ఖర్కోటఖుడు – Part 11

Posted on

“what the hell you are talking? rubbish.. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు పడేస్తా.” అన్నాడు రిచర్డ్స్ ఆవేశంగా కుర్చీని తన్ని పైకి లేస్తూ.

” కూల్ రిచర్డ్స్.. నాకు డబ్బే కావాలి అనుకుంటే నేనే నీకు ముందు ఫోన్ చేసేవాడిని. నాకు టైం మెషీన్ కావాలి. అది పూర్తయ్యాక కావాలంటే మల్హోత్రా ని తీసుకుపో.” అన్నాడు హార్ధిక్ రిచర్డ్స్ వంక నవ్వుతూ చూస్తూ.

ఎక్కడ “ఊ” అంటాడో అని మల్హోత్రా కి వెన్నులో వణుకు మొదలైంది.

“హార్ధిక్ ఇంక మాటలొద్దు. నా గురించి నీకు తెలీదు. గోటితో పోయేదాన్ని గొడవ వరకు తీసుకురాకు. నేనంటూ తలుచుకుంటే నిన్ను చంపేయ్యడం చిటికెలో పని.” అన్నాడు రిచర్డ్స్ ఆవేశంగా.

“సరే చంపేసుకో” అన్నాడు హార్ధిక్ మరింత కూల్ గా.

“అయితే ఇక మాటలతో పని జరగదంటావ్?”

“జరగదు” అన్నట్టు తల అడ్డంగా ఊపాడు హార్ధిక్.

రిచర్డ్స్ చిటికేసి హార్ధిక్ గుండెల వైపు వేలు చూపించాడు చూసుకోమన్నట్టు.

హార్ధిక్ కిందకు చూసే సరికి తన గుండెల మీద రెండు లేసర్ లైట్లు పడుతున్నాయి. రిచర్డ్స్ వైపు చూసాడు.

రిచర్డ్స్ వికారంగా నవ్వుతూ “చెయ్యి ఎత్తితే చాలు నీ ప్రాణాలు ఈ ప్రకృతిలో కలిసిపోతాయి. ఇప్పుడు నీ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. తేల్చుకో” అన్నాడు.

“చంపేయ్” అన్నాడు హార్ధిక్.

నిలువుగుడ్లు పడిపోయాయి రిచర్డ్స్ కి. అనుమానంగా హార్ధిక్ వైపు చూసాడు.

“come on. go ahead” అన్నాడు.

రిచర్డ్స్ ఒళ్ళు మండి చెయ్యి పైకి లేపాడు. కానీ హార్ధిక్ కి ఏమీ కాలేదు. “హ్మ్..” అన్నాడు చెయ్యి ఇంకోసారి లేపి. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. చిరాగ్గా వెనక్కి తిరిగి చూసాడు. తన స్నైపర్స్ ఇద్దరూ విగతజీవులుగా మారిపోయారు. భయంగా హార్ధిక్ వైపు చూసాడు.

హార్ధిక్ నవ్వుతూ రిచర్డ్స్ గుండెల వైపు చూపించాడు. చూసుకోమని.

నాలుగు లేసర్ డాట్స్ యమపాశాల్లా కదులుతున్నాయి రిచర్డ్స్ ఒంటి మీద. భయంతో నాలుగడుగులు వెనక్కేసాడు.

“రిచర్డ్స్ ని కూర్చోమన్నట్టు సైగ చేసాడు. రిచర్డ్స్ కుర్చీలో కూర్చోబోతుంటే “అక్కడ కాదు.. కింద” అంటూ ఉరిమింది హార్ధిక్ కంఠం.

అవమానభారంతో అలాగే కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

హార్ధిక్ రిచర్డ్స్ పక్కనున్న కుర్చీలో కాలు పెట్టి “ఇప్పుడు చెప్పు ఏం చేస్తావో?” అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ.

రిచర్డ్స్ బుర్ర అప్పటికే సేచురేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది.

హార్ధిక్ తన చెంప మీద వేసిన చిటెక్కి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు.

హార్ధిక్ తన కాలు రిచర్డ్స్ మొహానికి తగిలేలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

అది చూసి తట్టుకోలేకపోతున్నాడు జాన్. జేబులోంచి గన్ తీసి హార్ధిక్ వైపు గురిపెట్టాడు. మరుక్షణంలో జాన్ నొసటి మీద అమ్మవారి కుంకుమ బొట్టంత బొక్క పడింది.

జాన్ అలా నిర్జీవంగా వాలిపోతుంటే “జా…….న్” అన్నాడు రిచర్డ్స్ బాధతో మూలుగుతూ. అన్నిటినీ చాలా తెలివిగా అమలుపరిచే తన కుడిభుజం కూలిపోవడంతో. చదరంగంలో రాజుకు మంత్రి కరువైనట్టు అయిపోయింది.

హార్ధిక్ లేచి జాన్ శవం దగ్గరకు వెళ్ళి “ఓహ్.. జాన్ అంటే ఇతనేనా? నైస్ టు మీట్ యూ జాన్. మనం ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా కలవడం ఇదే మొదటిసారి. రెస్ట్ ఇన్ పీస్ జాన్” అన్నాడు జాన్ కళ్ళు మూస్తూ.

ఆ మాటలకు మరింత రక్తం మరిగిపోయింది రిచర్డ్స్ కి. ఇక ఆగలేక జేబులోని బటన్ నైఫ్ తీసుకుని హార్ధిక్ ని పొడవబోయాడు. ఇంతలో టూటూ చేతిలోని ఆయుధం రిచర్డ్స్ చేతిలోని కత్తిని, ఆ కత్తిని పట్టుకున్న చేతి గుత్తిని చేతి నుంచి వేరు చేసేసింది.

“ఆ………..హ్…హ్…..హ్…హ్…….” అంటూ రిచర్డ్స్ పెట్టిన గావుకేక ఆ ప్రదేశం మొత్తం బిగ్గరగా ప్రతిధ్వనించింది.

ముంజేతి నుంచి రక్తం ధారగా కారడం మొదలయ్యింది. టూటూ తన చేతిలోని కొడవలి వంటి పదునైన ఆయుధంతో రిచర్డ్స్ తలని మొండెం నుంచి వేరు చెయ్యడానికి సిద్ధపడుతుండగా…

“టూటూ..” అన్నాడు హార్ధిక్ చెయ్యెత్తి వారిస్తున్నట్టు.

రిచర్డ్స్ కి ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది.

“తలొద్దు.. కాళ్ళు తీసేయ్..” అన్న హార్ధిక్ మాట పూర్తి కాకుండానే ఆశ్చర్యంతో చూస్తున్న రిచర్డ్స్ కాళ్ళని కర్కశంగా నరికి అవతల పడేసాడు టూటూ.

అక్కడ జరుగుతున్న మారణహోమానికి భయంతో పరుగులు తీశారు రిచర్డ్స్ మనుషులు.

“ఇప్పుడు చెప్పు రిచర్డ్స్.. నువ్వు నేను నాకు నీకు అంటూ ఏవేవో పదాలు వాడావ్? నాకు సరిగా గుర్తు లేదు. ఇంకొకసారి చెప్పగలవా?” అంటూ ప్రశ్నించాడు హార్ధిక్ సూటిగా రిచర్డ్స్ కళ్ళలోకి చూస్తూ.

“రేయ్.. మదగజం లాంటి నన్ను ఇక్కడకి తీసుకొచ్చావ్ కదూ.. నిన్ను అతి కిరాతకంగా చంపకపోతే ఇన్నాళ్లూ నేను బ్రతికిన బ్రతుకంతా అనవసరం.” అంత భాదలోనూ కళ్ళల్లో నిప్పులు కురిపించాడు రిచర్డ్స్.

“రిచర్డ్స్… నువ్వు ఎంత పెద్ద ఏనుగువైనా కానివ్వు. వన్స్ నాదీ…. అనే సరస్సులో అడుగుపెడితే మాత్రం. నీకు గజేంద్రమోక్షమే.” స్థిరంగా పలికాడు హార్ధిక్.

“ఏం చెయ్యగలవ్ నన్ను? చంపుతావా? చంపేయ్” అన్నాడు రిచర్డ్స్.

“నన్ను ముట్టుకున్నా.. నాతో పెట్టుకున్నా నీ డెత్తుకి డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఆల్రెడీ పెట్టేసుకున్నావ్. టూటూ..” అని అరిచాడు హార్ధిక్.

ఒక్క చెయ్యి మినహా ఊపిరిలో నాగార్జునలా మిగిలిన రిచర్డ్స్ వైపు తన ఆయుధం పట్టుకుని కదిలాడు టూటూ…

రిచర్డ్స్ తన గదిలో అద్దం ముందు కూర్చుని ఉన్నాడు. కాళ్ళూ చేతులు లేకుండా తన దీన స్థితికి తనకే జాలి వేసింది.

171170cookie-checkఖర్కోటఖుడు – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *