మహారాజు : సంతోషకరమైన విషయం చెప్పారు పండితులారా …… , అలాగే ఈ మహాద్భుతమైన వివాహాన్ని తమరిచేతులమీదనే జరిపించండి , మహామంత్రిగారూ ……. మన సామంతరాజ్యాలకు వివాహ ఆహ్వానం పంపండి – సాయంత్రంలోపు రాజ్యంలో ఉండాలని , ఎత్తిపరిస్థులలోనూ వివాహ సాంప్రదాయంలో ఏలోటూ ఉండకూడదు అన్నీ ఆచారాలప్రకారమే జరిపించాలి . , పండితులారా ….. అల్లుడుగారిని పెళ్ళికొడుకులా సిద్ధం చెయ్యడానికి ఎవరైతే బాగుంటుంది .
మహారాజా ……. నా సోదరీమణులైన రాకుమారి చెలికత్తెలు ఉండనే ఉన్నారుగా ……..
పండితులు : కాబోయే మహారాజుగారే సెలవిచ్చారు .
మహారాజు : చామంతీ – మందాకినీ …… సగం మంది రాకుమారిణి – సగం మంది రాకుమారుడిని వివాహానికి సిద్ధం చేసే బాధ్యత మీదే , మాకూ చాలా పనులున్నాయి . తల్లీ మహీ …… నీ మనసు గెలిచిన వీరుడికి మన రాజమందిరం అంతా చూయించు , పెళ్ళిపనులు మొదలవ్వగానే ఎవరి మందిరంలో వారు చేరాలి , ముహూర్తానికి కేవలం కొన్ని ఘడియలు సమయం మాత్రమే ఉంది , మహామంత్రిగారూ …… రాజ్యంలో ఉన్న కళాకారులు – చిత్రకారులు అందరినీ అందరినీ పిలిపించి పెళ్ళిమండపాన్ని న భూతొ న భవిష్యతి అని ఆశ్చర్యపోయేలా సిద్ధం చేయించండి , రాబోవు అతిథులకు ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చెయ్యాలి పదండి , మహారాణీ వారూ …… సమయం లేదు కదలండి .
మహారాణి : సంతోషంగా ప్రభూ ……..
మహారాజా …… మీ రాజ్య ధనుస్సు .
మహారాజు : మేము ఎత్తగలమో లేమో …… , అది ఎప్పటికీ చంద్ర రాజ్య మహారాజుదే అంటే మీదే …….
ధన్యవాదాలు మహారాజా ……. , మీ అమ్మాయి ప్రేమను పొందాను కాబట్టి ధనుస్సును ఎత్తగాలిగాను కాబట్టి ఈ ధనుస్సు రాకుమారికే చెందుతుంది అంటూ అందించాను .
మహి : నా దేవుడి దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్లేకదా …….
మహారాజు : సంతోషంతో వెళ్లిపోయారు .
ప్రభూ ……. మమ్మల్ని సోదరీమణులు అన్నారు అంటూ ఆనందబాస్పాలతో దండం పెడుతున్నారు .
మేమిద్దరం ఇలా కలిసాము అంటే మీవల్లనే కదా …… , మీచేతులమీదుగా పెళ్ళికొడుకు అవ్వడం నా అదృష్టం , గురువుగారి తరువాత నాకు అన్నీ మీరే అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను ,
చెలికత్తెలు : చాలా చాలా సంతోషం వేస్తోంది ప్రభూ …….
మహి : నా వీరుడు నిజంగా దేవుడే అంటూ ఏకమయ్యేలా హత్తుకుంది , దేవుడా అందరూ వెళ్లిపోయారుకదా ఇకనైనా పెదాలపై ముద్దుపెట్టవచ్చుకదా ……. అంటూ ముచ్చికను కొరికేసింది .
స్స్స్ …… అవునవును , నా దేవకన్య పెదాల మాధుర్యాన్ని పొంది చాలాసమయమే అయ్యింది అంటూ ఒకచేతితో నామీదకు లాక్కుని పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టాను .
మహి : మ్మ్మ్ మ్మ్మ్ …… కాసేపు వదలకండి దేవుడా అంటూ తనివితీరా ముద్దులుకురిపిస్తోంది .
చెలికత్తెలందరూ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకున్నారు .
మహి : ఇప్పుడు మనసు కుదుటపడింది అంటూ నా గుండెలపైకి చేరింది .
