మాలతి టీచర్ – భాగం 19

Posted on

కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం………
నేను ఒక్క సారి అటూ ఇటూ చూసి, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని, తన దగ్గరకు జరిగాను. తాను బిత్తర చూపులతో నన్ను చూసింది….నేను మెల్లిగా,
” చాలా రోజులు అయ్యింది……..”గుసగుసగా అన్నాను.
” మ్మ్…..” ఇంకా అలా బిత్తరపోతూనే చూస్తోంది.
” తప్పో ….రైటో తెలీదు……ఒక్కసారి……”
మాలతి ముఖకవళికలు వేగంగా మారుతున్నాయి…….
” నన్ను అడ్డగాడిదా అని ఒక్కసారి తిట్టావా……?” సూటిగా తన కళ్ళలోకి చూస్తూ,అడిగాను.
అంతే, నన్నే చూస్తున్న కళ్ళు జలజలమని వర్షించాయి…….మాలతి ఏడుస్తోంది.
” మాలతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్……”గాబరా పడుతూ మెల్లిగా అన్నాను.
” మ్మ్…..”పవిట కొంగుతో కళ్ళద్దుకుంటూ, తలవంచుకుని గదిలోకి వెళ్ళిపోయింది.కాసేపు తర్వాత, తన గొంతు వినబడింది,
” శివా మంచినీళ్ళు గ్లాసులో కావలా, చెంబులో కావాలా…..?”
” గ్లాసులో ఇస్తే చాలు”
గ్లాస్సుతో వచ్చింది.
” అడగకుండా ఉండాల్సింది…..అడిగి, నీ మనస్సు కష్టపెట్టాను…..”
“మ్మ్…..” ఉబ్బిన కన్నీటిని చేత్తో తుడుచుకుంది.
” సరే….ఇక అడగనులే…..”కొంచెం ఇబ్బందిగా కదులుతూ,
మూడేళ్ళు అయ్యింది.వేరే పెళ్ళి,……… కాదు కాదు వేరే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవచ్చుగా….”
” ……”
జవాబు కోసం నా వంక చూసింది..
“మన్నించు శివా, ఏదో నోరుజారి,అలా అన్నాను” (బాధపడుతూ)
” లేదు లేదు, మాలతి నువ్వు ముందు చెప్పిందే కరక్ట్.అదే నూటికి నూరుపాళ్ళు
తాను మౌనంగా నన్ను చూస్తోంది….మళ్ళి నిశ్శబ్ధం……మళ్ళీ తానే…
“నేను అడిగినదానికి సమాధానం చెప్పలేదు”
” చూద్దాం ”
” పెళ్ళికి పిలుస్తావా…? లేక, ….ఎందుకులే అని….?”
తాను మాట ముగించేలోపల,
” మాలతి…..ప్లీజ్…..” బాధగా అన్నాను.
” ఓకే…ఓకే….సరదాగ అన్నాను” నవ్వింది.
” మాలతి, ఒక సారి నేను చెప్పినట్టు,అందరకి స్కూల్, కాలేజీ వయస్సులో జరిగేది, మన జీవితంలో ఆలస్యంగా జరిగింది ”
” నువ్వు చెప్పింది కరక్ట్ శివ, నన్ను నేను అలాగే సముదాయించుకుమంటున్నాను ”
” తప్పదు మాలతి, అలాగే మనస్సు కుదుట పరుచుకుంటూ, జీవితం సాగించాలి”
” చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు” నవ్వింది.
” నీ కంటేనే…..? నీ ముందు నేనెంతా…….?”
కొద్ద్దిసేపు మౌనం తర్వాత,
” సరే, ఇక నేను బయలుదేరుతాను మాలతి…”
అప్పుడే లోపలికి వచ్చిన మాలతి భర్త,
” భోజనం చేసి వెళ్ళోచ్చుగా,” అన్నారు
” అబ్బే లేదండి, ఇంకొక గంటలో ట్రెయిన్ ఉంది”(లేచి నిలబడుతూ,)
మీరు లోపలికి వెళ్ళండి అని తన భర్తకు చెప్పి నన్ను సాగనంపడానికి గేటు దాకా వచ్చింది.
” ఆరోగ్యం జాగ్రత్త శివా”
నేను తన కళ్ళలోకి చూశాను.
ఏ క్షణానైన వర్షించేలా ఉన్నాయి…..
” సరే మాలతి, వస్తాను”
” మ్మ్….”తలాడించింది.
నేను కాంపౌండ్ వాల్ దాటి రెండు అడుగులు వేశాను..
” ఓయ్ అడ్డగాడిదా…..”
మాలతి గొంతు వినగానే ఆనందగా వెనుకకు తిరిగాను..
‘ ఏంటీ ‘అన్నట్టు తనను చూశాను
” థాంక్స్ రా….”
” దేనికి….? వచ్చినందుకా….?”
” అన్నిటికీ…”
ఇంతలో కౌసి,
” అమ్మా అత్త పిలుస్తోంది”
” పద, వస్తున్నాను ” అంటూ మాలతి చెయ్యి ఊపుతూ లోపలికి వెళుతోంది, నా కాళ్ళకు గమ్యం గుర్తుకు వచ్చినట్టు ముందుకు సాగాయి..
దూరంగా, ఓ బడ్డీ కొట్టు నుండి చిన్నగా,
పల్ పల్ ధిల్ కే పాస్, తుం రెహెతే హో…..
హర్ ష్యాం ఆంఖోన్ పర్
తెర ఆంచల్ లెహరాయే
హర్ రాత్ యాదోన్ కీ
భారాత్ లే ఆయే………
పాట వినబడుతోంది.
(సెలవు)

1634312cookie-checkమాలతి టీచర్ – భాగం 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *