బంధాలు-అనుబంధాలు

Posted on

నీకు పెళ్ళయితే నాన్నను నీతోపాటు ఉంచుకో తల్లి. మీ నాన్న వట్టి అమాయకుడు. జాగ్రత్తగా చూసుకో తల్లి” “ఏవండీ మీరు ఎపుడు అనేవారు అమ్మాయికి ఫారిన్ చదువులు చదివినవానితో పెళ్లి జరిపిస్తానని, నేను అమ్మాయి పెళ్లి చూసే భాగ్యానికి నోచుకోలేదు. మీరు అనుకున్నట్టుగానే సరళ కు ఫారిన్ చదువులు చదివిన వాణ్ని, మీలాంటి మంచి గుణాలు ఉన్న అబ్బాయితో ఘనంగా పెళ్లి చేయండి.” అని తల వాల్చేసి ప్రాణాలు విడిచింది.

మన ఆప్తులెవరైనా అర్దాంతరంగా చనిపోతే కొంతకాలం భాదకు లోనౌతాము. మంచాన పడి భూమికి ఇంట్లో వాళ్లకు బరువై చనిపోతే ఒక చిన్న నిట్టూర్పుతో ఊరకుండిపోతాం. సత్యవతి మరణం అంతే, ఏడాదిగా మంచం మీద కాన్సర్ వ్యాధితో భాధ పడుతూ అందరికి బరువయ్యి చివరకు ఈ లోకం వాడాలి వెళ్ళిపోయింది.

కానీ చనిపోయే ముందు భర్త బాగోగులను కూతురికి అప్పగిస్తూ సత్యవతి అన్న మాటలు రాఘవయ్యకు సరళకు తీయని తేనే మాటల్లా వినిపించాయి. చుట్టూ పక్కల వాళ్ళు సత్యవతి మరణ వార్త విని పోగయ్యారు. సరళ కళ్ళల్లో చిన్న కన్నీటి చుక్క లేకున్నా బావురు మని ఏడుస్తూ “నాన్న, అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది నాన్న” అంటూ రాఘవయ్యను వాటేసుకొని ఏడవసాగింది. [ఇంకా వుంది.]

142823cookie-checkబంధాలు-అనుబంధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *