జనం మెచ్చిన రాజు – Part 21

Posted on

ఆ కౌగిలింతలో మీసం ఊడిరావడం చూసి వెంటనే సరిచేసి ప్రాణంలా హత్తుకుంది మహి ……

ఇదంతా మాయ మేము ఒప్పుకోము – మీకిష్టమైన యువరాజు గెలిచేలా పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిపించారు – అందుకేనేమో ఇతడిని చివరన ఉండేలా చూసారు , ఎదురెదురుగా బరిలోకి దిగితేనేకదా ఎవరి వీరత్వం గొప్పదో తెలిసేది అంటూ గురుకుల యువరాజులు అసూయతో మాట్లాడుతున్నారు .
ప్రభువు : ఎంత కండ కావరం …… , నేను నా రాజ్యంలో ఒకమాట ప్రకటిస్తే అదే శిలాశాసనం …….
యువరాజులు : ఇలా ప్రకటించేదానికి ఇక స్వయంవరం దేనికి మహారాజా – క్షత్రియ ఆచారం అంటూ బాగానే మాట్లాడారు – ఇంతదానికి ఇంతమంది యువరాజులను పిలిచి అవమాయనించడం తగునా తమరికి ……. , ఈ విషయం అన్ని రాజ్యాలకూ తెలిస్తే మీ పరువు ఏమౌతుందో ఊహించుకోండి …….
ప్రభువు : పరువు మాట వినగానేభయపడి , రాకుమారులారా …… స్వయంవర పోటీ న్యాయం – ధర్మాంగానే జరిగింది కదా ……
యువరాజులు : మాకు అలా అనిపించడం లేదు – మాతో బరిలోకి దిగి గెలవమనండి మీ వీరాధివీరుడిని అప్పుడు మేమే మౌనంగా వెళ్లిపోతాము .

నా దేవకన్య కళ్ళల్లోకి చూసి , మహారాజా నేను పోటీకి సిద్ధం అన్నాను .
యువరాజులు : ఇప్పుడు ఎవరు వీరాధివీరులో తెలుస్తుంది .
పోటీ మీరే చెప్పండి రాకుమారులారా …… , మహీ …… మరొక వినోదాన్ని తండ్రి చెంత ఉంది వీక్షించండి అంటూ మహారాజు గుండెలపైకి చేర్చాను , పోటీని గెలిచి ఈహారాన్ని మీ మెడలోవేసి నాదానిని చూసుకుంటాను .
యువరాజులు : మాటలు కట్టిపెట్టి బరిలోకి దిగు రాకుమారా …… , పోటీ ఏమిటంటే ……. నీ తలపై పండు ఉంచుకుంటే మేము ముగ్గురమూ ఒకేసారి గురిచూసి కొడతాము ఆ తరువాత నీవంతు ……
నేను సిద్ధం రాకుమారులారా అంటూ వాళ్ళు విసిరిన జామకాయను నా తలపై ఉంచుకుని వారు గీసిన చోట దైర్యంగా నిలబడ్డాను .
ప్రభువు : రాకుమారా …….
మహారాజా …… జరిగే వినోదాన్ని ఆస్వాదించండి – రాకుమారీ ….. కంగారుపడకండి .