మహీ ……. మీ తండ్రిగారు చెప్పినట్లుగా …….
మహి : గుర్తుంది గుర్తుంది కాబోవు మహారాజా …… , ప్రేమతో ముద్దులుకురిపిస్తూ రాజభవనం మొత్తం చూయిస్తాము రండి అంటూ నా చేతిని చుట్టేసింది .
మహీ ఒక్కక్షణం ఆగితే నా ధనుస్సు మరియు నా దేవకన్య అందించిన ఖడ్గం తీసుకొస్తాను .
మహి : నేను తీసుకొస్తాను కదా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , నేను కూర్చున్న చోటకువెళ్లి తీసుకొచ్చి చెలికత్తెలకు అందించి నా చేతిని చుట్టేసింది . అమ్మవారి ధనుస్సును మాత్రం మీదగ్గరే ఉంచుకోండి .
ఇది అమ్మవారు …… వారి భక్తురాలికి ఇచ్చిన కానుక ……
మహి : సరే సరే మహారాజా …….
మహీ ……. ఇలా ఇప్పుడు నీ ముందు ఉన్నాను అంటే నీవల్లనే , నువ్వు …… అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం ద్వారానే …….
మహి : మంజరి అంతా చెప్పిందిలే ప్రభూ ……. , మంజరీ అంటూ చేతిని చూయించింది .
సంతోషంతో ఎగురుతున్న మంజరి నేరుగా వచ్చి నా భుజంపై వాలింది .
మహి : మంజరీ …… నిన్నూ ……. , కొట్టడానికి కాదు లేవే అంటూ ఇష్టంగా ముద్దుపెట్టింది , దేవుడా ……. ముందు ఈవిషయాన్ని మన మిత్రుడికి చెప్పాలి రండి రండి అంటూ లాక్కునివెళ్లింది .
దూరం నుండి చూసి మిత్రమా …… అంటూ పరుగులుతీసింది – ఎవరు నిన్ను ఈ గుఱ్ఱపుశాలలో ఉంచినది అంటూ స్వయంగా ముడి విప్పింది .
మన్నించండి యువరాణీ …… స్వయంవరానికి విచ్చేసిన యువరాజులందరి అశ్వాలను ఇక్కడే ఉంచారు అని కాపరి బదులిచ్చారు .
మహి : కృష్ణ …… నా ప్రాణమిత్రుడు , నాతోనే ఉంటాడు లేకపోతే నా ప్రత్యేకమైన ఉద్యానవనంలో ఉంటాడు .
చిత్తం యువరాణీ …….
మహి : మిత్రమా రా వెళదాము , ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? , ఎవ్వరికీ సాధ్యం కాని పోటీలో గెలుపొంది నన్ను కౌగిలిలోకి చేర్చుకున్నారు మన దేవుడు , స్వయంగా నాన్నగారే …… మన దేవుడు వీరత్వాన్ని చూసి పొంగిపోయి నన్ను ….. దేవుడి గుండెలపైకి చేర్చారు అంటూ ప్రేమతో నిమురుతోంది .
మిత్రమా ……. పోటీ గొప్పతనం అంతా మహికే చెందుతుంది అంటూ వివరించాను.
సంతోషంతో చిందులువేశాడు కృష్ణ ……
మహి : అలా ఏమీ కాదులే కృష్ణా …… అని చెబుతూనే నా గుండెలపైకి చేరింది . మిత్రమా ……. రాజభవనం మొత్తం నేనే స్వయంగా చూయిస్తాను , ముందుగా ….. అమ్మవారి దేవాలయం అంటూ ప్రధారమైన ఉద్యానవనానికి తీసుకెళ్లింది – అక్కడ వివాహ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి .
ఇంతటి పరమ భక్తురాలు కాబట్టే నా దేవకన్య సహాయంతో ధనుస్సును ఎక్కుపెట్టగలిగాను .
మహి : పొగిడింది చాలు ప్రభూ అంటూ తియ్యనైనకోపంతో కొడుతోంది .
కోపంలోనూ ముద్దొచ్చేస్తున్నావు మహీ ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను ,అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము కాబట్టి కేవలం భక్తితో అంటూ పాదరక్షలను వదిలి పాదాలను నీటితో శుభ్రం చేసుకుని లోపలికివెళ్లాము .
