమ్మా – బుజ్జాయిల వలన ఆ అదృష్టం ఇంత త్వరగా కలిగింది , నేను కాలినడకన వెళతాను నువ్వు …… అమ్మ – చెల్లెమ్మలు – బుజ్జితల్లులను పిల్లలతోపాటు ఎంజాయ్ చేసేలా చూసి కొండపైకి రండి అక్కడ కలిసి దర్శనం చేసుకుందాము .
మహేష్ నేనుకూడా ……. ok ok బుజ్జాయిలతోపాటు ఒక్కరైనా ఉండాలికదా సరే ……..
అమ్మా – చెల్లెమ్మలూ ………
అమ్మ : కన్నయ్యా …….. మాకు లేవా మొక్కులు , మేము కూడా నీతోపాటే కాలినడకన ఆ దేవుడి దర్శనం చేసుకుంటాము – అప్పుడైనా మనందరి ఒకేఒక కోరిక త్వరగా తీరుతుందేమో ఆ దేవుడి కృప మనపై ఉండవచ్చు .
మా అక్కయ్యలకోసం మేము – బుజ్జిపాపాయి కూడా అన్నయ్యా ……..
అమ్మా – చెల్లెమ్మలూ ……..
అమ్మ : మొక్కు తీర్చుకోకపోతే దేవుడి ఆగ్రహానికి గురి అవ్వవచ్చు కన్నయ్యా …… , ఆ తరువాత నీ ఇష్టం – మన కోరిక తీరదానికి మరింత ఆలస్యం అవ్వవచ్చు .
లేదు లేదు లేదు అలా జరగడానికి వీలులేదు – అన్నిరోజులూ ……. బుజ్జాయిలు – బుజ్జితల్లుల బుజ్జి కోపాలకు దగ్ధమైపోతానేమో , అదీకాక మా అమ్మ బయటకు గెంటడం ఒకటి ఉందికదా ……..
చెల్లెమ్మలు ముసిముసినవ్వులు నవ్వుకుని అమ్మను చెరొకవైపు హత్తుకున్నారు . అమ్మా అమ్మా …….. అన్నయ్య ఒప్పుకున్నట్లే రండి భక్తితో రెడీ అవుదాము అని లోపలికివెళ్లారు .
కృష్ణ : ప్చ్ ……. అంటూ ఆశతో చూస్తున్నాడు .
నవ్వుకుని బుజ్జాయిలకు తెలియనివ్వకు అని భుజం తట్టి కిందకు దిగాను .
కృష్ణ : నువ్వు కనిపించకపోతే వారికి తెలియదా మహేష్ …….
వీక్ డే అవ్వడం వలన కాలేజ్ రన్ అవుతోంది – పిల్లలకు ఒక బ్లాకులో స్టే ఆలాట్ చేసినట్లు మేడం గారు వారి పిల్లలతో వచ్చి చెప్పారు . Sorry మహేష్ ……. సడెన్ గా టూర్ ఫిక్స్ అవ్వడం వలన బెటర్ గా ఆర్రేంజ్ చెయ్యలేకపోయాను – వీరు ఈ కాలేజ్ హెడ్ మాస్టర్ ……..
హెడ్ మాస్టర్ : అన్నీ ఏర్పాట్లూ చేసేసాము మేడం – పిల్లలు ఎటువంటి ఇబ్బందీ ఉండదు .
మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి మేడం ………
అంతలో డాడీ డాడీ ……. అంటూ బుజ్జితల్లులు – బుజ్జాయిలు – పిల్లలు బాబు వచ్చి హత్తుకున్నారు . డాడీ డాడీ …….. రూమ్స్ కు డోర్స్ విండోస్ లేవు – ఇక బాత్రూమ్స్ అయితే చెప్పడానికి మాటలు రానంత డర్టీగా ఉన్నాయి – పిల్లలందరూ ఇబ్బందిపడుతున్నారు .
మేడం గారు : ఏమిటండీ ఇది , మీరు వైజాగ్ వచ్చినప్పుడు ఎలా చూసుకున్నాము – ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా ? – మీవల్ల కాదు అని ముందే చెప్పి ఉంటే మేము వేరే ఏర్పాట్లు చేసుకునేవాళ్ళము కదా ……. , అమ్మాయిలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అని కంగారుపడుతున్నారు .
మేడం …….. మాకు ఒక్క అవకాశం ఇవ్వగలరా ? Please please ……
మేడం గారు : మహేష్ ……. అమ్మాయిల సేఫ్టీ ముఖ్యం ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు , లంచ్ లోపు గుడిలోపలికి ఎంటర్ అవ్వాలి – మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా ……. ? .
రిక్వెస్ట్ కాదు మేడం …… ఆర్డర్ వెయ్యండి , we are always at your సర్వీస్ …… రేయ్ కృష్ణా ……..
కృష్ణ : ఓన్లీ వన్ మినిట్ మహేష్ అంటూ ఆఫీస్ ఉన్న బస్ ఎక్కి లాప్టాప్ ఓపెన్ చేసి హోటల్ బుకింగ్స్ గూగుల్ చేసాడు .
బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ …….. మీ క్లాస్మేట్స్ అందరినీ పిలుచుకుని బస్సెస్ ఎక్కండి .
బుజ్జితల్లులు : అర్థమైంది డాడీ అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లులూ …….. అంటూ గుసగుసలాడాను .
లవ్ యు డాడీ అంటూ అందరూ లోపలికి పరుగుతీసి , నిమిషంలో అందరినీ పిలుచుకునివచ్చి , పిల్లలతోపాటు బస్సెస్ ఎక్కారు .
5 నిమిషాలలో కృష్ణగాడువచ్చి మహేష్ వెళదాము డ్రైవర్స్ కు చెబుతాను అని వెళ్ళాడు .
మేడం please అంటూ బస్ వైపు చూయించాను .
మేడం గారు : చూడండీ ……. ఇంకెప్పుడూ ఇలా మాకే కాదు ఏ కాలేజ్ కు చెయ్యకండి – మీరు ఇలా చేశారని మీ టూర్ ప్లాన్స్ మార్చుకోకండి ప్రతీ సంవత్సరం లానే మీ పిల్లలకోసం మా కాలేజ్ అన్నిరకాల ఏర్పాట్లూ చేస్తుంది – ఒక్క టూర్ వలన పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరిగి సంవత్సరం మొత్తం ఉత్సాహంగా చదువుకుంటారు – దానిని వారికి పర్ఫెక్ట్ గా అందించాలి .
హెడ్ మాస్టర్ : sorry మేడం అంటూ తలదించుకున్నాడు .
మేడం : పిల్లలకు భోధించేవాళ్ళమే ఇలా తలదించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అనిచెప్పి బస్ ఎక్కారు .
బస్ ఎక్కి చెల్లెమ్మా ……. అమ్మ స్నానానికి వెళ్ళారా ? , మీరు 5 మినిట్స్ ఆగండి అని విషయం చెప్పాను .
చెల్లెమ్మలు : అయితే మేము హోటల్ రూంలో కంఫర్ట్ గా స్నానం చేస్తాము – అమ్మకు ఈ విషయం తెలిస్తే కుళ్ళుకుంటారేమో మీరు కాస్త దూరంగా ఉండండి కొట్టినా కొడతారు అని నవ్వుకున్నారు .
15 నిమిషాలలో బస్ ఆగింది – అంతలో అమ్మ రావడంతో ముగ్గురమూ నవ్వుకున్నాము – చెల్లెమ్మలూ ……. అవసరమైన బ్యాగేజ్ తీసుకుని వచ్చెయ్యండి అని కిందకుదిగాను .
బస్సెస్ ను కృష్ణగాడు నేరుగా హోటల్ లోపలికి తీసుకెళ్లి , బుజ్జితల్లులవైపు సైగచేసి కిందకుదిగాడు .
ఫ్రెండ్స్ – పిల్లలూ ……. మనం స్టే చేయబోతున్న హోటల్ రండి అంటూ కిందకుదిగారు .
ఎదురుగా పెద్ద హోటల్ వైపు ఆశ్చర్యంతో చూస్తున్నారు . వైష్ణవి – జాహ్నవి ……. wow ఫైవ్ స్టార్ హోటల్ అంటూ సంతోషంతో చూసి ఆనందిస్తున్నారు – కేకలువేస్తున్నారు .
బుజ్జితల్లులు : మనకోసం మన హెడ్ మేడం గారు చాలా costly అయినా మొత్తం హోటల్ నే బుక్ చేసేసారు – మనకు ఇష్టమైన లగ్జరీయోస్ రూమ్స్ లోకి చేరి ఎంజాయ్ చెయ్యడమే ……… – బ్రేక్ఫాస్ట్ రూమ్స్ లలోకే ఆర్డర్ చెయ్యవచ్చు లేదా హోటల్ రెస్టారెంట్ లో అయినా చెయ్యవచ్చు మన ఇష్టం …….
థాంక్యూ మేడం థాంక్యూ sooooo మచ్ మేడం – మేడం మేడం అంటూ కేకలువేస్తూ పిల్లలందరూ సంతోషంతో చుట్టూ చేరి హత్తుకున్నారు .
మేడం గారు షాకింగ్ తో నావైపు చూసారు .
గుండెపై చేతినివేసుకుని at your సర్వీస్ మేడం అంటూ స్మైల్ ఇచ్చాను .
మేడం కళ్ళల్లో ఆనందబాస్పాలతో థాంక్యూ చెప్పారు . పిల్లలూ ……. వన్ hour లో రెడీ అవ్వాలి మరొక వన్ hour లో బ్రేక్ఫాస్ట్ చేసి బస్సెస్ లో ఉండాలి సో మీకిష్టమైన రూమ్స్ లలోకి 2 – 3 మెంబెర్స్ వెళ్లి రెడీ అవ్వండి గో గో గో ……..
పిల్లలు : థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ డ్రెస్సెస్ తీసుకుని ఉత్సాహంతో లోపలికివెళ్లారు . స్టెప్స్ – లిఫ్ట్ లలో వారికిష్టమైన గదులలోకి చేరారు .
డాడీ డాడీ ……. మీరు చెప్పినట్లుగానే చేసాము కదా అని బుజ్జాయిలు బాబుతోపాటు వచ్చారు .
వెనుకే మేడం గారు వచ్చి మహేష్ ……. వితిన్ మినిట్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసావు , థాంక్యూ థాం ………
మేడం మేడం మేడం …….. మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని కొండపై వెలసిన స్వామివారు కల్పించడం మా అదృష్టం . మా జీవితాంతం ఇలా రుణం తీర్చుకుంటూనే ఉంటాము – రేయ్ మహేష్ నెక్స్ట్ ఎక్కేక్కడ టూర్ places ఉన్నాయో అక్కడ ……..
కృష్ణ : డిటైల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ – i am not a kid ok …….
బుజ్జాయిలు – బుజ్జితల్లులతోపాటు మేడం గారు కూడా నవ్వేశారు .
కన్నయ్యా ……. నీసంగతి చెబుతాను ఉండు అని వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చి , బుజ్జాయిలూ – పిల్లలూ – బాబు ……. రండి మిమ్మల్ని రెడీ చేస్తాము అని పిలుచుకునివెళ్లారు .
బుజ్జితల్లులు : ఎందుకు డాడీ అమ్మమ్మ గుర్రుగా ఉన్నారు ? – మీరే ఏదో చేశారు ……..
ఏమీలేదు బుజ్జితల్లులూ అని వివరించాను – మేడం , టీచర్స్ వెళ్ళండి వెళ్లి రెడీ అవ్వండి – ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చెయ్యండి .
మేడం గారు ముసిముసినవ్వులతోనే వారి పిల్లల చేతులను పట్టుకుని టీచర్స్ వెనుకే వెళ్లారు .
బుజ్జితల్లులూ …….. వెళదామా ? .
బుజ్జితల్లులు : మా డాడీ గదికి ఎదురుగా మేము అంటూ చేతులను అందుకున్నారు .
లవ్ యు sooooo మచ్ , తొందరగా రెడీ అయ్యి గదిలోకి వచ్చెయ్యండి మన దేవతలతో మాట్లాడుదాము ఆలస్యం అయితే మాన్స్టర్స్ మత్తులోనుండి బయటకువచ్చేస్తారు .
అమ్మో ……. ఆలోపు అమ్మలు – పిన్నమ్మలతో మాట్లాడాలి , రాత్రివరకూ సరిపోయే బోలెడన్ని ముద్దులు అందుకోవాలి అని లాక్కుని టాప్ ఫ్లోర్లో ఉన్న ఒక గదిలో నన్ను వదిలేసి నా డ్రెస్ అందించి , చెల్లీ – అక్కయ్యా ……. వేరు వేరు గదులలో మరింత త్వరగా రెడీ అవ్వవచ్చు అంటూ ఎదురుగా ఉన్న గదిలలోకి వెళ్లారు చిన్న బ్యాగుతోపాటు ……….
నేను కాలకృత్యాలు తీర్చుకుని తలంటు స్నానం చేసి డ్రెస్ లోకి మారిపోయి వచ్చేన్తలో , బుజ్జితల్లులతోపాటు బుజ్జాయిలు పిల్లలు బాబు అందరూ లవ్లీ డ్రెస్సెస్ లో క్యూట్ గా రెడీ అయ్యి రావడమే కాకుండా , నా మొబైల్ లో వదినమ్మ చిన్నవదినతో – అమ్మ మొబైల్ లో మధ్య వదినలతో – చెల్లెమ్మ మొబైల్ లో హిమగారితో – చెల్లి మొబైల్ లో వాసంతి దేవతతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
అమ్మో అమ్మో …….. అందరూ ఒకదగ్గర చేరారన్నమాట …….
బుజ్జాయిలు : మరి మాకు అమ్మలు – పిన్నమ్మలతో మాట్లాడాలని ఉండదా డాడీ …….. , అదికూడా దేవుడి దర్శనానికి వెళుతున్నాము అమ్మలను చూడకుండా వెళ్లగలమా ………
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……. ఉమ్మా ఉమ్మా ఉమ్మా ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .
అమ్మో అమ్మో దేవతల ముద్దులన్నీ మీకేనా ……. , నాకు నాకు అంటూ బుజ్జాయిల దగ్గరికి చేరేంతలో ……..
స్టాప్ స్టాప్ స్టాప్ కన్నయ్యా ……. ఎక్కడ ఉన్నవాడివి అక్కడ ఆగిపో , ఇప్పటికే రెండుమూడుసార్లు మేము గీసిన గీతను దాటేశావు అని అమ్మ లోపలికివచ్చి అడ్డుగా నిలబడ్డారు .
బుజ్జితల్లి : అవును అమ్మమ్మా ……. బస్ లో ముద్దులుపెట్టాము – కాలేజ్ దగ్గర హత్తుకున్నాము – ఇక్కడే హోటల్ ముందు కూడా ……. అమ్మమ్మా మూడుసార్లు లైన్ దాటి తప్పుచేశారు .
అమ్మ : మూడుసార్లు అంటూ మూడుసార్లు చేతిపై గిల్లేసి చెల్లెమ్మలతోపాటు నవ్వుకుంటూ వెళ్లి అందరితోపాటు కూర్చుని దేవతలతో సంతోషంగా మాట్లాడుతున్నారు – దేవతలు తియ్యదనంతో నవ్వుకుంటున్నట్లు హృదయం పులకించిపోతోంది .
బుజ్జితల్లులు : నొప్పివేసిందా డాడీ మందు రాసేదా ……..
స్స్స్ స్స్స్ అవునవును , నో నో నో ……. ఈసారి కొరికేస్తుందేమో అమ్మ , అమ్మా బుజ్జితల్లులూ చెల్లెమ్మలూ ……. ఒక్కసారి ఒకే ఒక్కసారి దేవతలను చూడనివ్వండి please please ……..
అమ్మ అనుమతి తీసుకుని కపుల్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే డాడీ అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో అందరూ మొబైల్స్ ను నావైపుకు తిప్పారు . బేబీ – మహేష్ మహేష్ మై గాడ్ ……. హిమగారు మాత్రం తలదించుకున్నారు .
దేవతలూ ……. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఉమ్మా అంటూ రెండుచేతులతో ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవతలు : లవ్ యు అంటూ ప్రాణమైన ముద్దులు వదిలారు – ( నా ముద్దును స్వీకరించకుండా ఉండటానికి హిమగారు ఎంత కంట్రోల్ చేసుకున్నారోనన్న విషయం అప్పటికి తెలియదు – కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నారు ) .
అమ్మ : ఇక చాలులే బుజ్జితల్లులూ ……. , సెకండ్స్ అంటే నిమిషాలు చూశాడుగా – రోజూ నేరుగా కూడా కాలుస్తాడు కదా – నా తల్లులతో నేను మాట్లాడాలి అని తమవైపుకు మార్చుకున్నారు . కన్నయ్యా …… కాల్ చేసి మాకిష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే ఆర్డర్ చెయ్యి …….. – బుజ్జితల్లులూ …… మా డాడీకి ఏమిష్టమో మాకూ అదే ఇష్టం అనిమాత్రం అనకండి – ఈ వారం రోజులూ మాకిష్టమైనవే ఆర్డర్ చెయ్యాలి .
బుజ్జితల్లులు : సరే అమ్మమ్మా , లవ్ యు అంటూ అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అమ్మకు – బుజ్జాయిలకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాను – 15 మినిట్స్ లో రాగానే దేవతలతో మాట్లాడుతూనే చిరునవ్వులు చిందిస్తూ ఒకరికొకరు తినిపించుకున్నారు .
బుజ్జితల్లులు : అమ్మమ్మా …….. డాడీకి తినిపిస్తాము .
అమ్మ : మీ డాడీ కి చేతితో తినడం రాదా ? , అంతేలే మీకు …… మీ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం వెళ్ళండి మీ డాడీ దగ్గరకే వెళ్ళండి అని బుంగమూతిపెట్టుకుంది .
బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మమ్మా …….. , టూర్ మొత్తం మా అమ్మమ్మ – అమ్మల దగ్గరనే అంటూ బుంగమూతిపెదాలపై ముద్దులుపెట్టారు బుజ్జినవ్వులతో ………
అమ్మ పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించాయి . సరే సరే మీ తియ్యనైన కోరికను ఎందుకు కాదనాలి ……..
బుజ్జితల్లులు : యాహూ ………
అమ్మ : ఒక్కొక్క ముద్దనే , ఇలా వెళ్లి అలా తినిపించి ముద్దులేవో పెట్టుకుని వచ్చేయ్యాలి .
బుజ్జితల్లులు : మా అమ్మమ్మ …… మా డాడీ దేవతలకే దేవత అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి , ప్రేమతో ఒక్కొక్క ముద్ద – ఒక్కొక్క ముద్దుపెట్టి అమ్మ దగ్గరికి చేరుకున్నారు .
దేవతలు : వీడియో కాల్ లో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. బుజ్జితల్లులూ …….
చెల్లెమ్మలు ఆశతో చూసి అమ్మా అమ్మా ……. మేముకూడా అని ముసిముసినవ్వులతో అడిగారు .
అమ్మ : అంతేలే మీకు కూడా మీ అన్నయ్య అంటేనే ప్రాణం వెళ్ళండి వెళ్లి ముద్ద – ముద్దులు పెట్టిరండి , మళ్లీ ……. బిడ్డలను – మనవరాళ్లను వేరువేరుగా చూస్తుంది జానకి అన్న అపవాద నాకు వద్దమ్మా …….. అని తియ్యనికోపంతో …….
చెల్లెమ్మలు : లవ్ యు అమ్మా – అమ్మా ……. అంటూ కోపంతో ఉబ్బిన బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించి వచ్చి చెరొకముద్ద తినిపించి – బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి తియ్యనైన సంతోషంతో వెళ్లి కూర్చుని బుజ్జాయిలు – బాబు – పిల్లలకు తినిపించారు .
దేవతలు : లవ్ యు sooooo మచ్ చెల్లెమ్మలూ ……
బుజ్జితల్లులు – చెల్లెమ్మలు ……. ప్రాణంలా తినిపించడాన్ని , దేవతలు సంతోషంతో పరవశించిపోవడాన్ని రెండు కళ్ళు ఆశతో గమనిస్తున్నాయి . ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇక వీలు కానట్లు నావైపు ప్రాణంలా చూస్తూ బుజ్జితల్లులూ – తల్లులూ ……… నాకు కూడా అని తలదించుకుని ముసిముసినవ్వులు నవ్వుతో ది అమ్మ .
బుజ్జితల్లులు – చెల్లెమ్మ : అంతేలే అమ్మమ్మా – అమ్మా ……. మీకు , మీ కన్నయ్య అంటేనే ప్రాణం అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ అలకచెందారు .
అమ్మ : లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లులూ – తల్లులూ ……. అంటూ అందరి నుదుటిపై ముద్దులుపెట్టివచ్చి , కన్నయ్యా ……. అని ప్రాణంలా తినిపించి – నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి పరుగునవెళ్లి సోఫాలో కూర్చున్నారు , మొబైల్స్ వైపు ఆశతో చూస్తున్నారు ముద్దులకోసం ………
ఈ విషయం తెలిసే అమ్మను ఆటపట్టించాలని దేవతలు సైలెంట్ గా ఉండిపోయారు .
అమ్మ : తల్లులూ ……. మీ ప్రాణం కంటే ఎక్కువైన బేబీ – దేవుడికి తినిపించినందుకు బుజ్జితల్లులకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చారు – మీచెల్లెళ్లకు లవ్ యు చెప్పారు ……. అంతేలే మీకు …….
దేవతలు : సంతోషంతో నవ్వుతున్నారు . బుజ్జితల్లులు చెప్పినట్లు మా దేవతైన మా మంచి అమ్మకు ముద్దులు – లవ్ యు లు రెండూనూ …….. , కానీ ప్రతీసారీ మొబైల్ లో చెప్పడం ఇష్టం లేక అమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మ – ఎవ్వరూ బాధపడకూడదని నవ్వారు .
అమ్మ హృదయం చలించినట్లు లేచివచ్చి నా గుండెలపై కొట్టి ప్రాణంలా గుండెలపై వాలారు .
అమ్మ కళ్ళల్లో బాధకే విషయం అర్థమై ఓదార్చాను . అమ్మా – అమ్మమ్మా అంటూ అందరూ లేచివచ్చి చుట్టూ చేరారు , చెల్లెమ్మలకూ విషయం అర్థమైంది .
అమ్మ : ఏమీలేదు ఏమీలేదు గంటకోసారైనా కన్నయ్యను కొట్టకపోతే నాకు మనస్సు శాంతించదు అందుకే …….
చెల్లెమ్మలు : బుజ్జాయిలను నవ్వించడానికి మనకు కూడా కదా బుజ్జితల్లులూ ……. చూస్తారే కొట్టండి కొట్టండి అంటూ అందరూ నవ్వుకున్నారు – అమ్మ మరిన్ని దెబ్బలు కొడితే ఎంజాయ్ చేద్దాము రండి అంటూ వెళ్లి సోఫాలలో కూర్చుని తిన్నారు .
అమ్మ : కన్నయ్యా …….. కాలినడకన ఎప్పుడు ? .
బుజ్జాయిలు – బుజ్జితల్లులను ……. కృష్ణగాడితోపాటు బస్ లో పంపించి అలిపిరి మెట్ల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకునేంతవరకూ ……. ok నా అమ్మా ….
అమ్మ : సరే అంటూ వెళ్లి బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి కిందకుచేరుకుని బుజ్జాయిలు – బుజ్జితల్లులు వాళ్ళ క్లాస్మేట్స్ బస్సెస్ లో వెళ్లేలా ప్లాన్ వేసి పంపించి ఆఫీస్ బస్ లో అలిపిరి చేరుకున్నాము .