ముగ్గురూ కాస్తదూరంలో నిలబడి వాళ్ళ ధనుస్సులు ఎక్కుపెట్టారు – వాళ్ళు ఎక్కుపెట్టిన విధానం చూసే అర్థమైపోయింది గురువుగారు ఎన్నిసార్లు నేర్పించినా శ్రద్ధతో నేర్చుకోలేదని ……
పెదాలపై చిరునవ్వుతో వాళ్ళు వదిలిన బాణాలను ఒకటి నా ముఖం దగ్గర – మరొకటి నా మెడ దగ్గర – ఇంకొకదానిని నా ఛాతీదగ్గర చకచకా పట్టేసుకున్నాను .
మహారాజు మొదలుకుని సైన్యాధ్యక్షుడు వరకూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు .
దేవుడా …… అంటూ వచ్చి నన్ను స్పృశిస్తూ గుండెలపై దెబ్బలుకురిపిస్తూ ప్రాణంలా హత్తుకుంది – నీ ప్రేమ ఉండగా నాకేమి అవుతుంది మహీ …… అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అద్భుతం మహాద్భుతం రాకుమారా కాదు అల్లుడు గారూ కాదు కాదు చంద్ర సామ్రాజ్య కాబోయే రాజు …… , ఇక మీవంతు రాకుమారులారా ……
నా విద్యను చూసి అప్పటికే భయంతో వణుకుతున్న యువరాజులు …… తమ సైనికులను పిలిచి వాళ్ళ తలలపై జామకాయలు ఉంచారు .
ప్రభువు : మీలాంటి పిరికిపంద యువరాజులు ఇంతకంటే ఏమిచెయ్యగలరు అంటూ నవ్వుకున్నారు .
యువరాణీ …… మరొక వినోదం తిలకిస్తారా లేదు లేదు మీతోనే చేయిస్తాను అంటూ మహితో అమ్మవారి ధనుస్సును ఎక్కుపెట్టించాను , మహీ ….. ఒకేసారి కొడతారా ఒక్కొక్కటి కొడతారా ? .
మహి : ఆ యువరాజులు …… మీవైపే అనుమానంతో చూస్తున్నారు .
ఓహో ఆదా విషయం మూడింటినీ ఒకేసారి కొడితే నేనని తెలిసిపోతుంది – ఆ విద్యను నేర్పించేవారు గురువుగారొక్కరే నేర్చుకున్నది నేనొక్కడినే …… , ప్రస్తుతానికి ఒక్కొక్కటి కొడదాము అంటూ క్షణ వ్యవధిలో జామకాయలు రెండురెండుగా చెరొకవైపుకు పడ్డాయి .
యువరాజులు …..వీడు మన బానిస కాదు …… అని మాట్లాడుకోవడం వినిపించి , మహీ ……. నీవల్లనే అంటూ నా మెడలోని పూల హారాన్ని మహి మెడలోకి వేసి అమాంతం పైకెత్తి చుట్టూ తిప్పాను .

మహారాజు : ఆ ముగ్గురు యువరాజులను వాళ్ళ సైన్యంతో సహా ఉన్నఫలంగా పొలిమేరలు దాటించండి .
సైన్యాధ్యక్షుడు : తోసుకుంటూ వెళ్లారు .
గురువుగారిని అవమానించినందుకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా దేవకన్యను ప్రాణంలా హత్తుకున్నాను .
మాపైకి అందరూ పూలవర్షం కురిపించారు – చుట్టూ సంబరాలు చేసుకుంటున్నారు పండగ వాతావరణం నెలకొంది .

మంజరి ఆనందాలకు అవధులులేనట్లు మా చుట్టూ ఎగురుతూ సందడి చేస్తోంది , నా దేవకన్య చెలికత్తెలయితే నా దేవకన్య సంతోషాలను చూసి ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందిస్తున్నారు – పూలవర్షం కురిపిస్తున్నారు .
మహారాజు : తన రాజ్యానికి ఇంతవరకూ చూడని వీరాధివీరుడు – తెలివైనవాడు రాజు కాబోతుండటంతో పట్టరాని ఆనందానికి లోనౌతున్నారు , మహామంత్రీ …… మీ కాబోవు మహారాజు ఎలా ఉన్నారో చెప్పనేలేదు ? .
మహామంత్రి : ప్రభూ ప్రభూ ……. నేనింకా వారి వీరత్వ ప్రతిభ దగ్గరే ఉండిపోయాను ప్రభూ …… , నిజం చెప్పాలంటే మీకంటే వీరాధివీరుడు ప్రభూ – మన రాకుమారి గారికి చక్కనైన వరుడు – చూస్తున్నారుకదా రాకుమారి గారికి కూడా తెగ నచ్చేసినట్లు ఆ ఆనందం – ఇంతకంటే వీరాధివీరుడిని మన రాకుమారి గారికి తీసుకురాలేరు ప్రభూ …….
మహారాజు : చాలా చాలా సంతోషం మహామంత్రీ …… , అయితే పండితులను పిలిపించండి వెంటనే వెంటనే పాణిగ్రహణం ఆ వెంటనే సతీసమేతంగా పట్టాభిషేఖం …….
మహామంత్రి : చిత్తం ప్రభూ ……
మహారాజు : యువరాజులారా …… ఈ రెండు సంబరాలను చూసి మాతో ఆనందాలను పంచుకోండి .
సైన్యాధ్యక్షుడు : మన్నించండి ప్రభూ ……. , స్వయంవరానికి విచ్చేసిన యువరాజలందరూ సెలవు తీసుకున్నారు , కొంతమంది మన కాబోవు మహారాజు వీరత్వాన్ని చూసి ఆనందిస్తూ మరికొంతమంది ……
మహారాజు : అర్థమైంది అర్థమైంది ……. , రాజ్యం మొత్తం చాటింపు వేయించండి సంబరాలు అంబరాన్ని అంటాలి – మన కాబోవు మహారాజు వీరాధివీరుడు అంటూ మురిసిపోతున్నారు .
సైన్యాధ్యక్షుడు : ప్రభూ …… మన కాబోవు మహారాజుగారి నామధేయం ? .
మహారాజు : అవునవును ఒక్క క్షణం అంటూ నావైపుకు అడుగులువేశారు .

నా దేవకన్యను కిందకుదించి తన అంతులేని ఆనందాలను చూసి అంతే ఆనందంతో ప్రేమతో బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను , మహీ …… ఎలా ఉన్నావో చెప్పనేలేదు కదూ …….
మహి : అవును అంటూ బుంగమూతిపెట్టుకుంది .
బుంగమూతిలో ముద్దొచ్చేస్తున్నావు అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు తెలుసా – నావైపు పడుతున్న ఒక్కొక్క అడుగుకు ఈ హృదయం పారవశ్యంతో ఉప్పొంగిపోయింది మహీ ……
మహి : ఇక్కడేనా అంటూ నా హృదయంపై పెదాలను తాకించింది .
మ్మ్మ్ ……. ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను .
మహి : నా దేవుడి కోసమే ఇలా అందంగా అలంకరించుకున్నాను – మీకు నచ్చింది అంతకంటే ఆనందం మరొకటి లేదు అంటూ పులకించిపోతోంది .

అల్లుడుగారూ అల్లుడుగారూ …….
మహారాజా …… మన్నించండి .
మహారాజు : పోటీతోపాటు నా బంగారుతల్లి మనసు కూడా గెలుచుకున్నావు , ఒక తండ్రికి ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పు ……. , మీకు భంగం కలిగిస్తున్నందుకు నేనే …….
అలాంటిదేమీ లేదు మహారాజా …… అంటూ మహితోపాటు నవ్వుకున్నాను .
మహారాజు : నా అల్లుడు – ఈ రాజ్యానికి కాబోవు మహారాజు గొప్పతనం వీరత్వం గురించి రాజ్యం అంతా చాటింపు వేయాలని ఆశపడుతున్నాము , తమరి నామధేయం …… ? .
దివినుండి నాకోసం దిగివచ్చిన దేవకన్యా …… చెప్పండి ? .
మహి : నాకు సిగ్గేస్తోంది ప్రభూ అంటూ నా గుండెల్లో తలదాచుకుంది .
మన తల్లి ఇంత సిగ్గుపడటం నేనెప్పుడూ చూడలేదు ప్రభూ …… , అంతటి వీరాధివీరుడైన అల్లుడు దొరకడం మన అదృష్టం ……
మహి : అమ్మా …… అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి , రాజమాత చెంతకు చేరింది .
రాజమాతకు వందనం ……
రాజమాత : వందనం రాకుమారా …… , తమరి నామధేయం ? .
ఆ కైలాసనాథుడి నామధేయాలలో ఒకటైన మహేశ్వరుడు రాజమాత – మహారాజా …….
మహారాజు : తగ్గ పేరు అల్లుడుగారూ ……. , సైన్యాధ్యక్షా ….. విన్నారుకదా రాజ్యం మొత్తం మారుమ్రోగిపోవాలి .
సైన్యాధ్యక్షుడు : చిత్తం మహారాజా ……. అంటూ వెళ్లిపోయారు .