అమ్మా …… మీ ధనుస్సును ఎక్కుపెట్టి తప్పు చేసి ఉంటే మీ భక్తుడిని క్షమించండి ……… , మీ ప్రియమైన భక్తురాలి ప్రేమను పొందేలా అనుగ్రహించినందుకు ధన్యుణ్ణి అంటూ భక్తితో మొక్కుకున్నాను .
మహీ ……. నీకోసం అమ్మవారు అనుగ్రహించిన పువ్వు మరియు కుంకుమ అంటూ చూయించాను .
మహి : అమ్మా …… నేను రాకపోయినా అనుగ్రహించారా అంటూ కళ్ళకు హత్తుకుంది – ప్రభూ ……
పెదాలపై చిరునవ్వుతో నా దేవకన్య నుదుటిపై కుంకుమ ఉంచాను .
మహి : అమ్మవారి సాక్షిగా ఒక్కటైపోయినట్లే అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరింది .
అమ్మా …… ఇంతవరకూ ఏ ఆటంకాలు లేకుండా ఒక్కటి చేసారు – ఇకముందుకూడా ఎదురుకాకుండా చూడు తల్లీ …….
మహి : అమ్మా ……. పండితులు చెప్పిన ఒడిదుడుకులు కూడా దరిచేరనివ్వకుండా చూడండి అంటూ ప్రాణంలా కౌగిలించుకుంది – ప్రభూ …… అదిగో అమ్మవారి సమక్షంలో అంటే బయట ఉద్యానవనంలోనే మన వివాహం .
చూసానులే యువరాణీ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
మహి : అందమైన నవ్వులతో …… , ప్రభూ రండి మరి మూడురోజుల ముందు దొంగతనంగా మన మందిరంలోకి వచ్చారు – ఇప్పుడు మహారాజు అనుమతితో దొరలాగా రాజభవనం మొత్తం వీక్షించండి అంటూ చేతిని చుట్టేసి తీసుకెళ్లింది – మిత్రమా ….. రామరి , మంజరీ …… దర్జాగా మిత్రుడిపై కూర్చున్నావన్నమాట అంటూ నవ్వుకుంది .
మహీ …… ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : నా దేవుడు ప్రక్కన ఉంటే ఆనందం ఆగనే ఆగదు అంటూ సంతోషం పట్టలేక కొరికేసింది .
స్స్స్ …….
చామంతి : అప్పుడు అన్నమాట ఇప్పుడు తీర్చుకున్నారన్నమాట అంటూ నవ్వుకుంటున్నారు .
సోదరీ ……. గడిచిన మూడురోజులయితే గడియకోసారైనా కొరికేసింది .
మహి : అంత తియ్యగా ఉన్నారు మరి నా దేవుడు అంటూ మళ్లీ కొరికేసింది .
అందమైన ఉద్యానవనాలు – రాజ మందిరాలు – అద్భుతమైన శిల్ప సౌందర్యాలను చూయిస్తూ రాజ దర్బారులోని సింహాసనం దగ్గరికి తీసుకెళ్లింది . వివాహం తరువాత ఒక మంచిరోజున నా దేవుడికి పట్టాభిషేఖం చేసేది ఇక్కడే అంటూ కూర్చోబెట్టింది .
మహీ ……..
మహి : తండ్రిగారు చూసినా సంతోషిస్తారు అంటూ నా ఓడిలోకిచేరి ప్రేమతో చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
కాబోయే మహారాజుగారికి వందనాలు అంటూ పూలవర్షం కురిపించారు చెలికత్తెలు ……..
అందరి సమక్షంలో నా దేవకన్యతోపాటు కూర్చుంటాను ఎందుకంటే నా దేవకన్య ఎందులోనూ తక్కువకాదు అంటూ గుండెలపై ఎత్తుకుని పైకిలేచాను .
మహి : నా దేవుడు బంగారం అంటూ ముద్దులుకురిపించింది , ప్రభూ ……. ఇలాగే ఎత్తుకుని మన మందిరానికి తీసుకెళ్లండి – ఈపాటికి మన మిత్రుడు మన ఉద్యానవనానికి చేరుకునిఉంటాడు .
యువరాణీవారి ఆజ్ఞ అంటూ ఎత్తుకునే చెలికత్తెలు చూయించిన మార్గంలో నడిచాను . మహీ …… నీ ప్రేమను పొందడం వల్లనే ప్రధాన ద్వారం బయట ఉండాల్సినవాడిని రాజభవనంలో దర్జాగా తిరుగుతున్నాను .
మహి : రాజభవనంలో కాదు – నా దేవుడు …… నా హృదయంలో ఉన్నాడు అంటూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
ప్రభూ ……. ఇదే మీ ప్రత్యేక మందిరం అంటూ ద్వారం తెరిచి ఉద్యానవనంలోకి వెళ్లిపోయారు .
మహి : ప్రభూ …… అదిగో పాన్పు నన్ను దానిపై విసిరి నలిపెయ్యండి .
అనుకున్నాను ఇంకా అనలేదే అని అంటూ నుదుటిపై నుదుటిని తాకించాను .
మహి : స్స్స్ …….
మరికొద్ది ఘడియల్లో వివాహం …… మూడురోజులు ఆగావు ఈ కొద్దిసేపు ఆగలేవా ? .
మహి : ఆగలేను అంటూ బుంగమూతిపెట్టుకుంది ( ఆగలేకనే కదా వీరా …… మూడురాత్రులు మీతో స్వర్గసుఖాలు ఆస్వాదించినది ) .
బుంగమూతిపై ముద్దులవర్షం కురిపించడంతో అందమైన నవ్వులు వెల్లువిరిసాయి.
కాసేపు విశ్రాంతి తీసుకో మహీ అంటూ పాన్పుపైకి చేర్చాను .
మహి : అమ్మో ……. నా దేవుడిని చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను అంటూ లేచి నా చేతిని చుట్టేసింది .
మహీ – ప్రభూ ……. రాజమాత వేంచేస్తున్నారు అంటూ చామంతి వచ్చింది .
రాజమాత : తల్లీ మహీ ……..
అమ్మా …… అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది .
రాజమాత : తల్లీ …… అల్లుడుగారిని భోజన మందిరానికి తీసుకురా – మీ తండ్రిగారు వేచి చూస్తున్నారు , భోజనాల తరువాత పెళ్లికార్యక్రమాలు మొదలవుతాయి , మీ తండ్రిగారు మాటిచ్చినట్లుగా వివాహ సాంప్రదాయంలోని ప్రతీదీ జరిపించబోతున్నారు , నేను వెళుతున్నాను అల్లుడుగారిని తొందరగా తీసుకురా ……..
మహి : అలాగే అమ్మా …… మీరు వెళ్ళండి , పెళ్ళిపనులు మొదలవబోతున్నాయి అంటూ అందమైన సిగ్గుతో నా కౌగిలిలోకి చేరింది , మొదట మిత్రుడికి ఆహారం అందించి వెళదాము . ఉద్యానవనంలోకి వెళ్లి మిత్రుడికి ఇష్టమైన ఆహారాన్ని చేకూర్చి , మిత్రమా …… ఏమైనా అవసరం అయితే మంజరి ద్వారా కబురు పంపు స్వయంగా నేనే వస్తాను అనిచెప్పి భోజన మందిరానికి తీసుకెళ్లింది .
లోపలికి అడుగుపెట్టగానే అలా చూస్తూ ఉండిపోయాను – మహీ …….
మహి : ఇకనుండీ నాదేవుడు భోజనం చేసేది ఇక్కడే అంటూ మహారాజు గారి ప్రక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టింది .
మహారాజు : అల్లుడుగారూ ……. మీ భోజనమందిరానికి తగ్గదేనా ? , మన క్షత్రియులలో సహజమే కదా అంటూ ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అన్నిరకాల వడ్డించారు – వడ్డించేవారిని ఆపి నా దేవకన్యే స్వయంగా వడ్డించింది .
మాహారాజు – రాజమాత మురిసిపోతున్నారు .
మహి : నా దేవుడికి నా చేతితో తినిపించాలని ఉంది .
వద్దు వద్దు మహీ …… మొదటికే మోసం వస్తుంది .
మహి : అందుకే ఆగిపోయాను అంటూ అందమైన నవ్వులతో వడ్డిస్తూనే తిన్నది .
మహారాజా ……. వంటలు బహు రుచిగా ఉన్నాయి .
మహారాజు : కృతజ్ఞుణ్ణి యువరాజా …… , ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తోంది , క్షత్రియులలో నీ అంతటి వీరుడిని చూడనేలేదు , వివాహం పూర్తయిన వెంటనే పట్టాభిషేకం చేయించి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను మహారాణీ ……..
మహారాణి : మీ ఇష్టం ప్రభూ ……..
మహారాజు : క్షత్రియుల గొప్పదనం పెంచారు అల్లుడుగారూ …….
క్షత్రియుడు క్షత్రియుడు అని పదేపదే అంటుండటం విని మహివైపు తప్పుచేస్తున్నట్లుగా చూసాను .
మహి : పట్టాభిషేకం తరువాత క్షత్రియుడివి అయిపోతారు ప్రభూ ……. , నేనున్నానుకదా అంటూ చేతిపై ముద్దుపెట్టింది .
భోజనాలు పూర్తయ్యాక , అల్లుడుగారూ …… పెళ్ళిపనులు మొదలుపెట్టాలి పెళ్లిపీఠలపై కూర్చునేంతవరకూ ఒకరినొకరు చూసుకోకూడదు అన్నది సాంప్రదాయం , ఇద్దరినీ వేరువేరు మందిరాలలో పెళ్ళికొడుకు – పెళ్లికూతురిలా ముస్తాబు చెయ్యాలి . అల్లుడుగారి కోరిక ప్రకారం చెలికత్తెలు సిద్ధం చేస్తారు మహి మందిరంలో – నా బంగారుతల్లిని స్వయంగా నేనే పెళ్లికూతురిని చేసి తరిస్తాను వెళదామా తల్లీ …….
మహి : అమ్మా మీరువెళ్లండి వెనుకే వస్తాను . రాజమాత వెళ్లిపోగానే గుండెలపైకి చేరింది – సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా ఉండలేనే …….
నవ్వుకుని నా దేవకన్య బుగ్గలను ప్రేమతో అందుకున్నాను – అంతవరకూ గుర్తుండేలా అంటూ చేతులను బుగ్గలమీదనుండి నా దేవకన్య వయ్యారమైన నడుముపైకి చేర్చి నొక్కేస్తూ నామీదకు లాక్కుని తేనెలూరుతున్న పెదాలపై ఘాటైన ముద్దుపెట్టి ప్రేమను తెలియజేశాను .
ఆఅహ్హ్హ్ ……. మ్మ్మ్ …… చాలు ప్రభూ చాలు అంటూ ఆ ముద్దుమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచినట్లు రాజమాత వెనుక వెళ్లిపోతోంది .
తియ్యదనంతో నవ్వుకున్నాను .
ప్రభూ ప్రభూ …… అన్నీ సిద్ధం చేసాము .
సోదరీమణులారా పదండి అంటూ వెనుకే మహి మందిరానికి చేరుకున్నాను .
రోటిని పూజించి రోటిలో పసుపు దంచడంతో పెళ్ళిపనులు మొదలయ్యాయని చంద్రిక సన్తహోశంతో8 పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది . పసుపు వినాయకుడిని తయారుచేసి వివాహ కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ ఎటువంటి విజ్ఞాలూ రాకూడదని పూజించారు మహారాజు – రాజమాత …… , ఇక ప్రభువులను పెళ్ళికొడుకుగా చెయ్యవచ్చు అక్కడ మహిని కూడా పెళ్లికూతురిని చేసేస్తున్నారు .
సోదరీ ……. ఇంకా ప్రభువు ఏమిటి ఇక మీ సోదరుణ్ణి కదా , సోదరా అని ప్రేమతో పిలవచ్చు కదా …….
చెలికత్తెలందరూ ఉద్వేగానికి లోనయ్యారు . కృతజ్ఞులం ప్రభూ …….
అదిగో మళ్లీ …….
సంతోషం సోదరా అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతులను అందుకుని ఉద్యానవనంలోని పెళ్ళిపందిరి కింద బుజ్జి తోడు పెళ్లికూతురుతోపాటు కూర్చోబెట్టి పసుపు నీళ్లతో మొదలెట్టి పెళ్ళికొడుకును చేశారు . ఎదురుగా పెళ్ళిపెద్దలుగా మిత్రుడు – మంజరి తెగ ఆనందిస్తున్నారు .
నాకోసం అప్పటికప్పుడు సిద్ధం చేయించిన వస్త్రాలను అందించడంతో లోపలికివెళ్లి వేసుకున్నాను – పెళ్ళికొడుకులా అందంగా ముస్తాబు చేశారు .
అక్కడ మహికి మంగళ స్నానం చేయించి పట్టువస్త్రాలతో పెళ్లికూతురిలా మార్చి , మహి చేతులమీదుగా గౌరీ పూజ చూయిస్తున్నారు .
నన్నే ప్రాణంలా తలుచుకుంటూ పూజ పూర్తి చేసింది .
అక్కడ – ఇక్కడ పండితులు సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తిచేసేటప్పటికి పెళ్లి సమయం ఆసన్నమయ్యింది .
పండితులు : రాకుమారా …… ఇదిగో ఈ పెళ్లివస్త్రాలను ధరించి అలంకరించుకుని వస్తే మేళతాళాల మధ్యన పెళ్ళిమండపానికి తీసుకెళతాము .
ఇదేమాటను మహికి చెప్పగానే , నన్ను చూడబోతున్నానన్న ఆనందంలో రాజమాత బుగ్గపై సంతోషంతో ముద్దుపెట్టి , రాజమాత మందిరంలోకి వెళ్లి పెళ్ళిచీరను కట్టుకుంది .
తల్లీ ఇలా కూర్చో అంటూ అద్దం ముందు కూర్చోబెట్టి వజ్రవైఢూర్యాలు పొడగబడిన ఆభరణాలతో నిలువెల్లా అలంకరించి మురిసిపోతున్నారు .
ఇక్కడ సోదరీమణులు ……. నన్ను పెళ్ళికొడుకులా అలంకరించి తలపాగా ఉంచి , మహి చూడగానే మీ మీదకు చేరుతుందేమో సోదరా ……
సోదరీ …… మహీ ఎలా ఉంటుందో ? .
అక్కడ అందంగా అలంకరించిన మహిని చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు రాజమాత ……..
మహి : చిరునవ్వులు చిందిస్తూ ……. అమ్మా తండ్రిగారిని పిలవండి అనిచెప్పి , ఇద్దరి పాదాలకు నమస్కరించింది .
సంతోషం తల్లీ ……. అంటూ లేపి గుండెలపైకి తీసుకుని మురిసిపోయారు .
ప్రభూ …… ముహూర్త సమయం ఆసన్నమవుతోంది – మేళతాళాల మధ్యన సంబరంలా కాబోవు మహారాజుగారిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళుతున్నారు .
మహామంత్రిగారూ …… కొద్దిపాటి సమయంలో అన్నీ అనుకున్నట్లు జరిపించిన మీ ప్రతిభకు ధన్యవాదాలు …….
మహామంత్రి : కృతజ్ఞుణ్ణి ప్రభూ …….
మహి : తండ్రిగారూ …… తొందరగా తీసుకెళ్లండి .
మహారాజు : అంతటి వీరుడిని అల్లుడుగా చేసుకోవడం అంటే నాకూ ఆత్రంగానే ఉంది తల్లీ …… అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . నిన్ను బుట్టలో కూర్చోబెట్టుకుని ఎత్తుకునివెళ్లడానికి మీ మావయ్యలు సిద్ధంగా ఉన్నారులే …….
సంతోషం తండ్రిగారూ అంటూ సిగ్గుపడింది .
మేళతాళాల మధ్యన సోదరీమణులు …… ప్రధాన ఉద్యానవనంలోని అమ్మవారి దేవాలయం ఎదురుగా సిద్ధం చేసిన పెళ్ళిమండపానికి తీసుకెళ్లారు , నాతోపాటు మిత్రుడు – మంజరి వచ్చారు .
కొద్ది గడియాల్లోనే అంతటి అద్భుతమైన కళ్యాణమండపాన్ని సిద్ధం చేసిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినదే ……. , విద్యుత్ దీపాలు – కాగడాల వెలుగులలో పూలతో అలంకరించిన పెళ్ళిమండపాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడంలేదు …….
మహారాజు వారు స్వయంగా వచ్చి , అప్పటికే విచ్చేసిన సామంతారాజులకు వీరాధివీరుడు నా అల్లుడుగారు అంటూ పరిచయం చేస్తూ వెళ్లి పెళ్ళిమండపంలో కూర్చోబెట్టారు .
రాజ్య ప్రజలంతా మహేశ్వరుడు మహేశ్వరుడు అంటూ జయజయనాదాలు చేస్తున్నారు .
అప్పుడే బుట్టలో కూర్చుని వస్తున్న మహి విని అంతులేని ఆనందంతో పరవశించిపోతోంది . నా ఎదురుగా పెళ్లిపీఠలపై కూర్చోబెట్టగానే మాఇద్దరి మధ్యన ఉన్న పరదా చాటున తొంగితొంగిచూస్తోంది .
పండితులు …… మాఇద్దరితో పూజ జరిపించి , పరదాను తొలగించారు .
ఎదురుగా పట్టువస్త్రాలు – నిలువెల్లా ఆభరణాలతో పెళ్లికూతురిగా నా దేవకన్యను హృదయంపై చేతినివేసుకుని అలా కన్నార్పకుండా ప్రేమతో చూస్తుండిపోయాను .
నా చూపులకు మహి సిగ్గుపడటం చూసి హృదయం పులకించిపోతోంది .
నన్నుకూడా అందంగా ముస్తాబు చేసినందుకుగానూ …… చామంతిని పిలిచి బుగ్గపై ముద్దుపెట్టడం చూసి ఆనందించాను – నా భుజంపైనే ఉన్న మంజరిని అందమైనకోపంతో ఒసేయ్ మంజరీ …… మన దేవుడి దగ్గరే ఉండిపోయావు కదూ ….. ఒక్కసారైనా నాదగ్గరికి రానేలేదు .
నవ్వుకుని , మంజరీ …… వెళ్లు .
మంజరి వెళ్లి మహి భుజంపై వాలి , మహి బుగ్గపై ముద్దుపెట్టింది , మహీ …… నాకే అసూయ వేసేంత అందంగా ఉన్నావు తెలుసా ? , పాపం మన దేవుడు ఎంత నియంత్రించుకుంటున్నారో ……
మహి చిలిపిదనంతో నవ్వుతోంది .
పండితుల మంత్రాలు – మేళతాళాలు – పూలవర్షం అన్నింటినీ మరిచిపోయి నా దేవకన్య సౌందర్యం మైకంలో పడిపోయినట్లు ,పండితులు చెయ్యమన్నదల్లా తెలియకుండానే చేస్తూ పోతున్నాను , మహి అందం – ఆనందం – సిగ్గు …… నన్ను ఎల్లలులేని సంతోషాలకు చేర్చింది .
మంత్రాలు పూర్తవడం – ముహూర్త సమయం దగ్గరపడటంతో భజంత్రీలు భజంత్రీలు అంటూ పండితులవారు నాచేతిని తాళిని అందివ్వడంతో నా దేవకన్య మైకం నుండి బయటపడ్డాను .
తాళి అందుకుని లేచి అతిథులందరికీ మరియు మిత్రుడికి చూయించి నా దేవకన్య నుదుటిపై మంజరికి ప్రేమతో ముద్దుపెట్టి మూడుముళ్లు వేసి మెడపై చిన్నగా గిల్లి కూర్చున్నాను .
మాపై కురుస్తున్న అక్షింతలు – పూలవర్షంలో నా దేవకన్య స్స్స్ ….. అంటూ కొంటె కోపంతో చూస్తుండటం చూసి భలే ముచ్చటేసింది .
తరువాత హోమం చుట్టూ ఏడడుగులు – పాలపాత్రలో ఉంగరపు సయ్యాట – బంతి ఆట – పెద్దల ఆశీర్వాదం – భోజనాలు …… ఇలా సాంప్రదాయం ప్రకారం వివాహం అంగరంగవైభవంతో పూర్తయ్యింది , ప్రతీ ఆచారానికి మహి పెదాలపై అంతకంతకూ ఆనందం పెరుగుతూనే ఉంది – ఒక అమ్మాయికి తను కోరుకున్న వ్యక్తి వరుడుగా లభిస్తే కలిగే ఆనందాన్నే మహి అనుభూతి చెందుతోంది .
మహారాజు – రాజమాత మరియు పండితుల ఆశీర్వాదం తీసుకుని , మిత్రుడి దగ్గరకువెల్లి సంతోషాలను పంచుకున్నాము .
జంటగా చేతులను పెనవేసుకుని మంజరితోపాటు దేవాలయానికి వెళ్లి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము .
నాకళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ …….
మహి : ప్రభూ ……. గురువుగారి ఆశీర్వాదం తీసుకోలేదనే కదా అంటూ గుండెలపైకి చేరింది – ప్రభూ ……. తెల్లవారగానే గురువుగారి దగ్గరకు వెళ్లే ఏర్పాట్లుచేయిస్తాను – ఇద్దరమూ వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాము .
సంతోషంతో మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
బయటకువచ్చిచూస్తే అతిథులందరూ …… భోజనాలు పూర్తిచేసుకుని రాజభవనంలో ఏర్పాటుచేసిన విశ్రాంతి భవనాలకు చేరుకుంటున్నారు . చివరగా మహారాజు మహామంత్రి చెలికత్తెలతో కలిసి భోజనాలకు కూర్చున్నాను .
అందరి సమక్షంలో సంతోషాల మధ్యన ఒకరికొకరం ప్రేమతో తినిపించుకుని ఆనందించాము .
భోజనాల తరువాత మహారాజువారు …… పండితులతో మాట్లాడటం చాటుగా విన్నట్లు చామంతి సిగ్గుపడుతూ వచ్చి , మహీ మహీ …… మరికొద్దిసేపట్లో శోభనానికి మంచి ముహూర్తం ఉన్నట్లు ముచ్చటిస్తున్నారు .
మహి సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .
అంతలో రాజమాత వచ్చి తల్లీ ……. తెలిసిపోయినట్లుంది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు – అల్లుడుగారూ …… ఒక ఘడియలో శోభనపు వస్త్రాలలో నీ శ్రీమతిని నీముందుంచుతాను .
మహి వదల్లేక వదల్లేక వదిలి వెనక్కు తిరిగితిరిగి చూసి సిగ్గుపడుతూనే వెళ్ళింది .
చామంతి : సోదరా …… మీ మందిరంలో వస్త్రాలు ఉంచాము రండి అంటూ పిలుచుకునివెళ్లి , తలుపులువేసుకోండి మహి వచ్చేస్తుంది అంటూ లోపలికివదిలి తలుపులు వేసుకున్నారు .
మల్లెపూల సువాసన గుప్పుమనడంతో వెనక్కు తిరిగిచూస్తే ఎప్పుడు సిద్ధం చేశారో గదిమొత్తం పూలతో – క్రొవ్వొత్తులతో శోభనపు గదిలా అలంకరించబడింది , ఇక పాన్పు అయితే శృంగారభరితం ……. ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది .
మంజరి : అమ్మో …… ఇక నేను ఇక్కడా ఉండనేకూడదు , ఉద్యానవనంలోని మన మిత్రుడి దగ్గరకువెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అనిచెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది .
నవ్వుకుని బల్లపై ఉన్న తెల్లని వస్త్రాలను అందుకుని స్నానపు గదిలోకివెళ్లి స్నానం చేసి వస్త్రాలు ధరించి పూలతో అలంకరించిన పాన్పుపై కూర్చుని నా దేవకన్యకోసం ఆశతో ఎదురుచూస్తున్నాను ………..
కొద్దిసేపటికే అంటే శోభన ముహూర్తానికి ముందే …….. , ద్వారాన్ని గట్టిగా బాదుతున్న చప్పుళ్ళు వినిపించాయి .
ఆ చప్పుళ్ళు వింటుంటేనే ఏదో జరగరానిది జరగబోతోందని మనసులో సంకోచంతో వెళ్లి ద్వారం తెరిచాను . ఎదురుగా మహారాజు …….
మహారాజా ……..
మహారాజు : కళ్ళల్లో కోపాగ్నితో …… , నువ్వు క్షత్రియుడివేనా ? అని ముక్కుసూటిగా అడిగారు .
ప్రభూ ……
మహారాజు : మహేశ్వరా ….. నిజం చెప్పు , నువ్వు క్షత్రియుడివా కాదా ? .
ప్రభూ …….
తడబడుతుంటే ఇంకా అడుగుతారేంటి మహారాజా అంటూ హిడుంభి యువరాజు నాముందుకువచ్చాడు .
నానుండి మాట రాలేదు ……. అలా చూస్తుండిపోయాను ……….
Janam mechina raju episodes chala bagunnay and last episode lo vellu iddaru sonthoshamga undela cheyandi
Janam mechina raju episodes chala bagunnay and last episode lo vellu iddaru sonthoshamga undela cheyandi raju kuda vella prema accept cheste bagundu