అంతలోనే మహామంత్రి గారు పండితులను పిలుచుకునివచ్చారు . యువరాజా …… మన్నించండి మన్నించండి చంద్ర రాజ్యానికి కాబోవు మహారాజా …… మీ హస్తాన్ని అందించగలరా ? .
చేతిని చాపాను ……
మహామంత్రి : రాకుమారీ ……
సిగ్గుపడుతూ నా చేతిపై ఉంచింది .
పండితులు ఇద్దరి చేతులలో జాతకాలను చూసి , అద్భుతం మహాద్భుతం ప్రభూ …….. ఒకరికోసం మరొకరు పుట్టిన జంట – రాబోవు కొన్ని సంవత్సరాలు ఏవో తెలియని ఒడిదుడుకులు కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో వీరు ఎక్కడ ఉన్నా ఆ రాజ్యం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది .
మహారాజు : సంతోషమైన విషయం చెప్పారు ……
పండితులు : ప్రభూ ప్రభూ …….
మహారాజు : విన్నవించండి పండితులారా …….
పండితులు : ప్రభూ …… ఎన్ని పర్యాయాలు చూసినా , వీరి వివాహం ఈరోజే జరిగిపోవాలి అని గోచరిస్తుంది ఈరోజు జరగకపోతే 5 సంవత్సరాలవరకూ ఆగాల్సిందే …….
మహి : తండ్రిగారూ ……. అంటూ తన తల్లిని గట్టిగా హత్తుకుంది .
మహారాజు : పండితులారా మీరుకూడా ఒకసారి చూడండి .
వెనకున్న పండితులు వచ్చి చూసి అదేవిషయాన్ని వ్యక్తపరిచారు .
మహి కళ్ళల్లో చెమ్మతో రాజమాత గుండెలపైనుండే నా చేతిని అందుకుంది .
రాజమాత : ప్రభూ ……
మహారాజు : అర్థమైంది మహారాణీ ……. , ఇంతటి క్షత్రియ వీరాధివీరుడిని అల్లుడుగా వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను . అల్లుడుగారూ ……. వీరు చెప్పినది చెప్పినట్లుగా జరిగాయి – మీకు సమ్మతమైతే ఈరోజే వివాహం జరిపిస్తాము .
మహివైపు చూసి లోలోపలే అంతులేని ఆనందం పొందాను – బయటకుమాత్రం అదికాదు మాహారాజా ……. మొన్న పడిన భారీ వర్షాలకు మా రాజ్యపు దారులు ప్రవాహాలు – కొండ చరియలతో పూర్తిగా ద్వoసం అయిపోయాయి , మావారంతా అక్కడే ఆగిపోయారు కానీ ఈ దేవకన్యను పొందడం అదృష్టం అందుకే అవరోధాలన్నీ సంతోషంగా దాటుకుని మీ రాజ్యం చేరాను .
నామాటలకు నావైపే ప్రేమతో చూస్తూ కొంటెదనంతో నవ్వుతోంది మహి ……
నాకు వస్తున్న నవ్వులను బలవంతంగా ఆపుకుంటున్నాను .
మహారాజా …… బాధపడకండి , మీ ఇష్టప్రకారం ముందుకువెళ్లండి – పరిస్థితులు అనుకూలించాక మా రాజ్యంలో అందరి సమక్షంలో అంగరంగవైభవంగా మరొకసారి వివాహం జరుపుకుంటాము – రాకుమారి గారూ …… మీకు సమ్మతమే కదా ? .
మరుక్షణంలో నా గుండెలపైకి చేరిపోయింది .
మహారాజుగారు సంతోషం పట్టలేనట్లు , కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి అల్లుడుగారో …… ఈరోజే వివాహం అంటే మామూలుగా జరిపిస్తాము అనుకున్నారేమో …… మీరాజ్యంలో ఎలా అయితే జరుపుకోవాలని ఆశపడుతున్నారో అంతకుమించి సంబరంలా జరిపిస్తాము , మహామంత్రీ – సైన్యాధ్యక్షా …….
ఆజ్ఞ ప్రభూ …….
మహారాజు : పండితులారా …… ముహూర్త సమయం ? .
పండితులు : ఇద్దరి జాతకాల ప్రకారం ……. సాయంత్రం 7 గంటలకు దిగ్విజయమైన ముహూర్తం ఉంది ప్రభూ ……. , వందేళ్లకు ఒకసారి వచ్చే ముహూర్తం చెప్పాము కదా ప్రభూ …… ఇద్దరూ ఒకరికోసం మరొకరు పుట్టినవారు , మహేశ్వరుడు – మహేశ్వరి ……. పార్వతీపరమేశ్వరుల జంట ……
అంతే అందరి సంతోషాలతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి .
ఇద్దరమూ ఒకరికళ్లలోకి మరొకరం చూసుకుని సిగ్గులమొలకలవుతున్నాము .

1310930cookie-checkజనం మెచ్చిన రాజు – Part 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *